Friday, October 28, 2022

నాగులచవితీ / నాగచతుర్థీ

ॐ 29/10/22 నాగులచవితీ / నాగచతుర్థీ

నాగుల చవితి విశిష్టత 
కార్తీక శుక్ల పక్ష చవితిని ”నాగుల చవితి” అని పిలుస్తారు. ఇది సర్పపూజకు ఉద్దిష్టమైన దినం. కార్తీక శుద్ధ చవితినాడు నాగవ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెపుతున్నది. శ్రీనాధుని శివరాత్రి మహాత్మ్యంలో ఇలా వర్ణింపబడినది.

”చలి ప్రవేశించు నాగుల చవితి నాడు,
మెరయు వేసవి రథసప్తమీ దివసమున,
అచ్చ సీతు ప్రవేశించి బెచ్చు పెరిగి,
మార్గశిర పౌష మాసాల మధ్యవేళ.”

ఆశ్లేష, ఆరుద్ర, మూల, పూర్వాభాద్ర, పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రమలు. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగములో ‘న, అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది ‘కాలము’ కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా ‘కాలనాగు’ అని అంటారు. జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి.

జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తిక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది కార్తికమాసములోనే. మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం, ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు, అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య, శంకరునికి ఆభరణము కూడా సర్పమే కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది. కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ, నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తికమాసం నెలరోజులు కాకపోయినా కనీసం కార్తిక శుద్ధ చవితినాడు నాగులను ఆరాధించాలి. చవితి అం టే నాల్గవది అనగా ధర్మార్థకామమోక్ష పురుషార్థాలలో నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగుల చవితినాడు దేవాలయాలలో, గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి.

నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం

పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవి స్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం, శివం, సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము, యోగము, భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం, సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.

”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్‌ పాలయంతి” అనేది ప్రమాణ వాక్యం, అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.

Wednesday, October 26, 2022

కార్తీక మాసం 30 రోజులు - నిషిద్ధములు - దానం - పూజించవలసిన దైవం - జపించవలసిన మంత్రం

*#కార్తీక #మాసం 30 రోజులు - #నిషిద్ధములు - #దానం- #పూజించవలసిన #దైవం - #జపించవలసిన #మంత్రం*
*👉1వ రోజు:*
నిషిద్ధములు:-
ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు
దానములు:-
నెయ్యి, బంగారం
పూజించాల్సిన దైవము:-
స్వథా అగ్ని
జపించాల్సిన మంత్రము:-
ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా

*👉2వ రోజు:*
నిషిద్ధములు:-
తరగబడిన వస్తువులు
దానములు:-
కలువపూలు, నూనె, ఉప్పు
పూజించాల్సిన దైవము:-
బ్రహ్మ
జపించాల్సిన మంత్రము:-
ఓం గీష్పతయే - విరించియే స్వాహా

*👉3వ రోజు:*
నిషిద్ధములు:- 
ఉప్పు కలిసినవి, ఉసిరి
దానములు:- ఉప్పు
పూజించాల్సిన దైవము:- పార్వతి
జపించాల్సిన మంత్రము:- 
ఓం పార్వత్యై - పరమేశ్వర్యై స్వాహా

*👉4వ రోజు:*
నిషిద్ధములు:- వంకాయ, ఉసిరి
దానములు:- నూనె, పెసరపప్పు
పూజించాల్సిన దైవము:- విఘ్నేశ్వరుడు
జపించాల్సిన 
మంత్రము:-
ఓం గం గణపతయే స్వాహా

*👉5వ రోజు:*
నిషిద్ధములు:- పులుపుతో కూడినవి
దానములు:- స్వయంపాకం, విసనకర్ర
పూజించాల్సిన దైవము:- ఆదిశేషుడు
జపించాల్సిన మంత్రము:- 
(మంత్రం అలభ్యం, ప్రాణాయామం చేయాలి)

*👉6వ రోజు:*
నిషిద్ధములు:- ఇష్టమైనవి , ఉసిరి
దానములు:- చిమ్మిలి
పూజించాల్సిన దైవము:- సుబ్రహ్మణ్యేశ్వరుడు
జపించాల్సిన 
మంత్రము:-
ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా

*👉7వ రోజు:*
నిషిద్ధములు:- పంటితో తినే వస్తువులు, ఉసిరి
దానములు:- పట్టుబట్టలు, గోధుమలు, బంగారం
పూజించాల్సిన దైవము:- సూర్యుడు
జపించాల్సిన మంత్రము:-
ఓం. భాం. భానవే స్వాహా

*👉8 వ రోజు:*
నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం
దానములు:- తోచినవి - యథాశక్తి
పూజించాల్సిన దైవము:- దుర్గ
జపించాల్సిన మంత్రము:- 
ఓం - చాముండాయై విచ్చే - స్వాహా

*👉9వ రోజు:*
నిషిద్ధములు:- నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి
దానములు:- మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు
పూజించాల్సిన దైవము:- అష్టవసువులు -
పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము:- 
ఓం అమృతాయ స్వాహా - పితృదేవతాభ్యో నమః

*👉10వ రోజు:*
నిషిద్ధములు:- గుమ్మడికాయ, నూనె, ఉసిరి
దానములు:- గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె
పూజించాల్సిన దైవము:- దిగ్గజాలు
జపించాల్సిన మంత్రము:-
ఓం మహామదేభాయ స్వాహా

*👉11వ రోజు:*
నిషిద్ధములు:- పులుపు, ఉసిరి
దానములు:- వీభూదిపండ్లు, దక్షిణ
పూజించాల్సిన దైవము:- శివుడు
జపించాల్సిన మంత్రము:- 
ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ

