Wednesday, April 7, 2021

అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం..!

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం ఇది.  

నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.

పురాణగాథ

బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.

ఏం చేయాలి..?

ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.

ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు... హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.

చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.  

బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో  ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.  

బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము.

ఉమ్మెత్త పువ్వులతో శివుని పూజ ఎందుకు? ఏడు జన్మల పాపం తొలగిపోవాలంటే?

ఉమ్మెత్త పువ్వులంటే శివునికి ఎంతో ఇష్టం. ఒకే ఒక ఉమ్మెత్త పువ్వును శివుని వద్ద వుంచి వేడుకుంటే.. భక్తులకు మోక్షం సిద్ధిస్తుంది. కేరళలోని శివుని ఆలయాల్లో ఉమ్మెత్త పువ్వులతో అభిషేకం ప్రత్యేకంగా జరుగుతుంది. మాంగల్య భాగ్యం లభించాలంటే శివుడిని ఉమ్మెత్త పువ్వులతో అర్చించాలి.

ఇంకా ఉమ్మెత్త పువ్వులతో తయారు చేసిన మాలను శివుడికి అర్చించడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. వినాయకుడికి కూడా ఉమ్మెత్త పువ్వులంటే భలే ఇష్టం. అలాగే దుర్గాదేవిని ఉమ్మెత్తపూలతో పూజిస్తే.. దారిద్ర్యం తొలగిపోతుంది. నవరాత్రి రోజుల్లో ఏడో రోజు సరస్వతీ దేవీ అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు.

ఆ రోజున సరస్వతీ దేవి విగ్రహం ముందు ఉమ్మెత్త పువ్వులతో రంగోలి వేసి పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి.

అలాగే ప్రదోష కాలంలో శివుడిని అర్చిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. సర్పదోషంతో పాటు ఇతర దోషాలు తొలగాలంటే ప్రదోష సమయంలో శివుడిని అర్చించాలి. మాసానికి రెండుసార్లు ప్రదోషం వస్తుంది. అంటే అమావాస్యకు, పౌర్ణమికి ఒక్క రోజు ముందు ప్రదోషం వస్తుంది. ఈ సమయంలో శివుడిని దేవతలు స్తుతిస్తారని విశ్వాసం. అలాంటి సమయంలో శివునిని దర్శించుకుంటే.. శివుని అనుగ్రహంతో పాటు సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుంది. ప్రదోషం రోజున సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలో నందీశ్వరుడిని పూజించాలి. ఈ రోజున వ్రతమాచరించి.. సాయంత్రం ఆరు గంటలకు తర్వాత భోజనం తీసుకునే వారికి, ఆధ్యాత్మిక పరంగానే కాకుండా.. ఆరోగ్య పరంగానూ ఎంతో మేలు చేకూరుతుంది. శివుడు అభిషేక ప్రియుడు.

అందుకే ఆ రోజున ఆయనకు పాలాభిషేకం చేయిస్తే.. మంచి ఫలితం లభిస్తుంది. బిల్వ పత్రాలు, కొబ్బరిబోండాం నీటితో అభిషేకం చేయిస్తే.. ఈతిబాధలు తొలగిపోతాయి. ఇదే రోజున ఉమ్మెత్త పువ్వులతో శివునికి అర్చన చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. ఏడేడు జన్మల పాటు చేసిన పాపాలు తొలగిపోతాయి. బ్రహ్మహత్యా దోషం తొలగిపోతుంది. శనివారం పూట వచ్చే ప్రదోషాల్లో ఈశ్వరుడిని స్తుతిస్తే.. ఈతిబాధలు, అష్టకష్టాలు తొలగిపోతాయి. శనిదోషాలు కూడా తొలగిపోతాయి.

అలాగే శివునికి మామిడి పండ్ల రసంతో స్వామికి అభిషేకం చేయడం వలన ధనధాన్యాలు చేకూరుతాయి. జీవితంలో ధనధాన్యాలకి లోటు వుండదు. ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోవాలంటే.. మామిడి పండ్ల రసంతో శివుడికి అభిషేకం చేయాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.

రాహు, కేతు పూజకై శ్రీకాళహస్తి లోని గుడికి రాహు కేతువుల గ్రహణ సమయం కాలంలో పూజలు జరుగుటకు గల ఆంతర్యం

ఈ దేవాలయంలో పరమేశ్వరుడు తూర్పు దిశ యందు కూర్చుండి  పశ్చిమము చూచుట  మనము గమనించ దగ్గ విశేషం.   అలాగే పడమర లో అమ్మవారు కూర్చుండి   తూర్పు లో ఉన్న ఈశ్వరుని చూచుట గమనించగలము.  (ఆది అంతము)( ప్రకృతి పురుషుడు) ఒకరి కొకరు ఎదురెదురుగా ఉండటము .  ఈ విషయమును మరొక విధముగా చెప్పదలచుకుంటే రాశి చక్రమూలో  రాహువు కేతువు లు  ఒకరికొకరు ఎదురెదురుగా ఉంటారు.  ఈ దేవాలయములో  పరమేశ్వరుని శిరముపై పంచ తలలు కేతు గాను . అమ్మవారు ఏక సిర రాహు గాను  పరిగణించ వలెను.   ఈ దేవాలయంలో రాహుకాలంలో రాహు కేతువుల పూజ ప్రశస్తము అయితే ప్రతి రోజు రాహుకాలము వచ్చును. కానీ  ఆ సమయంలో స్వామివారిని దర్శించుకున్న స్వామి వారి తల పై పంచ నాగులు కేతువు దర్శనము  కనపడును.  అయితే రాహు గా అమ్మవారిని పరిగణించినపుడు  సోమవారము నాడు శుక్రవారం మాత్రమే   అమ్మవారికి నడుమునకు అలంకరించ్చే   వడ్రాణం రూపంలో రాహు కనబడును.

అమ్మవారికి శుక్రవారం రోజున వజ్రాల కిరీటం నడుమునకు   ఒక తల  నాగుపాము వడ్రాణం గాను  బంగారము తో తయారు చేసిన చీర తో  అలంకరింపబడును.  కనుక శ్రీకాళహస్తి లో సోమవారం శుక్రవారం రాహుకాల సమయంలో మాత్రమే .  ఈ విషయమును  గమనించి రాహు కేతువుల దోషనిమిత్తము సోమవారం శుక్రవారం రాహుకాలంలో ప్రశస్తమని గమనించగలరు.

YamaDharma raja History

  



 యమధర్మరాజు దక్షిణ దిక్పాలకుడు. చిత్ర గుప్తుడు ఈయన దగ్గర చిట్టాలు వ్రాసే సేవకుడు. సకల జీవరాశుల పాపపుణ్యాల బేరీజు వేసి శిక్షించడమే యముడి పని.


        దక్షప్రజాపతి కుమార్తె సంజ్ఞాదేవి సూర్యభగవానుణ్ని పెళ్లాడింది. ఆమెకు వైవస్వతుడు, యముడు అని ఇద్దరు కొడుకులు, యమి అనే కూతురు కలిగారు.


        ఛాయాదేవి వారి సవతి తల్లి. ఆమెకు సావర్ణి, శని అనే ఇద్దరు కొడుకులు కలిగారు. అంతవరకు తన సవతి బిడ్డలను సొంత బిడ్డలలాగా చూసుకుంటున్న ఛాయాదేవి, తనకు పిల్లలు కలుగగానే, భేద బుద్ధితో చూడటం ఆరంభించింది. 


        ఆమె పక్షపాత వైఖరిని సహించలేక, ధర్మం అంటే ప్రాణమైనా ఇచ్చే యముడు, ఒకనాడు తన సవితి తల్లిని కాలితో తన్నాడు. అందుకు ఆమె కోపంతో 


        “నన్ను తన్నిన నీ కాళ్లకు కుష్ఠురోగం ప్రాప్తించుగాక!” అని శపించింది.


        సంజ్ఞాదేవి కూతురైన యమికి పెళ్లీడు వచ్చింది. ఆమె అతిలోక సౌందర్యవతి. ఆమె తండ్రివెంట సూర్య రథంలో తిరుగుతూ తనతో తులతూగే అందగాడి కోసం ముల్లోకాలను గాలించింది. యుముడు ఒకనాడు 


        “చెల్లీ! నీకు తగిన అందగాడు దొరికాడా, లేదా? దొరికితే వాడు ఎవరో, ఎక్కడున్నాడో చెప్పు” అని అడిగాడు. 


        అందుకు యమి “అన్నా! నీకంటే అందగాడు నాకు ఎక్కడా కనిపించలేదు, అందుచేత నిన్నే పెళ్లి చేసుకోవాలని కోరికగా ఉంది” అన్నది.


        చెల్లెలు తనతో పరిహాసమాడుతున్నదని యముడు సిగ్గుపడ్డాడు. కానీ ఆమె తన పాదాలమీదపడి, ప్రాధేయ పడేసరికి నిర్ఘాంత పోయాడు. అతనికి కోపం వచ్చింది.


        “తెలివి తక్కువ దానా! తోడబుట్టిన వాడినే కామిస్తావా? రాక్షసికి కూడా ఇలాంటి కోరిక కలగదే! నీకు పెళ్లీలేదు, పెటాకులూ లేదు. భూలోకంలో నదిగా పుట్టి నీలాంటి పాపాత్ముల పాపాలు కడుగుతూ ఉండు” అని ఆమెను శపించాడు.


        అందుకు యమి ఏడుస్తూ కోపంతో....


         “నచ్చిన వాడికి పెళ్లాం కాలేకపోతే నదిగా, ఉండటమే మేలు నేను నీ చెల్లెలినే! శాపం ఇయ్యటంలో నీకంటే తక్కువ తిన్నాననుకున్నావా? నువ్వు కాలం తీరకుండానే చస్తావు పో!”  అని ప్రతి శాపం ఇచ్చింది. 


        యముడి శాపకారణంగా, ఆమె హిమాలయాలలో యమునా నదిగా పుట్టి రోదనా స్వరంతో పర్వతాల నుంచి కింది దూకి మైదానంలో ప్రవహిస్తుండగా గంగానది ఆమెను ఓదార్చి, తనలో కలుపుకొని పవిత్రురాలిని చేసింది.


        తన రక్తం పంచుకొని పుట్టిన చెల్లిలికే పాప చింత కలిగించిన తన అందం పట్ల యముడికి ఏహ్యా భావం కలిగింది. అతను శివుడి కోసం తపస్సు చెయ్యగా పార్వతీ పరమేశ్వరులు, ప్రత్యక్షమయ్యారు.


        భక్తితో స్తోత్రం చేసాడు యముడు. ప్రసన్నుడైన శివుడు


        “యమా ! ఏం కావాలో కోరుకో” అన్నాడు. 


        “పరమేశ్వరా! ఆకర్షణకు మూలమైన ఈ అందం నాకు వద్దు. స్త్రీలు, పురుషులూ నన్ను చూడగానే దడుసుకునేలా భయంకర రూపాన్ని ప్రసాదించు. ఇంకేమీ వద్దు!” అని కోరుకున్నాడు యముడు.


        “తథాస్తు !” అన్నాడు పరమేశ్వరుడు.


        తదుపరి, బ్రహ్మ దేవుడు జీవుల పాప పుణ్యాలను విచారించి తగిన  శిక్షలు విధించటానికి, దక్షిణ దిక్కున నరకం అనే పేరుతో ఒక న్యాయ పీఠాన్ని విశ్వకర్మచేత నిర్మింపజేశాడు. ధర్మబుద్ధి సమదృష్టీ కలవాడు, దయా దాక్షిణ్యాలు లేనివాడు, ప్రలోభాలకు లొంగనివాడు ఎవడో వాడే దక్షిణ దిక్కుకు, నరకానికీ, అందులోని న్యాయపీఠానికీ అధిపతిగా ఉండటానికి అర్హుడు అనుకున్నాడు.


        దానికి ఎవరు అర్హుడో తేల్చటానికి త్రిమూర్తులు ముగ్గురూ సమావేశమై, దేవతలతో చర్చించి చివరకి యముడు ఒక్కడే ఆ స్థానానికి తగినవాడు అని తేల్చారు. 


        అప్పటినుండి యుముడు దక్షిణ దిక్కుకు పాలకుడై శ్యామలాదేవిని పెళ్లాడి, నరకలోకంలోని సమ్యమనీ నగరంలో నివసిస్తూ, దండపాశాలు ధరించి, మహిష వాహనారూఢుడై తిరుగుతూ, పాప పుణ్యాలను విచారించి తీర్పులు చెప్పటం లో తనకు తానే సాటి అనిపించుకున్నాడు.

Tuesday, April 6, 2021

కొన్ని జాతీయములు :

కక్కుర్తి వెధవ :

అన్నింటిని ఆశించేవాడు. అలాంటి వారిని గురించి ఈ మాటను వాడతారు. ఆబగా అన్నం తినే వారిని ఉద్దేశించి కూడా ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.


కచ్చా పచ్చాగ :

ముక్కలు ముక్కలుగా ఉదా: ఈ చింత కాయలను కచ్చా పచ్చాగా దంచి తీసుక రా...


కచ్చాగోలీలాట :

పనికిరాని పని, వృధాశ్రమ, ప్రయోజనం లేని పనులు.పచ్చిమట్టితో గోలీలాట ఆడితే ఆ మట్టి ఉండలు విచ్చిపోతాయే తప్ప ఆట సాగదు.


కటకటాలు లెక్కపెట్టడము :

దీనికి జైలు కెళ్ళాడని అర్థము. జైలులో కటకటాలు తప్ప ఇంకేమి కనిపించవు. వాటిని లెక్కబెట్టడము తప్ప వేరే పని వుండదని దీనర్థం. జైలు కెళ్ళిన వాళ్ళగురించి వాడినదీ ఈ జాతీయము.


