Wednesday, May 19, 2021

స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం

రామునికి — సీత
కృష్ణునికి — రాధ 
ఈశునకు — ఈశ్వరి
మంత్రపఠనంలో — గాయత్రి 
గ్రంధ పఠనంలో — గీత
దేవుని యెదుట - వందన, అర్చన, పూజ, హారతి, ఆరాధన వీరికి తోడుగా శ్రద్ధ

మన దినచర్యలో భాగంగా
ఉదయానికే—ఉష, అరుణ
సాయింత్రం — సంధ్య
చీకటైతే — జ్యోతి, దీప
పడకలో - మేనక 
పడుకున్నాక — స్వప్న

చూచేటప్పుడు— నయన
వినేటప్పుడు — శ్రావణి
మాట్లాడునప్పుడు—వాణి
ఓరిమిలో -వసుధ
వడ్డించేటప్పుడు-అన్నపూర్ణ
నడుస్తున్నప్పుడు— హంస
నవ్వుచున్నప్పుడు — హాసిని, ప్రసన్న
అద్దంలో చూస్తే— సుందరి
చేసేపనికి -స్పూర్తి
పని చేయడానికి — స్పందన
మంచి పనికి — పవిత్ర
ఇష్టంగాచేసే పనికి — ప్రీతి
నీరు త్రాగునపుడు — గంగ
ఐస్క్రీమ్ తినేటప్పుడు — హిమజ
సినిమా చూస్తున్నప్పుడు — చిత్ర
అబద్ధ మాడునపుడు — కల్పన
నిజం చెప్పేటపుడు —సత్యవతి, నిర్మల
ఆలోచనలప్పుడు — ఊహా, భావన
చదువుచున్నప్పుడు — సరస్వతి
వ్యాపారంలో — ప్రతిభ , ప్రగతి
సంతోషంలో— సంతోషి
కోపంలో — భైరవి
ఆటలాడునప్పుడు— ఆనంది 
గెలుపు కోసం— జయ, విజయ
గెలిచిన తర్వాత — కీర్తి
     
సరిగమలు నేర్చునపుడు — సంగీత
పాటలు పాడునపుడు — శృతి, కోకిల
తాళం వేయునపుడు — లయ
      
సాహిత్య గోష్టిలో — కవిత 
నగరాన్ని కాపాడుతూ — ప్రకృతి

జీవిత గమనంలో మనతో
విద్యాభ్యాసంలో — విద్య
సంపాదనప్పుడు — లక్ష్మి
చేసేవృత్తిలో — ప్రేరణ,
పని చేసి వచ్చాక — శాంతి
చిన్నతనంలో — లాలన
మధ్యవయస్సులో -మాధురి
ముసలితనంలో- కరుణ, మమత
జీవితాంతం మనతో — “జీవిత”.

Thursday, May 6, 2021

మాతృమూర్తి ఋణ - ఆదిశంకరాచార్యులవారు

సన్యాసాశ్రమం స్వీకరించి తన ఆప్తులందరినీ త్యజించి వేళ్ళే ముందు తల్లి ఆర్యాంబ చాలా బాధ పడింది. "శంకరా, నువ్వు నాకు ఏకైక పుత్రుడువి కదా! నన్ను వదలి వెళ్ళి పోతున్నావు,

ఆఖరి క్షణాల్లో నాకని ఎవరున్నారు?నాకు దిక్కెవరు "  అని దీనంగా ప్రశ్నించింది.

"అమ్మా! ఏ సమయమైనా సరే,  నీవు తల్చుకుంటే చాలు నీ ముందు వుంటాను."  అన్నాడు శంకరుడు.

భగవత్పాదులు శంకరాచార్యులవారి తల్లికి మరణకాలం సమీపించింది.  మూసిన కళ్ళు తెరవలేదు.

"నేను తలచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు" అని మనసులోనే  తలుచుకుంటూ వున్నది ఆర్యాంబ.

తల్లి తలచుకుంటున్నదన్న విషయం ఆదిశంకరులు గ్రహించారు. వెంటనే శ్రీ కృష్ణుని ధ్యానించారు. 

శ్రీ కృష్ణుడు ఏం కావాలని అడిగాడు.

కురు పితామహుడు భీష్మాచార్యునికి  మోక్షమిచ్చినట్లుగా  నా  మాతృమూర్తి కి  మోక్షం ప్రసాదించమని  వేడుకున్నారు శంకరాచార్యులవారు.

అర్యాంబ , తలుచుకుంటే శంకరుడు వస్తానన్నాడే అని తపిస్తున్నప్పుడు అక్కడికి 

ఎవరో వస్తున్న అలికిడయింది.

కళ్ళు కూడా తెరవలేని స్థితిలో వున్న  ఆర్యాంబ చటుక్కున లేచి శంకరా!  అంటూ , అక్కడికి వచ్చిన ఒక పసిబాలుని, 

గట్టిగా హృదయానికి హత్తుకుంది.బాలుని ఒంటి నిండా ఆభరణాలను గమనించిన ఆర్యాంబ‌,

శంకరుడు సన్యాసి కదా ! యీ ఆభరణాలు ఎలావచ్చాయని  అనుకున్నది.  బరువెక్కిన కనురెప్పలను మెల్లిగా తెరచి చూసింది

ఆర్యాంబ. అక్కడ  తను అను నిత్యం పూజించే గురువాయూరు కృష్ణుడు  సాక్షాత్కరించి నిలచివుండడం

గమనించింది.

