I am UNIQUE, AMAZING, ORIGINAL, STRONG, KIND & I'm who I am. REAL and SIMPLE. :-) MoSt Of AlL My LiFe Is SiMpLe AnD CoLoRfUl...
Wednesday, April 21, 2021
రామ రెండక్షరాలు శక్తి శరాలు
Karnavedha samskaras (Piercing the earlobe)
Monday, April 19, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సర పంచాంగము
తెలుగు సంవత్సరాల పేర్లు. వాటి అర్థాలు
ఏదైనా రాసేటప్పుడు పేపరుపైన “శ్రీ” కారం రాస్తారెందుకు?
శుభకార్యాల్లో ఆడవాళ్ళ గొంతుకి గంధం రాసేదెందుకు?
అక్షరాల అధిదేవతలు
తథాస్థు దేవతలు అంటే
కాలసర్ప దోషం (నాగదోషం)
రెండు మంగళసూత్రాల వెనుక ఉన్న అద్బుత రహస్యం ఏమిటో తెలుసుకుందాం.
Saturday, April 17, 2021
జీవితాన్ని ఎలా గడపాలి?
Thursday, April 15, 2021
కాశీలోని కొన్ని వింతలు విశేషాలు
Wednesday, April 14, 2021
India, Hindu Rashtra!
Interesting article from a Pakistani Muslim. Omer Khalid Asks: “What Is Wrong In Bharat Becoming A Hindu Rashtra?”
Monday, April 12, 2021
మనం చేసే పూజలు ఎందుకు సత్ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి ?
Wednesday, April 7, 2021
నరకం లోని శిక్షలు
ఈ లోకంలో మనుష్యులు తమ క్షణిక సుఖాల కోసం అనేక దుష్కర్మలను చేస్తారు. ఈ దుష్కర్మల ఫలితంగా మనిషికి మృత్యువు తరువాత భోగదేహం ప్రాప్తిస్తుందని మన పురాణాలు ఉద్భోదిస్తున్నాయి . ఈ భోగదేహం రెండు రకాలు..
ఒకటి సూక్ష్మ శరీరం. ఇది మనిషి ఆచరించన సత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను అనుభవించడానికి స్వర్గాది ఊర్థ్వ లోకాలకు చేరుతుంది.
రెండవది యాతన దేహము. ఇది మానవుడు చేసిన పాప ఫలాలను నానా విధాలుగా అనుభవించడానికి నరకాది లోకాలకు చేరుతుంది. మృత్యువు తర్వాత వెంటనే కొత్త హేహం ధరించటం వీలుకాదు. కొత్త దేహ ప్రాప్తికి ముందు జీవు మనోమయ ప్రాణమయ హేహంచేత, సుకృత, దుష్కృత, సుఖ దుఃఖాల ఫలితాలను అనుభవిచవలసి వస్తుంది..
చాగంటి వారి అద్భుత ప్రవచనం
శ్రీ మద్భాగావతంలో యాతనాదేహం అనుభవించే వివిధ శిక్షలు వాటిని అమలు చేసే 28 నరకాల వర్ణన వున్నది.
వాటి సంక్షిప్త వివరణ ఇది.
1. తామిస్ర నరకం
పరుల యోక్క ధనాన్ని అపహరించ్చిన , పరస్త్రీలతో వ్యభిచరించినా ఈ శిక్ష ను పొందుతారు, ఇక్కడ అంధకారమైన(చీకటి) బంధురమున(గదిలొ) పడవేసి కాల్చిన ఇనుప కఱ్ఱలచే బాదుదురు.
2. అంధతామిస్ర నరకం
స్త్రీలను మోసగించి ధనమును తీసుకున్న వారు, తన కంటే పెద్దవారిని గౌరవించని వారు ఈ శిక్షను పొందుతారు ఇక్కడ చిమ్మ చీకటి గదిలో పాముల మద్య నరికిన చెట్ల వలె పడవేయుదురు.
3. రౌరవము
మూగ జీవులను మన కంటే అల్పమైన ఇతర ప్రాణులను చంపిన వారికి ఈ శిక్ష అమలు చేయుదురు ఇక్కడ రురువులు (పాముల కన్న ఘోరమైనవి అతి భయంకరమైనవి)చే హింసించును.
4. మహారౌరవం
మూగ జీవులను మన కంటే అల్పమైన ఇతర ప్రాణులను చంపి తన శరీరాన్ని పోషించుకునేవారు , మూగ జీవులను భందించే వారును ఈ నరకంలోకి వస్తారు ఇక్కడ పచ్చి మాంసము తిను రురువులచే హింసించును.
5. కుంభీపాకము
సజీవంగా వున్న పశుపక్ష్యాదులను చంపి వాటి మాంసాన్ని తిన్నవాడు ఇక్కడు కు చేరుతాడు ఇక్కడ సలసల కాగే నూనెలో పడవేయుదురు.
6. కాలసూత్ర నరకం
తల్లిదండ్రులను, సద్భ్రాహ్మణులను, వేదానికి ద్రోహం తలపెట్టిన వారు ఈ నరకాన్ని చూస్తారు ఇక్కడ రాగి నేల కలిగి, నెత్తిన నిప్పులు చెరుగు సూర్యుడు మాడ్చి వేయచుండును.
7. అసిపత్ర వనము
తల్లిదండ్రులను , వేదములను, గురువులను, ధిక్కరించిన వారు ఇక్కడికి వస్తారు ఇక్కడ కొరడాలతో గొడ్డును బాదినట్లు బాదుచూ, సర్వాంగములను కత్తులతో కోసి ఈ శిక్షలను అమలుచేయును..
8. సూకర ముఖము
దండించ దగని వారిని దండిచిన రాజులకు మరియూ న్యాయమూర్తులనూ చెరకు గడలవలే గానుగలలో పెట్టి తిప్పుదురు.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమ జపం
9. అంధకూపము
నల్లులు మున్నగు వాటిని చంపిన వారిని పాములు,నల్లులు,దోమలు,చీమలు చే హింసించును.
10. క్రిమి భోజనము
అతిధులకు అభ్యాగతులకు సరియైన అన్నం పెట్టక తన పొట్ట నింపుకొను వాడు క్రిములతో నిండిన సలసలగాకు లక్షయోజనముల కుండలో పడవేయబడును.
11. సంధశన
బ్రాహ్మణుల ధనము,ఇతరుల బంగారము,రత్నములు దోచుకున్న వారిని మండుతున్న కడ్డీలతో పొడుచుట మరియూ పటకారతో చర్మము పీకుట వంటి శిక్షలు వేయును.
