Tuesday, November 30, 2021

సహధర్మచారిణి

సనాతన ధర్మంలో భార్య అన్న పదానికి ఉన్న అనేక పదాలలో 'సహధర్మచారిణి' అన్నది విశిష్ట మైనది. 

ధర్మయుతమైన భర్త మార్గాన్ని అన్నివిధాలా తాను అనుసరించి అనుగమించేది అని అర్థంచెప్పుకోవచ్చు. పెళ్లి నాటి ప్రమాణాలు ప్రకారం ధర్మేచ ,అర్థేచ, కామేచ భార్యాభర్తలదిద్దరిదీ ఒకే మార్గం అయితే ఆ దాంపత్యం అన్యోన్య సుఖదాయకంగా ఉంటుంది. ఈ ఆదర్శాన్ని చాటి చెప్పడానికే బ్రహ్మాది దేవతలు తమ సతీమణులకు సగౌరవ స్ధానాలిచ్చి ఆదర్శమూర్తులయ్యారు. తన చతుర్ముఖాలలో  సరస్వతిని నిలిపాడు బ్రహ్మ దేవుడు.అంటే  విధాత రసనాగ్రసీమను (బ్రహ్మ నాలుకనే వేదికగా చేసుకొని) వాణి వేదవాణిగా లాస్యమాడింది. ఇక విష్ణుమూర్తి తన వక్షస్థలం పై లక్ష్మీ దేవిని నిలుపుకొని ఆమెకు హృదయస్థానాన్ని ఇచ్చాడు. దీనర్థం స్వామిది సంకల్పం అయితే అమ్మ సిద్ధిదాత్రి అన్నమాట. వీరిద్దరినీ మించి తన మేనిలో సగభాగమిచ్చి అర్థనారీశ్వరుడయ్యాడు జగదీశ్వరుడు. అంటే తామిద్దరమూ అభిన్నమని విడదీయరానంతగా కలిసి ఉన్నామని తెలపడమే అర్ధనారీశ్వర తత్త్వ పరమార్ధం.

దీన్నే కాళిదాసు మహాకవి రఘువంశంలో

"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"

'జగత్తుకు తల్లిదండ్రులు ఆదిదంపతులు అయిన పార్వతీ పరమేశ్వరులు వాక్కు అర్థాలలాగా ఎప్పుడూ కలిసే ఉంటారు. వారు ఈ నా కావ్య రచనకు  అర్థవంతములైన మంచి వాక్కులను ప్రసాదింతురుగాక!' అని నుతిస్తాడు. మాటను అనుసరించే అర్థం వచ్చినట్లుగా సతిపతులిద్దరూ ఒకరిననుసరించి మరొకరు నడుచుకోవాలి. అప్పుడే సంసారంలో ఆనంద సరాగాలు వెల్లివిరుస్తాయి.

లక్ష్మీ నారాయణులు, వాణీ హిరణ్యగర్భులు, శచీపురంధరులు, అరుంధతీ వసిష్ఠులు, సీతారాములు, రాధాకృష్ణులు అని భార్యలతో కలిపి భర్తల పేర్లు స్మరించడం లోకంలో పరిపాటి. కానీ ఒక్క పరమశివుణ్ణి మాత్రం  సాంబశివుడని పిలిస్తే చాలు. స+ అంబ శివుడు అంటే అమ్మతో కూడిన అయ్య . పార్వతీ పరమేశ్వరుల రూపం లాగానే వారి పేర్లు కూడా ఒకటిగా కలిసి పోయాయి. తల్లి జగన్మాత - శివుడు జగదీశ్వరుడు అంటే ఆమె శక్తి - స్వామి శక్తి మంతుడు. దీనికర్థం ఏమిటంటే అమ్మవారి అండ లేనిదే పరమేశ్వరుడు కనీసం కదలను కూడా కదలలేదు. అందుకే సౌందర్య లహరిలో  ఆదిశంకరులు అమ్మవారి తత్వాన్ని ఆవిష్కరించి త్రిమూర్తులకు సైతం వారి వారి శక్తి లేకపోతే చలనమే ఉండదు అని చెప్తారు.

సహధర్మచారిణి స్ధానాన్ని మించిన పదవి ధర్మపత్నికి లభించిందన్నమాట. ఇలా ఒక్కోసారి ఇల్లాలివల్లే ఇంటాయన గౌరవం కూడా పెరుగుతుందని ప్రాచీన స్తోత్రవాఙ్మయం నిరూపిస్తుంది.

"చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో

జటాధారీ కంఠేభుజగపతిహారీ పశుపతిః

కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం

భవానీ త్వత్పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదమ్"

"చితిలో బూడిదను భస్మంగా ధరిస్తాడు.విషాన్ని ఆహారంగా స్వీకరిస్తాడు.దిక్కులనే వస్త్రాలుగా ధరించిన దిగంబరుడు, జటలు కట్టిన వెంట్రుకలు గలవాడు, మెడలో విషసర్పాన్నే ఆభరణంగా ధరించినవాడు, కపాలాన్ని చేతదాల్చినవాడు, భూతాధిపతి,పశుపతి అన్నపేరున్నవాడు శివుడు. కానీ ఓ భవానీ! నిన్ను వివాహమాడి నందువల్లనే ఈశుడు జగదీశుడనే గొప్ప పదవిని పొందాడు" అని అంటారు ఆదిశంకర భగవత్పాదులు దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో. యమునితో పోరాడి పతిప్రాణాలను దక్కించుకున్న సతీసావిత్రి, త్రిమూర్తులనే పసిబిడ్డలు గా చేసి లాలించిన సతీ అనసూయ వంటి పతివ్రతా శిరోమణులకు నిలయం మన భారతదేశం.

శ్రీమద్రామాయణంలో అశోకవనంలో శోకిస్తున్న  సీతామాతను గురించి చెబుతూ ఆదికవి వాల్మీకి పరమాత్మ కోసం పరితపించే జీవాత్మ లాగా సీతమ్మ ఉంది అంటాడు. జీవాత్మ పరమాత్మ బంధాన్నే దాంపత్య బంధంగా ఆదికావ్యం  రామాయణం నిరూపిస్తుంది.

