Tuesday, August 16, 2022

బలరామ జననం

బలరామ జననం
ఆగస్టు 17 బుధవారం బలరామ జననం సందర్భంగా

బలరాముడు అనగానే నాగలిని ఆయుధంగా ధరించిన బలమైన రూపంతో మనకు గోచరిస్తాడు. బలరాముడు శ్రీకృష్ణుడికి అగ్రజుడు. విష్ణుమూర్తి దశావతారాల్లోని బలరాముడు కూడా ఒక అవతారమని చెబుతారు. చివరి వరకు శ్రీకృష్ణుని వెన్నంటి ఉంటూ ఆ అవతార ప్రయోజనం సిద్ధించడానికి కృషిచేసాడు. శ్రావణ బహుళ షష్ఠి తిథిన బలరాముడు జన్మించాడని అనేక పురాణాలు చెబుతున్నాయి. బలరాముని ఆయుధం హలం కనుక ఈ రోజును హలషస్తే అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో భాద్రపద తదియ రోజున బలరాముని జన్మోత్సవాన్ని జరుపుకుంటారు. మరి కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పూర్ణిమ రోజున, అక్షరతృతీయ రోజున కూడా బలరామ జన్మదినాన్ని ఒక పండుగలా జరుపుకుంటారు.

బలరాముడు వసుదేవుని కొడుకు. శ్రీకృష్ణుని సోదరునిగా, అవతరించాడు. ఆదిశేషుడే బలరామునిగా అవతరించాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఈయనకి మరో పేరు సంకర్షణుడు. అంటే ఒక గర్భం నుంచి మరొక గర్భంలోకి లాగబడినవాడు. అని అర్థం. దేవకీ, వసుదేవులకు పుట్టిన పిల్లలందరినీ కంసుడు చంపివేస్తుంటే, దేవకి ఏడో గర్భాన జన్మించవలసిన బలరాముడు విష్ణుమూర్తి ఆదేశంతో, యోగమాయ సహాయంతో ఆమె గర్భం నుంచి వసుదేవుని మరొక భార్య అయిన రోహిణి గర్భంలోకి వెళ్తాడు. ఆ కాలంలోనే గర్భమార్పిడి పద్ధతి జరిగిందనేది ఆధునికులు గమనించాలి.

దుష్టశిక్షణలో శ్రీకృష్ణుని వెంటే ఉన్నాడు బలరాముడు. బలరాముడు అతి బలవంతుడు. గదాయుద్ధంలో ఆయనకు సాటిఎవరూ లేరు. బలరాముణ్ణి ప్రకృతి తత్త్వంగా చెప్తారు. నాగలితో దున్నిన భూమి నుండి వచ్చిన ఆహారంతో సమస్త జీవరాసులను ఈ ప్రకృతి పోషిస్తుందన్న దానికి సంకేతం ఆయన ఆయుధం. భీముడు, దుర్యోధనుడు ఆయన వద్దనే గదాయుద్ధం నేర్చుకున్నారు. బలరాముడు ఎప్పుడూ నీలంరంగు వస్త్రాలనే ధరిస్తుంటాడని, అయన జండామీద తాటిచెట్టు గుర్తు ఉంటుందని కొన్ని పురాణాలు వర్ణించాయి. బలరాముడు కొన్ని విషయాల్లో శ్రీకృష్ణునితో ఏకీభవించకపోయినప్పటికీ, ఆయనను అతిక్రమించి మాత్రం ప్రవర్తించలేదు. ఇక్కడే బలరామునిలో ప్రకృతి తత్త్వం కనిపిస్తుంది.