12. తప్తసూర్మి
సంభోగించరాని పర స్ర్తీలతో సంభోగించిన మగవారు, అట్టి మగవారితో సంభోగించిన ఆడవారు ఈ శిక్షను అనుబవించును ఇందులో మండుతున్న ఇనుప చువ్వలతో శిక్షించును మరియూ మర్మాంగములను ఇనుప రంపముతో కోయును.
13. వజ్రకంటక శాల్మిలి
పశువులతో సంభోగించిన వాడు ముళ్ళున్న బూరుగు చెట్టు మీదికి ఎక్కించి కిందకు లాగి వేయును..
14. వైతరణి
కులమర్యాద పాటించని పురుషులు, రాజు లేక రాజోద్యోగి చీము, నెత్తురు, తలవెంట్రుకలు, గోళ్ళచే నిండి ఉండు నదిలో త్రోయ బడును.
15. పూయదన
శౌచము, ఆచారము పాటించని బ్రాహ్మణులను మలమూత్రాదులచే నిండిన చెరువున పడవేయుదురు.
16. ప్రాణరోధ
కుక్కలను, గాడిదలను, పెంచి వేటనే వృత్తిగా పెట్టుకున్న వారిని ఆంపకోలలచే వేటాడుదురు.
17. వైశాన
దంభ యజ్ఞములు చేసి పశువులను హింసించిన వారు ప్రాణాంతకమైన రకరకాల యాతనలను అనుభవింతురు
18. లాలాభీక్ష
భార్యలను భయపెట్టి హింసించికుల సుఖించే వారిచే మూత్ర పీనము చేయింతురు.
19. సారమేయోదనము
ఇండ్లు తగుల పెట్టుట, విషము పెట్టుట అట్టి వారిని మరియూ దొంగ జీవితము అనుబవించు వారిని వజ్రములవలే కరకుగా వున్న కోరలు గల ఏడువందల జాగిలములు పీక్కొని తినును.
20. అవిచి మంత
అబద్ద సాక్ష్యాలను చెప్పిన వారు,లావాదేవీల లో బొంకిన వారు వంద యోజనముల ఎత్తయిన పర్వత శిఖరముల నుండి పడద్రోసి పచ్చడి చేయబడును.
21. అయఃపానము
వ్రతనిష్టతో వుండి మద్యపానము చేసిన వారు, సోమపానము చేసిన వారు కరిగిన ఇనుమును త్రాగింతురు.
22. క్షారకర్దమ
తన కన్న అధికులను, పెద్దవారిని తిరస్కరించువారు తలక్రిందులగా పడద్రోసి నానా బాధలు పెట్టుదురు.
23. రక్షో గణబోధన
నరమేధములు చేయువారిని, పశువుల మాంసము తిను వారిని ముక్కలు ముక్కలుగా కొయును.
24. శూల ప్రోతము
జంతువులను, మూగజీవులను పొడిచి చంపినవారిని శూలములచే పొడువబడి,ఉరి కంబములను ఎక్కింపబడును.
25. దండసూకర
ఆడవారిని , పిల్లలకు భయము కలిగించు వారిని అయిదు తలలపాములు ఏడు తలల పాములచే క్రూరముగా హింసించెదరు.
26. అవధినిరోధన
తల్లితండ్రులను, భార్యాపిల్లలను బంధించిన వారిని విషాగ్నులు మండించి విషపు పొగలు పేట్టి ఉక్కిరి బిక్కిరి చేయును.
27. పర్యావర్తన
అతిధులను, అభ్యాగతులను గద్దించిన వారిని కనుగ్రుడ్లను కాకులచే గ్రద్దలచే పొడిపింతురు.
28. సూచిముఖి
ధన మదాంధముతో అందరిని చిన్న చూపు చూచిన వాని శరీరమును సూదులతో బొంతను వలే కుట్టుదురు.
అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం..!
పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం ఇది.
నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.
పురాణగాథ
బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.
ఏం చేయాలి..?
ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.
ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు... హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.
చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.
బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.
బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము.
ఉమ్మెత్త పువ్వులతో శివుని పూజ ఎందుకు? ఏడు జన్మల పాపం తొలగిపోవాలంటే?
ఉమ్మెత్త పువ్వులంటే శివునికి ఎంతో ఇష్టం. ఒకే ఒక ఉమ్మెత్త పువ్వును శివుని వద్ద వుంచి వేడుకుంటే.. భక్తులకు మోక్షం సిద్ధిస్తుంది. కేరళలోని శివుని ఆలయాల్లో ఉమ్మెత్త పువ్వులతో అభిషేకం ప్రత్యేకంగా జరుగుతుంది. మాంగల్య భాగ్యం లభించాలంటే శివుడిని ఉమ్మెత్త పువ్వులతో అర్చించాలి.
ఇంకా ఉమ్మెత్త పువ్వులతో తయారు చేసిన మాలను శివుడికి అర్చించడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. వినాయకుడికి కూడా ఉమ్మెత్త పువ్వులంటే భలే ఇష్టం. అలాగే దుర్గాదేవిని ఉమ్మెత్తపూలతో పూజిస్తే.. దారిద్ర్యం తొలగిపోతుంది. నవరాత్రి రోజుల్లో ఏడో రోజు సరస్వతీ దేవీ అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు.
ఆ రోజున సరస్వతీ దేవి విగ్రహం ముందు ఉమ్మెత్త పువ్వులతో రంగోలి వేసి పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి.
అలాగే ప్రదోష కాలంలో శివుడిని అర్చిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. సర్పదోషంతో పాటు ఇతర దోషాలు తొలగాలంటే ప్రదోష సమయంలో శివుడిని అర్చించాలి. మాసానికి రెండుసార్లు ప్రదోషం వస్తుంది. అంటే అమావాస్యకు, పౌర్ణమికి ఒక్క రోజు ముందు ప్రదోషం వస్తుంది. ఈ సమయంలో శివుడిని దేవతలు స్తుతిస్తారని విశ్వాసం. అలాంటి సమయంలో శివునిని దర్శించుకుంటే.. శివుని అనుగ్రహంతో పాటు సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుంది. ప్రదోషం రోజున సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలో నందీశ్వరుడిని పూజించాలి. ఈ రోజున వ్రతమాచరించి.. సాయంత్రం ఆరు గంటలకు తర్వాత భోజనం తీసుకునే వారికి, ఆధ్యాత్మిక పరంగానే కాకుండా.. ఆరోగ్య పరంగానూ ఎంతో మేలు చేకూరుతుంది. శివుడు అభిషేక ప్రియుడు.
