Monday, September 5, 2022

ఇంతకన్నా గొప్పగా నేనేమి చెప్పగలను ?
****************************
పొరుగువాడిని 
ప్రవాసాంధ్రుడిని
తమిళదేశంలో వున్నవాడిని
మీకన్న గొప్పగా నేనేమి చెప్పగలను
కాని
తెలుగు గొప్పతనాన్ని
తెలుగేతరులే గొప్పగా చెప్పారు
పోని పెద్దలేం చెప్పారో చెప్పనా
ఆంధ్ర దేశంలో పుట్టడం అందునా తెలుగు వాడిగా పుట్టడం 
పూర్వ జన్మ సుకృతం -అప్పయ్య దీక్షితులు
ఇంతకన్నా చెప్పగలనా నేను

కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు
మా తెలుగు తల్లివి - శంకరంబాడి
ఇంతకన్నా చెప్పగలనా నేను

తెలుగదేలన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ ,తెలుగొకొండ
ఎల్లనృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స -శ్రీకృష్ణదేవరాయలు
ఇంతకన్నా చెప్పగలనా నేను

తరపి వెన్నెల ఆణిముత్యాల సొబగు
పునుగు జవ్వాజి ఆమని పూలవలపు
మురళి రవళులు కస్తూరి పరిమళములు
కలిసి ఏర్పడే సుమ్మ మా తెలుగుభాష -నండూరి రామకృష్ణమాచార్యులు
ఇంతకన్నా చెప్పగలనా నేను

భాషలొక పదితెలిసిన ప్రభువు చూచి
భాషయనిన ఇద్దియని చెప్పబడిన భాష
-కవి సామ్రాట్ విశ్వనాధసత్యనారాయణ
ఇంతకన్నాగొప్పగా చెప్పగలనా నేను

తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు
సంకోచపడియెదవు సంగతేమిటిరా?
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా ! చావవెందుకురా? - కాళోజి
ఇంతకన్నా గొప్పగా చెప్పగలనా నేను

ఇంతమంది చెపుతూనే వున్నారు
తెలుగుభాష గొప్పతనాన్ని గురించి
వినకుండా 
తల్లి భాషను చంపెయ్యడం
తగదు మనకు
కడుపులో వున్న శిశువును తెలిసి తెలిసి చంపేస్తామే దానికి సమం.
ఆ పాపానికి ఒడిగట్టకండి.
మన భాష మనకి తెలియడం
మన ప్రధమ కర్తవ్యం
  -గోటేటి వెంకటేశ్వరరావు

No comments:

పూజారి -- కానుకలు..

పూజారి -- కానుకలు .. మీరు కానుకలు హుండీలోనే వేయండి . పూజారి ప్లేటులో వేయవద్దు ,హుండీలో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడికి చేరుతుంది...