*👉12వ రోజు:*
నిషిద్ధములు:- ఉప్పు, పులుపు, కారం, ఉసిరి
దానములు:- పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ
పూజించాల్సిన దైవము:- భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము:-
ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా

*👉13వ రోజు:*
నిషిద్ధములు:- రాత్రి భోజనం, ఉసిరి
దానములు:- మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం
పూజించాల్సిన దైవము:- మన్మధుడు
జపించాల్సిన మంత్రము:- 
ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా

*👉14వ రోజు:*
నిషిద్ధములు:- ఇష్టమైన వస్తువులు, ఉసిరి
దానములు:- నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె
పూజించాల్సిన దైవము:- యముడు
జపించాల్సిన మంత్రము:-
ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా

*👉15వ రోజు:*
నిషిద్ధములు:- తరగబడిన వస్తువులు
దానములు:- కలువపూలు, నూనె, ఉప్పు 
జపించవలసిన మంత్రం:-
'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'


*👉16వ రోజు:*
నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది,ఎంగిలి, చల్ల
దానములు:- నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం
పూజించాల్సిన దైవము:- స్వాహా అగ్ని
జపించాల్సిన మంత్రము:- ఓం స్వాహాపతయే జాతవేదసే నమః

*👉17వ రోజు:*
నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు
దానములు:- ఔషధాలు, ధనం
పూజించాల్సిన దైవము:- అశ్వినీ దేవతలు
జపించాల్సిన మంత్రము:- ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా

*👉18వ రోజు:*
నిషిద్ధములు:- ఉసిరి
దానములు:- పులిహార, అట్లు, బెల్లం
పూజించాల్సిన దైవము:- గౌరి
జపించాల్సిన మంత్రము:- ఓం గగగగ గౌర్త్యె స్వాహా

*👉19వ రోజు:*
నిషిద్ధములు:- నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి
దానములు:- నువ్వులు, కుడుములు
పూజించాల్సిన దైవము:- వినాయకుడు
జపించాల్సిన మంత్రము:- ఓం గం గణపతయే స్వాహా

*👉20వ రోజు:*
నిషిద్ధములు:- పాలు తప్ప - తక్కినవి
దానములు:- గో, భూ, సువర్ణ దానాలు
పూజించాల్సిన దైవము:- నాగేంద్రుడు
జపించాల్సిన మంత్రము:- ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం

*👉21వ రోజు:*
నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం
దానములు:- యథాశక్తి సమస్త దానాలూ
పూజించాల్సిన దైవము:- కుమారస్వామి
జపించాల్సిన మంత్రము:- ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా

*👉22వ రోజు:*
నిషిద్ధములు:- పంటికి పనిచెప్పే పదార్ధాలు, ఉసిరి
దానములు:- బంగారం, గోధుమలు, పట్టుబట్టలు
పూజించాల్సిన దైవము:- సూర్యుడు
జపించాల్సిన 
మంత్రము:- ఓం సూం - సౌరయే స్వాహా, ఓం భాం - భాస్కరాయ స్వాహా

*👉23వ రోజు:*
నిషిద్ధములు:- ఉసిరి, తులసి
దానములు:- మంగళ ద్రవ్యాలు
పూజించాల్సిన దైవము:- అష్టమాతృకలు
జపించాల్సిన మంత్రము:- 
ఓం శ్రీమాత్రే నమః, అష్టమాతృ కాయ స్వాహా

*👉24వ రోజు:*
నిషిద్ధములు:- మద్యమాంస మైధునాలు, ఉసిరి
దానములు:- ఎర్రచీర, ఎర్ర రవికెలగుడ్డ, ఎర్రగాజులు, ఎర్రపువ్వులు
పూజించాల్సిన దైవము:- శ్రీ దుర్గ
జపించాల్సిన మంత్రము:- 
ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా

*👉25వ రోజు:*
నిషిద్ధములు:- పులుపు, చారు - వగయిరా ద్రవపదార్ధాలు
దానములు:- యథాశక్తి
పూజించాల్సిన దైవము:- దిక్వాలకులు
జపించాల్సిన మంత్రము:- 
ఓం ఈశావాస్యాయ స్వాహా

*👉26వ రోజు:*
నిషిద్ధములు:- సమస్త పదార్ధాలు
దానములు:- నిలవవుండే సరుకులు
పూజించాల్సిన దైవము:- కుబేరుడు
జపించాల్సిన మంత్రము:- ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా

*👉27వ రోజు:*
నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, వంకాయ
దానములు:- ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు
పూజించాల్సిన దైవము:- కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము:- ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా

*👉28వ రోజు:*
నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయ
దానములు:- నువ్వులు, ఉసిరి
పూజించాల్సిన దైవము:- ధర్ముడు
జపించాల్సిన 
మంత్రము:- ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా

*👉29వ రోజు:*
నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరి
దానములు:- శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం
పూజించాల్సిన దైవము:- శివుడు (మృత్యుంజయుడు)
జపించాల్సిన మంత్రము:- ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం, 
ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్

*👉30వ రోజు:*
నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరి
దానములు:- నువ్వులు, తర్పణలు, ఉసిరి
పూజించాల్సిన దైవము:- సర్వదేవతలు, పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము:- ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః

పూజారి -- కానుకలు..

పూజారి -- కానుకలు .. మీరు కానుకలు హుండీలోనే వేయండి . పూజారి ప్లేటులో వేయవద్దు ,హుండీలో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడికి చేరుతుంది...