Saturday, December 11, 2021

తిరుమల - టీటీడీ పాలకమండలి నిర్ణయాలు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తాం.

జనవరి 13 న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభమవుతుంది.

కోవిడ్ నిభందనలు సడలిస్తే, పండుగ తరువాత సర్వదర్శనం పెంపు.

ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడం ప్రారంభిస్తాం.

11 మంది చిన్నపిల్లలుకు విజయవంతంగా గుండె శస్ర్త చికిత్స నిర్వహించారు.

చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలు అందించిన భక్తులకు ఉదయాస్తమాన సేవకు అనుమతించేలా అవకాశం కల్పిస్తాం.

పాలకమండలి సభ్యులు కూడా కోంత మంది విరాళాలు అందించేందుకు అంగీకరించారు.

500 ఉదయాస్తమాన సేవా టిక్కేట్లు ప్రస్తుతం ఖాళీగా వున్న వాటిని భక్తులకు కేటాయిస్తాం.

హనుమంతుడి జన్మస్థలమైనా అంజనాద్రి ప్రాంతాని అభివృద్ధి చేస్తాం. 

నాదనీరాజనం మండపం వద్ద శాశ్వత ప్రాతిపాదికన మండపాని నిర్మిస్తాం.

భక్తులు సౌకర్యార్థం అన్నమయ్య నడకమార్గాని రోడ్డు మార్గంగా అభివృద్ధి పర్చడానికి నిర్ణయం.

హిందు ధర్మప్రచారంలో భాగంగా ప్రతి జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు.

వర్షం కారణంగా అన్నమయ్య ప్రాజెక్ట్ వద్ద కోట్టుకుపోయిన ఆలయాలను తిరిగి పున:నిర్మిస్తాం.

ఐటి విభాగాన్ని పటిష్టవంతంగా నిర్వహించేందుకు ఉద్యోగ నియామకాలు చేస్తాం.

2.6 కోట్ల రూపాయల వ్యయంతో నూతన పరకామణి మండపంలో యంత్రాలు కొనుగోలు.

శ్రీశైలం ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేస్తాం.

తాళ్లపత్ర గ్రంధాలను పరిరక్షించడానికి యస్వీ వేద విద్యాలయంలో మ్యాన్ స్ర్కిప్ట్ విభాగాని ఏర్పాటు చేస్తాం.

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన భక్తులకు ఉచితంగా దర్శన భాగ్యం కల్పిస్తాం.

భక్తులకు శ్రీవేంకటేశ్వర నామ కోటి పుస్తకాలను అందిస్తాం.

కళ్యాణకట్ట క్షురకులకు ఇచ్చే పీస్ రేటును 11 నుంచి 15 రూపాయలకు పెంచాం.

3 కోట్ల రూపాయల వ్యయంతో వసతి గదుల్లో గీజర్లు ఏర్పాటు.

10 కోట్ల రూపాయల వ్యయంతో స్విమ్స్ లో భవనాలు నిర్మాణం.

12 కోట్ల రూపాయల వ్యయంతో మహిళా యూనివర్సిటీ లో హస్టల్ భవనాలు నిర్మాణం.

వైవి సుబ్బారెడ్డి చైర్మన్ టీటీడీ

The Wisdom of the Turtle: Moving Forward with Patience and Purpose

There is something quietly profound about watching a turtle move. Its steps are slow, steady, and deliberate, yet never meaningless. The wor...