కట్టు తప్పు :

నీతిని తప్పు. ప్రతి ఊరికి కొన్ని కట్టు బాట్లుంటాయి. అక్కడ నివసించే వారు ఆ వూరి కట్టు బాట్లకు అనుకూలంగా నడుచుకోవలసి వుంటుండి. అలా కాకుండా.... ఆ కట్టు బాట్లకు విరుద్ధంగా ప్రవర్తించెతే వారిని కట్టు తప్పాడు అని అంటారు. దానికి తగు పరిహారము చేయ వలసి వుంటుంది.


కట్టుబానిస :

బాసనం అంటే వంట. గెలిచిన తండావారు ఓడిన తండా వారి చేత వంట చేయించుకొని తింటూ ఉండేవారు.బానిస అంటే అణిగిమణిగి చాకిరీ చేసే వ్యక్తి


కట్టెకట్టోలె కావటం :

బాగా బలహీనంగా ఉండటం


కట్టె, కొట్టె, తెచ్చె :

క్లుప్తత.రాముడు వారధి కట్టి, రావణుడిని కొట్టి, సీతమ్మను తెచ్చాడు అని . రామాయణ మహా కావ్యాన్ని మూడు ముక్కల్లో చెప్పినట్లే..... ఏదైన ఒక పెద్ద విషయాన్ని చాల క్లుప్తంగా చెపితే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు...


కట్టె విరుపు మాటలు :

ఫెళఫెళమని కటువుగా ఉండే మాటలు.


కట్టు బట్టలతో వచ్చాడు :

ఏమి లేకుండా వచ్చాడు అని అర్థం. చేతిలో చిల్లి గవ్వ లేకుండా వచ్చిన వారినుద్దేశించి ఈ జాతీయాన్ని ఉపయొగిస్తారు.


కట్ట కట్టుకొని వచ్చారేందిరా :

అందరు ఒక్కసారె రావడం. ఏదైనా ఒక చిన్న విషయాన్ని చర్చించడానికి చాల మంది వస్తే ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.


కట్టకు పుట్టచేటు :

స్థిరంగా ఉండాల్సిపని పాడుచేశాడని అర్థం అంతా ఒక్కసారి వస్తే ఇలా అంటారు.


కటిక దారిద్ర్యం అనుభవిస్తున్నారు .

తీరని కష్టాలు అనుభవిస్తున్నారు.


కట్టు తప్పాడు :

పద్ధతిని అతిక్రమించాడని అర్థం. ఉదా: వారు కట్టు తప్పారు. ఇక్కడ కట్టు అనగా వూరికొరకు ఏర్పాటు చేసుకొన్న పద్ధతి అని అర్థము.


కట్టు బానిస :

జీతభత్యాలు లేకుండా వెట్టిచాకిరీ చేసే సందర్భంలో ఈ జాతీయం వాడతాం.


కత్తిమీద సాము :

అతి కష్టంతో కూడిన పనిని ధైర్యంతో చేసేటపుడు ఈ జాతీయం ఉపయోగిస్తాం.


కత్తుల బోను :

కట్టె విరుపు మాటలు సవరించు

తెగేసి నట్లు మాట్లాడడం.. ఉదా: వానివి కట్టె విరుపు మాటలు.


కడతేర్చాడు:

కడవల కొద్దీ సవరించు

అధికంగా. చంపేశాడని అర్థం.


కడిగిన ముత్యంలా వున్నాడు

చాల స్వచ్ఛంగా ఉన్నాడు. ఉదా: ఈ వ్యవహారంలో వాడు కడిగిన ముత్యంలా ఉన్నాడు. ఏ మరకా అంట లేదు. స్వశ్చతకు ముత్యాన్ని పోలుస్తుంటారు మాటల్లో. అనగా చాల స్వచ్ఛంగా వున్నదని అర్థం. అలా పుట్టినదే ఈ జాతీయము.

కడిగిన ముత్యంలాగ వున్నాడు

అతి పవిత్రంగా వున్నాడని అర్థం. చాల శుభ్రంగా వున్నాడని కూడా అర్థం. ముత్యం శ్వచ్చతకు చిహ్నం.


కాలసర్పయోగం అంటే ఏమిటి? కాలసర్పయోగం నివృత్తి హోమం

జన్మకుండలిలో రాహువు మరియు కేతువు ఉన్న రాశుల మధ్యలో మిగిలిన ఏడు గ్రహములు, అనగా రవి,చంద్ర, శని, కుజ, శుక్ర, బుధ, గురు గ్రహములు ఇమిడి ఉన్నట్లైతే ఈ కాలసర్ప యోగం ప్రాప్తిస్తుంది. ఎవరి జాతకంలో అయితే ఈ కాలసర్ప యోగం ఉంటుందో, ఆ జాతకులు తమ జీవితంలో ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు చూడాల్సి ఉంటుంది. తమ తమ రంగాలలో గొప్ప స్థాయికి చేరుకోడానికి, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి ఈ కాలసర్ప యోగం ఉన్న జాతకులకు తీవ్రమైన ఆటంకాలు ఎదురవుతాయి. ఎంత కష్టపడినా సరే, ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు.

కాలసర్ప యోగం ఉన్న అందరికీ ఒకే రకమైన ప్రభావాలు కనబడవు. కొన్ని సార్లు జన్మకుండలిలోని బలమైన గ్రహాలు, స్థానాల వల్ల కూడా జాతకునికి కాలసర్పయోగ ప్రభావం అంత ఎక్కువగా కనిపించదు. కాబట్టి, అలాంటి జాతకులు కాలసర్పయోగం గురించి భయపడాల్సిన అవసరం లేదు. అయినప్పటికి ఒక అనుభవజ్ఞుడైన జ్యోతిష్యుని సలహా మేరకు ఆలస్యం చేయకుండా పరిహార కార్యక్రమాలు జరిపించుకోవాలి.

కాలసర్పయోగం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయా?

 కాలసర్పయోగం ఉన్న ఎంతో మంది జాతకులు ధనం, పేరు, ప్రతిష్ట, అధికారం లాంటివి ఏర్పడి ఎంతో పై స్థాయికి చేరుకున్నారు. అయితే ఆ గొప్ప స్థాయికి చేరుకోవడానికి వారికి కూడా ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఏర్పడి ఉంటాయి. భగవత్ ధ్యానంతో, ఆత్మ స్థైర్యంతో కృషి చేస్తూ శిఖరాన్ని చేరుకోవాలి. అయితే కాలసర్పదోషానికి ప్రాయశ్చిత్త, పరిహారాలు జరిపించిన యెడల, వారి జీవితంలో అడ్డంకులు తొలగిపోయి విజయం చేకూరుతుంది.

కాలసర్పయోగం వల్ల ఎలాంటి కష్టాలు ఏర్పడతాయి?

కాలసర్పయోగం వల్ల ఎన్నో సమస్యలు, అనుకోని సంఘటనలు జాతకుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాలసర్పయోగం ఉన్న జాతకులకు ఆరోగ్య రీత్యా యోగ ప్రభావం పడుతుంది. శారీరకంగా వ్యాధుల బారీన పడి బాధలు అనుభవించాల్సి ఉంటుంది. మనఃశాంతి లేకపోవడం, జ్ఞాపకశక్తి మరియు పట్టుదల లేకపోవడం, అనవసరమైన ఒత్తిళ్ళకు లోనవడం, భాద్యతారాహిత్యంగా వ్యవహరించడం, జ్ఞానం లోపించడం, వ్యక్తిత్వ లోపాలు ఉండటం, ఆలోచనాశక్తి తక్కువగా ఉండటం జరుగుతాయి. దీనివల్ల జాతకుడు మానసిక స్థిరత్వం ఉండదు. దీనివల్ల వ్యక్తిగతంగా వారి సన్నిహితులతో సరైన బంధం కొనసాగించక బాధలు పడతారు. ఈ కాలసర్పయోగం వల్ల నిరంతరంగా శారీరక అనారోగ్యాలు లేదా వ్యాధులు ఏర్పడటమే కాకుండా, ఆ వ్యాధి తీవ్రత ఎక్కువ అవ్వటం జరుగుతుంది.

ఇక విద్యా, వృత్తి విషయాలకు వస్తే ఈ కాలసర్ప యోగం ఉన్న జాతకులు ఎప్పుడూ పరీక్షల్లో ఫెయిల్ అవుతూ ఉండటం, మంచి విద్యను నేర్చుకోలేకపోవటం, స్కూలుకు గాని, కాలేజీకి గాని, విశ్వవిద్యాలయానికి గాని ఒక కొత్త విద్య కొరకు చేరలేకపోవటం లాంటివి జరుగుతాయి. ఈ కాలసర్పయోగం జాతకులకు పై చదువులు చదవాలన్న శ్రద్ధ లేకుండా ఉండటానికి కూడా ఈ యోగం కారణం అవుతుంది. చదువులో, చేసే వృత్తిలో నిరంతర విఫలం పొందడం కూడా ఈ కాలసర్పయోగం వల్ల జరుగుతుంది. ఈ యోగం ఉన్న జాతకులకు ఉద్యోగాలలో ప్రమోషన్లు రావడానికి ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతాయి. ఒక్కోసారి ఉద్యోగం కూడా నష్టపోయే అవకాశాలు రాక మానవు.

ఈ కాలసర్ప యోగం ఉన్న వారు ప్రేమ వ్యవహారాలలో విఫలం అవ్వటం, ప్రాణ స్నేహితుని చేతిలో గాని, భాగస్వామి చేతిలో గాని, భార్య/భర్త చేతిలో గాని మోసపోవటం జరుగుతుంది. జీవిత భాగస్వామితో, ఆప్తులతో ఉన్న బంధం పై ఈ యోగ ప్రభావం పడుతుంది. వివాహం ఆలస్యంగా జరగడం, వైవాహిక జీవితం సాఫీగా ఉండకపోవడం, శృంగార జీవితంలో ఆనందం లేకపోవడం, వంధ్యత్వం (సంతాన లేమి), పదే పదే రక్తస్రావాలు జరగటం, పుత్ర యోగం లేకపోవటం, దంపతుల మధ్య అన్యోన్యత లేకపోవటం, విడాకులు జరగడం లాంటి దుర్ఘటనలు ఈ కాలసర్ప యోగం వల్ల సంభవిస్తాయి.

ఈ కాలసర్ప యోగం వల్ల ఆర్థికపరంగా అభివృద్ధి లేకపోవటం, ఆర్థిక స్థిరత్వం లేకపోవటం, జాతకుడిని పేదవాడు అయ్యేలా చేసే తీవ్రమైన అధిక ఋణాలు, వ్యాపారంలో అడ్డంకులు, వంశపారపర్యంగా వచ్చే ఆస్తులలో ఆటంకాలు వస్తాయి.

ఈ కాలసర్పయోగం వల్ల ప్రభావితులైన వారు, తమ జీవితంలో చిన్నతనం నుండి వృద్ధాప్యం వరకు ఆరోగ్య పరంగా, విద్య పరంగా, వృత్తి పరంగా, వివాహ పరంగా, అప్పుల ఆర్థికంగా, సామాజికంగా, రోజు వారి కార్యక్రమాల పరంగా, వారి లక్ష్యాలను చేరుకునేందుకు ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఏర్పడతాయి.

వామతంత్రం ప్రకారం, జన్మకుండలిలో కాలసర్పయోగం ఉన్న జాతకులు తమ బాధల నుండి, సమస్యల నుండి విముక్తి పొందాలంటే, “కాలసర్పయోగా నివృత్తి హోమం” తప్పక జరిపించాలి.  ఈ పరిహారం జరిపించడం వల్ల జాతకులకు ఉన్న దురదృష్టం దూరమయ్యి, శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ హోమం జరిపించడం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. అందువల్ల జాతకులకు శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానం లేని దంపతులు ఈ కాలసర్పయోగ నివృత్తి హోమం చేసుకోవడం వల్ల శీఘ్రంగా సంతానం కలుగుతుంది.వ్యాపారంలో నష్టాలు చూసే వారు, వృత్తిపరంగా అపజయం పాలయ్యే వారు, దుష్ట శక్తులు, దుష్టుల నుండి దూరం కావాలనుకునేవారు ఈ కాలసర్ప శాంతి హోమం ఎంతో శుభాన్ని చేకూరుస్తుంది.