ఇలా భర్తలను ఆరాధించి, అనుసరించి, అనుగమించి జీవితాంతం సాహచర్యం అందించిన భారతీయ మహిళలు సర్వదా సమాదరణీయలు.

దైవం మానుషరూపేణ

ఒక రోజు ఓ నాస్తికుడు అడవిలో అందాలను తన కెమెరా కళ్ళలో బంధించడానికి దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. మధ్యాహ్నం వరకు అడవంతా తిరిగి కొన్ని ఫోటోలు తీసుకున్నాడు. సాయంత్రానికల్లా అడవి నుండి బయటపడాలని,తిరుగు దారి పట్టాడు. అలా ఓ గంట నడిచాక కాని అతనికి అర్థం కాలేదు. తాను దారి తప్పి పోయాడని. అసలే అది కృూర మృగాలు కూడా తిరిగే అడవి. ఏదైనా కాని అని ధైర్యం తెచ్చుకుని మరో దారిలో ప్రయాణం కొనసాగించాడు.

ఆ దారిలో అతనికి పులి గాండ్రింపు వినిపించింది. నడక సాగిస్తున్న అతను గుండె చేతిలో పట్టుకుని అక్కడే ఆగిపోయాడు. అతనికి ఏం చేయాలో పాలుపోలేదు. ఓ మర్రి చెట్టు పక్కన తల దాచుకుని,తెచ్చుకున్న కాసిన్ని నీళ్ళు కూడా తాగేసాడు. పోనీ తన స్నేహితులకి,తనున్న లొకేషన్ షేర్ చేద్దామంటే,అక్కడ సిగ్నల్ అస్సలు లేదు.  తనకు తెలియకుండానే 'భగవంతుడా. నాకేంటి ఈ పరిక్ష' అని సణిగాడు.

వెంటనే తనలో తాను 'నా పిచ్చి కాని భగవంతుడే లేడు,ఇంకా ఆయనొచ్చి నన్నేం కాపాడతాడు??' అని అనుకున్నాడు. అయినా తన మనసులో ఓ మూల ఒక్కసారి భగవంతుడు తనని కాపాడమని కోరుకోవాలనుకున్నాడు.

వెంటనే ఆ నాస్థికుడు రెండు చేతులు జోడించి, తన మనసులో 'శివయ్య. నువ్వే గనక ఉంటే నాకు బయటికెళ్ళే దారి చూపించి నన్ను రక్షించు.' అని మొక్కాడు. మొక్కిన వెంటనే తన పక్కన ఓ బాణం దూసుకు వచ్చి పడింది. ఆ బాణం వేగంతో తన పక్కనే పడడం వల్ల ఒక్కసారి ఉలిక్కి పడి గావు కేక వేసాడు ఆ నాస్తికుడు.

ఏం జరిగిందో తనకి అర్థం కాలేదు. 
అప్పుడే అక్కడికి ఓ వేటగాడు వచ్చి "దొర గారు,ఇటు పక్క ఓ తెల్లటి కుందేలు వచ్చింది! మీరేమైనా చూసారా?" అని అడిగాడు  అందుకు ఆ నాస్తికుడు "నేను గంట నుంచి,ఈ చెట్టు కింద గుంట నక్కల కూర్చున్నా. ఈ వైపు ఏ కుందేలు రాలేదు." అన్నాడు. 

ఆ వేటగాడు ఆశ్చర్యంగా "నేను గంట సేపటి నుండి దాన్నే వేటాడుతూ వచ్చాను!ఎన్ని బాణాలు వేసినా తప్పించుకుని మీ దగ్గరికి వచ్చింది! ఇక్కడికొచ్చి చూస్తే ఆ కుందేలు కనిపించడం లేదు, ఈ రోజు వేట వృథా అయినట్టే." అంటూ అడవి నుంచి ఇంటి దారి పట్టాడు. 

వెంటనే ఆ నాస్తికుడు "ఆగు ఆగు, నేను దారి మరిచి ఎలా వెళ్ళాలో ఇక్కడ కూర్చున్న.  నన్ను నీతో పాటు తీసుకెళ్ళవా". అంటూ కొంచం ధీనంగా అడిగాడు. అందుకు, ఆ వేటగాడు-ఆ నాస్తికున్ని తనతో అడవి బయటి మార్గం వైపు తీసుకెళ్ళసాగాడు. 

నాస్తికుడు,ఆ వేటగానితో మాటలు కలిపి "నిజానికి నేను దేవుడిని నమ్మను!ఈ అడవిలో మొదటి సారి భయం వేసినపుడు నన్ను కాపాడమని వేడుకున్నా, ఆ దేవుడు వచ్చి నన్ను కాపాడ లేదు, మనిషే కాపాడాడు, నువ్వే దేవుడి కన్నా గొప్పవాడివి" అన్నాడు. 

ఆ మాటలు విన్న వేటగాడు క్షణ కాలం ఆగి" ఏందయ్యా సామి? దేవుడు లేడంటావా?మా మన్యంలో నన్ను మించిన విలుకాడు లేడు, అలాంటిది రామునికి మాయ లేడి కనిపించినట్టు, ఈ రోజు నాకు అలాంటి కుందేలు కనిపించింది, ఏ జంతువైనా ఒకటి లేదా రెండు బాణాల్లో నేలకొరిగిస్తాను, అలాంటిది, ఈ రోజు నాకు కనిపించిన కుందేలుకి ఎన్నో బాణాలతో కొట్టాను, అయినా ఏ ఒక్క బాణం దానికి తగలలేదు, నేనేంటి ఓ కుందేలుని కొట్టలేకపోవడం ఏంటి అని,పట్టుబట్టి దాని వెనకాల పరిగెడుతూ వస్తే చివరికి నీ దగ్గర మాయమయింది. అంతా శివ లీల" అన్నాడు.

