Bhaarata Maja Pooja - భారత మాత పూజ
భారత మాతకు పూజలు చేద్దాం
భారత మాతకు సేవలు చేద్దాం
మనకు మన తల్లికి ఆధారం
నిరతము మనకిచ్చు ఆహారం
గ్రామ దేవతను పూజించే మనం
దేశ మాతను పూజిద్దాం
దేశమంటే మట్టి కాదు
దేశమంటే మనుషులోయి
దేశమును ప్రేమించుమన్నా
భారత మాతను పూజించుమన్నా
తోటి వానికి తోడుపడమని
అందరకీ చెప్పడమేనోయి
సంగమేశ్వర శాస్త్రి మనకు మేలు చేసి మేలు చేసి
సమాజ సేవకోసము శక్తినంత ధార పోసి
తనమాటగ మనకు చెప్పిన
భారత మాత పూజ చేద్దాం
No comments:
Post a Comment