12 రకాల కాలసర్పయోగాలు

12 రకాల కాలసర్పయోగాలు 

మానవ జీవితములపై ప్రభావాన్ని చూపించే ప్రధాన గ్రహాలైన రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ , శని అను ఈ ఏడు గ్రహాలు ఎవరి జన్మకుండలిలో అయితే రాహువు మరియు కేతువు మధ్య చిక్కుకొని ఉన్నవారికి ఆ పరిస్థితిని కాలసర్పదోషం అంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి జన్మకుండలిలోని ఆరు స్థానాలలో ఏ గ్రహాలచేత ఆక్రమించబడకుండా ఉంటాయో అట్టి స్థితిని సంపూర్ణ కాలసర్ప యోగం అంటారు. కాలసర్పయోగం లేదా కాలసర్పదోషం మానవుల జీవితాలలో ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టిస్తాయి. మనిషి తాను చేసే కార్యాలకు తగిన ఫలితాన్ని పొందలేదు. కొందరికి కాలసర్పదోషం ఉన్న స్త్రీ, పురుషులకు వివాహం కాకపోవటం, సంతానం కలుగకపోవటం, వృత్తిపరంగా అభివృద్ధి లేకపోవటం, తరచూ కోర్టు కేసులలో లేదా తగాదలలో ఇరుక్కోవటం తరచుగా బంధువులతో శతృత్వాన్ని పొందటం లాంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవటం జరుగుతుంది. మనిషికి కావలసిన అదృష్టాన్ని అడ్డగించటములో కాలసర్పదోషం పోషించే పాత్ర ఎంతో ఉంటుంది. కాలసర్పదోషానికి వ్యక్తుల యొక్క మంచి చెడులతో సంబంధం లేదు. ధనిక, పేద తేడా లేకుండా ఈ కాలసర్పదోష ప్రభావానికి గురి కావలసి ఉంటుంది. కాలసర్పదోషం ఉన్న సంపన్నులు అనుక్షణం ఏదో ఒక విషయములో ఉత్కంఠను , ఆందోళనలను అనుభవిస్తూ ఉంటారు. వారిని అనుక్షణం ఏదో ఒక అభద్రతా భావం వెంటాడుతూ ఉంటుంది. హైందవ జ్యోతిష్యశాస్త్రములో ఎన్నో దుష్ట యోగాలు ఉన్నప్పటికి వాటి అన్నింటిలోనూ అతి తీవ్రమైనది కాలసర్పదోషం. ఒక్కో రకమైన కాలసర్పదోషం మనిషికి ఒక్కో వయస్సు వరకు ప్రభావం ఉంటుంది. కొన్ని కాలసర్పదోషములు మాత్రం మనిషి మరణించేంత వరకు దాని ప్రభావం చూపుతుంది. కలసర్పదోషాలు 12 రకములు. అవి ఏమిటో తెలుసుకుందాము.


1.అనంత కాలసర్పయోగం:


 ఎవరి జన్మకుండలిలో అయితే రాహువు లగ్నములో మరియు కేతువు సప్తమ భావములో ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి “అనంత కాలసర్ప దోషం” ఉన్నట్టు గుర్తించాలి. ఈ అనంత కాలసర్ప దోషం వలన బాధపడేవారు తరచుగా అవమానములు ఎదుర్కోవటం , ఆందోళనలకు గురి కావటం జరుగుతుంది. వీరిలో న్యూనత భావం ఎక్కువగా ఉంటుంది. ఇక కోర్టు సంబంధిత విషయాలకు వస్తే వీరు విసుగు కల్పించే , ఎంతో కాలముగా పూర్తి కానీ కేసులు ఉంటాయి. వీరి ఆరోగ్యము కూడా తరచూ బాధకరంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. వైవాహిక జీవితం సాఫీగా ఉండదు. ఈ అనంతకాలసర్ప దోషం ఉన్నవారు మానసికంగా మరియు శరీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.


2.కులికా కాలసర్పయోగం:


 ఎవరి జన్మకుండలిలో అయితే రాహువు ద్వీతీయ భావములో మరియు కేతువు అష్టమ భావములో ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి కులికా కాలసర్పదోషం ఉన్నట్టు గుర్తించాలి. ఈ రకమైన కాలసర్పదోషం ఉన్నవారు ధనాన్ని నష్టపోవటం , ప్రమాదాల వలన నష్టపోవటం జరుగుతుంది. వీరి కుటుంబములో తగాదాలు, నరాల బలహీనత, మూర్చలు లాంటి సమస్యలు వస్తాయి. కుటుంబ జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది. ఆర్థికపరమైన నష్టాలు ఎక్కువగా ఎదుర్కొంటారు.ఈ కాలసర్పదోషం అనుభవిస్తున్న వారు వారి మాటలను ఎంతో అదుపులో ఉంచుకోవాలి. వీరి మాటలు ఇతరులను సులభంగా బాధిస్తాయి కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. కుటుంబ సభ్యులలో మరియు సమాజములో వీరికి ఉన్న గౌరవము పోయే అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితం సాఫీగా ఉండదు. ఆర్థిక పరిస్తితి నిలదోక్కుకోవటం కోసం ఎంతో ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఈ కాలసర్పదోషం ఉన్నవారు సహజంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. గొంతుకు సంబంధించిన వ్యాధులు కలుగవచ్చు.


3.వాసుకి కాలసర్పయోగం:


 ఎవరి జన్మకుండలిలో అయితే మూడవ స్థానములో రాహువు మరియు తొమ్మిదవ స్థానములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఇమిడి ఉన్నట్లైతే వారికి వాసుకి కాలసర్పదోషం ఉందని గుర్తించాలి. ఈ కాలసర్పదోషంతో భాడపడేవారు సోదరుల కారణంగా లేదా అక్కాచెల్లెళ్ల కారణంగా నష్టపోవటం జరుగుతుంది. వీరు బంధువుల వలన కలిగే చిక్కులవలన గాని, రక్త సంబంధమైన సమస్యల వలన గాని, ఆకస్మిక మృతి పొందే అవకాశం ఉంటుంది. ప్రొఫెషనల్ జీవితములో సమస్యలు ఎదుర్కొంటారు. వీరి అదృష్టము ఎక్కువగా ఉండదు. స్నేహితుల వలన లేదా బంధువుల వలన మోసపోతారు. వ్యాపారములో, వ్యాపార భాగస్వాములతో నష్టాలు ఎదురయ్యి సమస్యలు ఎదుర్కొంటారు.  ఈ దోషం ఉన్న వారు సమస్యల వలన సతమతం అయ్యి ఆ ఆందోళనలో వీరు చేసే పనుల వలన ఇంకా సమస్యలలో చిక్కుకుంటారు. ఇతరులు వీరితో ఎంత సన్నిహితంగా ఉన్నా కూడా ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అందరూ వీరిని మోసగించాలనే చూస్తారు. రాహు లేదా కేతు మహా దశలో వీరు దూర ప్రయాణములు చేయుట మంచిది కాదు.


4.శంఖపాల కాలసర్పయోగం:


ఎవరి జన్మకుండలిలో అయితే రాహువు నాలుగవ భావములో మరియు కేతువు దశమ భావములో ఉంటూ వీరి మధ్య మిగిలిన ఏడు గ్రహాలు ఉండినట్లైతే వారికి శంఖపాల కాలసర్పదోషం ఉన్నదని గుర్తించాలి. ఈ దోషం ఉన్న వారికి వారి తండ్రి నుండి ప్రేమ లభించదు. వీరు అతి శ్రమలు చేస్తూ జీవిస్తూ ఉంటారు. తరచుగా వృత్తిపరమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.  వీరి జన్మభూమికి దూరంగా ఇతర రాష్ట్రాలలో లేదా ఇతర దేశాలలో హీనమైన పరిస్థితులలో మరణించటం జరుగుతుంది. వీరికి దేనిమీద సరైన ధ్యాస (Concentration)  ఉండదనే చెప్పాలి. ఉదాహరణకి తదేక ధ్యాస పెట్టె డ్రైవింగ్ లాంటి వాటిపై వీరికి పట్టు ఉండదు కాబట్టి వాటి జోలికి వెళ్లకపోవటమే మంచిది. ముఖ్యంగా వీరి తల్లితోనూ, కుటుంబ సభ్యులతోనూ సరైన బాంధవ్యము ఉండదు. కొందరికి వీరు నివశిస్తున్న ఇంటిలో వాస్తు దోషములు కూడా ఏర్పడవచ్చు. హుద్రోగములు, ఛాతీ, ఊపిరితిత్తులకు వ్యాధులు రావచ్చు. పై అధికారులతో పేచీలు ఉంటాయి. ప్రోమోషన్లు రాక ఇబ్బందుల పాలవుతారు. మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి.


5.పద్మ కాలసర్పయోగం:


 ఎవరి జన్మకుండలిలో అయితే పంచమ భావములో రాహువు మరియు ఏకాదశ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారు పద్మ కాలసర్ప దోషము నుండి బాధపడుతున్నట్టు గుర్తించాలి. ఇలాంటి జాతకులు చదువులో వెనుకబడటం జరుగుతుంది.జీవిత భాగస్వామికి తరచూ అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. సంతాన భాగ్యమును పోందలేకపోవటం , స్నేహితుల వలన వంచింపబడటం జరుగుతుంది. చదువు పరంగా వెనుకబడి ఉంటారు. ప్రేమ వ్యవహారాలలో, వ్యాపారాలలో, మార్కెట్ పరంగా వీటన్నింటిలో వీరికి అదృష్టము ఉండదు. కొందరికి సంతాన పరంగా ఆలస్యము ఉంటుంది. ప్రేమ వ్యవహారములో మరియు వైవాహిక జీవితములో సమస్యలు ఉంటాయి.  కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఉండదు.


6.మహా పద్మ కాలసర్పయోగం:


ఎవరి జన్మకుండలిలో అయితే 6వ స్థానములో రాహువు మరియు 12వ స్థానములో కేతువు ఉంది మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి మహాపద్మ కాలసర్పదోషం ఉన్నట్టు గుర్తించాలి. ఈ కాలసర్పదోషం ఉన్నవారికి వెన్నుముక ప్రారంభములో నెప్పులను, తలనొప్పులను, చర్మ వ్యాధులను కలిగి ఉంటారు. అంతేకాకుండా తరచుగా ఆస్తుల నష్టం జరుగుతుంది. వీరిపై తంత్ర ప్రయోగములు సులభముగా జరగగలవు. మామూలుగా ఇలాంటి జాతకులు విదేశాలలో ఉంటూ కుటుంబములో ఆశాంతి కలిగి ఉంటుంది. స్వయంకృత అపరాధల వలన వీరు మోసపోతారు. మానసిక రుగ్మత (డిప్రెషన్) , ఇతరుల పట్ల ద్వేషము, చేసే వృత్తి నుండి తేసివేయుట జరుగవచ్చు. కాలసర్పయోగం అంటే ఏమిటి? కాలసర్పయోగ నివృత్తి హోమం యొక్క వివరాలను ఈ లింకును క్లిక్ చేసి తెలుసుకోగలరు


7.తక్షక కాలసర్పయోగం :


 ఎవరి జన్మకుండలిలో అయితే సప్తమ భావములో రాహువు మరియు లగ్నములో కేతువు ఉన్నట్లైతే వారికి తక్షక కాలసర్పదోషం ఉన్నట్టు గుర్తించాలి. ఈ దోషం ఉన్నవారు నీచంగా ప్రవర్తించే వారిచేత అనేక రకాల బాధలు పొందవలసి ఉంటుంది. వీరు వ్యాపారములో నష్టపోవటం, అసంతృప్తితో బాధపడటం, వైవాహిక సుఖమును పోందలేకపోవటం జరుగుతాయి. ప్రమాదములు జరుగుతాయి. ఈ దోషము ఉన్నవారు ముఖ్యంగా శారీరక లక్షణములు వ్యతిరేకంగా ఉంటాయి. సహజ పొడుగు, బరువు కాకుండా వ్యతిరేకంగా ఉంటారు. శారీరక లక్షనాలే కాకుండా మానసిక లక్షణాలు కూడా వీరికి సరిగా ఉండవు. ఇతరులతో పోలిస్తే ఈ దోషం ఉన్న వారికి బుద్ధి కుశలత ఉండకపోవడం గమించవలసిన విషయం. నరముల బలహీనత కలుగుతుంది. సమస్యలను తట్టుకోలేక ఈ దోషము ఉన్నవారిలో కొందరు ఉన్మాది స్వభావము వారి వలె ప్రవర్తిస్తారు. వివాహేతర సంబంధములు చిక్కులు కలుగచేస్తాయి.


8.కర్కోటక కాలసర్పయోగం:


 ఎవరి జన్మకుండలిలో అయితే అష్టమ భావములో రాహువు మరియు ద్వీతీయ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఆ రాహు కేతు మధ్య ఉన్నట్లైతే వారికి కర్కోటక కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. ఈ దోషం ఉన్నవారు పూర్వీకుల ఆస్తులు అన్నీ కోల్పోతారు. శృంగారం ద్వారా వ్యాపించే వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్ రావచ్చు. విషపూరితమైన సర్పాల వలన గాని లేదా కీటకలా వలన గాని ప్రమాదములు పొందవచ్చు. కుటుంబములో అనేక సమస్యలు కలుగవచ్చు. హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. తీవ్రమైన ఆర్థిక నష్టము జరుగుతుంది. ఎటువంటి సహాయము పొందలేని వారు అవుతారు. యాక్సిడెంట్లు, ఆరోగ్య సమస్యలు దురయ్యే అవకాశములు ఉన్నాయి. వ్యక్తిగతంగా మరియు ప్రొఫెషన్ పరంగా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోగలరు.


9.శంఖచూడ కాలసర్పయోగం:


ఎవరి జన్మకుండలిలో అయితే నవమ భావములో రాహువు మరియు తృతీయ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి శంఖ చూడ కాలసర్పదోషం ఉన్నట్టు గుర్తించాలి. మతానికి వ్యతిరేకమైన కార్యకలాపములు జరుపుటకు సిద్ధపడతారు. హై బి.పి. , నిరంతర ఆలోచనలు ఉంటాయి. ఈ దోషం ఉన్న వారికి జీవితములో పైకి ఎదగడం ఎంత సులభమో , క్రిందకి జారిపోవటం కూడా అంతే సులభం. జీవితములో వీరికి ఏది సులభంగా దొరకదు. చేసే ప్రొఫెషన్ లో స్థిరత్వం కోల్పోతారు. ఈ దోషం ఉన్నవారికి, వీరి తండ్రికి భేదాభిప్రాయములు వస్తాయి. వీరికి పితృశాపము కూడా ఉన్నట్టు గుర్తించాలి. ఈ దోషంతో ఉన్నవారికి ఎవరిని నమ్మాలో తెలియక అన్నీ చోటల ఇతరుల చేతిలో మోసపోతూ ఉంటారు. వైవాహిక జీవితం విడాకుల వరకు వెళ్లవచ్చు. లీగల్ విషయాలలో ఎన్నో ఇబ్బందులు కలుగవచ్చు.