దానికి నాస్తికుడు "అంతా శివ లీలనా??ఇదంతా ఆ శివుడు చేయించే బదులు,శివుడే వచ్చి దారి చూపొచ్చు కదా." అని నవ్వుతూ ప్రశ్నించాడు. అందుకు ఆ వేటగాడు "మీకు ఆకలేసినపుడు హోటళ్ళోకి వెళ్ళి కూర్చుంటే,అక్కడి సర్వర్లు మీకు వడ్డించి ఆకలి తీరుస్తారు కాని ఆ హోటల్ యజమాని వచ్చి మీకు సేవ చేయడు కదా." అంటూ... ఆ నాస్తికుడు వెళ్ళాల్సిన చోటుకి,తన చూపుడు వేలుతో దారి చూపించాడు ఆ వేటగాడు. ఆ వేటగానికి ఏమైనా కొంత డబ్బు ఇద్దామని బ్యాగు తెరిచి, కొంత డబ్బు తీసి, ఆ వేటగానికి ఇవ్వబోయాడు.

అలా ఇవ్వబోతూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. అతని ముందు,వెనక,మరియు పక్కన తనకి దారి చూపించిన ఆ వేటగాడు కనిపించలేదు. ఆ నాస్తికుడు గుండెలు పిండేసాయి. కళ్ళల్లోంచి వస్తున్న నీటిని ఆపుకోలేక తనలో తాను 'నన్ను రక్షించడం కోసం మాయా కుందేలుని సృష్టించుకుని,నన్ను ఈ దట్టమైన అడవిలోంచి బయట పడవేయడమే గాక నాస్తికత్వం అనే మాయలో నుంచి కూడా నన్ను బయట పడేసావు! నీవు శివుడివో? శివుడు పంపిన దూతవో నీకే తెలుసు శివయ్య! ఇదంతా నిజంగా నీ లీలనే!" అంటూ ఇంటి దారి పట్టాడు ఆ నాస్థికుడు.

ఇంతకీ ఆ నాస్తికుని పేరు చెప్పలేదు కదు.

అతని పేరు "శివ కేశవ"!

తండ్రి ఆశీర్వాదం

తండ్రి ఆశీర్వాదం

అవసానదశలో ఉన్న ఒక తండ్రి తన ఏకైక కుమారుడైన ధరమ్ పాల్ ని పిలిచి, “ప్రియమైన కుమారా, నీకు వారసత్వంగా వదిలివెళ్ళడానికి నేను ఏ సంపదను కూడగట్టలేకపోయాను. కానీ జీవితాంతం నా పని యెడల ఎల్లప్పుడూ నిజాయితీగా, ప్రామాణికంగా ఉన్నానని నీకు నమ్మకం ఇవ్వగలను. 

కాబట్టి, నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను, నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా, విజయవంతంగా ఉంటావు. నువ్వు ఏది తాకినా అది బంగారం అవుతుంది నాయనా! ", అని చెప్పాడు. 
ధరమ్ పాల్ కృతజ్ఞతతో నమస్కరించి, భక్తితో తన తండ్రి పాదాలను తాకాడు. 

తండ్రి ప్రేమగా కుమారుడి తలపై చేయి వేసి, సంతృప్తిగా, ప్రశాంతంగా తుది శ్వాస విడిచాడు.

ఇంటి ఖర్చులు చూసుకోవడం ఇప్పుడు కొడుకు ధరమ్ పాల్ బాధ్యత. అతను తోపుడు బండిపై  చిన్న వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారం సమయంతో క్రమంగా అందుకున్న తర్వాత, ఒక చిన్న దుకాణాన్ని కొన్నాడు.

క్రమంగా, వ్యాపారం మరింత విస్తరించింది.  

త్వరలోనే  నగరంలోని సంపన్నులలో, ఐశ్వర్యవంతులలో అతను లెక్కించబడ్డాడు. ఇదంతా తన తండ్రి దీవెనల ఫలితమని అతను నిజంగా విశ్వసించాడు. 

తన తండ్రి ఎన్ని కష్టాలు పడినా సహనాన్ని విడిచిపెట్టలేదు, విశ్వాసం కానీ,  ప్రామాణ్యతను కానీ  కోల్పోలేదు, అందువల్లనే ఆయన మాటలకు అలాంటి శక్తి ఉండి, ఆయన ఆశీర్వాదాలు ఫలించాయి. 
ధరమ్ పాల్ ఎప్పుడూ అందరికీ ఇలా చెప్తూ, తన విజయానికి తన తండ్రి ఆశీస్సులే కారణమని చెబుతూ ఉండేవాడు.

ఒకరోజు ఒక స్నేహితుడు అడిగాడు, “మీ నాన్న అంత శక్తిమంతుడైతే, ఆయన ఎందుకు వృద్ధి చెందలేదు, ఎందుకు సంతోషంగా జీవించలేకపోయాడు?” 

ధరమ్ పాల్ మాట్లాడుతూ, "మా నాన్న శక్తివంతమైన వ్యక్తి అని నేను చెప్పడం లేదు, ఆయన ఆశీస్సులు చాలా శక్తివంతమైనవని నేను చెబుతున్నాను." 

ఎప్పుడూ తన తండ్రి ఆశీర్వాదం గురించి మాట్లాడటం వలన, అందరూ అతనికి 'తండ్రి ఆశీర్వాదం' అని పేరు పెట్టారు. ధరమ్ పాల్ దీన్ని పట్టించుకోలేదు, తన తండ్రి ఆశీర్వాదాలకు అర్హుడిగా మారగలిగితే అదే తనకు గౌరవంగా ఉంటుందని చెప్పాడు.

సంవత్సరాలు గడిచిపోయాయి, ఇప్పుడు తన వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరించాడు. ఎక్కడ వ్యాపారం చేసినా పెద్ద లాభాలు వచ్చేవి. 

నేను ఎప్పుడూ లాభాలను ఆర్జిస్తున్నాను, నేను ఒక్కసారి నష్టాన్ని అనుభవించాలి అని ఒకసారి ధరమ్ పాల్  కుతూహలపడ్డాడు.

ఒక నష్టపోయే వ్యాపారాన్ని సూచించమని తన స్నేహితుడిని అడిగాడు.  

ధరమ్ పాల్ విజయాన్ని, డబ్బుని  చూసుకొని చాలా గర్వపడుతున్నాడని,  ఆ స్నేహితుడు ఖచ్చితంగా నష్టపోయే వ్యాపారాన్ని సూచించాలి అని అనుకున్నాడు . 