గురువాయూరప్పన్ ని చూసిన ఆర్యాంబ  మహదానందంతో " అప్పా! నోరు తెరిచి,నీ నామజపం చేసేశక్తి కూడా లేని యీ దీనురాలి  ఆఖరిక్షణాలలో  నను చూసేందుకు 

వచ్చావా? కృష్ణా "   అని మెల్లిగాగధ్గద కంఠంతో  పలికింది. 

కృష్ణుడు  వెంటనే   "  నీ పుత్రుని ఆదేశం . రాకుండా వుండగలనా ? అమ్మను చూడకుండా వుండగలనా "  అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు.

అదే  సమయానికి  శంకరాచార్యులవారు కూడా  అక్కడికి వచ్చారు.

ఉప్పొంగిన  ఆనందంతో ఆ మాతృమూర్తి శంకరునితో " నాయనా ! నా  భాగ్యమేమని చెప్పను ? నిన్ను పుత్రుని గా పొంది నేను తరించాను. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడినే నా ముందు నిలబెట్టావు  కదా, శంకరా!" అని కన్నీళ్ళుకార్చింది .

గోపాలుని నేను నిలబెట్టడమేమిటి?

నేను జన్మించినది మొదలు  నీవు నా కోసం పడ్డ శ్రమకు , కష్టాలకు బదులుగా నెనేమీ చేయలేకపోయాను.

సాక్షాత్తు భగవంతుడే మానవరూపంలో పుట్టినా మాతృ ప్రేమకు సాటిగా , ఎంతటి సేవచేసినా  కన్నతల్లి ఋణం అణువంతైనా తీరదు.  నేనైనా అంతే.  నేను చేయగలిగినదంతా నీదివ్య చరణాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రమాణం ఒక్కటే "

అని మాతృదేవత పాదాలముందు మోకరిల్లారు ఆదిశంకరాచార్యులవారు.

మన తల్లి తండ్రులకు మనం చేసే సేవల వల్లనే వారి మనసు సంతృప్తిచెంది వారి దివ్యాశిస్సులు సదా  తమ బిడ్డలకు ప్రసాదిస్తారని జగద్గురు ఆది శంకరాచార్యులవారు యీలోకానికి సందేశమిచ్చారు.

బ్రహ్మగారు ఈ భూమి మీద జీవ సృష్టి

బ్రహ్మగారు ఈ భూమి మీద జీవ సృష్టి చేస్తూ మొదటగా

మనిషిని- ఎద్దును- కుక్కను - గుడ్లగూబను పుట్టించి ఒకొక్కరూ నలభై సంవత్సరాలు బతకండి అని ఆదేశించాడు.

సహజంగా మానవుడు ఓన్లీ 40 ఇయర్సేనా సార్ అన్నాడు.  అప్పుడు బ్రహ్మ గారు ఒకసారి ఇచ్చిన ఆర్డర్ కు తిరుగుండదోయ్ అన్నాడు.

అక్కడే ఉన్న ఎద్దు నాకు 40 ఏళ్లు ఎందుకుసార్ - ఎప్పుడూ పొలాలు దున్నుతూ, బళ్లను లాగుతూ ముల్లుకర్రతో పొడిపించుకుంటూ - నాకు 20 ఏళ్ళు చాలుసార్ అందోలేదో వెంటనే అక్కడ ఉన్న మానవుడు - ఆ 20 నాకివ్వండి నాకివ్వండి అనగానే - బ్రహ్మ గారు మీలో మీరు అడ్జస్టయితే నాకేమీ అభ్యంతరం లేదు అని అన్నాడు (ఇప్పుడు మానవుడికి 60 ఏళ్ల వయసయింది).

ఆ వెంటనే అక్కడ ఉన్న కుక్క  నాకు మాత్రం 40 ఏళ్లు ఎందుకు  - ఎక్కే గుమ్మం  దిగే గుమ్మం  అందరూ ఛీ ఛీ అనే బతుక్కి 20 ఏళ్లు చాలు అనగానే ... మళ్లీ మానవుడు ఆ 20 నాకే నాకే  అనగానే బ్రహ్మ గారు ఓకే ఓకే అనేశారు ( ఇప్పుడు మానవుడికి 80 ఏళ్ల వయసయింది).

చివరలో ఉన్న గుడ్లగూబ కూడా సామీ నన్ను చూస్తేనే అసహ్యంగా అపశకునంలా భావిస్తారు...తల అటూ ఇటూ తిప్పుతూ కూర్చుంటాను..సరిగా కనపడదుకూడా కాబట్టి  జంతువులందరిలా నాక్కూడా 20 ఏళ్లు చాలు సామీ అనగానే  - అందుకోసం ఎదురుచూస్తూన్న మానవుడు - అదికూడా నాకే నాకే అనుకుంటూ 100 ఏళ్లూ పూర్తయ్యాయని తెగ సంబరపడ్డాడు.

అందుకే:

మానవుడు తన మొదటి 40 ఏళ్లు మానవుడి గా బతుకుతాడు.

