Friday, February 3, 2017

అనంత పద్మనాభ స్వామి మహిమలు

దేవతలు అనంత పద్మనాభస్వామిని పూజిస్తారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం

అనంత మహిమలు

మొన్న కురిసిన భారీ వర్షాలకు కేరళ రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు వరదల పాలయ్యాయి. అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్న తిరువనంతపురం లోను వరదలు వచ్చాయి.




స్వామి వారి ఆలయం ముందు ఉండే పద్మ తీర్ధం నిండిపోయింది, ఆలయం దగ్గరకు వెళ్ళే మార్గం వర్షపు నీటిలో మునిగిపోయింది. దాంతో మూడు రోజుల పాటు స్వామి వారి ఆలయం తెరువలేదు, నిత్య పూజలు జరుగలేదు.

దేవతల ఆరాధన: అయితే పురాణ ప్రాశస్త్యం ప్రకారం అనంత పద్మనాభ స్వామి వారిని ప్రతి రోజూ దేవతలు పుజిస్తారట. అర్చక స్వాములు ఆలయాన్ని తెరువక ముందే దేవతలు స్వామి వారిని సేవిస్తారు.
అఖండ దీపం: స్వామి వారి సన్నిధిలో ఒక దీపం అఖండలంగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అందులో కేవలం ఆవు నేయ్యి మాత్రమే వేయాలని ఆలయ శాసనం. ప్రతి రోజు ఆలయం మూసివేసే సమయంలో అర్చక స్వాములు అందులో ఆవు నెయ్యి వేసి వెళతారు. మరుసటి రోజు ఉదయం ఆలయం తెరించేంత వరకూ అఖండలంగా వెలుగుతున్న ఆ జ్యోతిలోనికి మరల నెయ్యి వడ్డిస్తూ కొనసాగిస్తూ ఉంటారు.

మనం లౌకికంగా ఆలోచిస్తే నూనె కంటే నెయ్యితో దీపం వేలగాలంటే కాస్త కష్టమే, ఎందుకంటే నెయ్యి వాతావరణాన్ని బట్టి గడ్డకడుతూ ఉంటుంది. దీపం వెలగడానికి ద్రవంగా మారడానికి సమయం పడుతుంది. చల్లటి వాతావరణంలో నెయ్యి తొందరగా గడ్డ కడుతూ ఉంటుంది. దీపానికి కావలసిన ద్రవంగా నెయ్యి మారక దీపం కొండెక్కిపోయే అవకాశాలు ఎక్కువ. ఇది మనందరికీ అనుభవనీయమైన సంగతే. కానీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో దీపం లోనికి గడ్డ కట్టిన నెయ్యి వేసిన అది ద్రవంగా మారి దీపం అఖండలంగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది . అయితే కొందరికి అనుమానం కలగచ్చు దీపపు ప్రమిద లేక దీపపు కుందె ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటే అది వేడిగా ఉండి నెయ్యిని కరిగిస్తుంది కదా ఇందులో గొప్ప విశేషం ఏముంది అనిపించవచ్చు.

స్వామి వారి సన్నిధిలో దీపం మట్టి ప్రమిద లోనో లేక లోహపు కుందె లోనో ఉండదు . శిలలో చెక్కబడిన రాతి ప్రమిదలో ఉంటుంది. ఎంత పెద్దగా ప్రజ్వరిల్లితే ఆ వేడికి రాతి ప్రమిద వేడెక్కాలి , అందులో నెయ్యి కరగాలి. ఉష్ణోగ్రత తరచుగా ఒకచోట నుండి మరొక చోటికి ప్రయాణిస్తూ ఉంటుంది. రాతి శీలలో ఉండే చలి యొక్క ఉష్ణోగ్రత అదే రాతి శిలలోని ప్రమిదను కుడా చల్లబరుస్తూ నెయ్యిని గడ్డ కట్టేలా చేయాలి . కానీ అందుకు విరుద్ధంగా నెయ్యి కరిగిపోతూ దీపం నిరంతరాయంగా వెలుగుతూ ఉంటుంది.