10.పాతక కాలసర్పయోగం:


 ఎవరి జన్మకుండలిలో అయితే దశమ భావములో రాహువు మరియు చతుర్థ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి పాతక కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. ఈ దోషం ఉన్నవారు కుటిల స్వభావము కలిగి ఇతరులకు ద్రోహము చేయుటకు పాల్పడతారు. ఈ దోషం ఉన్నవారి ఇళ్ళల్లో దొంగతనాలు జరుగుతాయి. పైశాచిక పీడ ఎక్కువగా ఉంటుంది. లో బి.పి సమస్య ఉంటుంది. ఈ దోషం ఉన్న వ్యాపారస్తులు ఒకే వ్యాపారం చేయటం వలన ఎక్కువ నష్టాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఒంటరిగా అనిపించడం లాంటి మానసిక ఆందోళనలు కలిగి ఉంటారు.


11.విషధార్ కాలసర్పయోగం:


 ఎవరి జన్మకుండలిలో అయితే ఏకాదశ భావములో రాహువు మరియు 5వ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నత్లితే వారికి విషధార్ కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. సోదరులతో విబేధాలు కలుగవచ్చు. చపల మనస్తత్వం కలిగి ఉంటారు. సంతాన పరమైన సమస్యలు ఎదుర్కొంటారు. కారాగార శిక్ష అనుభవించే సూచనలు రావచ్చు. నిద్రలేమి, కంటి సమస్యలు, హృదయ సమస్యలు రావచ్చు. పై చదువులు చదువుకోవాలంటే చాలా కష్టాలు పడవలసి ఉంటుంది. సంతానము ఆలస్యముగా కలుగవచ్చు. కొంత డబ్బు కోసం ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఒక్కోసారి చేయకూడని పనులు కూడా చేయవలసి ఉంటుంది. జ్ఞాపక శక్తి మందగిస్తుంది.


12.శేషనాగ కాలసర్పయోగం:


 ఎవరి జన్మకుండలిలో అయితే ద్వాదశ భావములో రాహువు మరియు 6వ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి శేషనాగ కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. తరచూ ఓటమికి గురి అవుతూ ఉంటారు. దురదృష్టం వీరిని వెంటాడుతూ  ఉంటుంది. రహస్య శత్రువులు బాధిస్తూ ఉంటారు. నేత్ర సంబంధమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఏడుపు ఆరోగ్యానికి మంచిదే!

ఆనందం, విషాదం... ఇవన్నీ జీవితంలో భాగమే. ఆటలు, పాటలు, స్నేహితులు మరియు కబుర్లలో కొంతమంది ఆనందాన్ని వెతుక్కుంటే... మరి కొంతమంది అందరితో కలిసి పంచుకునే ఆనందం కంటే, వ్యక్తిగత ఆనందానికి పెద్దపీట వేస్తుంటారు. ఇక విషాదం విషయానికి వస్తే... కొంత మంది బోరున ఏడ్చేస్తే, మరికొంత మంది లోలోపలే కుమిలిపోతుంటారు. అయితే, ఆనందం వల్ల శరీరానికి కలిగే మేలు సంగతిని కాసేపు పక్కన పెడితే... విషాదం మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిదని, అది లేకపోతే మానవ జీవితానికి అర్థమే లేదని పరిశోధకులు చెబుతున్నారు.

విచారంగా ఉన్నప్పుడు కన్నీళ్లు రావడం సహజం. ఎవరైనా సరే మరింత సంతోషంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు కన్నీళ్లు వస్తుంటాయి. వీటిని ఆనంద భాష్పాలు అంటారన్న విషయం మీకు తెలిసిందే. మనస్సులోని భావోద్వేగాలను అధిగమించలేక పోయినప్పుడు అది కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది. ఏడుపు ప్రతికూలంగా చిత్రీకరించబడింది. ఏడుపు వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? అవును, ఏడుపు వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరం భావాలకు ప్రతిస్పందించినప్పుడు, మనము కన్నీటి గ్రంథి నుండి కళ్ళద్వారా బయటకు వచ్చే నీటిని కన్నీళ్ళుగా పిలుస్తాము. కన్నీళ్ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు శాస్త్రీయంగా ఏడవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. నెమ్మదిగా క్రమరహిత శ్వాస, కండరాల వణుకు మొదలైనవి. భావోద్వేగాల నుండి వచ్చే కన్నీళ్లు వేరే రసాయన కూర్పును కలిగి ఉంటాయి. కంటి నొప్పి లేదా ఇన్ఫెక్షన్ నుండి వచ్చే కన్నీళ్లకు ఇది భిన్నంగా ఉంటుంది. ఈ వ్యాసంలో, మీ మనస్సు నుండి భావోద్వేగాలు బయటకు వచ్చినప్పుడు కన్నీళ్ళ నుండి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. ఒత్తిడిని తగ్గిస్తుంది మనస్సు ఒత్తిడి మరియు ఆందోళన మధ్య గందరగోళ స్థితిలో ఉంటుంది, ఇది శారీరకంగా మరియు మానసికంగా మమ్మల్ని సాధారణ స్థితికి తీసుకువస్తుంది. ఇది మనకు ఒత్తిడి నుండి విరామం ఇస్తుందని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది కొన్ని పరిశోధనల ప్రకారం, కన్నీళ్లలో కొన్ని విషపూరిత అంశాలు బయటకు వస్తాయి. ఇది శరీరంలోని ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది. సహజంగా శుభ్రపరచడం భావోద్వేగ కన్నీళ్లలో లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇదియాంటీ బాక్టీరియల్ లక్షణాలు సహజ ప్రక్షాళనగా పనిచేస్తాయి. పొడి కళ్ళ చికిత్స ఏడుపు వల్ల కలిగే మరో ఆరోగ్య ప్రయోజనం ఏమిటంటే ఇది కంటికి తేమను ఇస్తుంది. ఏడుపు కళ్ళ పొడిదనం, ఎరుపు మరియు దురదను నివారించవచ్చు. కళ్ళు మన అత్యంత విలువైన నిధి - నిర్లక్ష్యం చేయవద్దు.... మానసిక స్థితి మెరుగుదల ఏడుపు ద్వారా మెదడులో ఉత్పత్తి అయ్యే ఎండార్ఫిన్లు లేదా మంచి ఎమోషన్ హార్మోన్ల ఏడుపు మనస్సును తేలికపరుస్తుంది మరియు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. నిరాశ నుండి ఉపశమనం ఏడుపు వల్ల కలిగే మరో ఆరోగ్య ప్రయోజనం ఏమిటంటే అది డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఏడుపు ప్రతికూల భావోద్వేగాల నుండి ఉపశమనం కలిగిస్తుందని వైద్యులు భావిస్తున్నారు. 1. శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది మూడు రకాల కన్నీళ్లు ఉన్నాయి: రిఫ్లెక్స్ కన్నీళ్లు నిరంతర కన్నీళ్లు భావోద్వేగ కన్నీళ్లు రిఫ్లెక్స్ మీ కళ్ళ నుండి పొగ మరియు ధూళి వంటి స్పష్టమైన శిధిలాలు. నిరంతర కన్నీళ్లు మీ కళ్ళను ద్రవపదార్థం చేస్తాయి మరియు వాటిని ఇన్ఫెక్షన్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. భావోద్వేగ కన్నీళ్లకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండవచ్చు. నిరంతర కన్నీళ్లలో 98 శాతం నీరు ఉండగా, భావోద్వేగ కన్నీళ్లలో ఒత్తిడి హార్మోన్లు మరియు ఇతర టాక్సిన్లు ఉంటాయి. దీనిపై మరింత పరిశోధనలు అవసరమవుతున్నప్పటికీ, ఏడుపు మీ సిస్టమ్ నుండి బయటకు వస్తుందని పరిశోధకులు సిద్ధాంతీకరించారు. 2. స్వీయ ఉపశమనానికి సహాయపడుతుంది ఏడుపు అనేది స్వీయ-ఉపశమనానికి మీ ఉత్తమ విధానాలలో ఒకటి. ఏడుపు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను (పిఎన్ఎస్) సక్రియం చేస్తుందని పరిశోధకులు విశ్వసనీయ మూలం కనుగొన్నారు. PNS మీ శరీర విశ్రాంతి మరియు జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఏదేమైనా, ప్రయోజనాలు వెంటనే ఉండవు. ఏడుపు ఓదార్పు ప్రభావాలను మీరు అనుభవించడానికి ముందు కన్నీరు కార్చడానికి చాలా నిమిషాలు పట్టవచ్చు. 3. తక్కువ నొప్పి దీర్ఘకాలిక కన్నీళ్ళ విడుదలల కోసం ఏడుపు ట్రస్టెడ్ సోర్స్ ఆక్సిటోసిన్ మరియు ఎండోజెనస్ ఓపియాయిడ్లు, లేకపోతే ఎండార్ఫిన్స్ అని పిలుస్తారు. ఈ అనుభూతి-మంచి రసాయనాలు శారీరక మరియు మానసిక నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. ఎండార్ఫిన్లు విడుదలయ్యాక, మీ శరీరం కొంతవరకు తిమ్మిరి దశలోకి వెళ్ళవచ్చు. ఆక్సిటోసిన్ మీకు ప్రశాంతత లేదా శ్రేయస్సు భావాన్ని ఇస్తుంది. ఏడుపు అనేది స్వీయ-ఓదార్పు చర్య అని మరొక ఉదాహరణ. 4. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది నొప్పిని తగ్గించడంలో మీకు సహాయపడటంతో పాటు, ఏడుపు, ప్రత్యేకంగా దు:ఖించడం, విశ్వసనీయ మూలం మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. మీరు బాధపడుతున్నప్పుడు, మీరు చల్లని గాలిని చాలా త్వరగా తీసుకుంటారు. చల్లటి గాలిలో శ్వాస తీసుకోవడం మీ మెదడు ఉష్ణోగ్రతను నియంత్రించడానికి మరియు తగ్గించడానికి సహాయపడుతుంది. ఒక వెచ్చని మెదడు కంటే చల్లని మెదడు మీ శరీరానికి మరియు మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. తత్ఫలితంగా, దు:ఖకరమైన పరిస్థితి తర్వాత మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. 5. ఇతరుల మద్దతు మీకు నీలం అనిపిస్తే, ఏడుపు అనేది మీ చుట్టూ ఉన్నవారికి మీకు మద్దతు అవసరమని తెలియజేయడానికి ఒక మార్గం. దీనిని ఇంటర్ పర్సనల్ బెనిఫిట్ ట్రస్టెడ్ సోర్స్ అంటారు. మీరు శిశువుగా ఉన్నప్పటి నుండి, ఏడుపు ఒక అటాచ్మెంట్ ప్రవర్తన. దీని పనితీరు ఇతరుల నుండి సౌకర్యం మరియు సంరక్షణ పొందటానికి అనేక విధాలుగా ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, కఠినంగా ఉన్నప్పుడు మీ సామాజిక మద్దతు నెట్‌వర్క్‌ను రూపొందించడానికి ఇది సహాయపడుతుంది. ఓదార్పు దు:ఖించడం ఒక ప్రక్రియ. ఇది దు:ఖం, తిమ్మిరి, ఆందోళన మరియు కోపం కాలాలను కలిగి ఉంటుంది. దు:ఖించే కాలంలో ఏడుపు చాలా ముఖ్యం. ఇది ప్రియమైన వ్యక్తిని ఓదార్చడానికి మరియు అంగీకరించడానికి విశ్వసనీయ మూలానికి సహాయపడవచ్చు. ప్రతి ఒక్కరూ ఏడ్చే ప్రక్రియలో రకరకాలుగా వెళతారు. మీ ఏడుపు విపరీతమైనదని లేదా మీ దైనందిన జీవితంలో జోక్యం చేసుకోవడం ప్రారంభిస్తే, మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది. 7. భావోద్వేగ సమతుల్యతను పునరుద్ధరిస్తుంది ఏడుపు విచారానికి ప్రతిస్పందనగా మాత్రమే జరగదు. మీరు చాలా సంతోషంగా, భయపడినప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు కొన్నిసార్లు మీరు ఏడుస్తారు. యేల్ యూనివర్శిటీ ట్రస్టెడ్ సోర్స్ పరిశోధకులు ఈ విధంగా ఏడుపు భావోద్వేగ సమతుల్యతను పునరుద్ధరించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. మీరు చాలా సంతోషంగా లేదా ఏదైనా గురించి భయపడి ఏడుస్తున్నప్పుడు, అటువంటి బలమైన భావోద్వేగాన్ని అనుభవించకుండా కోలుకోవడం మీ శరీర మార్గం. 8. శిశువు శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది గర్భం నుండి శిశువు మొట్టమొదటి ఏడుపు చాలా ముఖ్యమైన ఏడుపు. పిల్లలు బొడ్డు తాడు ద్వారా గర్భం లోపల తమ ఆక్సిజన్‌ను అందుకుంటారు. ఒక బిడ్డ ప్రసవించిన తర్వాత, వారు స్వయంగా శ్వాసించడం ప్రారంభించాలి. మొదటి ఏడుపు ఏమిటంటే శిశువు ఊపిరితిత్తులు బయటి ప్రపంచంలో జీవితానికి అనుగుణంగా సహాయపడతాయి. ఏడుపు పిల్లలు ఊపిరితిత్తులు, ముక్కు మరియు నోటిలో ఏదైనా అదనపు ద్రవాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. 9. శిశువు నిద్రకు సహాయపడుతుంది ఏడుపు పిల్లలు రాత్రి బాగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది. శిశు నిద్రపై ఒక చిన్న అధ్యయనంలో, 43 మంది పాల్గొనేవారు తమ పిల్లలను పడుకోబెట్టడానికి నియంత్రిత ఏడుపు అని కూడా పిలుస్తారు. నియంత్రిత ఏడుపుతో, పిల్లలు వారి తల్లిదండ్రుల జోక్యానికి ముందు కొన్ని నిమిషాల పాటు ఏడుస్తూనే ఉన్నారు. ఏడుపు ఎక్కువ సేపు నిద్రించడాన్ని రెండింటినీ పెంచింది మరియు రాత్రి సమయంలో శిశువులు నిద్రలేచిన సంఖ్యను తగ్గించింది. ఒక సంవత్సరం తరువాత, ఏడుపు శిశువులలో ఒత్తిడిని పెంచడం లేదా తల్లిదండ్రుల-పిల్లల బంధాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయలేదు.