ప్రకృతి భగవానుని కంటే వేరుగా కనిపించినప్పటికీ విరుద్ధంగా ప్రవర్తించదు. ఆయన ఆదేశాలకు లోబడే పనిచేస్తుంది. బలరాముడు శ్రీకృష్ణునితో విభేదించినట్లు కనబడినప్పటికీ అసలు ధర్మసూక్ష్మం ఏమిటో మనకు తెలియబరుస్తాడే తప్ప నిజానికి అది విభేదం కాదు. బలరాముడి సాహసం, పరాక్రమం తెలియచెప్పే సంఘటనలు మనకు పురాణాల్లో అనేక చోట్ల కనిపిస్తాయి. జాంబవతి కుమారుడైన సాంబుడు దుర్యోధనుడి కుమార్తెయైన లక్ష్మణను. స్వయంవరం నుంచి తీసుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా, కౌరవ సైన్యం సాంబుని బంధింస్తారు. ఈ విషయం తెలిసిన యాదవులు, దుర్యోధనుని సైన్యం మీదకి యుద్ధానికి వెళ్తారు. కానీ బలరాముడు వారిని వారించి తానొక్కడే కొద్దిపాటి సైన్యంతో యుద్ధానికి సిద్ధమవుతాడు. తన పరాక్రమం చూపిస్తూ తన హలాయుధంతో హస్తినను యమునలో పడేలా కొట్టాడు. ఆ దెబ్బకి హస్తినలో కొంతభాగం యమునలో పడింది. ఇప్పటికీ హస్తినలో (ఢిల్లీ) లోని దక్షిణ భాగం ఒక వైపుకి ఒరిగి ఉందంటారు.

భారత యుద్ధంలో తనకి కౌరవపాండవులిద్దరూ సమానమే కాబట్టి తటస్థంగా ఉంటాడు. యుద్ధంలో ఎవరి పక్షమూ వహించక తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. అలా వింధ్యపర్వత ప్రాంతాలు, దండకారణ్యాన్ని దాటి బలరాముడు తన యాత్ర కొనసాగిస్తున్నాడు. ఓ ప్రాంతంలో ప్రజలంతా కరువు కాటకాలతో తిండి దొరకక విలవిలలాడుతున్నారు. దానికితోడు ప్రలంబసూతి అనే రాక్ష సుడు, అక్కడి ప్రజలను విపరీతంగా వేధిస్తున్నాడు. ఆ రాక్షసుని నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందా? అని ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్న తరుణంలో బలరాముడు అక్కడకు చేరుకున్నాడు. ప్రజల బాధలు విని తన హలంతో బలరాముడు ఆ రాక్షసున్ని అంతం చేశాడు. అనంతరం ఆ నాగలిని భూమిపై బలంగా నాటాడు. ఆయన నాగలిని నాటినచోట ఒక జలధార ఉద్భవించి, నాగావళిగా పేరొందింది. అనంతరం బలరాముడు, ఆ నాగావళి నది పక్కనే ఒక మహాలింగాన్ని ప్రతిష్ఠించి, దానికి రుద్రకోటేశ్వరుడని నామకరణం చేశాడు. బలరాముడు ప్రతిష్ఠించిన ఉమారుద్ర కోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు మానవలే కాదు సకల దేవతలు కూడా అక్కడికి చేరుకున్నారని పురాణ కథనం.