భారతదేశం నుండి లవంగాలను కొనుగోలు చేసి, వాటిని ఆఫ్రికాలోని జాంజిబార్‌కు రవాణా చేసి, అక్కడ విక్రయించమని సలహా ఇచ్చాడు. ధరమ్ పాల్ కు ఈ ఆలోచన నచ్చింది. జాంజిబార్ లవంగాలకు చాలా ప్రసిద్ధి చెందింది. అవి అక్కడ నుండి భారతదేశంలోకి దిగుమతి చేయబడతాయి, ధర కూడా 10-12 రెట్లు అమ్ముడవుతుంది. వాటిని ఇక్కడ కొనుగోలు చేసి అక్కడ విక్రయిస్తే కచ్చితంగా నష్టమే.  

తన తండ్రి ఆశీర్వాదాలు అతనికి ఎంతవరకు సహాయపడతాయో చూడడానికి ధరమ్ పాల్ దీనిని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. 

నష్టాన్ని అనుభవించడానికి, అతను భారతదేశంలో లవంగాలను కొని, వాటిని ఓడలో నింపి, స్వయంగా జాంజిబార్ ద్వీపానికి తీసుకెళ్లాడు.

జాంజిబార్ ఒక సల్తనత్. ధరమ్ పాల్ ఓడ దిగి, వ్యాపారులను కలవడానికి పొడవైన ఇసుక దారి పై నడవడం ప్రారంభించాడు. అవతలి వైపు నుండి సైనికులతో పాటు కాలినడకన వస్తూ, సుల్తాన్ లాగా కనపడుతున్న వ్యక్తిని చూశాడు. 

ఎవరని వాకబు చేయగా ఆయన  స్వయంగా సుల్తాన్ అని చెప్పారు. 

వారు ఒకరినొకరు ఎదురుపడ్డప్పుడు, ధరమ్ పాల్ ను పరిచయం చేసుకోమని సుల్తాన్ అన్నాడు. 

అప్పుడు ధరమ్ పాల్ ఇలా చెప్పాడు, "నేను భారతదేశంలోని గుజరాత్‌లోని ఖంభాట్ నుండి వ్యాపారిని, వ్యాపారనిమిత్తం ఇక్కడకు వచ్చాను." 

సుల్తాన్ అతన్ని వ్యాపారవేత్తగా భావించి తగిన గౌరవంతో మాట్లాడటం ప్రారంభించాడు.
సుల్తాన్‌తో పాటు వందలాది మంది సైనికులు ఉన్నారు కానీ, ఎవరి వద్దా  కత్తులు కానీ తుపాకులు లేకపోవడం ధరమ్ పాల్ గమనించాడు. బదులుగా, వారందరూ తమతో పాటు భారీ జల్లెడలను తీసుకువెళ్తున్నారు. 

అతనికి చాలా ఆశ్చర్యంగా, ఆసక్తిగా అనిపించింది.  వినయంగా సుల్తాన్‌ను, “మీ సైనికులు జల్లెడలను ఎందుకు మోస్తున్నారు?” అని  అడిగాడు.

సుల్తాన్ నవ్వుతూ ఇలా అన్నాడు, “ నేను ఈ ఉదయం సముద్రతీరాన్ని సందర్శించడానికి వచ్చాను, ఇక్కడ ఎక్కడో నా వేలి నుండి ఉంగరం జారిపడిపోయింది. ఇప్పుడు, ఈ ఇసుకలో సరిగ్గా ఎక్కడ పడిందో గుర్తించడం కష్టం, కాబట్టి నేను నా సైనికులను వెంట తెచ్చుకున్నాను. వారు ఇసుకను జల్లించి నా ఉంగరాన్ని వెతుకుతారు.

ఆ ఉంగరం చాలా ఖరీదైనదని అయ్యుండాలి ధరమ్ పాల్ అన్నాడు. 

అలా కాదని సుల్తాన్ ఇలా చెప్పాడు, “నా దగ్గర దానికంటే చాలా విలువైన, లెక్కలేనన్ని ఉంగరాలు ఉన్నాయి, కానీ ఆ ఉంగరం ఒక సాధువు యొక్క ఆశీర్వాదం. 

ఆ సాధువు ఆశీర్వాదం వల్ల నా సల్తనత్  చాలా ధృడంగా, సంతోషంగా ఉందని నేను నమ్ముతున్నాను, కాబట్టి నా మనస్సులో ఆ ఉంగరం విలువ నా సల్తనత్ కంటే ఎక్కువ!”.

అప్పుడు, సుల్తాన్ మళ్ళీ వ్యాపారం గురించి మాట్లాడటం ప్రారంభించి, “అయితే, ఈసారి ఏ వస్తువులు తెచ్చావు?” అని అడిగాడు.

"లవంగాలు", అన్నాడు ధరమ్ పాల్. 
అది విని సుల్తాన్ ఆశ్చర్యపోయాడు.
“ ఇది లవంగాల దేశం, మీరు ఇక్కడ లవంగాలు అమ్మడానికి వచ్చారా? మీకు అలాంటి సలహా ఎవరు ఇచ్చారు? ఖచ్చితంగా, ఆ వ్యక్తి మీ శత్రువు అయి ఉండాలి! ఇక్కడ, మీరు ఒక పైసాతో గుప్పెడు లవంగాలను కొనుక్కోవచ్చు. ఇక్కడ మీ నుండి లవంగాలు ఎవరు కొంటారు, ఇంక  మీరు ఏం సంపాదిస్తారు? ”
ధరమ్ పాల్, “ నేను అదే పరీక్షించాలనుకుంటున్నాను ప్రభూ ! నేను ఇక్కడ ఏమైనా లాభం పొందగలనో లేదో చూడాలి. నాన్నగారి ఆశీర్వాదంతో ఇప్పటి వరకు నేను ఏ వ్యాపారం చేసినా లాభసాటిగా సాగింది. కాబట్టి, ఇప్పుడు ఆయన ఆశీస్సులు ఇక్కడ కూడా పనిచేస్తాయో లేదో చూడాలనుకుంటున్నాను.”