ఎంత ఆనందంగా ఉండేవారైనా జీవితంలో ఎప్పుడో ఒకసారి విషాదాన్ని అనుభవించక తప్పదు. అలాంటి విషాదాలు ఎదురైనప్పుడే... మనిషికి తాము చేసే తప్పులేంటో విశ్లేషించుకునే అవకాశం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. బాధ కలిగినప్పుడు దానిని అనుభవించటం వల్ల ఏదో ఒక ప్రయోజనం తప్పకుండా ఉంటుందని.. లేదంటే, దాన్ని భరించాల్సిన అవసరమే లేదని వారంటున్నారు.

సాధారణంగా బాధ కలిగిన క్షణంలో ఏ పనీ చేయలేమనీ,

మనస్సు మొద్దుబారిపోయినట్లు అనిపిస్తుందని అయితే నిజానికి అలా ఆలోచనలు నిలిచిపోవడం అంటూ ఏమీ ఉండదని నిపుణులు అంటున్నారు. కాకపోతే, దేనివల్ల బాధ కలిగిందో, ఆ విషయం గురించే ఎక్కువగా ఆలోచించటం వల్ల... మిగతా ఏ విషయాలపైకి దృష్టి వెళ్లదని అన్నారు.

విషాదం కూడా మనకు మేలే చేస్తుంది. అది, గుండెల నుండి మోయలేని భారాన్ని తొలగించి, ఫ్రెష్‌గా తయారు చేయడమే గాకుండా, ఏదైనా విషయాలపై మనం తీసుకునే నిర్ణయాల్లో కూడా స్పష్టత కలిగి ఉండేలా చేస్తుంది. కాబట్టి, హాయిగా విషాదంలో మునిగిపోండి... ఆరోగ్యంగా ఉండండి...!

What are the most effective ways to promote blogs?

Do you want to grow an audience to eventually sell advertising space on your blog? Does your blog support a product that you sell on your website? Do you want to establish your blog as an authority in your niche?

All of the above are excellent ways to use a blog to help a business, but there are different ways of promotion that can impact each goal.

1. Focus on search engine optimized (SEO) content

Growing a blog and SEO content go hand in hand. SEO content is basically content that has the goal of ranking on search engines for popular queries (keywords) in order to attract organic traffic to your blog from search engine users.

SEO advice can range from the very logical (use your target keyword in the title of your post, write a clear meta description) to the technical (proper use of coding, mobile-friendly design) so if you’re unfamiliar I’d suggest checking out some industry blogs to learn the basics. Some suggestions are:

2. Write “Evergreen” Content

One tip for adding SEO content to your blog would be to target topics in your niche that can be evergreen content. What do I mean by evergreen? Evergreen is a concept in SEO that means the topic of the post will be relevant for years to come, as opposed to a seasonal topic that is only relevant for a short period of time.

This way, as you write your blog posts about “evergreen” topics with SEO in mind you are future-proofing your site to stay relevant for search engine users over and over again in time.

3. Invite guest bloggers

Another easy way to promote your blog is by letting other people write for you! Guest blogging is a way for other bloggers to reach a new audience by contributing a post of theirs to your blog. Usually, a guest post includes a link to the guest author’s website in return for the post to make it a win-win for both parties. The more loyal followers your guest author has, the better. When the guest author goes to share their new post on your blog, it attracts their audience to your site and makes your blog look more authoritative. SEMrush takes guest authors all the time, so much so that we even publish a  wrap up with all of our favorite posts from guest contributors!


4. Mention influencers in your blog posts (and let them know)

Another strategy to getting more people in your industry aware of your blog is by mentioning influencers in your post. You can include a quote of theirs that you like, share one of their related posts, or just mention how helpful their website is for what you’re talking about.

After name-dropping them in your post, reach out to them over email or social media to let them know. Most people will be flattered that you thought of them and included them as a part of your post. Who knows, they could be interested in your blog and share the post with their followers, ask to contribute a guest post in the future, or offer you guidance!

5. Build an Email Marketing List

Are you trying to grow your blog without an email list? You may need to rethink your strategy.

Building an email list from your blog readers is one of the most time-tested ways to build loyalty with your fanbase and keep your readers engaged again and again. However, as this post explains, you need to offer clear value when asking people to sign up. No one wants more random emails in their inbox. Offer special deals, insider tips and secrets, or early access to a new product. Basically, users want a clear incentive for signing up for another list.

Not to mention, it’s a great way to measure your growth over time - how fast is your email list growing in tandem with your number of posts? Do certain blog posts encourage people to sign up for your email list more than others?

6. Contribute to Upvote Communities

Upvote communities (such as reddit, quora, or http://inbound.org) are websites where users submit content and vote on the submissions that they like the most. This way, when you enter the site, the most valued information is at the top of the feed. It’s a democratic way of doing things, and a great opportunity to promote your blog when you have something worth sharing.

But before you just spam upvote communities with your blog posts, you should find the right communities for you and participate as a commenter and have conversations with other users. If you don’t think there is a subreddit for your niche, you’re probably wrong.

And if there isn’t, you can always apply to create your own subreddit. SEMrush has its own subreddit that we moderate to field our customers’ top questions to learn what we should be writing about.

Other than Reddit, there are communities such as ProductHunt (for promoting a new product), private Slack groups (such as Online Geniuses and Traffic Think Tank), and of course, Quora! :)

7. Write Answers on Quora

Quora is technically an upvote community but its unique for its popularity and strict question-answer format. If you have a tool like SEMrush, you can look for new ways to promote your blog by entering http://Quora.com in Organic Research and checking out all of the keywords that Quora ranks for.

Add a filter to look for search terms relevant to your blog. Once you identify some keywords that are relevant to your blog, you can write an answer to the question Quora and mention your blog within the answer.

You probably won’t see a huge impact from one answer, but if you make a habit of answering Quora questions somewhat frequently, you can start to build your authority on the site as a trusted source in your industry. Eventually, you’ll gain traffic to your blog from Quora.

Once you have plenty of answers on Quora, your profile could be a good place to write more about your blog in your bio.

8. Social Media

Making use of social media - both unpaid and paid posts can be huge for getting a blog off the ground. If you’re serious about using social media to make an impact for you, it would be wise to invest in social media tools to help you schedule your posts in advance and track engagement. Twitter and Facebook are great places to grow an audience and find like-minded people online.

This point could be an entire article on its own, but for brevity’s sake I’ll instead leave a couple of links to helpful articles about promoting a blog on social media:

9. Bonus Tip - Use Google Analytics and Google Search Console

These tools won’t promote your blog, per se, but they are great for showing you your growth over time. Both are free tools from Google that tell you how people get to your website, what they do on your site, and what content is most engaging. If you are serious about growing your blog, you will need to rely on these tools for a lot of basic insights.

Google Analytics will tell you your average user’s time on page, sessions, bounce rate, and much more. Google Search Console, meanwhile, will help you understand how Google crawls your website and, if your site is getting organic traffic from search engines, what keywords they’re searching that trigger your blog posts.

Now that you have some tips to promote your blog and track its growth, good luck! And don’t underestimate a tool like SEMrush for extra insights on your competition that will help you build a strategy to grow!

Monday, April 5, 2021

ఏ రోజు ఏ ఆభరణాలు ధరిస్తే శుభం

మహిళలు నిత్యం ఆభరణాలు ధరిస్తారు. సందర్భాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. అయితే గ్రహాలను అనుసరించి ఆభరణాలు ధరించాల్సి ఉంటుంది. ఏ రోజు ఏ రకమైన నగలు ధరిస్తే మంచిదో తెలుసుకోవడం ముఖ్యం.

వారంలో రోజుకో గ్రహాధిపతి ఉంటాడు. ఆదివారానికి సూర్యుడు అధిపతి అయితే, శుక్రవారానికి శుక్రుడు అన్నట్టు.. ఆయా వారాలని బట్టి ఆ రోజుకి ఉండే గ్రహాధిపతిని అనుసరించి ఏ నగలు ధరించాలో తెలుసుకోవాలి. నిత్యం నవగ్రహాలను అనుసరించి ఆభరణాలు ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయి.

అయితే బంగారంతో పొదిగించిన ఆభరణాలు లేకపోయినా.. తమ తమ స్థోమతకు తగినట్లు ఇప్పుడు దుకాణాల్లో అమ్మబడే ఆభరణాలతో ప్రతిరోజూ అలంకరణ చేసుకోవడం మంచిది.

ఇక ఏ వారంలో ఎలాంటి ఆభరణాలు ధరించాలో తెలుసుకుందాం.

ఆదివారం (సూర్యగ్రహానికి ప్రీతికరమైన రోజు) కెంపులతో చేసిన నగలు.. చెవిపోగులు, హారాలు మొదలగునవి ధరించడం శుభప్రదం. దీనిద్వారా నేత్ర సంబంధిత వ్యాధులు, శరీర తేజస్సు, ప్రకాశవంతం పొందవచ్చును.

సోమవారం (చంద్రగ్రహానికి ప్రీతికరమైన రోజు) ముత్యాలతో తయారు చేసిన ఆభరణాలు.. హారాలు, గాజులను వేసుకోవడం మంచిది. ముత్యాలతో తయారయ్యే గాజులను, చెవిపోగులను వాడటం ద్వారా మనశ్శాంతి, అనుకున్న కార్యములో విజయం చేకూరుతుంది.

మంగళవారం (కుజ గ్రహానికి ప్రీతికరమైన రోజు) పగడాలతో చేసిన ఆభరణాలు.. దండలు, ఉంగరాలను వాడటం మంచిది. పగడాలతో తయారైన ఉంగరాలను, దండలను వాడటం ద్వారా కుటుంబ సంక్షేమం చేకూరటం, ఈతిబాధలు తొలగిపోవడం వంటి ఫలితాలుంటాయి.

బుధవారం (బుధ హానికి ప్రీతికరమైన రోజు) పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి వాడటం మంచిది. విద్యాకారకుడైన బుధునికి ప్రీతికరమైన ఈ రోజున విద్యార్థులు పచ్చని రంగుతో కూడిన ఉంగరాలు, స్త్రీలతే హారాలు వినియోగించడం మంచిది. దీంతో బుద్ధికుశలతలు పెరగడం, ధనలాభం, కార్యసిద్ధి చేకూరుతుంది.

గురువారం బృహస్పతి (గురుభగవానుడు) కోసం పుష్యరాగముతో తయారైన చెవిపోగులు, ఉంగరాలు వంటి ఆభరణాలు ధరించడం మంచిది. దీంతో గురుగ్రహ ప్రభావంతో అవివాహితులకు కళ్యాణం జరగడం, వ్యాపారాభివృద్ధి, కార్యసిద్ధివంటి ఫలితాలుంటాయి.

శుక్రవారం శుక్రుని (శుక్రగ్రహం) కోసం వజ్రాల హారాలు, ముక్కుపుడక వాడటం ద్వారా స్త్రీలకు సౌభాగ్యం, ఆర్థిక సమస్యలు తొలగిపోవడం, పదోన్నతులు, అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. లక్ష్మిదేవి అనుగ్రహం కూడా పొందినవారవుతారు.

శనివారం (శనిగ్రహం) శనికోసం నీలమణి, మణిహారాలు వంటి ఆభరణాలు ధరించడం మంచిది. దీనిద్వారా శనిగ్రహ ప్రభావంతో తలెత్తే సమస్యలు కొంతవరకు సమసిపోతాయి. నీలమణితో తయారైన హారాలు చెవిపోగులు, ఉంగరాలు ధరించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయని రత్న శాస్త్రం చెబుతోంది.

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి 'నవరత్నాలు' -

కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో 

1) నిమ్మకాయ: 
రోజు నిమ్మకాయ రసం త్రాగండి. దీనివల్ల విటమిన్ C పెరుగుతుంది. 

2) బాదo: 
ఒకరోజు ముందు రాత్రి నానబెట్టిన బాదాంను మరుసటి పొద్దున్న తిన్నండి. విటమిన్ E తో పాటు జలుబు నుండి రక్షిస్తుంది. 

3)పెరుగు:
రోజు పెరుగును తినండి, తేనే కూడా బాగుంటుంది. ఇది విటమిన్ D తో కూడి వుంటుంది. 

4) పసుపు:
మీ వంటలలో పసుపును ఎక్కువగా వాడండి. ఇది ఇమ్యూన్ బూస్టర్.

5) పాలకూర:
ఈ ఆకుకూరల్లో విటమిన్ C దండిగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తిని ఇస్తుంది. 

6) అల్లం:
గొంతులో మంటను, వికారాన్ని తగ్గిస్తుంది. 