అందుకే ఆ రోజున ఆయనకు పాలాభిషేకం చేయిస్తే.. మంచి ఫలితం లభిస్తుంది. బిల్వ పత్రాలు, కొబ్బరిబోండాం నీటితో అభిషేకం చేయిస్తే.. ఈతిబాధలు తొలగిపోతాయి. ఇదే రోజున ఉమ్మెత్త పువ్వులతో శివునికి అర్చన చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. ఏడేడు జన్మల పాటు చేసిన పాపాలు తొలగిపోతాయి. బ్రహ్మహత్యా దోషం తొలగిపోతుంది. శనివారం పూట వచ్చే ప్రదోషాల్లో ఈశ్వరుడిని స్తుతిస్తే.. ఈతిబాధలు, అష్టకష్టాలు తొలగిపోతాయి. శనిదోషాలు కూడా తొలగిపోతాయి.
అలాగే శివునికి మామిడి పండ్ల రసంతో స్వామికి అభిషేకం చేయడం వలన ధనధాన్యాలు చేకూరుతాయి. జీవితంలో ధనధాన్యాలకి లోటు వుండదు. ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోవాలంటే.. మామిడి పండ్ల రసంతో శివుడికి అభిషేకం చేయాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.
రాహు, కేతు పూజకై శ్రీకాళహస్తి లోని గుడికి రాహు కేతువుల గ్రహణ సమయం కాలంలో పూజలు జరుగుటకు గల ఆంతర్యం
ఈ దేవాలయంలో పరమేశ్వరుడు తూర్పు దిశ యందు కూర్చుండి పశ్చిమము చూచుట మనము గమనించ దగ్గ విశేషం. అలాగే పడమర లో అమ్మవారు కూర్చుండి తూర్పు లో ఉన్న ఈశ్వరుని చూచుట గమనించగలము. (ఆది అంతము)( ప్రకృతి పురుషుడు) ఒకరి కొకరు ఎదురెదురుగా ఉండటము . ఈ విషయమును మరొక విధముగా చెప్పదలచుకుంటే రాశి చక్రమూలో రాహువు కేతువు లు ఒకరికొకరు ఎదురెదురుగా ఉంటారు. ఈ దేవాలయములో పరమేశ్వరుని శిరముపై పంచ తలలు కేతు గాను . అమ్మవారు ఏక సిర రాహు గాను పరిగణించ వలెను. ఈ దేవాలయంలో రాహుకాలంలో రాహు కేతువుల పూజ ప్రశస్తము అయితే ప్రతి రోజు రాహుకాలము వచ్చును. కానీ ఆ సమయంలో స్వామివారిని దర్శించుకున్న స్వామి వారి తల పై పంచ నాగులు కేతువు దర్శనము కనపడును. అయితే రాహు గా అమ్మవారిని పరిగణించినపుడు సోమవారము నాడు శుక్రవారం మాత్రమే అమ్మవారికి నడుమునకు అలంకరించ్చే వడ్రాణం రూపంలో రాహు కనబడును.
అమ్మవారికి శుక్రవారం రోజున వజ్రాల కిరీటం నడుమునకు ఒక తల నాగుపాము వడ్రాణం గాను బంగారము తో తయారు చేసిన చీర తో అలంకరింపబడును. కనుక శ్రీకాళహస్తి లో సోమవారం శుక్రవారం రాహుకాల సమయంలో మాత్రమే . ఈ విషయమును గమనించి రాహు కేతువుల దోషనిమిత్తము సోమవారం శుక్రవారం రాహుకాలంలో ప్రశస్తమని గమనించగలరు.
YamaDharma raja History
యమధర్మరాజు దక్షిణ దిక్పాలకుడు. చిత్ర గుప్తుడు ఈయన దగ్గర చిట్టాలు వ్రాసే సేవకుడు. సకల జీవరాశుల పాపపుణ్యాల బేరీజు వేసి శిక్షించడమే యముడి పని.
దక్షప్రజాపతి కుమార్తె సంజ్ఞాదేవి సూర్యభగవానుణ్ని పెళ్లాడింది. ఆమెకు వైవస్వతుడు, యముడు అని ఇద్దరు కొడుకులు, యమి అనే కూతురు కలిగారు.
ఛాయాదేవి వారి సవతి తల్లి. ఆమెకు సావర్ణి, శని అనే ఇద్దరు కొడుకులు కలిగారు. అంతవరకు తన సవతి బిడ్డలను సొంత బిడ్డలలాగా చూసుకుంటున్న ఛాయాదేవి, తనకు పిల్లలు కలుగగానే, భేద బుద్ధితో చూడటం ఆరంభించింది.
ఆమె పక్షపాత వైఖరిని సహించలేక, ధర్మం అంటే ప్రాణమైనా ఇచ్చే యముడు, ఒకనాడు తన సవితి తల్లిని కాలితో తన్నాడు. అందుకు ఆమె కోపంతో
“నన్ను తన్నిన నీ కాళ్లకు కుష్ఠురోగం ప్రాప్తించుగాక!” అని శపించింది.
సంజ్ఞాదేవి కూతురైన యమికి పెళ్లీడు వచ్చింది. ఆమె అతిలోక సౌందర్యవతి. ఆమె తండ్రివెంట సూర్య రథంలో తిరుగుతూ తనతో తులతూగే అందగాడి కోసం ముల్లోకాలను గాలించింది. యుముడు ఒకనాడు
“చెల్లీ! నీకు తగిన అందగాడు దొరికాడా, లేదా? దొరికితే వాడు ఎవరో, ఎక్కడున్నాడో చెప్పు” అని అడిగాడు.
అందుకు యమి “అన్నా! నీకంటే అందగాడు నాకు ఎక్కడా కనిపించలేదు, అందుచేత నిన్నే పెళ్లి చేసుకోవాలని కోరికగా ఉంది” అన్నది.
చెల్లెలు తనతో పరిహాసమాడుతున్నదని యముడు సిగ్గుపడ్డాడు. కానీ ఆమె తన పాదాలమీదపడి, ప్రాధేయ పడేసరికి నిర్ఘాంత పోయాడు. అతనికి కోపం వచ్చింది.
“తెలివి తక్కువ దానా! తోడబుట్టిన వాడినే కామిస్తావా? రాక్షసికి కూడా ఇలాంటి కోరిక కలగదే! నీకు పెళ్లీలేదు, పెటాకులూ లేదు. భూలోకంలో నదిగా పుట్టి నీలాంటి పాపాత్ముల పాపాలు కడుగుతూ ఉండు” అని ఆమెను శపించాడు.
అందుకు యమి ఏడుస్తూ కోపంతో....
“నచ్చిన వాడికి పెళ్లాం కాలేకపోతే నదిగా, ఉండటమే మేలు నేను నీ చెల్లెలినే! శాపం ఇయ్యటంలో నీకంటే తక్కువ తిన్నాననుకున్నావా? నువ్వు కాలం తీరకుండానే చస్తావు పో!” అని ప్రతి శాపం ఇచ్చింది.