సుల్తాన్ ఇలా అడిగాడు,  “తండ్రి ఆశీస్సులా ! అంటే దాని అర్థం ఏమిటి?!" 

అప్పుడు ధరమ్ పాల్ అతనికి వివరించాడు, *“మా తండ్రి ఆయన జీవితమంతా నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేశారు, కానీ డబ్బు సంపాదించలేకపోయారు. మరణ సమయంలో నా చేతిపై చేయివేసి, నీ చేతిలోని ధూళి కూడా బంగారంగా మారాలని ఆశీర్వదించారు"*,  అని ఆ మాటలు మాట్లాడుతూ, ధర్మపాల్ వంగి నేల నుండి గుప్పెడు ఇసుక తీసుకున్నాడు.
ఇసుకను తన వేళ్ళ మధ్య జారిపోనిస్తూ, సుల్తాన్ ముందు గుప్పిటను తెరిచేసరికి,  ధర్మపాల్, సుల్తాన్ ఇద్దరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. 

ఇసుక మొత్తం జారిపోయిన తర్వాత ధరమ్ పాల్ చేతిలో వజ్రం పొదిగిన ఉంగరం మిగిలిఉంది.

సుల్తాన్ వెతుకుతున్న ఉంగరం ఇదే. అతను ఉంగరాన్ని చూసి చాలా సంతోషించాడు. 

“ఇది మహాద్భుతం ! ఓ అల్లా, చాలా కృతజ్ఞతలు, మీరు ఒక తండ్రి ఆశీస్సులను నిజం చేసారు!” .

అదే భగవంతుడు సాధువు ఆశీస్సులకు కూడా శక్తిని ప్రసాదిస్తాడని ధరమ్ పాల్ అన్నాడు. 
అది విన్న సుల్తాన్ మరింత సంతోషించాడు. అతను ధరమ్ పాల్ ని కౌగిలించుకొని, "ఇవాళ నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను" అన్నాడు. 

ధరమ్ పాల్ ఇలా అన్నాడు, “నువ్వు 100 ఏళ్లు జీవించి, నీ ప్రజలను బాగా చూసుకోగాక ! ప్రజలు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, నాకు మరేమీ అక్కర్లేదు."

సుల్తాన్ అది విని ఉప్పొంగిపోయి, “నేను ఈరోజు మీ వస్తువులన్నీ కొంటాను. మీరు కోరుకున్నంత ధర ఇస్తాను”, అన్నాడు.
కాబట్టి, ధరమ్ పాల్ తండ్రి ఆశీర్వాదం అక్కడ కూడా అతనిని విఫలం చేయలేదు.

తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని, వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదన్నది వాస్తవ సత్యం.

వారి సేవలో గడిపిన ప్రతి క్షణం ఫలాన్ని ఇస్తుంది. మన పెద్దలను గౌరవించడమే భగవంతునికి మనం చేసే ఉత్తమమైన సేవ.

ఈ  ప్రపంచం అంతా అనేకమైన అవకాశాలుతో నిండిఉంది. సాధ్యమయ్యే సంఘటనకు అవకాశం ఎలాగూ ఉంటుంది, కానీ అత్యద్భుతమైన విషయం ఏమిటంటే, అసాధ్యమైన సంఘటన సాధ్యమయ్యే అవకాశం కూడా ఉంది.

Monday, November 29, 2021

త్రిచక్ర యాప్ - 3 Chakra Project

తిరుపతి అర్బన్ జిల్లా:




  • తిరుపతి నగరంలోని ఆటోలకు ప్రత్యేక గుర్తింపు.
  • త్రిచక్ర యాప్ ద్వారా ఆటో యొక్క వివరాలన్నీ నమోదు.
  • ఆటో ప్రయాణికులకు ప్రత్యేక రక్షణ.
  • తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్. 
  • నగరంలోని ఆటోలకు త్రిచక్ర యాప్ ద్వారా ప్రత్యేక గుర్తింపు.
  • నగరములోని ఆటోల యజమానులు త్రిచక్ర యాప్ ను ప్లే స్టోర్ నందు డౌన్లోడ్ చేసుకోవాలి.
  • ప్రతి ఆటో దారుడు తప్పకుండా పూర్తి వివరాలతో యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
  • నకిలీ వాహనాలను సులభంగా గుర్తించే అవకాశం.
  • ప్రయాణికులకు పూర్తిస్థాయిలో భద్రత.
  • ప్రయాణికులు ఉన్నచోట నుండి యాప్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం.
  • ప్రయాణికులు పయనించు మార్గాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
  • దీని వల్ల ఆటో యొక్క లొకేషన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.
  • ప్రతి ఆటోకు ఒక QR కోడ్ నెంబర్ వస్తుంది. దాని ద్వారా ప్రయాణికులతో నేరుగా సంప్రదించవచ్చు.
  • ప్రయాణికులకు, ఆటో డ్రైవర్లకు, పోలీసులకు అనుసందానమై ఉపయోగకరంగా ఉంటుంది.
  • ప్రయానికుల భద్రతే ముఖ్యం. దిశా యాప్ వలే పనిచేయడం వలన పూర్తి స్థాయిలో భద్రత.
  • ఆపదలో ఉన్నప్పుడు QR కోడ్ ఒక రక్షణ.
నగరంలో ఆటో ప్రయానికుల భద్రత దృష్ట్యా త్రిచక్ర యాప్ ను ప్రారంబించి ఆటోలకు గుర్తింపు నంబర్లను ఆటోలకు అతికించిన జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు. ఈ కార్యక్రమం ఈ రోజు బాలాజీ కాలనీ, లక్ష్మీనారాయణ కళ్యాణ మండపం ప్రాంగణంలో జరిగింది.   

జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు మాట్లాడుతూ తిరుపతి నగరం మహా పుణ్యక్షేత్రం. ఇక్కడ దేశ విదేశాల నుండి శ్రీవారి దర్శనార్థం భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా నగరంలో ఎక్కువ భాగం ప్రజలు, మహిళలు, యువత ఆటోల పైనే ఆధారపడుతారు. భద్రత దృష్ట్యా నగరములో ఉన్న ఆటోలకు కూడా ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో మరియు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు ఎదురు కాకుండా ఉండాలనే ఈ త్రిచక్ర యాప్ ను తయారు చేయడం జరిగింది. 