Friday, August 5, 2022

చతుఃషష్టి ఉపచారాలు

ఒకసారి శ్రీశంకరాచార్యులవారికి లలిత అమ్మవారు 64 కళలతో, 64 యోగినీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ ఆనందపారవశ్యములో ఆశువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికే అధికారం ఉన్న చతుఃషష్టి ఉపచారాలను ఈ విధంగా వివరించేరు. అవి.
1. అర్ఘ్యం,పాద్యం,ఆచమనీయం – అమ్మవారి కాళ్ళు, చేతులు జలముతో కడిగి, త్రాగుటకు జలము సమర్పించడం
2. ఆభరణ అవరోపణం – ముందురోజు వేసియున్న ఆభరాణాలు తీయడం
3. సుగంధ తైలాభ్యంజనం – వంటికి నూనె పట్టించడం
4. మజ్జనశాలా ప్రవేశము – స్నానాల గదికి తీసుకొని వెళ్ళడం
5. మణిపీఠోపవేశనం – మణులతో అలంకరించిన పీఠముపై కూర్చోపెట్టడం
6. దివ్యస్నానీయ ఉద్వర్తనం – నలుగు పెట్టుట
7. ఉష్ణోదక స్నానము – వేడి నీటితో స్నానము చేయించుట
8. కనక కలశచ్యుత సకల తీర్థాభిషేచనం – బంగారుకలశలలో పవిత్రనదులనుండి తీసుకువచ్చిన సకల పవిత్ర తీర్థములతో అభిషేకము
9. ధౌతవస్త్ర పరిమార్జనం – పొడిగుడ్డతో శుభ్రంగా తుడవడం
10. అరుణ దుకూల పరిధానం – ఎర్రని వస్త్రము ధరింపజేయడం
11. అరుణకుచోత్తరీయం – ఎర్రని ఉత్తరీయమును (జాకెట్టు) ధరింపజేయడం
12. ఆలేపన మంటప ప్రవేశనం – అత్తరు మొదలైన అలేపనలు పూసే గృహానికి అమ్మవారిని తీసుకొని వెళ్ళడం అక్కడ మళ్ళీ మణిపీఠముపై కూర్చోపెట్టడం
13. చందన అగరు కుంకుమ సంకు మృగమద కర్పూర కస్తూరీ గోరోజనాది దివ్య గంధ సర్వాంగీణ ఆలేపనం – వివిధ దివ్య గంధములను అమ్మవారికి అలదింపజేయడం
14. కేశాభరస్య కలాదుల అగరు ధూపం – కేశములు విస్తారపరచి సుగంధధూపం వేయడం
15. జడవేసి, మల్లికా మాలతీ చంపక అశోక శతపత్ర పూగ క్రముక మంజరీ పున్నాగ కల్హార ముఖ్య సర్వ ఋతు కుసుమమాల సంప్రయం - వివిధఋతువులలో పూచిన సుగంధ పుష్పములతో అల్లిన మాలతో అమ్మవారిని అలంకరించడం
16. భూషణమండప ప్రవేశము – అలంకార గది ప్రవేశము
17. మణిపీఠోపవేశనము - అక్కడమళ్ళీ మణిపీఠం పై కూర్చోపెట్టడము
18. నవమణిమకుట ధారణ – తొమ్మిది రకాల మణులతో కూర్చిన కిరీటం పెట్టడం
19. దానిపైన చంద్ర శకలం పెట్టడం
20. సీమంతంలో సిధూరాన్ని దిద్దడం
21. తిలక ధారణము – నుదుటిపై తిలకంతో బొట్టు పెట్టడం
22. కాలాంజనం దిద్దడం – అమ్మవారి కళ్ళకు కాటుక పెట్టడం
23. పాళీయగళం – అమ్మవారికి చెంప స్వరాలు (మావటీలు) అలంకారం చేయడం
24. మణికుండళయుగళం - మణికుండలములు రెండు చెవులకు అలంకరించడం
25. నాసాభరణం – ముక్కుకి నాసాభరణం అలంకరించడం
26. అధరయావక లేపనం – పెదవులకు పూసే లత్తుక పూయడం
27. ఆర్య భూషణం - ప్రధాన భూషణం అలంకరించడము
28. మాంగల్య సూత్రము – మాంగల్య సూత్రమును అలంకరించుట
29. హేమచింతాకం – బంగారుతో కూడిన చింతామణులమాల వేయడం
30. పతకం – బంగారు పతకం
31. మహాపతకం – పెద్దదిగా ఉన్న బంగారు పతకం
32. ముక్తావళి – మూడు వరుసల ముత్యాలహారం
33. ఏకావళి – 27 ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాలహారం
34. చన్నభీరము – యజ్ఞోపవితం లాగ భుజములమీదనుండి వేసే ఒక ఆభరణము
35. కేయూర యుగళ భూషణ చతుష్టయము – నాలుగు చేతులకు నాలుగు కేయీరములు ( దండ కడియాలు)
36. వలయావళి – నాలుగు చేతులకు కంకణములు
37. ఊర్మికావళి – నాలుగు చేతులకు ఉంగరములు
38. కాంచీధామము – వడ్డాణము అని పెలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణము
39. కటిసూత్రము – వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రము
40. సౌభాగ్యాభరణం – అశోకచెట్టు ఆకులాగ ఉండే ఒక ఆభరణం (కుత్తిగంటు) 
41. పాదకటకం – కాలి అందెలు
42. రత్ననూపురములు – దానిచుట్టూ మువ్వల రత్ననూపురములు
43. పాదంగుళీయములు - మట్టెలు
44. పాశం – పైన ఉన్న కుడి చేతిలో తాడు
45. అంకుశం – పైన ఉన్న ఎడమ చేతిలో అంకుశం
46. పుండ్రేక్షు చాపము – క్రింద ఉన్నకుడి చేతిలో చెరుకువిల్లు 
47. పుష్పబాణములు – కింద ఉన్న ఎడమ చేతిలో పుష్పములతో చేసిన బాణములు
48. శ్రీ మణి మాణిక్య పాదుక – ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు
49. స్వ సామన వేషభి ఆవరణ దేవతాభి సహ మహాచక్రాథిరోహణము – సర్వాలంకాణలతో ఉన్న ఆవరణదేవతలతో కూడిన మహాసింహాసనముపై అమ్మవారిని అధిష్టింపజేయడం
50. కామేశ్వరాంగ పర్యాంక ఉపవేశము – అమ్మవారిని కామేశ్వరుని పర్యంకముపై కూర్చొండబెట్టుట
51. అమృతచషకము – అమ్మవారికి త్రాగుటకు పాత్రతో మధువును అందించుట
52. ఆచమనీయము – జలమునందించుట
53. కర్పూరవీటిక – కర్పూర తాంబూలము నందించుట ( కర్పూరతాంబూలం అంటే ఎలాఉంటుందో, అందులో ఏ ఏ సుగధద్రవ్యాలు ఉంటాయో ఈ క్రింద వివరించడమనది)
54. ఆనందోల్లాస విలాస హాసము – అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతసము, అనుగ్రహము తో కూడిన చేసే మందహాసము
55. మంగళార్తికం – దీపముల గుత్తి ని అమ్మవారి చుట్టూ తిప్పడం
56. ఛత్రము – అమ్మవారికి గొడుగు పట్టుట
57. చామరము – అమ్మవారికి చామరము వీచుట
58. దర్పణమ్ – అమ్మవారికి దర్పణం చూపించుట
59. తాళావృతం – అమ్మవారికి విసనకర్రతో విసురుట
60. చందనం – గంధం పమర్పించుట
61. పుష్పం – పుష్పాలను సమర్పించుట
62. ధూపము – సువాసనభరితమైన ధూపమును వేయుట
63. దీపము – దీప దర్శనము చేయించుట
64. నైవేద్య,తాంబూల,నీరాజన నమస్కారములు – నవరసభరితమైన నైవేద్యమును సమర్పించుట, తరువాత తాంబూల నీరాజనాది సత్కారములతో నమస్కరించుట
ఏకాంతము.