యముడి శాపకారణంగా, ఆమె హిమాలయాలలో యమునా నదిగా పుట్టి రోదనా స్వరంతో పర్వతాల నుంచి కింది దూకి మైదానంలో ప్రవహిస్తుండగా గంగానది ఆమెను ఓదార్చి, తనలో కలుపుకొని పవిత్రురాలిని చేసింది.
తన రక్తం పంచుకొని పుట్టిన చెల్లిలికే పాప చింత కలిగించిన తన అందం పట్ల యముడికి ఏహ్యా భావం కలిగింది. అతను శివుడి కోసం తపస్సు చెయ్యగా పార్వతీ పరమేశ్వరులు, ప్రత్యక్షమయ్యారు.
భక్తితో స్తోత్రం చేసాడు యముడు. ప్రసన్నుడైన శివుడు
“యమా ! ఏం కావాలో కోరుకో” అన్నాడు.
“పరమేశ్వరా! ఆకర్షణకు మూలమైన ఈ అందం నాకు వద్దు. స్త్రీలు, పురుషులూ నన్ను చూడగానే దడుసుకునేలా భయంకర రూపాన్ని ప్రసాదించు. ఇంకేమీ వద్దు!” అని కోరుకున్నాడు యముడు.
“తథాస్తు !” అన్నాడు పరమేశ్వరుడు.
తదుపరి, బ్రహ్మ దేవుడు జీవుల పాప పుణ్యాలను విచారించి తగిన శిక్షలు విధించటానికి, దక్షిణ దిక్కున నరకం అనే పేరుతో ఒక న్యాయ పీఠాన్ని విశ్వకర్మచేత నిర్మింపజేశాడు. ధర్మబుద్ధి సమదృష్టీ కలవాడు, దయా దాక్షిణ్యాలు లేనివాడు, ప్రలోభాలకు లొంగనివాడు ఎవడో వాడే దక్షిణ దిక్కుకు, నరకానికీ, అందులోని న్యాయపీఠానికీ అధిపతిగా ఉండటానికి అర్హుడు అనుకున్నాడు.
దానికి ఎవరు అర్హుడో తేల్చటానికి త్రిమూర్తులు ముగ్గురూ సమావేశమై, దేవతలతో చర్చించి చివరకి యముడు ఒక్కడే ఆ స్థానానికి తగినవాడు అని తేల్చారు.
అప్పటినుండి యుముడు దక్షిణ దిక్కుకు పాలకుడై శ్యామలాదేవిని పెళ్లాడి, నరకలోకంలోని సమ్యమనీ నగరంలో నివసిస్తూ, దండపాశాలు ధరించి, మహిష వాహనారూఢుడై తిరుగుతూ, పాప పుణ్యాలను విచారించి తీర్పులు చెప్పటం లో తనకు తానే సాటి అనిపించుకున్నాడు.
Tuesday, April 6, 2021
కొన్ని జాతీయములు :
కక్కుర్తి వెధవ :
అన్నింటిని ఆశించేవాడు. అలాంటి వారిని గురించి ఈ మాటను వాడతారు. ఆబగా అన్నం తినే వారిని ఉద్దేశించి కూడా ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
కచ్చా పచ్చాగ :
ముక్కలు ముక్కలుగా ఉదా: ఈ చింత కాయలను కచ్చా పచ్చాగా దంచి తీసుక రా...
కచ్చాగోలీలాట :
పనికిరాని పని, వృధాశ్రమ, ప్రయోజనం లేని పనులు.పచ్చిమట్టితో గోలీలాట ఆడితే ఆ మట్టి ఉండలు విచ్చిపోతాయే తప్ప ఆట సాగదు.
కటకటాలు లెక్కపెట్టడము :
దీనికి జైలు కెళ్ళాడని అర్థము. జైలులో కటకటాలు తప్ప ఇంకేమి కనిపించవు. వాటిని లెక్కబెట్టడము తప్ప వేరే పని వుండదని దీనర్థం. జైలు కెళ్ళిన వాళ్ళగురించి వాడినదీ ఈ జాతీయము.
కట్టు తప్పు :
నీతిని తప్పు. ప్రతి ఊరికి కొన్ని కట్టు బాట్లుంటాయి. అక్కడ నివసించే వారు ఆ వూరి కట్టు బాట్లకు అనుకూలంగా నడుచుకోవలసి వుంటుండి. అలా కాకుండా.... ఆ కట్టు బాట్లకు విరుద్ధంగా ప్రవర్తించెతే వారిని కట్టు తప్పాడు అని అంటారు. దానికి తగు పరిహారము చేయ వలసి వుంటుంది.
కట్టుబానిస :
బాసనం అంటే వంట. గెలిచిన తండావారు ఓడిన తండా వారి చేత వంట చేయించుకొని తింటూ ఉండేవారు.బానిస అంటే అణిగిమణిగి చాకిరీ చేసే వ్యక్తి
కట్టెకట్టోలె కావటం :
బాగా బలహీనంగా ఉండటం
కట్టె, కొట్టె, తెచ్చె :
క్లుప్తత.రాముడు వారధి కట్టి, రావణుడిని కొట్టి, సీతమ్మను తెచ్చాడు అని . రామాయణ మహా కావ్యాన్ని మూడు ముక్కల్లో చెప్పినట్లే..... ఏదైన ఒక పెద్ద విషయాన్ని చాల క్లుప్తంగా చెపితే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు...
కట్టె విరుపు మాటలు :
ఫెళఫెళమని కటువుగా ఉండే మాటలు.
కట్టు బట్టలతో వచ్చాడు :
ఏమి లేకుండా వచ్చాడు అని అర్థం. చేతిలో చిల్లి గవ్వ లేకుండా వచ్చిన వారినుద్దేశించి ఈ జాతీయాన్ని ఉపయొగిస్తారు.
కట్ట కట్టుకొని వచ్చారేందిరా :
అందరు ఒక్కసారె రావడం. ఏదైనా ఒక చిన్న విషయాన్ని చర్చించడానికి చాల మంది వస్తే ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
కట్టకు పుట్టచేటు :
స్థిరంగా ఉండాల్సిపని పాడుచేశాడని అర్థం అంతా ఒక్కసారి వస్తే ఇలా అంటారు.
కటిక దారిద్ర్యం అనుభవిస్తున్నారు .
తీరని కష్టాలు అనుభవిస్తున్నారు.
కట్టు తప్పాడు :
పద్ధతిని అతిక్రమించాడని అర్థం. ఉదా: వారు కట్టు తప్పారు. ఇక్కడ కట్టు అనగా వూరికొరకు ఏర్పాటు చేసుకొన్న పద్ధతి అని అర్థము.
కట్టు బానిస :
జీతభత్యాలు లేకుండా వెట్టిచాకిరీ చేసే సందర్భంలో ఈ జాతీయం వాడతాం.