ఆ తరువాత 20 ఏళ్లు ఎద్దు నుండి తీసుకున్న కారణంగా   మానవుడు తన 40-60 ఏళ్ల మధ్యలో ఒక ఎద్దు లా కష్టపడుతూ పిల్లల్ని చదివించి, పెళ్ళిళ్ళు చేసి, ఇల్లు కట్టుకోవడం చేస్తూంటాడు.

ఇక ఆ తర్వాత 20 ఏళ్లు కుక్క నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 60-80 ఏళ్ల మధ్యలో తన ఇంటికి తనే ఓ కాపలాదారుగా మారిపోయి

వచ్చి వెళ్ళే వాళ్ళ ఆరా తీసుకుంటూ,  కోడుకు, కోడలు , మనవలు ఇచ్చే ఆర్డర్లు తీసుకొంటూ కాలక్షేపం చేస్తోంటాడు.

ఇక చివరి 20 ఏళ్లు గుడ్లగూబ నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 80-100 ఏళ్ల మధ్యలో ఎప్పుడు ఈలోకం నుంచి వెళిపోతాడోనని ఇంట్లో వాళ్ళు ఇతగాడికి ప్రొమోషన్ ఇచ్చి ఇతని మకాం వరండాలోకి మార్చిన కారణంగా... పాపం ఆ కుక్కిమంచంలోనే అన్నీ కానిస్తూ, కనపడక పోయినా గుడ్లగూబ లా తల ఇటూ అటూ తిప్పుతూ  ఆ దేవుడి పిలపుకై ఎదురు చూస్తూ ఉంటాడు.

"ఇదే మానవుల నూరేళ్ళ చరిత్ర".

మళ్ళీ ఆ మానవుడే అంటాడు : దురాశ దుఃఖానికి చేటని - దేవుడు ఇచ్చిన దానికంటే అతిగా ఆశపడకూడదని. 

 ( ఎక్కడో ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం విన్న కధకు ఈ అక్షర రూపం ఇచ్చే చిన్నప్రయత్నం)

గోదాదేవి అసలు కథ


తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు , మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి , ఆయనకు పెరియాళ్వారు అంటే - పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తూ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు ‘కోదై’ అంటే - పూలమాల అన్నపేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది.

గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూపాడుతూ పెరిగిందే. యుక్తవయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది. కళ్లుమూసినా , తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలనీ , తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు ! తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి , తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి , గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ , ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా , ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు.

ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్లంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికీ , అలంకారానికీ సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు , వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు , తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడింది గోదా. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై !

ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు , ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి , గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మనీ… అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాననీ చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవినీ , విల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి , అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగిరోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి , విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు.

తీర్థయాత్ర - విది విధాన

పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం అనాదిగా ఉన్న ఆచారం. కానీ ఎక్కువమంది దృష్టిలో తీర్థయాత్ర అంటే ప్రయాణం చేసేయడం, అక్కడి దేవుణ్ణి దర్శించుకోవడం, తిరిగిరావడం – ఇంతే ! కానీ తీర్థయాత్ర అంటే కేవలం ఇవే కావు. ఓ పుణ్యక్షేత్రానికి యాత్ర చేసేటప్పుడు పాటించాల్సిన విధినిషేధాలు కొన్నున్నాయి.

1. ఏ దేవుడి క్షేత్రానికి వెళ్తున్నామో ఆ దేవుడి పూజ ముందస్తుగా కొన్నిరోజుల పాటు ఇంట్లో చేయాలి. కనీసం స్తోత్రాలైనా చదవాలి. ఆ దేవుడి గుఱించి ఏదైనా పవిత్ర గ్రంథం ఉంటే దాన్ని కనీసం ఓ సప్తాహం పాటు పారాయణ చేయాలి. ఆ తరువాతే యాత్రకి బయల్దేఱి వెళ్ళాలి. అప్పుడు మన యాత్ర నిరాటంకంగా జఱిగేలా ఆయన ఆశీర్వదిస్తాడు.

2. ఇలా వెళ్ళి, అలా వచ్చేయడం కాకుండా, కనీసం రెండు-మూడ్రోజుల పాటైనా ఆ క్షేత్రంలో గడిపి, తద్ద్వారా ఆ భగవత్సన్నిధాన అనుభూతి విశేషాలతో మన మనస్సులు సంపూర్ణంగా పరిప్లావితం అయ్యేలా యాత్రా ప్రణాళిక వేసుకోవాలి.

౩. మొక్కుబడి తీర్చుకోవడం కోసం వెళుతున్న పక్షంలో అందుకోసం కట్టిన ముడుపును కూడా మర్చిపోకుండా వెంట తీసుకెళ్ళాలి. ఆ దేవుడు మన ఇష్టదైవం గానీ, ఇలవేల్పు గానీ అయిన పక్షంలో ఆయనకి ప్రతిరోజూ పూజ చేసేటప్పుడు సమర్పించిన ధనరూపకమైన దక్షిణల్నీ, ధాన్యాన్నీ కూడా ఆ దేవాలయంలో సమర్పించడం కోసం తీసుకెళ్ళాలి.