ఇది సైన్స్ చెప్పే వాటికి వ్యతిరేకంగా లేదా? స్వామి వారి మహిమ కాక మరేమిటి?

మరొక నిదర్శనం:


అర్చక స్వాములు ఉదయాన్నే ఆలయం తెరిచి చూసినప్పుడు దీపంలో నెయ్యి కాస్త తగ్గి ఉంటుంది. ఆ దీపాన్ని మళ్ళీ నెయ్యి వేసి నింపుతారు.అంటే ప్రతి రోజు ఉదయo, మధ్యాహ్నము, సాయంత్రం, రాత్రి అర్చక స్వాములు అప్రమత్తంగా ఉంటూ దీపం అఖండలంగా ఉండేలా నెయ్యి వడ్డిస్తూ ఉంటారు కదా.

మరి మూడు రోజులు ఆలయం మూసి ఉన్నా కూడా ఆ దీపం అలానే వెలుగుతూ ఉంది అంటే ఎవరు నెయ్యి వడ్డించి ఉంటారు? ఇది దేవతలు స్వామి వారిని సేవిస్తుంటారు అనటానికి నిదర్శనం కాదా?

మరొక నిదర్శనం:

అనంత పద్మనాభ స్వామి వారి మూర్తి పూర్తిగా నీటిలో మునిగిపోతే ప్రళయం సంభవిస్తుందని ఆలయ శాసనంలో ఉంది. మొన్న కురిసిన వర్షాలకు తిరువనంతపురం దాదాపుగా మునిగిపోయింది. స్వామి వారి మూర్తి ఎంత వరకూ వరదలో మునిగిందో అనీ తిరువనంతపుర ప్రజలు భయాందోళలను పొందారు. ఆలయం దగ్గర కనిపించిన వరద తాకిడి కూడా భయానకంగా కనిపించిందట.

మూడు రోజుల తరువాత అర్చక స్వాములు ఆలయ తలుపులు తీసి చూడగా వారు నిశ్చేష్టులయ్యారు. స్వామి వారి గర్భాలయంలోనికి నీరు ప్రవేశించలేదు. ఎక్కడా తేమ కూడా లేదు. అప్పుడే కడిగి శుబ్రపరచినట్లుగా పొడిగా , సుగంధ పరిమళాలతో సువాసనలతో, అఖండలంగా ప్రజ్వరిల్లుతున్న దీపం దర్శనమిచ్చాయి. అంతే కాదు స్వామి వారికి అలంకరించిన పూల మాలలు తాజాగా ఉన్నాయి. బయట ధ్వజ స్థంభం కూడా పరి శుభ్రంగా తేమ లేకుండా ఉన్నాయి. స్వామి వారి ఆలయం చుట్టూ ఉండే ఉపాలయాలలోను వరద నీరు ప్రవేశించలేదు. ఇలా నేటికీ స్వామి వారి ఉనికి మనకు చాటుతూనే ఉన్నారు. మనమే ఆయనను గుర్తించలేక శిలలా భావిస్తూ యాంత్రికంగా షోడశోపరచార పూజలు చేస్తూ మన భక్తికి సాటిలేదు అంటూ గర్విస్తూ అజ్ఞానంలో ఓలలాడుతూ ఉన్నాము. ఇలాంటి నిదర్శనాలు ప్రతి ఆలయంలోను జరుగుతూనే ఉంటాయి. అంతటి భక్తి మనలో ఉంటే వాటిని దర్శించే భాగ్యము స్వామి వారే కలిగిస్తారు.

ఇలాంటి నిదర్శనాలను అందరికీ తెలియజేసి నాస్తికులలోను, హేతువాదులలోను మార్పు తెచ్చి మన సనాతన ధర్మాన్ని పరి రక్షించుకోవలసిన కర్తవ్యం మనది.


ఓం నమో నారాయణాయ.

No comments:

The Wisdom of the Turtle: Moving Forward with Patience and Purpose

There is something quietly profound about watching a turtle move. Its steps are slow, steady, and deliberate, yet never meaningless. The wor...