7) వెల్లుల్లి :
ఇది ఒక ఆధ్బుతమైన ఔషధం. రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. 

8) ప్రతిరోజు వాకింగ్ చేయండి.
ఆసనాలు,ప్రాణాయామం చేయండి,
మెడిటేషన్ లో కూర్చోండి

9) ఎండు ద్రాక్ష ( కిస్ మిస్ ) :
ఇందులో జింక్, ఐరన్, ఫైబర్ మరియు B12 విటమిన్ కలిగిన పండు. 

పైన వివరించిన పండ్లు, ఆకుకూరలు, ,వంట దినుసులు మీ ఆహరంలో తప్పకుండా తీసుకోండి.దీనివల్ల మీ శరీరం కరోనా వైరస్ తో ధైరంగా పోరాడే శక్తిని ఇవ్వటమే కాదు అసలు మిమ్మల్ని ఏమీ చేయలేదు.

పితృ దోష నివృత్తి హోమం

పూర్వీకులు చేసిన చెడు కర్మల ఫలితాలను వారి వారసులు ఈ పితృ దోషం రూపములో ఫలితములు అనుభవిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే మనం పూర్వ జన్మలో చేసిన కర్మలకు ఇప్పుడు అనగా ఈ జన్మలో అనుభవిస్తాము అని అర్థం. పితృదోషం ఉన్న జాతకులు ఆ దోష ప్రభావాన్ని పూర్తిగా అనుభవించి గాని, మంచి కార్యాలను చేస్తూ, ప్రాయశ్చిత్త పరిహారాలు చేయడం వల్ల గాని పితృ దోషం నివృత్తి అవుతుంది. ఈ ఐహిక ప్రపంచంలో పూర్వీకుల నుండి వంశపార పర్యంగా వచ్చే ఆస్తి, అంతస్తులను వారి వారసులు ఎలా అయితే తీసుకుంటున్నారో, అదే విధంగా వారి పూర్వీకులు చేసిన కర్మల ఫలితాలను కూడా స్వీకరించాల్సి ఉంటుంది.

పూర్వీకులు చేసిన పాపముల వల్ల పితృ దోషం ఏర్పడుతుంది. జాతకుని జన్మకుండలిలో ఏ గ్రహం వల్ల అయితే పితృ దోషం ఏర్పడిందో, ఆ గ్రహానికి సంబంధించిన అధి దేవతను ప్రార్థించి వేడుకోవాలి. పూజాది హోమ కార్యక్రమములు జరిపించాలి. ఆ విధంగా జరుపకుండా నిర్లక్ష్యం చేసినట్లైతే, ఈ పితృ దోషం జాతకుని తరువాత వచ్చే తరాల వారి జన్మకుండలిలో కూడా పితృ దోషం కనబడుతూ, ఆ పితృ దోషం యొక్క ప్రభావాన్ని ఎదుర్కొని బాధలు పడాల్సి ఉంటుంది.

 జన్మకుండలిలో 9వ భావంలో పైశాచిక గ్రహాలు ఉన్నప్పుడు గాని లేదా నవమాధిపతి శత్రు, నీచ స్థానంలో లేదా వక్ర స్థితిలో ఉన్నప్పుడు గాని జాతకునికి పితృ దోషం ఉన్నట్టు నిర్ధారించాలి. రవి, చంద్ర, గురు, శని, రాహు, కేతు, బుధ గ్రహాలు ప్రత్యేక స్థానాలలో ఉన్నప్పుడు, ఆ గ్రహాల శత్రు గ్రహాలతో కలసి ఉన్నప్పుడు గాని, లేదా వక్ర స్థానంలో ఉన్నప్పుడు గాని పితృ దోషమును జన్మకుండలిలో జ్యోతిష్యులు గుర్తిస్తారు. పితృదోషమును ప్రేరేపించడానికి కొన్ని లగ్నాలకు రవి, కుజ, శని గ్రహాలు యోగ కారకులుగా వ్యవహరిస్తాయి. జన్మకుండలిలో పితృదోషం ఉన్నట్టు ఎప్పుడైతే గుర్తిస్తారో, వెంటనే వామతంత్ర ఆచారంలో పితృదోష నివారణా హోమమును జరిపించుకొని, దోష నివృత్తి చేసుకోవాలి.

*పితృదోషం వల్ల ఎలాంటి సమస్యలు ఏర్పడతాయి?*

పితృదోషం ఉన్న జాతకులకు శరీరకంగా, మానసికంగా అనుకోని చెడు ప్రభావాలు పడతాయి. శారీరకంగా వైకల్యం రావడం లేదా వ్యాధి బారీన పడటం లాంటివి జరుగుతాయి. ఏదైనా వ్యాధి పారంపర్యంగా తరువాతి తరం వారికి రావడం లాంటివి జరుగుతాయి. పితృదోషం ఉన్న జాతకుల కుటుంబములోని వ్యక్తులు పదే పదే చేతబడి ప్రయోగానికి గురి అవుతూ ఉంటారు. కారణంగా ఆరోగ్యం నశిస్తుంది.

*చదువు, వృత్తి, ఉద్యోగం పరంగా ఎదురయ్యే సమస్యలు:*

పితృదోషం ఉన్న జాతకులు ఎలాంటి పరీక్షల్లో అయినా ఫెయిల్ అవటం, పై చదువుల కొరకు ఎలాంటి ప్రోత్సాహం జాతకులకు లభించకపోవడం, చదువు పరంగా, వృత్తి పరంగా నిత్యం అపజయం పాలవటం, ఉద్యోగం స్థిరంగా ఉండకపోవడం, ప్రమోషన్లకు తీవ్రమైన ఆటంకాలు రావడం లాంటివి జరుగుతాయి.

పితృదోషం వల్ల భార్యా భర్తల మధ్య ప్రేమ తగ్గిపోవడం, వివాహం ఆలస్యం కావడం, వైవాహిక జీవితం సాఫీగా లేకపోవడం, శృంగార జీవితంలో ఆనందం లేకపోవడం వల్ల అసంతృప్తి కలగడం, సంతాన సాఫల్యత లేకపోవడం, పదే పదే గర్భస్రావాలు జరగడం, చిన్నతనంలోనే సంతానం మరణించడం, గోత్రం వంశం కొనసాగించేందుకు పుత్ర యోగం లేకపోవటం, దంపతుల మధ్య ప్రేమానుబంధం లేకపోవటం, వివాహేతర సంబంధాలు ఏర్పడటం, విడాకులు జరగడం లాంటి తీవ్రమైన సమస్యలు పితృ దోషం ఉన్న జాతకులకు ఎదురవుతాయి.

*ఆర్థికపరమైన సమస్యలు:*   

ఆర్థిక పరమైన అభివృద్ధి లోపించడమే కాక, ఆర్థిక స్థిరత్వం ఉండదు. తీవ్రమైన అప్పులు ఎదురవడం వల్ల పేదరికం అనుభవించాల్సి వస్తుంది. పూర్వీకుల ఆస్తుల విషయాలలో ఎన్నో సమస్యలు వస్తాయి. డబ్బు రూపంలో వచ్చే లాభాలను చేతి దాకా వచ్చినా చేజార్చుకుంటారు.

*ముఖ్య గమనిక:*

 జన్మకుండలిలో ఏ గ్రహం వల్ల పితృదోషం ఏర్పడిందో తెలుసుకోవాలి. ఎందుకనగా ఏ గ్రహం వల్ల అయితే పితృదోషం ఏర్పడిందో ఆ గ్రహ దశ, అంతర్దశ, గోచార సమయంలో ఈ దోష ప్రభావం జాతకులపై పడి, సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

*పరిహారం:*

పితృదోషం వల్ల ఇక్కడ వివరించిన సమస్యలు ఎదుర్కొంటున్న జాతకులు వెంటనే వామతంత్ర ఆచారం ప్రకారం పితృదోష నివృత్తి హోమమును ఖచ్చితంగా జరిపించుకోవాలి. ఈ పితృదోష నివృత్తి హోమమును జరిపిస్తే పితృదేవతలు తమ వారసుల పై తమ అనుగ్రహాన్ని కురిపిస్తారు. పితృదేవతలు తమ వారసులు నిర్వహించుకునే పనులలో విజయం సాధించుకునేందుకు పరోక్షంగా సహాయపడి వారికి విజయం చేకూరేలా అనుగ్రహిస్తారు. తత్కారణంగా పనులకు ఉన్న అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోయి విజయం లభిస్తుంది. వామతంత్ర ఆచారం ప్రకారం చేసీ పితృదోష నివృత్తి హోమము ఎంతో శక్తివంతమైనది. ఈ హోమం ఆరోగ్యపరమైన తీవ్ర సమస్యలను సైతం పారద్రోలుతుంది. ధీర్ఘ వ్యాధులు నుండి ఉపశమనం పొందుతారు.వ్యాపారంలో లాభాలు అమితంగా రావాలన్నా పితృదోషం ఉన్న జాతకులు ఈ పితృదోష నివృత్తి హోమమును తప్పక జరిపించాలి.

Saturday, March 27, 2021

అతిథి దేవోభవ

‘ఆతిథ్యం’ అంటే భోజనం పెట్టడం మాత్రమే కాదు.

ఆత్మీయంగా ఆదరించడం ఆతిథ్యంలోని ప్రధానాంశం. ఇంటి ముందుకొచ్చి అర్థించిన ముష్టివాళ్ళక్కూడా ఆహారం పెడతాం. కానీ, అది ఆతిథ్యం కాదు.

ఈ ప్రపంచంలో మనదంటూ ఏమీ లేదంటుంది యోగవాసిష్ఠం.

 సకలమూ బ్రహ్మస్వరూపమే. ఇచ్చేవాడు, పుచ్చుకొనేవాడు... రూపంలో భేదాలే తప్ప ఇద్దరిలోనూ ఒకే అంతర్యామి కొలువున్నాడు కదా! కనుక భేదం లేదు.

ప్రపంచంలో చెట్ల కన్నా మించిన ఆతిథ్య ధర్మం చూపగలవారు ఉండరు. ఎవరో నాటుతారు. ఇంకెవరో నీరు పోస్తారు. అవి కాలంతోపాటు చెలిమి చేస్తూ ఎదిగి వృక్షాలవుతాయి. పువ్వులు పూస్తాయి. కాయలు కాస్తాయి. పక్షులకు ఆశ్రయం, ఆహారం సమకూరుస్తాయి. బాటసారులకు నీడనిస్తాయి. చివరకు కట్టెలుగా మారి మనిషికి అక్కరకొస్తాయి.

ఇంతటి సేవాధర్మం నిర్వర్తిస్తూ, మౌనంగా జీవితం ప్రారంభించి, మౌనంగానే నిష్క్రమిస్తాయి. దత్తాత్రేయ గురుచరిత్రలో ఒక అవధూత, ప్రకృతిలో ఎందరో తనకు గురువులుగా చెబుతాడు. ప్రతి ప్రాణీ జీవితంలో ఉండే మౌన సందేశాలను అవధూత ఆకళింపు చేసుకుంటాడు. అంతకంటే గొప్ప ఆధ్యాత్మిక పరిపక్వత చూడలేం. ప్రాపంచిక దృష్టితో చూస్తే ఏదీ గొప్పగా అనిపించదు. వస్తువుల్ని, వ్యక్తుల్ని మన కొలబద్దతోనే కొలుస్తాం. మన దృష్టిని బట్టే అంచనాలు వేస్తాం.

శిలను శిల్పంగా మార్చినప్పుడు విలువ పెరుగుతుంది. బంగారం నగగా రూపొందినప్పుడూ అంతే. కొందరు సామాన్యులుగానే కనిపిస్తారు. కానీ, వారిలో అసమాన ప్రజ్ఞ దాగి ఉంటుంది.

వివేకానందుడు అమెరికా వెళ్లినప్పుడు ఆయన రూపం, వేషంకేసి అందరూ చులకనగా చూశారట. ఒక మహిళ ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది. వివేకానందుడి తొలి సంబోధనతోనే సభ హర్షధ్వానాలతో దద్దరిల్లి పోయిందని చెబుతారు.ఆయన జ్ఞాన జ్యోతి. కొన్ని తరాలకు సరిపడా జ్ఞాన సంపదను ఆయన జిజ్ఞాసువులకు వదిలి వెళ్ళాడు.

ప్రపంచంలో జీవితావసరాలు లభిస్తాయి. కానీ, జ్ఞానం అంత సులువుగా లభించదు. నచికేతుడి కథలో యముడు ఎన్ని విధాల ప్రలోభపెట్టినా, పట్టుదలగా అతడు జ్ఞానభిక్షనే కోరుకున్నాడు. అంతవరకు నిరాహారంగా, అతిథి మర్యాదలను తిరస్కరించాడు.

ప్రాణాధారమైన అన్నపానాలను గృహస్థు అతిథికి భక్తిశ్రద్ధలతో సమర్పించడాన్నే అతిథి యజ్ఞం అంటారు. అంటే, అతిథిని సంతృప్తిపరిస్తే యజ్ఞఫలం దక్కుతుందని అర్థం చేసుకోవాలి. అతిథి రూపంలో ఇంద్రుడు వచ్చి బీదగృహస్థు రంతిదేవుణ్ని పరీక్షించిన కథ సుప్రసిద్ధం. కుచేలుడికి కృష్ణుడు కేవలం స్నేహ వాత్సల్యమే చూపలేదు. అనితర సాధ్యంగా ఆతిథ్యమిచ్చాడు. స్వయంగా పాదాలు కడిగాడు. తన అష్టదేవేరుల చేత సేవలు చేయించాడు. అష్టైశ్వర్యాలూ అనుగ్రహించాడు.