కత్తిమీద సాము :
అతి కష్టంతో కూడిన పనిని ధైర్యంతో చేసేటపుడు ఈ జాతీయం ఉపయోగిస్తాం.
కత్తుల బోను :
కట్టె విరుపు మాటలు సవరించు
తెగేసి నట్లు మాట్లాడడం.. ఉదా: వానివి కట్టె విరుపు మాటలు.
కడతేర్చాడు:
కడవల కొద్దీ సవరించు
అధికంగా. చంపేశాడని అర్థం.
కడిగిన ముత్యంలా వున్నాడు
చాల స్వచ్ఛంగా ఉన్నాడు. ఉదా: ఈ వ్యవహారంలో వాడు కడిగిన ముత్యంలా ఉన్నాడు. ఏ మరకా అంట లేదు. స్వశ్చతకు ముత్యాన్ని పోలుస్తుంటారు మాటల్లో. అనగా చాల స్వచ్ఛంగా వున్నదని అర్థం. అలా పుట్టినదే ఈ జాతీయము.
కడిగిన ముత్యంలాగ వున్నాడు
అతి పవిత్రంగా వున్నాడని అర్థం. చాల శుభ్రంగా వున్నాడని కూడా అర్థం. ముత్యం శ్వచ్చతకు చిహ్నం.
కాలసర్పయోగం అంటే ఏమిటి? కాలసర్పయోగం నివృత్తి హోమం
కాలసర్ప యోగం ఉన్న అందరికీ ఒకే రకమైన ప్రభావాలు కనబడవు. కొన్ని సార్లు జన్మకుండలిలోని బలమైన గ్రహాలు, స్థానాల వల్ల కూడా జాతకునికి కాలసర్పయోగ ప్రభావం అంత ఎక్కువగా కనిపించదు. కాబట్టి, అలాంటి జాతకులు కాలసర్పయోగం గురించి భయపడాల్సిన అవసరం లేదు. అయినప్పటికి ఒక అనుభవజ్ఞుడైన జ్యోతిష్యుని సలహా మేరకు ఆలస్యం చేయకుండా పరిహార కార్యక్రమాలు జరిపించుకోవాలి.
కాలసర్పయోగం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయా?
కాలసర్పయోగం ఉన్న ఎంతో మంది జాతకులు ధనం, పేరు, ప్రతిష్ట, అధికారం లాంటివి ఏర్పడి ఎంతో పై స్థాయికి చేరుకున్నారు. అయితే ఆ గొప్ప స్థాయికి చేరుకోవడానికి వారికి కూడా ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఏర్పడి ఉంటాయి. భగవత్ ధ్యానంతో, ఆత్మ స్థైర్యంతో కృషి చేస్తూ శిఖరాన్ని చేరుకోవాలి. అయితే కాలసర్పదోషానికి ప్రాయశ్చిత్త, పరిహారాలు జరిపించిన యెడల, వారి జీవితంలో అడ్డంకులు తొలగిపోయి విజయం చేకూరుతుంది.
కాలసర్పయోగం వల్ల ఎలాంటి కష్టాలు ఏర్పడతాయి?
కాలసర్పయోగం వల్ల ఎన్నో సమస్యలు, అనుకోని సంఘటనలు జాతకుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాలసర్పయోగం ఉన్న జాతకులకు ఆరోగ్య రీత్యా యోగ ప్రభావం పడుతుంది. శారీరకంగా వ్యాధుల బారీన పడి బాధలు అనుభవించాల్సి ఉంటుంది. మనఃశాంతి లేకపోవడం, జ్ఞాపకశక్తి మరియు పట్టుదల లేకపోవడం, అనవసరమైన ఒత్తిళ్ళకు లోనవడం, భాద్యతారాహిత్యంగా వ్యవహరించడం, జ్ఞానం లోపించడం, వ్యక్తిత్వ లోపాలు ఉండటం, ఆలోచనాశక్తి తక్కువగా ఉండటం జరుగుతాయి. దీనివల్ల జాతకుడు మానసిక స్థిరత్వం ఉండదు. దీనివల్ల వ్యక్తిగతంగా వారి సన్నిహితులతో సరైన బంధం కొనసాగించక బాధలు పడతారు. ఈ కాలసర్పయోగం వల్ల నిరంతరంగా శారీరక అనారోగ్యాలు లేదా వ్యాధులు ఏర్పడటమే కాకుండా, ఆ వ్యాధి తీవ్రత ఎక్కువ అవ్వటం జరుగుతుంది.
ఇక విద్యా, వృత్తి విషయాలకు వస్తే ఈ కాలసర్ప యోగం ఉన్న జాతకులు ఎప్పుడూ పరీక్షల్లో ఫెయిల్ అవుతూ ఉండటం, మంచి విద్యను నేర్చుకోలేకపోవటం, స్కూలుకు గాని, కాలేజీకి గాని, విశ్వవిద్యాలయానికి గాని ఒక కొత్త విద్య కొరకు చేరలేకపోవటం లాంటివి జరుగుతాయి. ఈ కాలసర్పయోగం జాతకులకు పై చదువులు చదవాలన్న శ్రద్ధ లేకుండా ఉండటానికి కూడా ఈ యోగం కారణం అవుతుంది. చదువులో, చేసే వృత్తిలో నిరంతర విఫలం పొందడం కూడా ఈ కాలసర్పయోగం వల్ల జరుగుతుంది. ఈ యోగం ఉన్న జాతకులకు ఉద్యోగాలలో ప్రమోషన్లు రావడానికి ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతాయి. ఒక్కోసారి ఉద్యోగం కూడా నష్టపోయే అవకాశాలు రాక మానవు.
ఈ కాలసర్ప యోగం ఉన్న వారు ప్రేమ వ్యవహారాలలో విఫలం అవ్వటం, ప్రాణ స్నేహితుని చేతిలో గాని, భాగస్వామి చేతిలో గాని, భార్య/భర్త చేతిలో గాని మోసపోవటం జరుగుతుంది. జీవిత భాగస్వామితో, ఆప్తులతో ఉన్న బంధం పై ఈ యోగ ప్రభావం పడుతుంది. వివాహం ఆలస్యంగా జరగడం, వైవాహిక జీవితం సాఫీగా ఉండకపోవడం, శృంగార జీవితంలో ఆనందం లేకపోవడం, వంధ్యత్వం (సంతాన లేమి), పదే పదే రక్తస్రావాలు జరగటం, పుత్ర యోగం లేకపోవటం, దంపతుల మధ్య అన్యోన్యత లేకపోవటం, విడాకులు జరగడం లాంటి దుర్ఘటనలు ఈ కాలసర్ప యోగం వల్ల సంభవిస్తాయి.