భద్రత విషయంలో ఈ యాప్ దిశా యాప్ వలే భద్రతను కల్పిస్తుంది. ప్రయాణికులు, మహిళలు ఆటో లో ప్రయాణించినప్పుడు అనుకోని సంఘటనలు ఎదురైతే ఈ QR కోడ్ స్కాన్ ద్వారా రక్షణ పొందవచ్చు. చేయవలసినదంతా ఒక్కటే, ప్రతి ఆటోకు ఆటో ముందు బాగం, లోపల, బయట QR కోడ్ స్టిక్కర్లు అంటించబడి ఉంటుంది. అది గమనించి అత్యవసరమైనప్పుడు సమాచారాన్ని పోలీస్ వారికి తెలుపవచ్చు. ఒకవేళ తప్పని పరిస్థితి, అనుమానం ఉన్నా వెంటనే ఆటోలోని QR కోడ్ ను స్కాన్ చేయగానే ఆటో యొక్క పూర్తి వివరాలు, డ్రైవర్/ఓనర్, ఆటో నంబర్, లొకేషన్ అన్ని తెలుస్తుంది. మీరు పోలీస్ వారికి, తల్లిదండ్రులకు, స్నేహితులకు, ఆటో యొక్క వివరములను షేర్ చేయవచ్చును.   
 
నగరంలో ఉన్న ఆటో దారులందరు తప్పకుండా ఆటో మరియు డ్రైవర్/యజమాని యొక్క పూర్తి వివరాలను ఈ యాప్ ద్వారా పొందుపరిచి ఉంటుంది. ఆటో కావాలసిన ప్రయాణికులు వారు ఉన్న చోట నుండే యాప్ ద్వారా సులభంగా వారి వద్దకు ఆటో ను రప్పించుకోవచ్చు. దీని ద్వారా ప్రయాణికులు ప్రయాణించే మార్గాలను మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఈ యాప్ పోలీస్ స్టేషన్ నందు అనుసందానమై ఉన్నందున ఆటో ఎక్కడికి వెళుతున్నది, ఎక్కడ ఆగినది అనే పూర్తి వివరాలు పోలీసులకు సమాచారం తెలుస్తుంది. దీని వలన ప్రయాణికులు పూర్తి భద్రతతో సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేరవచ్చు. అనుకోని సంఘటనలు జరిగినప్పడు QR కోడ్ వివరాల ద్వారా క్షణంలో పోలీస్ వారు మీ ముందు ఉంటారు.
 
నకిలీ ఆటోలను మరియు కొత్త వ్యక్తులను కూడా సులభంగా గుర్తించవచ్చు. ప్రతి ఒక ఆటో కు QR కోడ్ ఉన్నందున అనుకోని సంగటనలు జరిగినప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యాత్రికులు, ప్రజలు, మహిళలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని, అందరు సురక్షిత భద్రత పొందాలని అలాగే ఆటో డ్రైవర్లు, యజమానులు ఇందుకు సహకరించి విజయవంతం చేసి తిరుపతికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటున్నాననని ఈ సందర్భంగా జిల్లా యస్.పి గారు తెలియజేసారు.

యాప్ యొక్క వివరాలు:

ప్రజలు:
 
1. ప్లేస్టోర్ నుంచి త్రిచక్ర సిటిజెన్ అప్ ని డౌన్లోడ్ చేసుకోవలెను.

2. మీ పేరు మరియు మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.

3. రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి ఓటీపీ వాలిడేషన్ ద్వారా లాగిన్ అవ్వవలెను.

4. Nearby బటన్ మీరు click చేస్తే మీకు దగ్గర లో ఉన్న ఆటో ల వివరాలు వాటి ఫోన్ నెంబర్ లతో పాటు మీరు స్క్రీన్ పైన చూడవచ్చును. మీకు నచ్చినటువంటి ఆటో డ్రైవర్ కి ఫోన్ చేసి మీరు వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళవచ్చు.

QR స్కాన్ విధానం:

5. Dashboard నందు QR స్కానర్ ని ఉపయోగించి మీరు ప్రయాణిస్తున్న ఆటోలో ఉన్న QR కోడ్ ను స్కాన్ చేసుకోవలెను.

6. QR స్కాన్ విధానం ద్వారా మీరు ప్రయాణిస్తున్న ఆటో వివరాలు మీరు సేవ్ చేసుకోవచ్చు. మీ ప్రయాణం లో మీ లొకేషన్ తో పాటు మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోవచ్చు.

7. ఆపద సమయంలో పోలీస్ వారికీ కూడా మీ లొకేషన్ ని షేర్ చేసుకోవచ్చు. షేర్ చేసిన తరువాత మీ సురక్షణ కోసం పోలీస్ వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటారు.

ఆటో యాజమాని:

1. ఆటో డ్రైవర్లు ప్లేస్టోర్ నుంచి త్రిచక్ర అనే ఆప్ ని డౌన్లోడ్ చేసుకొని మీ పేరు మీ మొబైల్ నెంబర్ డిస్ట్రిక్ట్ వివరాలతో రిజిస్టర్ చేసుకోవలెను.

2. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వాలిడేషన్ ద్వారా లాగిన్ అవ్వచ్చు.

3. లాగిన్ అయిన తర్వాత మీ ఆటో యొక్క వివరాలు(ఆటో నెంబర్, ఆటో ఫోటో మొ.), ఆటో ఓనర్ యొక్క వివరాల(ఓనర్ ఫోటో, ఫోన్ నెంబర్, లైసెన్స్ ఫోటో మొ.) డాక్యూమెంట్లను ఆప్ లో అప్లోడ్ చేయాలి.

4. మీరు అప్లోడ్ చేసిన డాకుమెంట్స్ ని మీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులు చెక్ చేసి మీకు అప్రూవల్ ఇచ్చిన తరువాత మీకు పోలీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్ జెనెరేట్ అయిన తరువాత మీకు QR కోడ్ ఉన్న స్టికర్ ఇవ్వటం జరుగుతుంది. .

