ప్రముఖ వాగ్గేయ కారులు
(అతి సంక్షిప్త పరిచయం)
జయదేవుడు (1101-1153)
'గీతగోవిందము' అను సంగీత గ్రంథమును సంస్కృత భాషలో రచించిన ప్రథమ వాగ్గేయకారుడు.'జయదేవ'ముద్రతో ఇతను రచించిన సంగీత కృతులు 'అష్టపదులు'గా ప్రసిద్ధి చెందినవి.
పురందరదాసు (1484-1564)
తన ఇష్టదైవమగు పండరీపుర విఠలునిపై
వేలాది,సంగీత కృతులను కన్నడ భాషలో రచించారు. 'దేవరనామాలు' అను పేరుతోప్రఖ్యాతిగాంచిన ఈతని కృతులు 'పురందరవిఠల' ముద్రతో ఉన్నాయి.
అన్నమాచార్యులు (1408-1503)
తన ఇష్టదైవమైన తిరుపతి,శ్రీవేంకటేశ్వరునిపై 32 వేల కీర్తనలను రచించారు.ఈ కీర్తనలు 'వేంకటేశ' ముద్రతో సాగుతుంది.'ఆంధ్ర పద కవితా పితామహుడు' గా ప్రఖ్యాతి చెందినారు.
భక్త రామదాసు (1620-1680)
ఇతని అసలు పేరు కంచర్ల గోపన్న.తన ఆరాధ్య దైవమగు శ్రీరామునిపై 'రామదాసు' ముద్రతో అనేక కీర్తనలను రచించారు.
క్షేత్రయ్య (1610-1685)
ఇతని అసలు పేరు వరదయ్య. అనేక క్షేత్రములను సందర్శించడం వలన క్షేత్రయ్యగా పిలువబడినారు.
తన ఇష్టదైవమగు గోపాలస్వామి పేర 'మువ్వగోపాల' ముద్రతో పెక్కు సంగీత కృతులు రచించారు.
శ్యామశాస్త్రి (1762-1827)
అసలు పేరు వేంకట సుబ్రహ్మణ్యం.
ఆంధ్రులైన సంగీతత్రయంలో మూడవవారు.
త్యాగరాజు,ముత్తుస్వామి దీక్షితులకు సమకాలికులు. 'శ్యామకృష్ణ' ముద్రతో సంగీత కృతులు రచించారు.
త్యాగరాజు(1767-1847)
కాకర్ల త్యాగరాజు 'సంగీతరత్నత్రయము' గా, ప్రసిద్ధి గాంచిన వారిలో అగ్రగణ్యుడు. తన ఇష్టదైవమైనశ్రీరామునిపై,అపారమైన భక్తితో 24 వేల కీర్తనలను రాసారు.
ముత్తుస్వామి దీక్షితులు(1776-1835)
'సంగీతరత్నత్రయం'లో రెండవ వారు.
'గురుగుహ' ముద్రతో సంస్కృత భాషలోవీరు కృతులు రచించారు.
స్వాతితిరునాళ్(1813-1846)
తిరువాన్కూరు(కేరళ) సంస్థానమునకు ప్రభువు.
బహుభాషా పాండిత్యమునకుతోడు, సంగీతంములోనూ విశేష ప్రజ్ఞా వంతులు. మళయాళము, తమిళము, సంస్కృతము, హిందీ, మరాఠీ, ఒరియా, కన్నడము , తెలుగు వంటి ఎనిమిది భాషలలో 'పద్మనాభ' ముద్రతో సంగీత కృతులను రచించారు.
నారాయణ తీర్థులు (17వ శతాబ్దము)
ఇతని అసలు పేరు తల్లావఝల శివశంకరశాస్త్రి. తన ఆరాధ్య దైవమగుశ్రీకృష్ణుని లీలావినోదములను 'కృష్ణ లీలా తరంగిణి' అను సంగీత గ్రంథమున విపులంగా వర్ణిస్తూ కీర్తనలను రాసారు.
ఇవి 'తరంగములు' అను పేర ప్రసిద్ధి చెందినవి.
No comments:
Post a Comment