ఇక్కడ మనం గమనించాల్సింది- ఆతిథ్యంలోని ఆత్మీయ భావనకున్న విలువ. ఆదిశంకరులకు గృహిణి ఒక్క ఉసిరికాయను భక్తితో సమర్పించి, కనకధారా స్తోత్రానికి ప్రేరణనిచ్చింది. అదే ప్రపంచానికి కల్పవృక్షమైంది.

 
అతిథి తృప్తిపడినప్పుడు ‘అన్నదాతా సుఖీభవ’ అన్న ఒక్క మాటకున్న విలువ అమూల్యం. ఆ మాటను అంతర్యామి ఆశీస్సుగానే భావించాలి.

అతిథికి ఆకలి, దాహం తీర్చగల ఆహార పానీయాలు సమకూర్చగలిగితే చాలు. అవి ఖరీదైనవా, సామాన్యమైనవా అనే ప్రసక్తి తలెత్తదు. సర్వదేవతా స్వరూపిణిగా గోమాతను భావించినట్లే అతిథిని దైవ స్వరూపంగా భావించి ఆదరించడమే భారతీయ సంప్రదాయం. అతిథికి కులమతాలతో, జాతితో ఎలాంటి దుర్విచక్షణా చూపకూడదు. 

అప్పుడే అది అసలైన ఆతిథ్యం అవుతుంది.

Friday, March 26, 2021

Unknown Facts of Sabarimala Ayyappa Swamy

శబరిమల అయ్యప్పస్వామి గురించి మనకు తెలియని కొన్ని విషయాలు

శబరిమల అయ్యప్ప స్వామి చరిత్ర గురించి మనలో చాలా మందికి తెలుసు. కానీ శబరిమల ఆలయ విశిష్టత, విశేషాలు , ఇప్పుడున్న ఆలయాన్ని ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు అనే అనేక విషయాలు మనలో చాలా మందికి తెలియదు.
ఆరోజుల్లో శబరిమల వెళ్ళడానికి ఎరుమేలిమార్గం అనే ఒకే ఒక దారి ఉండేది. నెలసరి పూజలకు ప్రత్యేకపూజలకు ఆలయ సిబ్బంది, తాంత్రి, మేల్ శాంతి ఈ మార్గంలో వెళ్ళివచ్చేవారు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్ళడం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తోంది.

సుమారు 200 సంవత్సరాల క్రితం అంటే (1819)లో 70 మంది శబరిమల యాత్ర చేసారని, ఆ సంవత్సర ఆదాయం ఏడురూపాయలని పందళరాజు వంశీయుల రికార్డులలో ఉంది. 1907వ సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పైకప్పు (గర్భగుడి) ఎండుగడ్డి, ఆకులతో కప్పబడివుండేది. అప్పుడు అక్కడ శిలా విగ్రహానికే పూజలు జరిగేవి. 1907-1909 మధ్యకాలంలో దేవాలయం అగ్నికి ఆహుతి అవడంతో మరల దేవాలయాన్ని పునఃనిర్మించినట్లు తెలుస్తోంది.

ఈసారి శిలా విగ్రహానికి బదులు, అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్టించారు. పంచలోహావిగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగింది. ఈ దేవాలయం 1935 వరకు తిరువాంకూరు మహారాజా సంస్థానంవారి ఆధీనంలో ఉండేది. 1935లో దీనిని తిరువాంకూరూ దెవస్థానం బోర్డువారికి అప్పగించబడింది. ఆ తరువాతే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కొరకు కూడా శబరిమలలో దేవాలయం తెరవడం మొదలుపెట్టారు.

చాలక్కాయమార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడి తరువాత పంబా ప్రాజెక్టు నిర్మాణంలో శబరిమలకు వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. అనంతరం 1945వ సంవత్సరం నుండి భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో విషు, పంకుని ఉత్తారం, ఓణం వంటి పండుగదినాలలొ కూడా తెరవడం ప్రారంభించారు.

శబరిమలకివెళ్ళే భక్తులు పెరగడాన్ని చూసి కొందరికి కన్ను కుట్టి 1950లో దెవలయాన్ని, విగ్రహాన్ని ధ్వంసం చేసారు. అలా పరశురామ నిర్మితమైన దేవాలయం మూడుసార్లు అగ్నికి ఆహుతి అయింది. దేవస్థానం బోర్డు, భక్తుల విరాళాలతో ఇప్పుడున్న దేవాలయాన్ని పునఃనిర్మించి ఇప్పుడున్న పంచలోహ అయ్యప్ప విగ్రహాన్ని చెంగనూరు వాస్తవ్యులు శ్రీ అయ్యప్పన్, శ్రీనీలకంఠన్ అనే శిల్పులిరువురూ కలిసి రూపుదిద్దారు.

దేవస్థానం ముఖ్యతాంత్రి శ్రీకాంతారు శంకర తాంత్రి 1951 జూన్ నెలలో (07-06-1951) వేదపండితుల మంత్రాలమధ్య, భక్తుల శరణుఘోష మద్య ప్రతిష్ఠ జరిగింది. అప్పటి వరకు కేరళీ కేళివిగ్రహంగా కీర్తించబడిన అయ్యప్ప భారతీకాళి విగ్రహంగా కీర్తించబడి, నేడు భూతళీకేళివిగ్రహంగా ప్రపంచమంతటా కీర్తించబడుతున్నాడు.

శబరిమల తపస్వి శ్రీవిమోచనానందస్వామి కృషి ఎంతో మెచ్చుకోదగ్గది. 
1950లో శబరిమల అయ్యప్ప ఆలయం అగ్నికి ఆహుతి అయినప్పుడు, శ్రెవిమోచనానందస్వామి హిమాలయాలలో సంచరిస్తున్నారు.బదరీనాథ్ లో ఈ వార్త విని ఒక్క శబరిమలలో దేవాలయన్ని ధ్వంసం చేసారు, కానీ, భారతదేశమంతటా అయ్యప్ప దేవాలయాలు నిర్మించి, అతిత్వరలో ప్రపంచమంతటా నిన్ను కీర్తించేటట్లు చేస్తానని శపథం చేసి, ఆ మహానుభావుడు కాశీ, హరిద్వార్, పూనా, బొంబాయి, కరుపత్తూరు, శ్రీరంగపట్టణం, మున్నగు పట్టణాలలో అయ్యప్పదేవాలయాలు నిర్మించడానికి దోహదం చేసారు. నేడు ఆయన కోరిక నెరవేరి దేశమంతటా ఎన్నొ అయ్యప్ప దేవాలయాలు నిర్మించారు.నేడు శబరిమల యాత్రకు భారతీయులే కాక విదేశీయులూ వచ్చి దర్శించుకోవడం విశేషం.

శబరిమలకు వచ్చే భక్తులు పెరగడంతో 1980 నుండి దేవస్థానం బోర్డువారు శ్రద్ధ తీసుకొని పంబపై వంతెన, పంబ నుండి విద్యుద్దీపాలు, మంచి నీటి కొళాయిలు, స్వాముల విశ్రాంతి కోసం పెద్ద షెడ్లు నిర్మించారు.

1984 వరకు పదునెట్టాంబడిని ఎక్కడానికి పరశురామ నిర్మితమయిన రాతిమెట్లపైనుండే ఎక్కేవారు. వారువెళ్ళే పడిని బట్టి ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కే ఆచారం ఉండేది. మెట్లు అరిగిపోయి, అన్ని మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన భక్తులు అనేక ఇబ్బందులకు గురికావడం చూసి, భక్తుల విరాళాలతో పదునెట్టాంబడికి 1985వ సంవత్సరంలొ పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పడం జరిగింది. దీనివలన 18 మెట్లు ఎక్కడం సులభరతమైంది. భక్తుల రద్దీ పెరగడం వలన తొక్కిసలాటలు లేకుండా ఉండటానికి వీలుగా, 1982లో ప్లై ఓవరు బ్రిడ్జి కట్టి దానిపై నుండి పదునేట్టాంబడి ఎక్కిన తర్వాత క్యులో వెళ్ళడానికి ఏర్పాటు చేసారు.

కొండపైనుండి మాలికాపురత్తమ్మ గుడివరకు ప్లైఓవరుబ్రిడ్జి కట్టడం వలన యాత్రీకులు తిరగడానికి వీలుగావుంది. 1989-90లోనే పంబామార్గంలో కొంతభాగం, సన్నిధానం ఆవరణలో మొత్తం భాగం సిమెంటు కాంక్రీటు చేసి, బురద లేకుండా చేసి భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా తయారు చేసారు.

1985 నుండి పక్కా బిల్డింగులెన్నో అక్కడ నిర్మించబడి, శబరిమల స్వరూపాన్ని మార్చాయి. బెంగళూరు భక్తుడొకరు శబరిమలగర్భగుడిపైన, చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయడానికి పూనుకొని 2000 సంవత్సరంలో పూర్తిచేయడంతో శబరిమల స్వర్ణదేవాలయంగా మారింది.శబరిమలలో వంశపారంపర్య ముఖ్యపూజారిని తాంత్రి అని పిలుస్తారు. వీర్ని పరశురాముడు పూజ కొరకు ఆంధ్రాలో కృష్ణాజిల్లా నుండి తీసుకెళ్ళారని చెబుతారు. ప్రస్తుతం, శ్రీరాజీవ్ తాంత్రి ఆధ్వర్యంలో శబరిమల దేవాలయంలో పూజలు జరుపబడుతున్నాయి. శబరిమల దేవాలయంలో పూజలు జరిపించడానికి మేల్ శాంతిని (పూజారి) ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎన్నుకొంటారు. దేవస్థానంవారికి వచ్చిన దరఖాస్తులని పరిశీలించి పదింటిని సెలక్టు చేసి వారి పేర్లను రాసి ఒక డబ్బాలో ఉంచి,అయ్యప్ప విగ్రహం ముందుంచి ఒక చిన్నపిల్లవాని చేత లాటరీ తీయిస్తారు. ఎవరు పేరు వస్తే, వారు ఆ సంవత్సరనికి మేల్ శాంతిగా శబరిమలలో వ్యవహరిస్తారు.

స్వామి వారి ఆభరణాలను పందళంలో భద్రపరచి ఉంచుతారు. ప్రతీయేటా జనవరి 14 తారీఖునాటికి (మకరసంక్రాంతి) శబరిమల మూడుపెట్టెలలో పందళం నుండి 84 కిలోమీటర్లు ఆడవులలో నడుచుకొని మోసుకువస్తారు. ఈ ఆభరణాలు తేవడానికి పందళంలో భాస్కరన్ పిళ్ళే వారి కుటుంబం ఉంది. వీరు మొత్తం 11 మంది. దీక్షలో ఉండి (65 రోజులు) తిరువాభరణాలను శబరిమల మోసుకువస్తారు.

వీరు జనవరి 12 మధ్యాహ్నం పందళంలో బయలుదేరి మధ్యలో రెండు రాత్రిళ్ళు విశ్రాంతి తీసుకొని, 14 తారీఖున సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానం చేరుతారు. ఆభరణాల వెంట పందళరాజు వంశస్తులలో పెద్దవాడు కత్తి పట్తుకొని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరు ఆభరణాలు స్వామివారికి అలంకరించి కర్పూరహారతి గుళ్ళో ఇవ్వగానే తూరుపుదిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది. పదునెనిమిది మెట్లు ఎక్కడానికి ఇరుముడి లేకుండా తాంత్రీ, పందళరాజు, తిరువాభరణాలు మోసేవారు ఎక్కుతారు. 
మరల జరవరి 20వ తారీఖునాడు పందళరాజు వెంటరాగా తిరువాభరణాల మూడు పెట్టెలను తిరిగి పందళం తీసుకు వెళ్ళి భద్రపరుస్తారు.

అయ్యప్ప భక్తజనవత్సలుడు. ఆయన అనుగ్రహం ఉంటే మనం సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఆయనను ఒకసారి దర్శించుకున్న భక్తులు మళ్ళీ మళ్ళీ ఆయన దర్శనం కోసం మరొక సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అదీ ఆయన మహిమ.

ఓం స్వామియే శరణమయ్యప్ప

నమస్కార విధానం

👉 నమః - అనగా త్యాగమని వాచ్యార్థం. నేను నీకంటే తక్కువవాడను. నీవు నాకంటే గొప్పవాడవు అనే 'దాస్యభావం' (దైవానికి దైవవిషయాలకు) స్ఫురిస్తుంది.

👉 'నాకు నేను ఉపయుక్తుడను కాను', కాబట్టి, నీవే నన్ను ఉద్దరించగలవాడవు అని 'ఆత్మార్పణము చేసుకోవటం' అనునిక అపూర్వయోగాన్ని 'నమః' అను పదం సూచిస్తోంది. తన నికృష్ణతను, పూజ్యడగువాని ఉత్కృష్ణతను చూపటానికి నమస్కారంలో ఓ రహస్యం ఉంది. నమస్కారం వంటి తారక మంత్రం ఇంకొకటి లేదు. శత్రువు యొక్క శత్రుభావాన్ని సమూలంగా పోగొట్టగల శక్తి ఈ నమస్కారానికి ఉంది. నమస్కారంతో సకలార్థసిద్ధిని పొందవచ్చు.

👉 శ్రీకృష్ణ పరమాత్మకు ఒక్కసారి నమస్కరించితే పది ఆశ్వమేథయాగాల అనంతరం చేయబడు అవభృథస్నానంతో సమానమని, భారతంలో చెప్పబడింది.

