కాలసర్ప యోగం ఉన్న అందరికీ ఒకే రకమైన ప్రభావాలు కనబడవు. కొన్ని సార్లు జన్మకుండలిలోని బలమైన గ్రహాలు, స్థానాల వల్ల కూడా జాతకునికి కాలసర్పయోగ ప్రభావం అంత ఎక్కువగా కనిపించదు. కాబట్టి, అలాంటి జాతకులు కాలసర్పయోగం గురించి భయపడాల్సిన అవసరం లేదు. అయినప్పటికి ఒక అనుభవజ్ఞుడైన జ్యోతిష్యుని సలహా మేరకు ఆలస్యం చేయకుండా పరిహార కార్యక్రమాలు జరిపించుకోవాలి.
కాలసర్పయోగం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయా?
కాలసర్పయోగం ఉన్న ఎంతో మంది జాతకులు ధనం, పేరు, ప్రతిష్ట, అధికారం లాంటివి ఏర్పడి ఎంతో పై స్థాయికి చేరుకున్నారు. అయితే ఆ గొప్ప స్థాయికి చేరుకోవడానికి వారికి కూడా ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఏర్పడి ఉంటాయి. భగవత్ ధ్యానంతో, ఆత్మ స్థైర్యంతో కృషి చేస్తూ శిఖరాన్ని చేరుకోవాలి. అయితే కాలసర్పదోషానికి ప్రాయశ్చిత్త, పరిహారాలు జరిపించిన యెడల, వారి జీవితంలో అడ్డంకులు తొలగిపోయి విజయం చేకూరుతుంది.
కాలసర్పయోగం వల్ల ఎలాంటి కష్టాలు ఏర్పడతాయి?
కాలసర్పయోగం వల్ల ఎన్నో సమస్యలు, అనుకోని సంఘటనలు జాతకుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాలసర్పయోగం ఉన్న జాతకులకు ఆరోగ్య రీత్యా యోగ ప్రభావం పడుతుంది. శారీరకంగా వ్యాధుల బారీన పడి బాధలు అనుభవించాల్సి ఉంటుంది. మనఃశాంతి లేకపోవడం, జ్ఞాపకశక్తి మరియు పట్టుదల లేకపోవడం, అనవసరమైన ఒత్తిళ్ళకు లోనవడం, భాద్యతారాహిత్యంగా వ్యవహరించడం, జ్ఞానం లోపించడం, వ్యక్తిత్వ లోపాలు ఉండటం, ఆలోచనాశక్తి తక్కువగా ఉండటం జరుగుతాయి. దీనివల్ల జాతకుడు మానసిక స్థిరత్వం ఉండదు. దీనివల్ల వ్యక్తిగతంగా వారి సన్నిహితులతో సరైన బంధం కొనసాగించక బాధలు పడతారు. ఈ కాలసర్పయోగం వల్ల నిరంతరంగా శారీరక అనారోగ్యాలు లేదా వ్యాధులు ఏర్పడటమే కాకుండా, ఆ వ్యాధి తీవ్రత ఎక్కువ అవ్వటం జరుగుతుంది.
ఇక విద్యా, వృత్తి విషయాలకు వస్తే ఈ కాలసర్ప యోగం ఉన్న జాతకులు ఎప్పుడూ పరీక్షల్లో ఫెయిల్ అవుతూ ఉండటం, మంచి విద్యను నేర్చుకోలేకపోవటం, స్కూలుకు గాని, కాలేజీకి గాని, విశ్వవిద్యాలయానికి గాని ఒక కొత్త విద్య కొరకు చేరలేకపోవటం లాంటివి జరుగుతాయి. ఈ కాలసర్పయోగం జాతకులకు పై చదువులు చదవాలన్న శ్రద్ధ లేకుండా ఉండటానికి కూడా ఈ యోగం కారణం అవుతుంది. చదువులో, చేసే వృత్తిలో నిరంతర విఫలం పొందడం కూడా ఈ కాలసర్పయోగం వల్ల జరుగుతుంది. ఈ యోగం ఉన్న జాతకులకు ఉద్యోగాలలో ప్రమోషన్లు రావడానికి ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతాయి. ఒక్కోసారి ఉద్యోగం కూడా నష్టపోయే అవకాశాలు రాక మానవు.
ఈ కాలసర్ప యోగం ఉన్న వారు ప్రేమ వ్యవహారాలలో విఫలం అవ్వటం, ప్రాణ స్నేహితుని చేతిలో గాని, భాగస్వామి చేతిలో గాని, భార్య/భర్త చేతిలో గాని మోసపోవటం జరుగుతుంది. జీవిత భాగస్వామితో, ఆప్తులతో ఉన్న బంధం పై ఈ యోగ ప్రభావం పడుతుంది. వివాహం ఆలస్యంగా జరగడం, వైవాహిక జీవితం సాఫీగా ఉండకపోవడం, శృంగార జీవితంలో ఆనందం లేకపోవడం, వంధ్యత్వం (సంతాన లేమి), పదే పదే రక్తస్రావాలు జరగటం, పుత్ర యోగం లేకపోవటం, దంపతుల మధ్య అన్యోన్యత లేకపోవటం, విడాకులు జరగడం లాంటి దుర్ఘటనలు ఈ కాలసర్ప యోగం వల్ల సంభవిస్తాయి.
ఈ కాలసర్ప యోగం వల్ల ఆర్థికపరంగా అభివృద్ధి లేకపోవటం, ఆర్థిక స్థిరత్వం లేకపోవటం, జాతకుడిని పేదవాడు అయ్యేలా చేసే తీవ్రమైన అధిక ఋణాలు, వ్యాపారంలో అడ్డంకులు, వంశపారపర్యంగా వచ్చే ఆస్తులలో ఆటంకాలు వస్తాయి.
ఈ కాలసర్పయోగం వల్ల ప్రభావితులైన వారు, తమ జీవితంలో చిన్నతనం నుండి వృద్ధాప్యం వరకు ఆరోగ్య పరంగా, విద్య పరంగా, వృత్తి పరంగా, వివాహ పరంగా, అప్పుల ఆర్థికంగా, సామాజికంగా, రోజు వారి కార్యక్రమాల పరంగా, వారి లక్ష్యాలను చేరుకునేందుకు ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఏర్పడతాయి.
వామతంత్రం ప్రకారం, జన్మకుండలిలో కాలసర్పయోగం ఉన్న జాతకులు తమ బాధల నుండి, సమస్యల నుండి విముక్తి పొందాలంటే, “కాలసర్పయోగా నివృత్తి హోమం” తప్పక జరిపించాలి. ఈ పరిహారం జరిపించడం వల్ల జాతకులకు ఉన్న దురదృష్టం దూరమయ్యి, శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ హోమం జరిపించడం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. అందువల్ల జాతకులకు శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానం లేని దంపతులు ఈ కాలసర్పయోగ నివృత్తి హోమం చేసుకోవడం వల్ల శీఘ్రంగా సంతానం కలుగుతుంది.వ్యాపారంలో నష్టాలు చూసే వారు, వృత్తిపరంగా అపజయం పాలయ్యే వారు, దుష్ట శక్తులు, దుష్టుల నుండి దూరం కావాలనుకునేవారు ఈ కాలసర్ప శాంతి హోమం ఎంతో శుభాన్ని చేకూరుస్తుంది.
No comments:
Post a Comment