4. పుణ్యక్షేత్రాల్లో చేసే పారాయణలు విశేష ఫలితాన్నిస్తాయి. కనుక యాత్రా సమయం లోనూ,  పుణ్యక్షేత్రం లోనూ చదువుకోవడం కోసం కొన్ని చిన్నచిన్న పుస్తకాలు కూడా వెంట తీసుకెళ్లాలి. ఉదాహరణకి – విష్ణుసహస్రనామాలు, వివిధ దేవీదేవతల స్తోత్రసంపుటాలు మొ||వి. కార్లో వెళ్ళేవారు దేవుడి దృశ్యక, శ్రవ్యక క్లుప్తికలను (CDs) దగ్గఱ పెట్టుకుని కదలాలి.

5. పిల్లల్ని బడి మానిపించైనా సరే, తీర్థయాత్రకి అవశ్యం తీసుకెళ్ళాలి. ఆ బాల్యదశ లో కాకపోతే వారింక ఎప్పటికీ ఆధ్యాత్మికతకీ, మత సంప్రదాయాలకీ పరిచితం కారు. వారికి సంస్కృతీ, సంప్రదాయమూ అలవడనే అలవడవు. వాటిని బళ్ళల్లో నేర్పరు. తల్లిదండ్రులే వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని నేర్పాలి ...  

  చిన్నప్పట్నుంచీ హిందూ సంప్రదాయానికి వారిని అలవర్చకపోతే వారి తరంలోనో, వారి వారసుల తరంలోనో మతం మారే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఈ రోజున్నట్లే ఱేపు కూడా ఉంటుందని అనుకోకూడదు. హిందూ తల్లిదండ్రులు తమ నిర్లక్ష్యం ద్వారా తమ పిల్లల జీవితాల్లో సృష్టించిన ఆధ్యాత్మిక శూన్యాన్ని వేఱే ఎవఱో తమ మతంతో భర్తీ చేసేందుకు కాచుక్కూర్చుంటారని మర్చిపోవద్దు.    

6. యాత్రని రహస్యంగా ఉంచకూడదు. సాధ్యమైనంత వఱకూ పరిచయస్థులందఱికీ తెలియజేయాలి. వారిలో యాత్రకి రాలేని వారుంటే వారు తమ తరఫున పదో పరకో, లేకపోతే కొన్ని వస్తువులో దేవుడికి సమర్పించమని ఇస్తారు. వాటిని కూడా వెంట తీసుకెళ్ళాలి. భక్తులంటే భగవంతుని స్వరూపాలే. వారికి సేవ చేయడం భగవంతుడికి సేవ చేయడమే.

7. అప్పుచేసి, లేదా ఇతరుల్ని పీడించి సంపాదించిన ద్రవ్యంతో యాత్ర చేయకూడదు.

8. యాత్ర చేస్తూండగా దైవేతర, లౌకిక సంభాషణల్లో సాధ్యమైనంత వఱకూ పాల్గొనకుండా ఉండడానికే ప్రయత్నించాలి. నిరంతరం భగవన్నామాన్ని, స్తోత్రాల్నీ వల్లిస్తూ ముందుకు సాగాలి. భగవత్సంబంధమైన సత్కథల్ని తోటివారితో చెబుతూ ప్రయాణం చేయాలి. ఎవఱితోనూ ఏ విధమైన చర్చలూ, వాదాలూ, తర్కాలూ చేయకూడదు. ఇతరులు ఏదైనా పొఱపాటు మాట్లాడితే దాన్ని సవరించే పని పెట్టుకోకూడదు.

9. కామక్రోధాది అరిషడ్వర్గాల్ని ఉపశమింపజేసుకోవాలి. శత్రువుల్నీ, దురదృష్టాల్నీ జ్ఞాపకం చేసుకోకూడదు. యాత్రలో తారసపడేవారందఱినీ స్నేహభావంతో చూడాలి.

10. దారిలో మనకు కలిగే ఆకలిదప్పుల్నీ, అలసటనీ, అనారోగ్యాల్నీ, అసౌకర్యాల్నీ భగవత్ ప్రసాదంగా భావించి ఆనందంగా భరించాలి. పూర్వజన్మ దుష్కర్మ ఈ యాత్రాక్లేశాల ద్వారా హరించుకు పోతోందనీ, ఆత్మ పరిశుద్ధమవుతోందనీ భావించి సంతోషించాలి. అంతే తప్ప “అది బాలేదు, ఇది బాలేదు” అని మాటిమాటికీ వ్యాఖ్యానించుకొని మనసుని కష్టపెట్టుకోకూడదు. యాత్రకొచ్చింది తినడానికో, తాగడానికో, జీవితాన్ని ఆస్వాదించడానికో, కాలకృత్యాలు తీర్చుకోవడానికో కాదనీ, దైవసన్నిధానాన్ని అనుభూతి చెందడానికేననే విషయాన్ని అనుక్షణం గుర్తుంచుకొని ప్రవర్తించాలి. ఆయా అవసరాలు ఎలా తీఱినా ఫర్వాలేదన్నట్లు మసలుకోవాలి. దైవానుభూతికి మినహా ఇంకా దేనికీ ప్రాధాన్యం ఇవ్వకూడదు.   