సృష్టి రహస్య విశేషాలు

సృష్ఠి ఆవిర్బావము.
1  ముందు(పరాపరము) దీనియందు శివం పుట్టినది
2  శివం యందు  శక్తి
3  శక్తి యందు నాధం
4  నాధం యందు బిందువు
5  బిందువు యందు సదాశివం
6  సదాశివం యందు మహేశ్వరం
7  మహేశ్వరం యందు ఈశ్వరం
8  ఈశ్వరం యందు రుద్రుడు
9  రుద్రుని యందు విష్ణువు
10 విష్ణువు యందు బ్రహ్మ
11  బ్రహ్మ యందు ఆత్మ
12  ఆత్మ యందు దహరాకాశం
13  దహరాకాశం యందు వాయువు
14  వాయువు యందు అగ్ని
15  ఆగ్ని యందు జలం
16  జలం యందు పృథ్వీ. 
17. పృథ్వీ యందు ఓషధులు
18. ఓషదుల వలన అన్నం
19. ఈ అన్నము వల్ల నర,  మృగ, పశు, పక్షి, వృక్ష, స్థావర జంగమాదులు పుట్టినవి.

సృష్ఠి కాల చక్రం
పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది. ఇప్పటివరకు ఎంతో మంది శివులు, ఎంతోమంది విష్ణువులు, ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు. ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు. ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.
1 కృతాయుగం
2 త్రేతాయుగం
3 ద్వాపరయుగం
4 కలియుగం
నాలుగు యుగాలకు 1 మహయుగం.
71 మహ యుగాలకు 1మన్వంతరం.
14 మన్వంతరాలకు ఒక సృష్ఠి (ఒక కల్పం.)
15 సందులకు ఒక ప్రళయం (ఒక కల్పం)
1000 యుగాలకు బ్రహ్మకు పగలు (సృష్ఠి) .  
1000 యుగాలకు ఒక రాత్రి  (ప్రళయం.)
2000 యుగాలకు ఒక దినం.

