Wednesday, April 7, 2021

నరకం లోని శిక్షలు

ఈ లోకంలో మనుష్యులు తమ క్షణిక సుఖాల కోసం అనేక దుష్కర్మలను చేస్తారు. ఈ దుష్కర్మల ఫలితంగా మనిషికి మృత్యువు తరువాత భోగదేహం ప్రాప్తిస్తుందని మన పురాణాలు ఉద్భోదిస్తున్నాయి . ఈ భోగదేహం రెండు రకాలు..

ఒకటి సూక్ష్మ శరీరం. ఇది మనిషి ఆచరించన సత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను అనుభవించడానికి స్వర్గాది ఊర్థ్వ లోకాలకు చేరుతుంది.

రెండవది యాతన దేహము. ఇది మానవుడు చేసిన పాప ఫలాలను నానా విధాలుగా అనుభవించడానికి నరకాది లోకాలకు చేరుతుంది. మృత్యువు తర్వాత వెంటనే కొత్త హేహం ధరించటం వీలుకాదు. కొత్త దేహ ప్రాప్తికి ముందు జీవు మనోమయ ప్రాణమయ హేహంచేత, సుకృత, దుష్కృత, సుఖ దుఃఖాల ఫలితాలను అనుభవిచవలసి వస్తుంది..

చాగంటి వారి అద్భుత ప్రవచనం

శ్రీ మద్భాగావతంలో యాతనాదేహం అనుభవించే వివిధ శిక్షలు వాటిని అమలు చేసే 28 నరకాల వర్ణన వున్నది.

వాటి సంక్షిప్త వివరణ ఇది.

1. తామిస్ర నరకం

పరుల యోక్క ధనాన్ని అపహరించ్చిన , పరస్త్రీలతో వ్యభిచరించినా ఈ శిక్ష ను పొందుతారు, ఇక్కడ అంధకారమైన(చీకటి) బంధురమున(గదిలొ) పడవేసి కాల్చిన ఇనుప కఱ్ఱలచే బాదుదురు.

2. అంధతామిస్ర నరకం

స్త్రీలను మోసగించి ధనమును తీసుకున్న వారు, తన కంటే పెద్దవారిని గౌరవించని వారు ఈ శిక్షను పొందుతారు ఇక్కడ చిమ్మ చీకటి గదిలో పాముల మద్య నరికిన చెట్ల వలె పడవేయుదురు.

3. రౌరవము

మూగ జీవులను మన కంటే అల్పమైన ఇతర ప్రాణులను చంపిన వారికి ఈ శిక్ష అమలు చేయుదురు ఇక్కడ రురువులు (పాముల కన్న ఘోరమైనవి అతి భయంకరమైనవి)చే హింసించును.

4. మహారౌరవం

మూగ జీవులను మన కంటే అల్పమైన ఇతర ప్రాణులను చంపి తన శరీరాన్ని పోషించుకునేవారు , మూగ జీవులను భందించే వారును ఈ నరకంలోకి వస్తారు ఇక్కడ పచ్చి మాంసము తిను రురువులచే హింసించును.

5. కుంభీపాకము

సజీవంగా వున్న పశుపక్ష్యాదులను చంపి వాటి మాంసాన్ని తిన్నవాడు ఇక్కడు కు చేరుతాడు ఇక్కడ సలసల కాగే నూనెలో పడవేయుదురు.

6. కాలసూత్ర నరకం

తల్లిదండ్రులను, సద్భ్రాహ్మణులను, వేదానికి ద్రోహం తలపెట్టిన వారు ఈ నరకాన్ని చూస్తారు ఇక్కడ రాగి నేల కలిగి, నెత్తిన నిప్పులు చెరుగు సూర్యుడు మాడ్చి వేయచుండును.

7. అసిపత్ర వనము

తల్లిదండ్రులను , వేదములను, గురువులను, ధిక్కరించిన వారు ఇక్కడికి వస్తారు ఇక్కడ కొరడాలతో గొడ్డును బాదినట్లు బాదుచూ, సర్వాంగములను కత్తులతో కోసి ఈ శిక్షలను అమలుచేయును..

8. సూకర ముఖము

దండించ దగని వారిని దండిచిన రాజులకు మరియూ న్యాయమూర్తులనూ చెరకు గడలవలే గానుగలలో పెట్టి తిప్పుదురు.

ఓం నమో భగవతే వాసుదేవాయ నమ జపం

9. అంధకూపము

నల్లులు మున్నగు వాటిని చంపిన వారిని పాములు,నల్లులు,దోమలు,చీమలు చే హింసించును.