11. తీర్థగమ్యాన్ని చేఱుకున్నాక ముందు చేయాల్సిన పని స్నానాదులు ముగించి ఎంతో కొంత ఆహారంగా తీసుకోవడం. సుప్రసిద్ధ క్షేత్రాలైతే దైవదర్శనానికి గంటలకొద్దీ సమయం పట్టవచ్చు. తినడం ఆలస్యమయ్యే కొద్దీ, వరుసలో నిలబడ్డా మనసు దేవుడి మీదికి కాక తిండి మీదికే పోతూంటుంది. కనుక ఖాళీకడుపుతో దైవదర్శనం చేయలేం.

12. దైవదర్శనానికి వెళ్ళే దారిలో ఎన్ని ఆకర్షక విషయాలూ, వస్తువులూ ఉన్నా ఆగకుండా, పట్టించుకోకుండా ముందుకు సాగిపోవాలి. భారీ బ్యాగులూ, పెట్టెలూ మొదలైన సరంజామాతో వెళ్ళడం చాలా అసౌకర్యం. అలా తీసుకెళ్తే చిత్తం దేవుడి మీద కాక వాటి మీదే లగ్నమై ఉంటుంది.

13. కొన్ని క్షేత్రాలలో ప్రధాన దైవతం కాక మఱో దేవుడో, దేవతో వేంచేసి ఉంటారు. ముందు వారిని దర్శించుకున్నాకనే ప్రధాన దైవతాన్ని దర్శించాలనే సంప్రదాయం ఉంటుంది. దాన్ని తు.చ. తప్పకుండా పాటించాలి. ఉదాహరణకి – తిరుమలలో శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకున్నాకనే శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వెళ్ళాలి. అలాగే శ్రీస్వామి వారిని దర్శించాక తిరుచానూరులో శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి.

14. “రిక్తహస్తేన నోపేయాద్ రాజానం దైవతమ్ గురుమ్” అన్నారు పెద్దలు. కనుక దైవ దర్శనానికి వట్టి చేతులతో వెళ్ళకూడదు. అందులోనూ సమాజంలో కాస్తో కూస్తో స్థితిమంతులనిపించు కుంటున్నవారు దేవుడి దగ్గఱికి చేతులూపుకుంటూ వెళ్ళనేకూడదు. పూలదండలు, పండ్లు, కొబ్బరికాయ, తాంబూలం, దక్షిణద్రవ్యం, క్రొత్తవస్త్రాలూ, ఏదైనా వెండి/ బంగారు వస్తువూ – వీటిల్లో ఏదో ఒకటి గానీ, కొన్ని గానీ, అన్నీ గానీ సమర్పణగా తీసుకెళ్ళాలి. కొన్ని క్షేత్రాల్లో ప్రధాన దైవతానికి కొన్ని ప్రత్యేక సమర్పణ లంటే ప్రీతి కనుక అవేంటో కనుక్కుని అవి కూడా తీసుకెళ్ళాలి.

15. దేవుడికి సమర్పించిన పూలదండల్నీ, తినుబండారాల్ని, వస్త్రాల్నీ ఆయన ప్రసాదంగా వెనక్కి తీసుకోవచ్చు. కానీ ఆయనకు సమర్పించిన డబ్బునీ, వెండి/ బంగారు ఆభరణాల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోకూడదు. 

అలా చేస్తే  అమ్మ వార్లు చాలా బాధపడతారు. మనకు జన్మజన్మల దరిద్రం చుట్టుకుంటుంది. ఈ సంగతి తెలీక చాలామంది ఆడవాళ్ళు అమ్మవార్ల దర్శనానికి వెళ్ళినప్పుడు నగలతో వారిని అలంకరింపజేసి ఆ తరువాత మళ్లీ వాటిని వెంట తీసుకెళుతున్నారు. “దేవుడికి ఇంత ఇవ్వాలి” అని మనసులో అనుకుని, లేదా ఆ మాట పైకి అనేసి ఆ తరువాత మనసు మార్చుకోవడం కూడా మహాదోషం.

16. అలాగే దేవుడి కోసం బయటికి తీసిన డబ్బుని యథాతథంగా సమర్పించేయాలే తప్ప, “ఈ నోటు తీసుకుని ఇంత చిల్లఱ నాకు వెనక్కివ్వండి” అని అడక్కూడదు. మనం అక్కడికి వెళ్ళినది దేవుణ్ణి శరణాగతి వేడడానికే తప్ప ఆయనతో బేరసారాలూ, వ్యాపారమూ, నగదుమార్పిడి చేయడానికి వెళ్ళలేదనే విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి.

17. ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడి స్థానిక ఆచార వ్యవహారాలన్నింటినీ వినయ విధేయతలతో పాటించాలే తప్ప “ఇవన్నీ నిజమా ? వీటి వల్ల ఏమైనా ప్రయోజనముందా ? దీనివల్ల గుడి సిబ్బందికేమైనా లబ్ధి చేకూఱుతోందేమో ? మమ్మల్ని ఎందుకింత కష్టపెడుతున్నారు ? ఫలానా గుళ్ళో ఇలా లేదే ? ఇక్కడెందుకు ఇలా ఉంది ?” అని వితండవాదాలూ, విమర్శలూ, తర్కాలూ చేయకూడదు. పుణ్యక్షేత్రాల్లో అశ్లీలాలూ, అవాచ్యాలూ పలకరాదు.