ఈ కాలసర్ప యోగం వల్ల ఆర్థికపరంగా అభివృద్ధి లేకపోవటం, ఆర్థిక స్థిరత్వం లేకపోవటం, జాతకుడిని పేదవాడు అయ్యేలా చేసే తీవ్రమైన అధిక ఋణాలు, వ్యాపారంలో అడ్డంకులు, వంశపారపర్యంగా వచ్చే ఆస్తులలో ఆటంకాలు వస్తాయి.
ఈ కాలసర్పయోగం వల్ల ప్రభావితులైన వారు, తమ జీవితంలో చిన్నతనం నుండి వృద్ధాప్యం వరకు ఆరోగ్య పరంగా, విద్య పరంగా, వృత్తి పరంగా, వివాహ పరంగా, అప్పుల ఆర్థికంగా, సామాజికంగా, రోజు వారి కార్యక్రమాల పరంగా, వారి లక్ష్యాలను చేరుకునేందుకు ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఏర్పడతాయి.
వామతంత్రం ప్రకారం, జన్మకుండలిలో కాలసర్పయోగం ఉన్న జాతకులు తమ బాధల నుండి, సమస్యల నుండి విముక్తి పొందాలంటే, “కాలసర్పయోగా నివృత్తి హోమం” తప్పక జరిపించాలి. ఈ పరిహారం జరిపించడం వల్ల జాతకులకు ఉన్న దురదృష్టం దూరమయ్యి, శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ హోమం జరిపించడం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. అందువల్ల జాతకులకు శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానం లేని దంపతులు ఈ కాలసర్పయోగ నివృత్తి హోమం చేసుకోవడం వల్ల శీఘ్రంగా సంతానం కలుగుతుంది.వ్యాపారంలో నష్టాలు చూసే వారు, వృత్తిపరంగా అపజయం పాలయ్యే వారు, దుష్ట శక్తులు, దుష్టుల నుండి దూరం కావాలనుకునేవారు ఈ కాలసర్ప శాంతి హోమం ఎంతో శుభాన్ని చేకూరుస్తుంది.
12 రకాల కాలసర్పయోగాలు
12 రకాల కాలసర్పయోగాలు
మానవ జీవితములపై ప్రభావాన్ని చూపించే ప్రధాన గ్రహాలైన రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ , శని అను ఈ ఏడు గ్రహాలు ఎవరి జన్మకుండలిలో అయితే రాహువు మరియు కేతువు మధ్య చిక్కుకొని ఉన్నవారికి ఆ పరిస్థితిని కాలసర్పదోషం అంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి జన్మకుండలిలోని ఆరు స్థానాలలో ఏ గ్రహాలచేత ఆక్రమించబడకుండా ఉంటాయో అట్టి స్థితిని సంపూర్ణ కాలసర్ప యోగం అంటారు. కాలసర్పయోగం లేదా కాలసర్పదోషం మానవుల జీవితాలలో ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టిస్తాయి. మనిషి తాను చేసే కార్యాలకు తగిన ఫలితాన్ని పొందలేదు. కొందరికి కాలసర్పదోషం ఉన్న స్త్రీ, పురుషులకు వివాహం కాకపోవటం, సంతానం కలుగకపోవటం, వృత్తిపరంగా అభివృద్ధి లేకపోవటం, తరచూ కోర్టు కేసులలో లేదా తగాదలలో ఇరుక్కోవటం తరచుగా బంధువులతో శతృత్వాన్ని పొందటం లాంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవటం జరుగుతుంది. మనిషికి కావలసిన అదృష్టాన్ని అడ్డగించటములో కాలసర్పదోషం పోషించే పాత్ర ఎంతో ఉంటుంది. కాలసర్పదోషానికి వ్యక్తుల యొక్క మంచి చెడులతో సంబంధం లేదు. ధనిక, పేద తేడా లేకుండా ఈ కాలసర్పదోష ప్రభావానికి గురి కావలసి ఉంటుంది. కాలసర్పదోషం ఉన్న సంపన్నులు అనుక్షణం ఏదో ఒక విషయములో ఉత్కంఠను , ఆందోళనలను అనుభవిస్తూ ఉంటారు. వారిని అనుక్షణం ఏదో ఒక అభద్రతా భావం వెంటాడుతూ ఉంటుంది. హైందవ జ్యోతిష్యశాస్త్రములో ఎన్నో దుష్ట యోగాలు ఉన్నప్పటికి వాటి అన్నింటిలోనూ అతి తీవ్రమైనది కాలసర్పదోషం. ఒక్కో రకమైన కాలసర్పదోషం మనిషికి ఒక్కో వయస్సు వరకు ప్రభావం ఉంటుంది. కొన్ని కాలసర్పదోషములు మాత్రం మనిషి మరణించేంత వరకు దాని ప్రభావం చూపుతుంది. కలసర్పదోషాలు 12 రకములు. అవి ఏమిటో తెలుసుకుందాము.
1.అనంత కాలసర్పయోగం:
ఎవరి జన్మకుండలిలో అయితే రాహువు లగ్నములో మరియు కేతువు సప్తమ భావములో ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి “అనంత కాలసర్ప దోషం” ఉన్నట్టు గుర్తించాలి. ఈ అనంత కాలసర్ప దోషం వలన బాధపడేవారు తరచుగా అవమానములు ఎదుర్కోవటం , ఆందోళనలకు గురి కావటం జరుగుతుంది. వీరిలో న్యూనత భావం ఎక్కువగా ఉంటుంది. ఇక కోర్టు సంబంధిత విషయాలకు వస్తే వీరు విసుగు కల్పించే , ఎంతో కాలముగా పూర్తి కానీ కేసులు ఉంటాయి. వీరి ఆరోగ్యము కూడా తరచూ బాధకరంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. వైవాహిక జీవితం సాఫీగా ఉండదు. ఈ అనంతకాలసర్ప దోషం ఉన్నవారు మానసికంగా మరియు శరీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
2.కులికా కాలసర్పయోగం:
ఎవరి జన్మకుండలిలో అయితే రాహువు ద్వీతీయ భావములో మరియు కేతువు అష్టమ భావములో ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి కులికా కాలసర్పదోషం ఉన్నట్టు గుర్తించాలి. ఈ రకమైన కాలసర్పదోషం ఉన్నవారు ధనాన్ని నష్టపోవటం , ప్రమాదాల వలన నష్టపోవటం జరుగుతుంది. వీరి కుటుంబములో తగాదాలు, నరాల బలహీనత, మూర్చలు లాంటి సమస్యలు వస్తాయి. కుటుంబ జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది. ఆర్థికపరమైన నష్టాలు ఎక్కువగా ఎదుర్కొంటారు.ఈ కాలసర్పదోషం అనుభవిస్తున్న వారు వారి మాటలను ఎంతో అదుపులో ఉంచుకోవాలి. వీరి మాటలు ఇతరులను సులభంగా బాధిస్తాయి కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. కుటుంబ సభ్యులలో మరియు సమాజములో వీరికి ఉన్న గౌరవము పోయే అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితం సాఫీగా ఉండదు. ఆర్థిక పరిస్తితి నిలదోక్కుకోవటం కోసం ఎంతో ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఈ కాలసర్పదోషం ఉన్నవారు సహజంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. గొంతుకు సంబంధించిన వ్యాధులు కలుగవచ్చు.