5. మీకు స్క్రీన్ పైన ఒక Online/Offline అనే ఒక బటన్ ఉంటుంది. ఆన్లైన్ గ్రీన్ కలర్ లో పెట్టుకుంటే మీకు దగ్గర లో ఉన్న ప్రజలు మీకు ఫోన్ చేయటం ద్వారా మీకు బాడుగలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.
 
పోలీస్:
 
1. ప్లే స్టోర్ నుంచి త్రిచక్ర ఆప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పోలీస్ అధికారి తన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు.

2. లాగిన్ అయిన తరువాత QR స్కానర్ ద్వారా ఆటో మరియు ఆటో డ్రైవర్ యొక్క వివరాలను పరీక్షించవచ్చును.

3. ఆటో యొక్క వివరాలని ఆటో డ్రైవర్ మొబైల్ నెంబర్ (లేదా) ఆటో నెంబర్ (లేదా) పోలీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా కూడా ఆటో వివరాలను పరీక్షించవచ్చును.

4. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉన్న అధికారికి వారి స్టేషన్ పరిధిలో ఉన్నటు వంటి ఆటోల యొక్క వివరాలు చూసి వాటికీ అప్రూవల్ ఇచ్చిన తరువాత పోలీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్ జెనెరేట్ అవుతుంది.
 
          ఈ కార్యక్రమంలో డి.యస్.పి లు ట్రాఫిక్ I మల్లికార్జున, ట్రాఫిక్ II కాటమరాజు, వెస్ట్ నరసప్ప, సి.ఐ లు ఈస్ట్ శివప్రసాద్, ట్రాఫిక్ రామ సుబ్బయ్య, 3చక్ర యాప్ డెవలపర్ రియాజ్, ఆటో డ్రైవర్లు, యజమానులు పాల్గొన్నారు.

Thursday, November 25, 2021

Chanting Vishnu Sahasranama

Vishnu Sahasranama was first composed & recited by Bhishma when he was on his deathbed. Lord Krishna went to see Bhishma because he was breathing his last. When Bhishma had darshan of Lord Krishna, he started reciting Vishnu Sahasranama immediately. Vishnu Sahasranama means, the rosary of thousand names of Lord Vishnu.

He started reciting Vishnu Sahasranama in the order he saw the lord's form continuously and successively.

Vishnu Sahasranama is found in Mahabharata, the great epic of India.

If confers all the mundane transcendental benefits to the person who chants it. There are so many Sahasranamas of Vishnu, but among them, this happens to be the most cardinal and important one because right from Sankaracharyalu there are so many Sages and Saints who have recited and commented in their own way. Even today, it is recited with fervor and gaiety in all the temples of Lord Vishnu.

The Chanting of the following names of Lord Vishnu immensely helps us in overcoming the obstacles in our daily life.

1. "Om Vashatkaaraaya Namaha" : For Success in Business.

2. "Om Aksharaaya Namaha": For Success in Studies.

3. "Om Bhuthabhavanaya Namaha": For Good Health.

4. "Om Paramaathmane Namaha": For Self Confidence.

Wednesday, November 24, 2021

బ‌ల్లిశాస్త్రం చెప్పే నిజాలు

బల్లి శరీరంపై పడితే మనలో చాలా మంది ఆందోళన పడుతుంటారు. బల్లిశాస్త్రంపై అవగాహన లేక ఏం చెయ్యాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు. అయితే బల్లి మన శరీరంపై ఎక్కడ పడినప్పటికీ వెంటనే తలస్నానం చేసి, దీపం పెట్టి, నైవేద్యంతో ఇష్ట దైవమును ప్రార్థించాలి. బల్లి లేదా తొండ తల మీద నుంచి కిందకు దిగితే మంచిది కాదు. కింద నుంచి పైకి పాకి వెంటనే దిగితే మంచిది. శరీరంపై కొన్ని ప్రత్యేక స్థానాల్లో బల్లి పడటం వల్ల కొన్ని రకాల ఫలితాలు కలుగుతాయి. అలాగే కొన్ని రకాల నష్టాలు కూడా కలుగుతాయి. 

మగవారి తలపై బల్లి పడితే మరణం వెంటాడుతుందని సంకేతం. ముఖంపై పడితే ఆర్థిక సమస్యల నుంచి బయట పడి లాభాల బారిన పడతారు. ఎడమ కన్నుపై పడితే అంతా శుభమే జరుగుతుంది. కుడి కన్నుపై పడితే చేసే పని విజయవంతం కాదు. అపజయం కలుగుతుంది. నుదురుపై పడితే ఇతర సమస్యలు రావడం, విడిపోవడం లాంటివి జరుగుతుంది. 

కుడి చెంపపై పడితే బాధలు ఎక్కువవుతాయి. ఎడమ చెవిపై పడితే ఆదాయం బాగా వస్తుంది. పైపెదవి అయితే కలహాలు వెంట పడతాయి. కింది పెదవి ఆదాయంలో లాభం కలుగుతుంది. రెండు పెదవుల మధ్య పడితే మృత్యువు సంభవిస్తుంది. వీపుపై ఎడమ భాగం విజయం కలుగుతుంది. మణికట్టు అలంకార ప్రాప్తి కలుగుతుంది. మోచేయి డబ్బు నష్టం. 

వేళ్ళపై పడితే అనుకోకుండా బంధువులు, స్నేహితుల రాక, కుడి భుజంపై పడితే కష్టాలు, సమస్యలు. ఎడమ భుజం పదిమందిలో అవమానం జరుగుతుంది. తొడలపై పడితే దుస్తులు, వస్త్రాలు నాశనమవుతాయి. మీసాలపై పడితే కష్టాలు వెంటాడుతాయి. కాలి వేళ్ళపై అయితే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. పాదములపై అయితే ప్రయాణానికి సిద్ధం అని అర్థం. ఇవన్నీ పురుషులపై బల్లి పడితే కలిగే విషయాలు. 