ఇప్పుడు బ్రహ్మ వయస్సు 51 సం.
ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.
1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.
7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.
14 మంది మనువులు.

ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం. 
శ్వేతవరాహ యుగంలో ఉన్నాం.
5 గురు భాగాన కాలంకు 60 సం
1 గురు భాగాన కాలంకు 12 సం
1 సంవత్సరంకు 6 ఋతువులు.
1 సంవత్సరంకు  3 కాలాలు.
1 రోజుకు 2 పూటలు పగలు  రాత్రి
1 సం. 12 మాసాలు.
1 సం.  2 ఆయనాలు
1సం. 27 కార్తెలు
1 నెలకు 30 తిధులు
27 నక్షత్రాలు - వివరణలు
12 రాశులు
9 గ్రహాలు
8 దిక్కులు
108 పాదాలు
1 వారంకు 7 రోజులు
పంచాంగంలో 1 తిధి. 2 వార.  3 నక్షత్రం.  4 కరణం.  5 యోగం.
సృష్ఠి యావత్తు త్రిగుణములతోనే ఉంటుంది.
దేవతలు జీవులు చెట్లలో అన్ని వర్గంలలో మూడే గుణములు ఉంటాయి.
1  సత్వ గుణం 
2  రజో గుణం
3  తమో గుణం

పంచ భూతంలు ఆవిర్భావం
1 ఆత్మ యందు ఆకాశం 
2 ఆకాశం నుండి వాయువు
3 వాయువు నుండి అగ్ని
4 అగ్ని నుండి జలం
5 జలం నుండి భూమి అవిర్బవించాయి.
5  ఙ్ఞానేంద్రియంలు
5  పంచ ప్రాణంలు
5  పంచ తన్మాత్రలు
5  ఆంతర ఇంద్రియంలు
5  కర్మఇంద్రియంలు  = 25 తత్వంలు

1  ఆకాశ పంచికరణంలు
ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల ( జ్ఞానం )
ఆకాశం - వాయువులో కలవడం వల్ల ( మనస్సు )
ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల  ( బుద్ది )
ఆకాశం - జలంతో కలవడంవల్ల  ( చిత్తం )
ఆకాశం - భూమితో కలవడంవల్ల   (ఆహంకారం ) పుడుతుతున్నాయి

2( వాయువు పంచీకరణంలు )
వాయువు - వాయువుతో కలవడం వల్ల  ( వ్యాన)
వాయువు - ఆకాశంతో కలవడంవల్ల       ( సమాన )
వాయువు - అగ్నితో కలవడంవల్ల           ( ఉదాన )
వాయువు - జలంతో కలవడంవల్ల          ( ప్రాణ )
వాయువు - భూమితో కలవడంవల్ల        ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.

3 ( అగ్ని పంచీకరణములు )
అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల     ( శ్రోత్రం )
అగ్ని - వాయువుతో కలవడంవల్ల   ( వాక్కు )
అగ్ని - అగ్నిలో కలవడంతో           ( చక్షువు )
అగ్ని - జలంతో కలవడంతో         ( జిహ్వ )
అగ్ని - భూమితో కలవడంతో     ( ఘ్రాణం )  పుట్టెను.

4 ( జలం పంచికరణంలు )
జలం - ఆకాశంలో కలవడంవల్ల     ( శబ్దం )
జలం - వాయువుతో కలవడంవల్ల  ( స్పర్ష )
జలం -  అగ్నిలో కలవడంవల్ల        ( రూపం )
జలం - జలంలో కలవడంవల్ల         ( రసం )
జలం - భూమితో కలవడం వల్ల      ( గంధం )
పుట్టెను.

5 ( భూమి పంచికరణంలు )
భూమి - ఆకాశంలో కలవడంవల్ల      ( వాక్కు )
భూమి - వాయువుతో కలవడం వల్ల  ( పాని )
భూమి -  అగ్నితో కలవడంవల్ల          ( పాదం )
భూమి - జలంతో కలవడంతో          ( గూహ్యం )
భూమి - భూమిలో కలవడంవల్ల      ( గుదం )
పుట్టెను.( మానవ దేహ తత్వం )

5  ఙ్ఞానేంద్రియంలు
1  శబ్ద
2  స్పర్ష
3  రూప
4  రస
5  గంధంలు.

