Friday, March 26, 2021

చీమ - బాతు- హంస - Ramakrishna paramahamsa

చీమ - బాతు- హంస

 రామకృష్ణ పరమహంస అంటారు. ... నేను జీవితంలో కొన్నిటిని చెపుతాను. వాటిని ఆదర్శంగా పెట్టుకో. ఇంతకన్నా ఆదర్శమైనవి నీకు ప్రపంచంలో అక్కర్లేదు. అంటారు. 

అవి ఏమిటి? 

మొదటిది చీమ. చీమను నీవు ఆదర్శంగా తీసుకో. 

కొంచెం పంచదార, కొంత ఇసుక కలిపి అక్కడ పోస్తే చీమ పంచదార రేణువులను మాత్రమే తీసుకువెళుతుంది. ఇసుక రేణువులను వదిలివేస్తుంది. 

ఈ జగత్తులో సారవంతమైన విషయమును గ్రహించి అసారవంతమైన విషయమును విడిచి పెట్టడం నేర్చుకోవాలి. 

సారవంతమైన విషయమును లోపల పదిలపరచుకోవడం నేర్చుకోవాలి.

     రెండు.... బాతులా బ్రతుకు

. బాతు తెల్లగా ఉంటుంది. కానీ బాతు బురదలో ఉంటుంది. ఆ బాతు మీద బురద చుక్క వచ్చి పడుతుంది. అది శరీరమును దులుపుకుం టుంది. వెంటనే బురద చుక్క జారి కింద పడిపోతుంది. 

తెల్లటి మల్లెపువ్వులా ఉండే బాతు ఎప్పుడూ బురదలో ఉంటుంది. కానీ దానికి బురద అంటడం లేదు.

 మనలో చాలామంది ... నేను ఫలానా వాళ్ళతో తిరిగి ఇలా పాడైపోయాను. నేను ఇలా పాడైపోవడానికి కారణం వాళ్ళే. నా సాంగత్యం మంచిది కాదు. నేను అలాంటి వాళ్ళతో ఉన్నాను... అని అంటూ ఉంటారు. 

కానీ అలా అనకూడదు. బురదలో ఉన్న బాతుకి బురద అంటలేదు. మరి నీకెందుకు చెడ్డ గుణములు అంటుకోవాలి? నీవు మనసులో స్వచ్ఛంగా ఉంటే , ఇతరులను మార్చగలవేమో కానీ ఇతరులు నిన్ను మార్చలేరు. నీ దగ్గర ధీశక్తి లేనప్పుడే నీవు ఇతరులు చెప్పిన మాటలకు లొంగిపోతావు. నీది పిరికి మనసు. అటువంటపుడు నీవు తొందరగా దుర్గుణములకు వసుడవు అయిపోతావు. నీ మనసు బలహీనమై నది. దానిని పదిలం చేసుకోవడం మానివేసి, శక్తిమంతము చేసుకోవడం మానివేసి, చీడా పీడా తొలగించడం మానివేసి, నీవు పాడవడాని కి ఇతరుల యందు దోషమును ఆరోపిస్తున్నావు. అది మరొక పెద్ద దోషం. కాబట్టి నీవు బాతులా ఉండడం నేర్చుకో. 

     మూడు.... హంస... నీవు హంసలా ఉండడం నేర్చుకో.

 హంస పాలను, నీటిని కలిపి పెడితే పాలను తీసుకుని నీటిని విడిచిపె డుతుంది. జగత్తునందు బ్రహ్మమును దర్శనం చేసి, జగత్తును విడిచిపెట్టడం అలవాటు చేసుకో. 
ఈ మూడింటిని అలవాటు చేసుకుంటే ఇంతకన్నా గొప్ప విషయం అక్కర్లేదు.

No comments:

The Wisdom of the Turtle: Moving Forward with Patience and Purpose

There is something quietly profound about watching a turtle move. Its steps are slow, steady, and deliberate, yet never meaningless. The wor...