18. పుణ్యక్షేత్రాల్లో రాజకీయాలూ, క్రీడలూ, సినిమాలూ, పెట్టుబడివ్యాపారాలూ, విద్యా-ఉద్యోగావకాశాలూ, లోకాభిరామాయణమూ మాట్లాడరాదు. వారపత్రికలూ, వార్తాపత్రికలూ, కథలూ, నవలలూ చదవరాదు. భార్యతో గానీ, ప్రియురాలితో గానీ సరసాలాడరాదు. భగవంతుడికి తప్ప ఇంకెవఱికీ జై కొట్టరాదు, పొగడరాదు. పరనింద, ఎగతాళి చేయరాదు.

19. ధూమపానం, మద్యపానం, మాంసాహారం పూర్తిగా వివర్జించాలి.  

20. కొంతమంది పుణ్యక్షేత్రాల్లో చనిపోతే సద్గతి లభిస్తుందనుకుని అక్కడికెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటారు. అలాంటిచోట్ల కాలిక మరణం, లేదా సాధారణ మరణం పొందితేనే సద్గతి. ఆత్మహత్య చేసుకుంటే మటుకూ దుర్గతే. ఆత్మహత్య చేసుకోవడమంటే భవిష్యత్తు మీదా, తద్ద్వారా భగవంతుడి మీదా నమ్మకం లేదని ఆచరణాత్మకంగా, బహిరంగంగా ప్రదర్శించడమే. అది దైవవిశ్వాసానికి ఎంతమాత్రమూ ప్రతీక కాదు. అలా చనిపోయేవారికి పిశాచ, బ్రహ్మరాక్షస జన్మలే గతి.   

21. ఒకానొక పుణ్యక్షేత్రంలో మనుషులూ, స్థలాలూ మనకు నచ్చకపోయినా విమర్శించకూడదు. ఆ విమర్శలు నేరుగా అక్కడి దేవుడికే తగుల్తాయి. పుణ్యక్షేత్రమైనా, కాకపోయినా అందఱిలోనూ భగవంతుడే ఉన్నాడు గనుక ఎక్కడైనా సరే, పరనిందా, భగవన్నిందా రెండూ వేఱు కాదు.    

22. కొన్నికొన్ని క్షేత్రాలలో స్థలమహాత్మ్యమూ, భగవద్వరప్రసాదమూ మూలంగా కొన్నికొన్ని రకాల విశేష సాధనలు చేస్తే త్వరగా కోరికలు తీఱతాయి. అవేంటో అక్కడ జనాన్ని అడిగి తెలుసుకుని ఆ ప్రకారంగా అనుష్ఠించాలి.

23. దర్శనం కాగానే “హమ్మయ్య” అనుకుని బయటపడొద్దు. గుళ్ళోనో, గుడి బయట అరుగు మీదనో, చెట్టు కిందనో కూర్చుని భగవంతుడి స్తోత్రాలు చదువుకుని, లేదా జపధ్యానాదుల్లాంటివి చేసుకుని ఆ తరువాతే లేవాలి. ఇలా చేసేటప్పుడు వట్టి నేలమీద కాకుండా ఏదైనా ఓ ఆసనం (చిట్టిచాప, వస్త్రం, తెల్ల కాయితం లాంటివి) వేసుకుని చేయాలి. అలా కాక వట్టి నేలమీద కూర్చుని చేసే ఉపాసనల ఫలం భూదేవికీ, తద్ద్వారా బలి చక్రవర్తికీ చెందుతుంది.

24. అక్కడ ఎవఱైనా చేయి చాపితే మనకు తోచినంత, మనం ఓపినంత దానం చేయాలి. పుణ్యక్షేత్రంలో చేస్తున్న దానం కనుక దానికి విశేష ఫలితం ఉంటుంది. ఒకవేళ ఇష్టం లేకపోతే ఇవ్వనక్కఱలేదు. కానీ యాచకుల్ని విసుక్కోవడం, కసురుకోవడం, దూషించడం, బుద్ధి చెప్పడం లాంటివి మంచివి కావు. ఇష్టం లేకపోతే మౌనంగా అక్కణ్ణుంచి వెళ్ళిపోవాలి.

25. ఈ రోజుల్లో లౌకిక ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలాన పుణ్యక్షేత్రాలున్న ఊళ్లల్లో సినిమా హాళ్ళూ, వ్యభిచార గృహాలూ కూడా చొఱబడ్డాయి. “దర్శనమైపోయింది గదా” అని చెప్పి వాటికేసి దృష్టిసారించరాదు. పెద్దలేమన్నారంటే-

శ్లో|| అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి |

పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రలేపో భవిష్యతి ||

తాత్పర్యం – ఇతర ప్రదేశాల్లో చేసిన పాపం పుణ్యక్షేత్రంలో పోతుంది. కానీ పుణ్యక్షేత్రంలో చేసిన పాపం సిమెంటులా పట్టుకుంటుంది.