3.వాసుకి కాలసర్పయోగం:
ఎవరి జన్మకుండలిలో అయితే మూడవ స్థానములో రాహువు మరియు తొమ్మిదవ స్థానములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఇమిడి ఉన్నట్లైతే వారికి వాసుకి కాలసర్పదోషం ఉందని గుర్తించాలి. ఈ కాలసర్పదోషంతో భాడపడేవారు సోదరుల కారణంగా లేదా అక్కాచెల్లెళ్ల కారణంగా నష్టపోవటం జరుగుతుంది. వీరు బంధువుల వలన కలిగే చిక్కులవలన గాని, రక్త సంబంధమైన సమస్యల వలన గాని, ఆకస్మిక మృతి పొందే అవకాశం ఉంటుంది. ప్రొఫెషనల్ జీవితములో సమస్యలు ఎదుర్కొంటారు. వీరి అదృష్టము ఎక్కువగా ఉండదు. స్నేహితుల వలన లేదా బంధువుల వలన మోసపోతారు. వ్యాపారములో, వ్యాపార భాగస్వాములతో నష్టాలు ఎదురయ్యి సమస్యలు ఎదుర్కొంటారు. ఈ దోషం ఉన్న వారు సమస్యల వలన సతమతం అయ్యి ఆ ఆందోళనలో వీరు చేసే పనుల వలన ఇంకా సమస్యలలో చిక్కుకుంటారు. ఇతరులు వీరితో ఎంత సన్నిహితంగా ఉన్నా కూడా ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అందరూ వీరిని మోసగించాలనే చూస్తారు. రాహు లేదా కేతు మహా దశలో వీరు దూర ప్రయాణములు చేయుట మంచిది కాదు.
4.శంఖపాల కాలసర్పయోగం:
ఎవరి జన్మకుండలిలో అయితే రాహువు నాలుగవ భావములో మరియు కేతువు దశమ భావములో ఉంటూ వీరి మధ్య మిగిలిన ఏడు గ్రహాలు ఉండినట్లైతే వారికి శంఖపాల కాలసర్పదోషం ఉన్నదని గుర్తించాలి. ఈ దోషం ఉన్న వారికి వారి తండ్రి నుండి ప్రేమ లభించదు. వీరు అతి శ్రమలు చేస్తూ జీవిస్తూ ఉంటారు. తరచుగా వృత్తిపరమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. వీరి జన్మభూమికి దూరంగా ఇతర రాష్ట్రాలలో లేదా ఇతర దేశాలలో హీనమైన పరిస్థితులలో మరణించటం జరుగుతుంది. వీరికి దేనిమీద సరైన ధ్యాస (Concentration) ఉండదనే చెప్పాలి. ఉదాహరణకి తదేక ధ్యాస పెట్టె డ్రైవింగ్ లాంటి వాటిపై వీరికి పట్టు ఉండదు కాబట్టి వాటి జోలికి వెళ్లకపోవటమే మంచిది. ముఖ్యంగా వీరి తల్లితోనూ, కుటుంబ సభ్యులతోనూ సరైన బాంధవ్యము ఉండదు. కొందరికి వీరు నివశిస్తున్న ఇంటిలో వాస్తు దోషములు కూడా ఏర్పడవచ్చు. హుద్రోగములు, ఛాతీ, ఊపిరితిత్తులకు వ్యాధులు రావచ్చు. పై అధికారులతో పేచీలు ఉంటాయి. ప్రోమోషన్లు రాక ఇబ్బందుల పాలవుతారు. మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి.
5.పద్మ కాలసర్పయోగం:
ఎవరి జన్మకుండలిలో అయితే పంచమ భావములో రాహువు మరియు ఏకాదశ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారు పద్మ కాలసర్ప దోషము నుండి బాధపడుతున్నట్టు గుర్తించాలి. ఇలాంటి జాతకులు చదువులో వెనుకబడటం జరుగుతుంది.జీవిత భాగస్వామికి తరచూ అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. సంతాన భాగ్యమును పోందలేకపోవటం , స్నేహితుల వలన వంచింపబడటం జరుగుతుంది. చదువు పరంగా వెనుకబడి ఉంటారు. ప్రేమ వ్యవహారాలలో, వ్యాపారాలలో, మార్కెట్ పరంగా వీటన్నింటిలో వీరికి అదృష్టము ఉండదు. కొందరికి సంతాన పరంగా ఆలస్యము ఉంటుంది. ప్రేమ వ్యవహారములో మరియు వైవాహిక జీవితములో సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఉండదు.
6.మహా పద్మ కాలసర్పయోగం:
ఎవరి జన్మకుండలిలో అయితే 6వ స్థానములో రాహువు మరియు 12వ స్థానములో కేతువు ఉంది మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి మహాపద్మ కాలసర్పదోషం ఉన్నట్టు గుర్తించాలి. ఈ కాలసర్పదోషం ఉన్నవారికి వెన్నుముక ప్రారంభములో నెప్పులను, తలనొప్పులను, చర్మ వ్యాధులను కలిగి ఉంటారు. అంతేకాకుండా తరచుగా ఆస్తుల నష్టం జరుగుతుంది. వీరిపై తంత్ర ప్రయోగములు సులభముగా జరగగలవు. మామూలుగా ఇలాంటి జాతకులు విదేశాలలో ఉంటూ కుటుంబములో ఆశాంతి కలిగి ఉంటుంది. స్వయంకృత అపరాధల వలన వీరు మోసపోతారు. మానసిక రుగ్మత (డిప్రెషన్) , ఇతరుల పట్ల ద్వేషము, చేసే వృత్తి నుండి తేసివేయుట జరుగవచ్చు. కాలసర్పయోగం అంటే ఏమిటి? కాలసర్పయోగ నివృత్తి హోమం యొక్క వివరాలను ఈ లింకును క్లిక్ చేసి తెలుసుకోగలరు
7.తక్షక కాలసర్పయోగం :
ఎవరి జన్మకుండలిలో అయితే సప్తమ భావములో రాహువు మరియు లగ్నములో కేతువు ఉన్నట్లైతే వారికి తక్షక కాలసర్పదోషం ఉన్నట్టు గుర్తించాలి. ఈ దోషం ఉన్నవారు నీచంగా ప్రవర్తించే వారిచేత అనేక రకాల బాధలు పొందవలసి ఉంటుంది. వీరు వ్యాపారములో నష్టపోవటం, అసంతృప్తితో బాధపడటం, వైవాహిక సుఖమును పోందలేకపోవటం జరుగుతాయి. ప్రమాదములు జరుగుతాయి. ఈ దోషము ఉన్నవారు ముఖ్యంగా శారీరక లక్షణములు వ్యతిరేకంగా ఉంటాయి. సహజ పొడుగు, బరువు కాకుండా వ్యతిరేకంగా ఉంటారు. శారీరక లక్షనాలే కాకుండా మానసిక లక్షణాలు కూడా వీరికి సరిగా ఉండవు. ఇతరులతో పోలిస్తే ఈ దోషం ఉన్న వారికి బుద్ధి కుశలత ఉండకపోవడం గమించవలసిన విషయం. నరముల బలహీనత కలుగుతుంది. సమస్యలను తట్టుకోలేక ఈ దోషము ఉన్నవారిలో కొందరు ఉన్మాది స్వభావము వారి వలె ప్రవర్తిస్తారు. వివాహేతర సంబంధములు చిక్కులు కలుగచేస్తాయి.