5 పంచ తన్మాత్రలు
1  చెవులు
2  చర్మం
3  కండ్లు
4  నాలుక
5  ముక్కు

5  పంచ ప్రాణంలు
1  అపాన 
2  సామనా
3  ప్రాణ
4  ఉదాన
5  వ్యాన

5  అంతఃర ఇంద్రియంలు  
1  మనస్సు
3  బుద్ది
3  చిత్తం
4  జ్ఞానం
5  ఆహంకారం

5 కర్మేంద్రియంలు
1  వాక్కు
2  పాని
3  పాదం
4  గుహ్యం
5  గుదం

6  అరిషడ్వర్గంలు
1  కామం
3  క్రోదం
3  మోహం
4  లోభం
5  మదం
6  మాత్సర్యం

3  శరీరంలు
1  స్థూల  శరీరం
2  సూక్ష్మ  శరీరం
3  కారణ  శరీరం

3  అవస్తలు
1  జాగ్రదావస్త
2  స్వప్నావస్త
3  సుషుప్తి అవస్త

6  షడ్బావ వికారంలు 
1  ఉండుట
2  పుట్టుట
3  పెరుగుట
4  పరినమించుట
5  క్షిణించుట
6  నశించుట

6 షడ్ముర్ములు
1  ఆకలి
2  దప్పిక
3  శోకం
4  మోహం
5  జర
6  మరణం

7  (కోశములు)  (సప్త ధాతువులు)
1  చర్మం
2  రక్తం
3  మాంసం
4  మేదస్సు
5  మజ్జ
6  ఎముకలు
7  శుక్లం

3 జీవి త్రయంలు
1  విశ్వుడు
2  తైజుడు
3  ప్రఙ్ఞుడు

3  కర్మత్రయంలు
1  ప్రారబ్దం కర్మలు
2  అగామి  కర్మలు
3  సంచిత  కర్మలు

5  కర్మలు
1  వచన
2  ఆదాన
3  గమన
4  విస్తర
5  ఆనంద

3  గుణంలు
1  సత్వ గుణం
2  రజో గుణం
3  తమో గుణం

9  (చతుష్ఠయములు)
1  సంకల్ప
2  అధ్యాసాయం
3  ఆభిమానం
4  అవధరణ
5  ముదిత
6  కరుణ
7  మైత్రి
8  ఉపేక్ష
9  తితిక్ష

10  (5 పంచభూతంలు పంచికరణ చేయనివి)
1  ఆకాశం
2  వాయువు
3  ఆగ్ని
4  జలం
5  భూమి

14  మంది  (అవస్థ దేవతలు)
1  దిక్కు
2  వాయువు
3  సూర్యుడు
4  వరుణుడు
5  అశ్వీని దేవతలు
6  ఆగ్ని
7  ఇంద్రుడు
8  ఉపేంద్రుడు
9  మృత్యువు
10  చంద్రుడు
11  చతర్వకుడు
12  రుద్రుడు
13  క్షేత్రజ్ఞుడు
14  ఈశానుడు

10  ( నాడులు ) 1 ( బ్రహ్మనాడీ )
1  ఇడా నాడి
2  పింగళ
3  సుషుమ్నా
4  గాందారి
5  పమశ్వని
6  పూష
7  అలంబన
8  హస్తి
9  శంఖిని
10  కూహు
11  బ్రహ్మనాడీ

10  వాయువులు
1  అపాన
2  సమాన
3  ప్రాణ
4  ఉదాన
5  వ్యాన
6  కూర్మ
7  కృకర
8  నాగ
9  దేవదత్త
10  ధనంజమ

7  షట్ చక్రంలు
1  మూలాధార
2  స్వాదిస్థాన
3  మణిపూరక
4  అనాహత
5  విశుద్ది
6  ఆఙ్ఞా
7  సహస్రారం

మనిషి  ప్రమాణంలు
96  అంగుళంలు
8  జానల పోడవు
4  జానల వలయం
33 కోట్ల రోమంలు
66 ఎముకలు
72 వేల నాడులు
62  కీల్లు
37  ముారల ప్రేగులు
1  సేరు గుండే
అర్ద సేరు రుధిరం
4  సేర్లు మాంసం
1  సేరెడు పైత్యం
అర్దసేరు శ్లేషం