ఇక స్త్రీలపై బల్లి పడితే: తలపై పడితే మరణ భయం, కొప్పుపై రోగాల భయం, పిక్కలపై బంధువుల రాక, ఎడమ కన్ను భర్త వేరొకరి ప్రేమను పొందుతారట, కుడి కన్ను మనోవ్యధ, రొమ్ము (వక్షస్ధలం) మంచి జరుగుతుంది, కుడి చెంప మగ శిశువు జన్మిస్తాడని, కుడి చెవి ధనలాభం.. ఆదాయం, పై పెదవి విరోధములు కలుగుతాయి, కింది పెదవి కొత్త వస్తువులు మీ చెంతకు చేరుతాయి. 

స్త్రీలకు రెండు పెదవులపై పడితే కష్టాలు, సమస్యలను ఫేస్ చెయ్యాలి. వీపు పైన పడితే మరణవార్తను వింటారు. గోళ్ళపై పడితే చిన్నచిన్న కలహాలు గొడవలు.స్త్రీల ఎడమ చేయిపైన బల్లి పడితే మెంటల్ స్ట్రెస్, వేళ్ళపై పడితే నగల ప్రాప్తి కలుగుతుంది. కుడిభుజం కామరతి ప్రాప్తి కలుగుతుంది, తొడలు- కామము, మోకాళ్ళు ఆదరణ, అభిమానం, చీలమండలము కష్టాలు, కుడి కాలిపై పడితే గొడవలు, కాలివేళ్ళు పుత్రుడు జన్మిస్తాడు. 

ఇక బల్లి ఎవరిపైనా అయినా సరే తలమీద పడితే కలహము, బ్రహ్మరంధ్రం మీద భయం కలుగుతాయి. జుట్టుమీద అయితే కష్టం, వెనుక జుట్టుపైన పడితే మృత్యు భయం, జడమీద మృత్యు భయం వంటివి కలుగుతాయి. అదేవిధంగా ముఖంపైన పడితే బందు దర్శనం, కనుబొమ్మల మీద కలహం, కుడి కన్నుమీద ఓటమి, ఎడమకన్ను మీద అవమానం, కుడిచెవి మీద దుర్వార్త వినటం, ఎడమచెవి మీద వర్తక లాభం, ముక్కుమీద ఆరోగ్య సమస్యలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. 

బల్లి పై పెదవిపైన పడితే వ్యయం, క్రింది పెదవి పైన లాభం, గడ్డము మీద కారాగృహప్రాప్తి, కంఠముపై శతృహాని, మెడపైన భయం, రొమ్ముమీద విజయం, కుడి భుజంపైన ఆరోగ్యం, ఎడమ భుజముపైన పడితే స్త్రీ భోగము కలుగుతాయి. 

బల్లి గుండెలపైన పడితే భయం, కడుపుపై పడితే సంతాన లాభం, మోచేతినందు నష్టం, అరచేతినందు ధనలాభం, వెన్నుమీద భయం, పిరుదుల మీద శయ్యాలాభం, తొడ భాగంపైన విషపు జంతువుల వలన ప్రాణ భయం, మోకాలిపైన వాహనలాభం, పాదములమీద ప్రయాణము, వ్రేళ్ళపైన రోగము, అరికాలిపైన బల్లి పడితే ఉన్నత పదవులు కలుగుతాయని జ్యోతిష నిపుణులు మరియు శాస్త్ర వివరణ.

Monday, November 22, 2021

మన పండుగల గొప్పతనం 




సంక్రాంతి: మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం, అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.

మహాశివరాత్రి: కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.

హోలీ: వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు, పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.

ఉగాది: కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.

శ్రీరామ నవమి: భార్య - భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.

అక్షయ తృతీయ: విలువైన వాటిని కూడబెట్టుకోమని.

వ్యాస (గురు) పౌర్ణమి : జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.

నాగుల చవితి: ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.

వరలక్ష్మి వ్రతం: నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.

రాఖీ పౌర్ణమి: తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.

వినాయక చవితి ( నవరాత్రులు ): ఊరంతా ఒక్కటిగా కలవడానికి.

పితృ అమావాస్య: చనిపోయిన వారిని ఎప్పటికి మరువకు అని చెపుతూ.

దసరా ( ఆయుధ పూజ): ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.

దీపావళి: పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.

కార్తీక పౌర్ణమి: చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.

గోదాదేవి ఎవరు

గోదాదేవి 1200 ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికులు పన్నిద్దరాళ్వారులలో ఏకైక మహిళ. ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో (4000 పాశురాలు) గోదాదేవి పాడిన 30 పాశురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. గోదాదేవి తనని తాను రేపల్లెలో గొల్లభామగా భావించుకుంది.

తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణస్వామిని పగలంతా చూస్తున్న సంతోషం , రాత్రివేళ చూడలేని తాపం , తెల్లవారే వేళనే కన్నులారా చూసి తరించాలన్న తపన , ఆత్రం కలబోసిన భావరాగానురాగాల పారిజాతాల మాల తిరుప్పావై.

పాశురాల పరమార్ధం: తిరుప్పావైలో ఉన్న మొత్తం పాశురాలు 30. వీటిలో మొదటి అయిదు ఉపోద్ఘాతంగా ఉంటాయి. తిరుప్పావై ప్రాధాన్యతను వివరిస్తాయి. భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదని , చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశురాలు చెబుతాయి. భగవంతుని ఆరాధించటం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని , పంటలు నిండుగా పండుతాయని , దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉంది.

తర్వాతి పది పాశురాల్లో చెలులతో కలిసి శ్రీరంగనాథుని సేవించడానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి. పదిహేను నుంచి ఇరవయ్యో పాశురం వరకు గోదాదేవి చెలులతో కలిసి దేవాలయానికి వెళ్లిన విషయాలు , అక్కడి శిల్పసౌందర్యాల వర్ణనలు , రంగనాథునికి సుప్రభాతం పాడటం మొదలైనవి ఉంటాయి. కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాశురాల్లోనే ఉంటుంది.

చివరి తొమ్మిది పాశురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాశురంలో ఫలశృతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది.


పూజారి -- కానుకలు..

పూజారి -- కానుకలు .. మీరు కానుకలు హుండీలోనే వేయండి . పూజారి ప్లేటులో వేయవద్దు ,హుండీలో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడికి చేరుతుంది...