10. క్రిమి భోజనము

అతిధులకు అభ్యాగతులకు సరియైన అన్నం పెట్టక తన పొట్ట నింపుకొను వాడు క్రిములతో నిండిన సలసలగాకు లక్షయోజనముల కుండలో పడవేయబడును.

11. సంధశన 

బ్రాహ్మణుల ధనము,ఇతరుల బంగారము,రత్నములు దోచుకున్న వారిని మండుతున్న కడ్డీలతో పొడుచుట మరియూ పటకారతో చర్మము పీకుట వంటి శిక్షలు వేయును.

12. తప్తసూర్మి

సంభోగించరాని పర స్ర్తీలతో సంభోగించిన మగవారు, అట్టి మగవారితో సంభోగించిన ఆడవారు ఈ శిక్షను అనుబవించును ఇందులో మండుతున్న ఇనుప చువ్వలతో శిక్షించును మరియూ మర్మాంగములను ఇనుప రంపముతో కోయును.

13. వజ్రకంటక శాల్మిలి

పశువులతో సంభోగించిన వాడు ముళ్ళున్న బూరుగు చెట్టు మీదికి ఎక్కించి కిందకు లాగి వేయును..

14. వైతరణి

కులమర్యాద పాటించని పురుషులు, రాజు లేక రాజోద్యోగి చీము, నెత్తురు, తలవెంట్రుకలు, గోళ్ళచే నిండి ఉండు నదిలో త్రోయ బడును.

15. పూయదన

శౌచము, ఆచారము పాటించని బ్రాహ్మణులను మలమూత్రాదులచే నిండిన చెరువున పడవేయుదురు.

16. ప్రాణరోధ

కుక్కలను, గాడిదలను, పెంచి వేటనే వృత్తిగా పెట్టుకున్న వారిని ఆంపకోలలచే వేటాడుదురు.

17. వైశాన

దంభ యజ్ఞములు చేసి పశువులను హింసించిన వారు ప్రాణాంతకమైన రకరకాల యాతనలను అనుభవింతురు

18. లాలాభీక్ష

భార్యలను భయపెట్టి హింసించికుల సుఖించే వారిచే మూత్ర పీనము చేయింతురు.

19. సారమేయోదనము

ఇండ్లు తగుల పెట్టుట, విషము పెట్టుట అట్టి వారిని మరియూ దొంగ జీవితము అనుబవించు వారిని వజ్రములవలే కరకుగా వున్న కోరలు గల ఏడువందల జాగిలములు పీక్కొని తినును.

20. అవిచి మంత

అబద్ద సాక్ష్యాలను చెప్పిన వారు,లావాదేవీల లో బొంకిన వారు వంద యోజనముల ఎత్తయిన పర్వత శిఖరముల నుండి పడద్రోసి పచ్చడి చేయబడును.

21. అయఃపానము

వ్రతనిష్టతో వుండి మద్యపానము చేసిన వారు, సోమపానము చేసిన వారు కరిగిన ఇనుమును త్రాగింతురు.

22. క్షారకర్దమ

తన కన్న అధికులను, పెద్దవారిని తిరస్కరించువారు తలక్రిందులగా పడద్రోసి నానా బాధలు పెట్టుదురు.

23. రక్షో గణబోధన

నరమేధములు చేయువారిని, పశువుల మాంసము తిను వారిని ముక్కలు ముక్కలుగా కొయును.

24. శూల ప్రోతము

జంతువులను, మూగజీవులను పొడిచి చంపినవారిని శూలములచే పొడువబడి,ఉరి కంబములను ఎక్కింపబడును.

25. దండసూకర

ఆడవారిని , పిల్లలకు భయము కలిగించు వారిని అయిదు తలలపాములు ఏడు తలల పాములచే క్రూరముగా హింసించెదరు.

26. అవధినిరోధన

తల్లితండ్రులను, భార్యాపిల్లలను బంధించిన వారిని విషాగ్నులు మండించి విషపు పొగలు పేట్టి ఉక్కిరి బిక్కిరి చేయును.

27. పర్యావర్తన

అతిధులను, అభ్యాగతులను గద్దించిన వారిని కనుగ్రుడ్లను కాకులచే గ్రద్దలచే పొడిపింతురు.

28. సూచిముఖి

ధన మదాంధముతో అందరిని చిన్న చూపు చూచిన వాని శరీరమును సూదులతో బొంతను వలే కుట్టుదురు.

No comments:

పూజారి -- కానుకలు..

పూజారి -- కానుకలు .. మీరు కానుకలు హుండీలోనే వేయండి . పూజారి ప్లేటులో వేయవద్దు ,హుండీలో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడికి చేరుతుంది...