(మానవ దేహంలో 14 లోకాలు)  పైలోకాలు 7
1  భూలోకం  -  పాదాల్లో
2  భూవర్లలోకం  -  హృదయంలో
3  సువర్లలోకం  -  నాభీలో
4  మహర్లలోకం  -  మర్మాంగంలో
5  జనలోకం  -  కంఠంలో
6  తపోలోకం  -  భృమద్యంలో

7  సత్యలోకం  -  లాలాటంలో
అధోలోకాలు  7
1  ఆతలం  -  అరికాల్లలో
2  వితలం  -  గోర్లలో
3  సుతలం  -  మడమల్లో
4  తలాతలం  -  పిక్కల్లో
5  రసాతలం  -  మొకాల్లలో
6  మహతలం  -  తోడల్లో

7  పాతాళం - పాయువుల్లో
(మానవ దేహంలో  సప్త సముద్రంలు)
1  లవణ సముద్రం  -  మూత్రం
2  ఇక్షి సముద్రం  -  చెమట
3  సూర సముద్రం  -  ఇంద్రియం
4  సర్పి సముద్రం  -  దోషితం
5  దది సముద్రం  -  శ్లేషం
6  క్షీర సముద్రం  -  జోల్లు
7  శుద్దోక సముద్రం  -  కన్నీరు

(పంచాగ్నులు)
1  కాలాగ్ని  -  పాదాల్లో
2  క్షుదాగ్ని  -  నాభిలో
3  శీతాగ్ని  -  హృదయంలో
4  కోపాగ్ని  -  నేత్రంలో
5  ఙ్ఞానాగ్ని  -  ఆత్మలో

7  (మానవ దేహంలో  సప్త  దీపంలు)
1  జంబుా ద్వీపం  -  తలలోన
2  ప్లక్ష ద్వీపం  -  అస్తిలోన
3  శాక ద్వీపం  -  శిరస్సుపైన
4  శాల్మల ధ్వీపం  -  చర్మంన
5  పూష్కార ద్వీపం  -  గోలమందు
6  కూశ ద్వీపం  -  మాంసంలో
7  కౌంచ ద్వీపం  -  వెంట్రుకల్లో

10  (నాధంలు)
1  లాలాది ఘోష  -  నాధం
2  భేరి  -  నాధం
3  చణీ  -  నాధం
4  మృదంగ  -  నాధం
5  ఘాంట  -  నాధం
6  కీలకిణీ  -  నాధం
7  కళ  -  నాధం
8  వేణు  -  నాధం
9  బ్రమణ  -  నాధం
10  ప్రణవ  -  నాధం

Thursday, August 4, 2022

తథాస్తు దేవతలు

తథాస్థు దేవతలంటే
వేదాలలో ‘అనుమతి’అనే ఒక దేవత ఉంది. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు, ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే లాగ సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటున్నారు. సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం.

అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు. వీరు విశ్వకర్మ అంశ అయిన సూర్యుని కుమారులు. అశ్వ రూపంలో సూర్యుడు, ఛాయాదేవి సంభోగించుట మూలంగా వీరు జన్మించారు.

మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులుగా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. వీరిసోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన.

ఏం మాట్లాడినా తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారు. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు. పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందట. తథాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించ కూడని మాటలను పదేపదే అంటే దేవతలు వెంటనే తథాస్తు అనేస్తారు. వీరినే తథాస్తు దేవతలు అంటారు.

సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తథాస్తు అంటూ ఉంటారు. ఎంత ఉన్నా తరచూ డబ్బు లేదులేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు.

అనారోగ్యానికి గురైనపుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్లండని సలహా ఇస్తారు. వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు. ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడుతారు. హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు. దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం, దీని వల్ల మంచి పేరు రావడం చోటు చేసుకుంటాయి.

చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి. మరికొన్ని దుష్పలితాలు చోటుచేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతాయి. 

కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మంచే జరుగుతుంది.

పూజారి -- కానుకలు..

పూజారి -- కానుకలు .. మీరు కానుకలు హుండీలోనే వేయండి . పూజారి ప్లేటులో వేయవద్దు ,హుండీలో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడికి చేరుతుంది...