26. తీర్థయాత్ర చేసినందుకు గుర్తుగా అక్కడి వస్తువుల్నీ, విగ్రహాల్నీ, స్థలపురాణ గ్రంథాల్నీ తప్పనిసరిగా కొనాలి. వీలైతే కొన్ని ఎక్కువ పుస్తకాలే కొనాలి. ఇంటికి వెళ్ళాక వాటిని ఇతరులకిచ్చి చదివిస్తే వారికీ ఆ తీర్థయాత్ర చేయాలనే కోరిక కలుగుతుంది. పుణ్యక్షేత్రం నుంచి తెచ్చిన ప్రసాదాల్ని కేవలం తామారగించడమే కాకుండా తమ బంధుమిత్రులకీ, ఇఱుగు పొఱుగు వారికీ కూడా పంచాలి.

27. యాత్రలో పొందిన మధురానుభవాల్ని మాత్రమే ఇతరులతో చెప్పాలి. “ఓయమ్మో, అంత కష్టపడ్డాం, ఇంత కష్టపడ్డాం” అని వాపోకూడదు. అది భగవంతుణ్ణి విమర్శించడమే అవుతుంది. అదే విధంగా ఇంటికెళ్ళేటప్పుడు/ వెళ్ళాక  “యాత్రకంతా కలిపి మొత్తం ఎంత ఖర్చయింది ?” అని లెక్కలు వేయకూడదు. అలాంటివి యాత్రకి బయల్దేఱక ముందే వేసుకోవాలి.

మొత్తమ్మీద తీర్థయాత్రకి వెళ్ళి సాధ్యమైనంత పుణ్యధనాన్ని మూటగట్టుకు రావాలి, పాపాల్ని కాదు.

చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ


ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది. 

దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.

మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!

దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.

మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను

దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి.

మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?

దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి

మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?

దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి

మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!

దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు 

మనిషి: నా స్నేహితులున్నారా అందులో?

దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే

మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?

దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు

మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!

దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.

మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?

దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.

మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.

మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.

మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?

దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.

 ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.

అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. 

పశ్చాతాపులను క్షమించాలి. 

 *తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.

సర్వేజనా సుఖినోభవంతు 

వేములవాడ ధర్మగుండ మహత్యం తెలుసా


రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి తనకు వచ్చిన కుష్టు వ్యాధి నివారణ కోసం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ చివరకు వేములవాడ ప్రాంతం  చేరుకొని ఇప్పుడు  నేలకోని ఉన్న దక్షిణామూర్తి  ప్రాంతము లో ఒక మహా బోధి వృక్షం ఉండేది. దాని ప్రక్కనే ఒక కోనేరు ఉంది ఇక్కడ బస చేయడానికి అనువైన ప్రాంతము గాఉందని  బోధి చెట్టు  క్రింద సేద తీర్చుకొన్నాడు  ఉధయమునే స్నానమాచ రించుటకు  ప్రక్కనే ఉన్న కోనేరు లో దిగగానే ఒక్కసారి గా తన శరీరాన్ని ఏదో బలమైన శక్తి కోనేరు అడుగునకు లాగినది.  చక్రవర్తి కోనేరు అడుగు బాగం నుండి కొంత సమయములో  సంపూర్ణ ఆరోగ్యం తో తన వ్యాధి నయం అయి బయటకు వచ్చాడు. అంతే ఆ రాజు బోధి వృక్షం క్రింద గల దక్షిణామూర్తి ( శివలింగం ) కు పుజనచారించి నమ్మలేని నిజాన్ని చూసి నివ్వర పోతు ఏమి ఆ కోనేటి మహత్యం అంటూ ఆలోచిస్తూ  చెట్టు క్రింద వాలి పోయాడు . కొద్ది సేపటి తరువాత జనం అలజడికి మేల్కొని చూడగా అక్కడ ఒక మహాముని కూర్చుండి. వ్యాధి గ్రస్తులయిన వారికీ కోనేటి నీటితో వైద్యం చేస్తూ కానిపించాడు. ఆ మహాముని కి ప్రణమిల్లి అయ్యా నేను రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి ని నాకు అతిబయంకర  కుష్టు వ్యాధి వాచినది ఎన్నో ప్రదేశాలు తిరిగా ఎన్నో పుణ్యనదులలో స్నానమాచ రించ కానీ ఈ కోనేటి లో మునగాగానే నా  వ్యాధి దూరమైంది ఎలా? నా  సందేహ నివృతి చేయండి స్వామి అంటూ ప్రదేయపడ్డాడు. అప్పుడు ఆ మహాముని ఈ విధముగా చెప్పాడు ఈ కోనేటి అడుగు భాగమున అష్టదిక్కుల కాలబైరవ జ్వలముకి బహుముకి ...... దేవత లు కొలువు తిరి ఉన్నారు అందుకే ఈ కోనేటి కి కలియిగంతం వరకు దాని మహిమ అలానే ఉంటుందని చెప్పాడు. ఓ.కే నా నమ్మలేదు కాదు ఇప్పటి కి గుండం లో నీరు తిసి వేస్తే మనకు ఆ విగ్రహాలు కనిపిస్తాయి మిత్రులారా ..... ఇకనుంచి ఇచరిత్ర నలుగురి తో పంచుకుని ఆధారాలతో కనిపించే  పుష్కరణి పవిత్రతను కాపాడుతారని ఆశిస్తూ................వేములవాడ ధర్మగుండ మహత్యం తెలుసా ?


రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి తనకు వచ్చిన కుష్టు వ్యాధి నివారణ కోసం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ చివరకు వేములవాడ ప్రాంతం  చేరుకొని ఇప్పుడు  నేలకోని ఉన్న దక్షిణామూర్తి  ప్రాంతము లో ఒక మహా బోధి వృక్షం ఉండేది. దాని ప్రక్కనే ఒక కోనేరు ఉంది ఇక్కడ బస చేయడానికి అనువైన ప్రాంతము గాఉందని  బోధి చెట్టు  క్రింద సేద తీర్చుకొన్నాడు  ఉధయమునే స్నానమాచ రించుటకు  ప్రక్కనే ఉన్న కోనేరు లో దిగగానే ఒక్కసారి గా తన శరీరాన్ని ఏదో బలమైన శక్తి కోనేరు అడుగునకు లాగినది.  చక్రవర్తి కోనేరు అడుగు బాగం నుండి కొంత సమయములో  సంపూర్ణ ఆరోగ్యం తో తన వ్యాధి నయం అయి బయటకు వచ్చాడు. అంతే ఆ రాజు బోధి వృక్షం క్రింద గల దక్షిణామూర్తి ( శివలింగం ) కు పుజనచారించి నమ్మలేని నిజాన్ని చూసి నివ్వర పోతు ఏమి ఆ కోనేటి మహత్యం అంటూ ఆలోచిస్తూ  చెట్టు క్రింద వాలి పోయాడు . కొద్ది సేపటి తరువాత జనం అలజడికి మేల్కొని చూడగా అక్కడ ఒక మహాముని కూర్చుండి. వ్యాధి గ్రస్తులయిన వారికీ కోనేటి నీటితో వైద్యం చేస్తూ కానిపించాడు. ఆ మహాముని కి ప్రణమిల్లి అయ్యా నేను రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి ని నాకు అతిబయంకర  కుష్టు వ్యాధి వాచినది ఎన్నో ప్రదేశాలు తిరిగా ఎన్నో పుణ్యనదులలో స్నానమాచ రించ కానీ ఈ కోనేటి లో మునగాగానే నా  వ్యాధి దూరమైంది ఎలా? నా  సందేహ నివృతి చేయండి స్వామి అంటూ ప్రదేయపడ్డాడు. అప్పుడు ఆ మహాముని ఈ విధముగా చెప్పాడు ఈ కోనేటి అడుగు భాగమున అష్టదిక్కుల కాలబైరవ జ్వాలాముఖి బహుముకి దేవత లు కొలువు తిరి ఉన్నారు అందుకే ఈ కోనేటి కి కలియిగంతం వరకు దాని మహిమ అలానే ఉంటుందని చెప్పాడు.

ఆదిశంకరాచార్యుల జయంతి - 16 మే, 2021

1) కైలాస వాసుని అవతారంగా భావించబడే శంకరుల కృప వలన మనకు ఈ రోజు హిందూ మతములో 

2) స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత ఉన్నవని అనుటలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. 

3) ఎందరో మహర్షుల, ఋషుల నోట అంతర్యామి వాక్కులుగా పలుకబడిన శక్తి వేదములుగా ప్రకాశిస్తున్నాయి. 

4) ఎవరో రచించి, మరెవరో పరిశీలనము, విమర్శ చేసేందుకు అవి పురాణాలు, నవలలు కావు. 

5) విశ్వవ్యాప్తుని మనోకమలము నుండి స్వయంగా మహాపురుషుల నోట వెలువడిన సచ్చిదానందములు వేదములు. 

6) అంతటి వేదములకు కూడా వక్ర భాష్యము చెప్పి, భారతీయ సమాజంలో విభజన కలిగించి

7) మూఢ చాందస భావాలను ప్రేరేపించి అన్యమతముల వైపు ప్రజలను మళ్లించిన సమయంలో 

8) ఆ పరిస్థితిని చక్క దిద్దటానికి శంకరులు కాలడిలో శివగురు శక్తితో ఆర్యాంబ గర్బములో 

9) ఉత్తరాయణ పుణ్య కాలమున వైశాఖ శుద్ధ పంచమి నాడు అవతరించారు.

10) చిన్ముద్రతో, మౌనంతో జ్ఞానాన్ని వ్యాపింప జేసే దక్షిణామూర్తి రూపమైన పరమ శివుడు 

11) ఈ దంపతులను ఆశీర్వదించగా శంకరులు ఉదయించారు. 

12) పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆయన దైవిక శక్తి, మార్గము కాలడిలో ప్రస్ఫుటించాయి.

సాక్ష్యాత్తు కైలాస శంకరుడు  - కాలడి శంకరులుగా ఈ భూమి మీదకు అవతరించారు

హర హర శంకర !!  జయ జయ శంకర !!

సృష్టి రహస్య విశేషాలు. సృష్టి ఎలా ఏర్పడింది.

సృష్టి రహస్య విశేషాలు సృష్టి  ఎలా  ఏర్పడ్డది సృష్టి  కాల చక్రం  ఎలా నడుస్తుంది మనిషిలో  ఎన్ని  తత్వాలున్నాయి ( సృష్ఠి )  ఆవిర్బావము  1  ముంద...