8.కర్కోటక కాలసర్పయోగం:
ఎవరి జన్మకుండలిలో అయితే అష్టమ భావములో రాహువు మరియు ద్వీతీయ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఆ రాహు కేతు మధ్య ఉన్నట్లైతే వారికి కర్కోటక కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. ఈ దోషం ఉన్నవారు పూర్వీకుల ఆస్తులు అన్నీ కోల్పోతారు. శృంగారం ద్వారా వ్యాపించే వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్ రావచ్చు. విషపూరితమైన సర్పాల వలన గాని లేదా కీటకలా వలన గాని ప్రమాదములు పొందవచ్చు. కుటుంబములో అనేక సమస్యలు కలుగవచ్చు. హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. తీవ్రమైన ఆర్థిక నష్టము జరుగుతుంది. ఎటువంటి సహాయము పొందలేని వారు అవుతారు. యాక్సిడెంట్లు, ఆరోగ్య సమస్యలు దురయ్యే అవకాశములు ఉన్నాయి. వ్యక్తిగతంగా మరియు ప్రొఫెషన్ పరంగా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోగలరు.
9.శంఖచూడ కాలసర్పయోగం:
ఎవరి జన్మకుండలిలో అయితే నవమ భావములో రాహువు మరియు తృతీయ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి శంఖ చూడ కాలసర్పదోషం ఉన్నట్టు గుర్తించాలి. మతానికి వ్యతిరేకమైన కార్యకలాపములు జరుపుటకు సిద్ధపడతారు. హై బి.పి. , నిరంతర ఆలోచనలు ఉంటాయి. ఈ దోషం ఉన్న వారికి జీవితములో పైకి ఎదగడం ఎంత సులభమో , క్రిందకి జారిపోవటం కూడా అంతే సులభం. జీవితములో వీరికి ఏది సులభంగా దొరకదు. చేసే ప్రొఫెషన్ లో స్థిరత్వం కోల్పోతారు. ఈ దోషం ఉన్నవారికి, వీరి తండ్రికి భేదాభిప్రాయములు వస్తాయి. వీరికి పితృశాపము కూడా ఉన్నట్టు గుర్తించాలి. ఈ దోషంతో ఉన్నవారికి ఎవరిని నమ్మాలో తెలియక అన్నీ చోటల ఇతరుల చేతిలో మోసపోతూ ఉంటారు. వైవాహిక జీవితం విడాకుల వరకు వెళ్లవచ్చు. లీగల్ విషయాలలో ఎన్నో ఇబ్బందులు కలుగవచ్చు.
10.పాతక కాలసర్పయోగం:
ఎవరి జన్మకుండలిలో అయితే దశమ భావములో రాహువు మరియు చతుర్థ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి పాతక కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. ఈ దోషం ఉన్నవారు కుటిల స్వభావము కలిగి ఇతరులకు ద్రోహము చేయుటకు పాల్పడతారు. ఈ దోషం ఉన్నవారి ఇళ్ళల్లో దొంగతనాలు జరుగుతాయి. పైశాచిక పీడ ఎక్కువగా ఉంటుంది. లో బి.పి సమస్య ఉంటుంది. ఈ దోషం ఉన్న వ్యాపారస్తులు ఒకే వ్యాపారం చేయటం వలన ఎక్కువ నష్టాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఒంటరిగా అనిపించడం లాంటి మానసిక ఆందోళనలు కలిగి ఉంటారు.
11.విషధార్ కాలసర్పయోగం:
ఎవరి జన్మకుండలిలో అయితే ఏకాదశ భావములో రాహువు మరియు 5వ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నత్లితే వారికి విషధార్ కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. సోదరులతో విబేధాలు కలుగవచ్చు. చపల మనస్తత్వం కలిగి ఉంటారు. సంతాన పరమైన సమస్యలు ఎదుర్కొంటారు. కారాగార శిక్ష అనుభవించే సూచనలు రావచ్చు. నిద్రలేమి, కంటి సమస్యలు, హృదయ సమస్యలు రావచ్చు. పై చదువులు చదువుకోవాలంటే చాలా కష్టాలు పడవలసి ఉంటుంది. సంతానము ఆలస్యముగా కలుగవచ్చు. కొంత డబ్బు కోసం ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఒక్కోసారి చేయకూడని పనులు కూడా చేయవలసి ఉంటుంది. జ్ఞాపక శక్తి మందగిస్తుంది.
12.శేషనాగ కాలసర్పయోగం:
ఎవరి జన్మకుండలిలో అయితే ద్వాదశ భావములో రాహువు మరియు 6వ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి శేషనాగ కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. తరచూ ఓటమికి గురి అవుతూ ఉంటారు. దురదృష్టం వీరిని వెంటాడుతూ ఉంటుంది. రహస్య శత్రువులు బాధిస్తూ ఉంటారు. నేత్ర సంబంధమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
The Wisdom of the Turtle: Moving Forward with Patience and Purpose
There is something quietly profound about watching a turtle move. Its steps are slow, steady, and deliberate, yet never meaningless. The wor...
-
Nepal is currently witnessing a powerful youth-led movement that has deeply shaken the country’s political scene. This wave of protests, led...
-
There is something quietly profound about watching a turtle move. Its steps are slow, steady, and deliberate, yet never meaningless. The wor...
-
The Tanapalli Subramanya Swamy Temple, also known as Sree Balagnana Dhandayudhapaani Swamy Temple, has a relatively recent history. It is si...