👉 నమస్కారం వలన దైన్యభావం అలవడతాయి. దీనిచే మనలోని అహంకారం తగ్గుతుంది. దైన్యమనగా (నిరాడంబరత) సేవాభావమని అర్థం. సేవాభావం వలన, భగవద్భక్తి పెంపొంది, భగవంతునిపట్ల ఆరాధనాభావం కలుగుతుంది. అట్టి ప్రేమారాధానమే 'భక్తి'. అట్టి భక్తితో సాధింపరాని సిద్ధులు లేవు. భక్తియే ఆత్మా సాక్షాత్కార జ్ఞానానికి మూలం. పరమభాక్తియే మోక్షప్రాప్తికి ఉత్తమ సాధనం. నమస్కారము – కాయకము, వాచికము, మాసికము అని మూడు విధాలు.

*1. కాయకము:*
👉 ఇది శారీరకమైనది, రెండు అరచేతులు కలిపి చేసే నమస్కారం. పడుకుని అష్టాంగాల్ని నేలపైమోపి చేయబడు సాష్టాంగ నమస్కారం, మరియు ధ్యాన ముద్ర నమస్కారము. (ఎడమబోటనివేలిపై కుడి బొటనవేలు ఉంచి, పరస్పరం పట్టుకుని, ఇతర వ్రేళ్ళను సాచి ఉంచితే మహాముద్ర అవుతుంది) ఈ ధ్యానముద్ర నమస్కారంతో, భావంతుని దానించితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి.

*2. వాచికము:*
👉 నోటితో ఉచ్ఛరించునది. 'నమః', 'నమస్కారము' మొదలగు శబ్దములతో మనమనోభావాన్ని తెలుపటం.

*3. మాసికము:*
👉 దైవంపట్ల, మనఃపూర్వకమైన 'నమస్కార' భావమును మనస్సునందే ఏకాగ్రతతో తలచుట.

👉 ఏవిధమైన నమస్కారమైనప్పటికీ ఆత్మార్పణ చేసుకొనుటయే అవుతుంది. కాయక నమస్కారంతో (శారీరక నమస్కారాలు) అష్టాంగము, పంచాంగము, త్రయ్యంగము, ఏకంగము అని నాలుగు విధానాలున్నాయి.

*అష్టాంగ నమస్కారము:*
👉 అష్టాంగ నమస్కారం ఉత్తమమైనది, ముఖ్యమైనది, తప్పని సరిగా ఆచరించవలసినది.

👉 *'శిరోహస్తౌచ కర్ణౌచ చుబుకమ్ బాహు యుగ్మం అష్టాంగ చ నమస్కారమ్'*

👉 అనగా ........ శిరస్సు, రెండుచేతులు, రెండుచెవులు, గడ్డం, రెండు భుజాలు వీనిని నేలపై ఆనించి చేయబడు నమస్కారం 'అష్టాంగము' అని చెప్పబడుతోంది.

👉 *దేవతలకు, గురువులకు, పెద్దలకు ఈ విధమైన నమస్కారం చేయాలి. (స్త్రీలు ఈవిధమైన నమస్కారాన్ని చేయరాదు).*

*పంచాంగ నమస్కారము:*
👉 ' శిరోహస్తౌచ బాహుచ కృత్యా జానునీ, సంస్థితా ఇదం పంచాంగ మేవోక్తమ్'

👉 అనగా శిరస్సు, రెండుచేతులు, రెండు భుజాలు, మోకాళ్ళు నేలపై ఆన్చి (మోకాళ్ళపై వంగి) చేయబడు నమస్కారం పంచాంగ నమస్కారమని పిలువబడుతోంది. 

*ఈ విధమైన నమస్కారం స్త్రీలకు ఉత్తమమైనది.*

*త్రయ్యంగ నమస్కారము:*
👉 'హస్తౌ బద్ధ్వాతు ముకళ వమ్మార్నిదేశేనియోజయేత్'

👉 రెండుచేతులు ముకుళించి (జోడించి) తలపై ఉంచి చేయబడుతున్న నమస్కారం త్రయ్యంగ నమస్కారం.

*ఏకంగా నమస్కారము:*
👉 ' ఏకాంగంతు నమస్కారం శిరసైనా కృతాభవేత్'

👉 తలను మాత్రం వంచి చేయబడు నమస్కారం 'ఏకాంగ' నమస్కారమని పిలువబడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే (చేతులను జోడించి నమస్కరించ లేని పరిస్థితులలోనే) ఈ పద్ధతిలో నమస్కరించాలి.

👉 'గురువు'కు ఈ క్రింది విధంగా నమస్కరించటం శ్రేయస్కరం.

👉 ' వ్యత్యప్త పాణినా కార్యమున సంగ్రహణం గురోః |
సవ్యేన సవ్యః స్పృష్టవ్యో దక్షిణేవ చ దక్షణ:|'

👉 అనగా రెండు చేతులులను మార్చి పట్టుకుని (అనగా కుడిచేతిలో గురువు యొక్క కుడిపాదాన్ని, ఎడమచేతిలో గురువుయొక్క ఎడమపాదాన్ని) పట్టుకుని నమస్కరించాలి.

👉 మీ పాదపద్మాలే నాకు శరణ్యమనే భక్తి భావనతో గురువుకు నమస్కరించాలి.

👉 ' ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాంకరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాం గముచ్యతే'

👉 వక్షఃస్థలాన్ని, శిరస్సును భూమికితాకించి, దృష్టితో దైవాన్ని చూస్తూ, మనస్సులో దైవమును ప్రార్థన చేస్తూ, 'నమః' అని పలుకుతూ, రెండు పాదాగ్రాలను కలుపుతూ, రెండు చేతులతో నమస్కరిస్తూ, రెండు చెవులను నేలకు తాకిస్తూ బోర్లపడి నమస్కరించటం 'సాష్టాంగ నమస్కారం' అనబడుతుంది.

👉 ఈ విధమైన నమస్కారంలో కాయికము, వాచికము, మానసికము అనబడు త్రివిధాలైన నమస్కారాలు అంతర్గర్భితాలై ఉన్నాయి.

👉 అనగా మనస్సు చేత చింతించుట, వాక్కుచే 'నమః' అని అనటం, బోర్లగిలి అష్టాంగనమస్కారం చేయుట కలిసున్నాయి. ఇంకా రెండుచేతులు, రెండుకాళ్ళు, వక్షస్థలం, నొసలు, రెండు భుజాలు మొత్తం ఎనిమిది అంగాలను నేలకు తాకుతున్నట్లు బోర్లగిలి నమస్కరిస్తున్నందువల్ల 'సాష్టాంగ నమస్కారం' అని పిలువబడుతోంది. ఈవిధమైన 'సాష్టాంగ నమస్కారం' శ్రేష్టమైనది.

👉 స్త్రీలు సాష్టాంగ నమస్కారాలు చేయరాదు.

👉 నమస్కారాలు చేయటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మొక్కుబడిగా, హడావుడిగా కాక మనస్ఫూర్తిగా నమస్కరించాలి.

👉 రెండు చేతులను పూర్తిగా కలిపి హృదయస్థానాన్నిగాని, నుదుటనుగాని స్పర్శిస్తూ నమస్కరించాలి. నమ్రతభావనతో నమస్కరించాలి.

👉 ఇవన్నీ పూర్తిగా పాటించి నమస్కరిస్తేనే 'నమస్కారం' యొక్క నమ్రతాక్రియకు పరిపూర్ణత సిద్ధిస్తుంది. 3,5,7,9,12 సంఖ్యలలో నమస్కారాలు చేయడం శ్రేయస్కరం.

ఏకాదశులు - ఫలితాలు

01. చైత్ర శుక్ల ఏకాదశి – ‘కామదా’ - కోర్కెలు తీరుస్తుంది.

02. చైత్ర బహుళ ఏకాదశి - 'వరూధిని' - సహస్రగోదాన ఫలం లభిస్తుంది.

03. వైశాఖ శుద్ధ ఏకాదశి - 'మోహిని' - దరిద్రుడు ధనవంతుడగును.

04. వైశాఖ బహుళ ఏకాదశి - 'అపర' - రాజ్యప్రాప్తి.

05. జ్యేష్ఠ శుక్ల ఏకాదశి - 'నిర్జల' - ఆహారసమృద్ధి.

06. జ్యేష్ఠ బహుళ ఏకాదశి - 'యోగినీ' - పాపాలను హరిస్తుంది.

07. ఆషాఢ శుద్ధ ఏకాదశి - 'దేవశయనీ' - సంపద-ప్రాప్తి (విష్ణువు యోగనిద్రకు శయనించే రోజు).

08. ఆషాఢ బహుళ ఏకాదశి - 'కామిక' - కోరిన కోర్కెలు ఫలిస్తాయి.

09. శ్రావణ శుక్ల ఏకాదశి - 'పుత్రదా' - సత్సంతాన ప్రాప్తి.

10. శ్రావణ బహుళ ఏకాదశి - 'అజ' - రాజ్య, పత్నీ, పుత్ర ప్రాప్తి మరియు అపన్నివారణం.

11. భాద్రపద శుద్ధ ఏకాదశి – ‘పరివర్తన' - యోగసిద్ధి (యోగనిద్రలో విష్ణువు ప్రక్కకు పొర్లును కనుక పరివర్తన).

12. భాద్రపద బహుళ ఏకాదశి - 'ఇందిరా' - సంపదలు, రాజ్యము ప్రాప్తించును.

13. ఆశ్వయుజ శుక్ల ఏకాదశి - 'పాపాంకుశ' - పుణ్యప్రదం.

14. ఆశ్వయుజ బహుళ ఏకాదశి - 'రమా' - స్వర్గప్రాప్తి.

15. కార్తిక శుక్ల ఏకాదశి - 'ప్రభోదిని' - జ్ఞానసిద్ధి (యోగనిద్ర నొందిన మహావిష్ణువు మేల్కొనే రోజు).

16. కార్తిక కృష్ణ ఏకాదశి - 'ఉత్పత్తి' - దుష్టసంహారము (మురాసురుని సంహరించిన కన్య విష్ణు శరీరము నుండి జనించిన రోజు).

17. మార్గశిర శుక్ల ఏకాదశి - 'మోక్షదా' - మోక్షప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).

18. మార్గశిర కృష్ణ ఏకాదశి - 'విమలా' (సఫలా) - అజ్ఞాననివృత్తి.

19. పుష్య శుక్ల ఏకాదశి - 'పుత్రదా' - పుత్రప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).

20. మాఘ కృష్ణ ఏకాదశి - 'కల్యాణీ' (షట్తిలా) - ఈతిబాధ నివారణం.

21. మాఘ శుక్ల ఏకాదశి - 'కామదా' (జయా) - శాప విముక్తి.

22. మాఘ కృష్ణ ఏకాదశి - 'విజయా' - సకల కార్య విజయం (ఇది భీష్మ ఏకాదశి).

23. ఫాల్గుణ శుక్ల ఏకాదశి - 'అమలకీ' - ఆరోగ్యప్రదం.

24. ఫాల్గుణ కృష్ణ ఏకాదశి - 'సౌమ్యా' - పాపవిముక్తి

చండీ యాగం ఎందుకు చేస్తారు

యాగం అంటే అదో పెద్ద క్రతువు. వేదకాలంలో మాత్రమే సాధ్యమయ్యే ఆచారం. కానీ యాగానికి వచ్చే ఫలితం దృష్ట్యా ఇప్పటికీ కొందరు ఎన్ని వ్యయప్రయాసలకి ఓర్చయినా సరే యాగం చేయాలని సంకల్పిస్తూ ఉంటారు. వాటిలో ప్రముఖంగా వినిపించేది చండీయాగం!

ఎవరీ చండి?

చండి అంటే ‘తీవ్రమైన’ అన్న అర్థం వస్తుంది. అందుకనే సానుకూలమైన, ప్రతికూలమైన మాటలు రెండింటికీ ఈ పదాన్ని వాడతారు. చండి అన్న దేవత గురించి పురాణాలలో అనేకమైన ప్రస్తావనలు కనిపిస్తాయి. పూర్వకాలంలో శుంభ, నిశుంభులు అనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు, చండి అవతారాన్ని ధరించిందట. తన శౌర్యంతో ఆమె శుంభ, నిశుంభులనే కాకుండా వారి సేనాధిపతులైన చండముండాసురులను కూడా సంహరించింది.

పూజలు:

చండీదేవినీ, ఆమె తేజోరూపమైన చాముండీదేవినీ కొలిచేందుకు దేశంలో చాలా ఆలయాలే ఉన్నాయి. హరిద్వార్లో ఆదిశంకరాచార్యులు నిర్మించినట్లుగా చెబుతున్న ఆలయం దగ్గర నుంచీ, మైసూరు పాలకులు నిర్మించిన ఆలయం వరకూ ఈ తల్లిని కొలుచుకునేందుకు ప్రత్యేకమైన క్షేత్రాలు ఉన్నాయి. ఆంతేకాదు! గ్రామదేవతగా, కులదేవతగా కూడా చండీదేవికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఇక సప్తమాతృకలలో ఒకరుగా, 64 తాంత్రిక దేవతలలో ముఖ్యురాలిగా... తంత్ర విద్యలలో కూడా చాముండేశ్వరిది ప్రత్యేక స్థానం.

చండీయాగం

మార్కండేయ పురాణంలో దుర్గాదేవిని స్తుతిస్తూ సాగే ఏడువందల శ్లోకాల స్తుతిని దుర్గాసప్తశతి అంటారు. దీనికే చండీసప్తశతి అని కూడా పేరు. హోమగుండంలో అగ్నిప్రతిష్టను గావించి ఈ దుర్గాసప్తశతి మంత్రాలను జపించడంతో చండీయాగం సాగుతుంది. చండీదేవికి ప్రీతిపాత్రమైన నవాక్షరి వంటి మంత్రాలను కూడా ఈ సందర్భంగా జపిస్తారు. యాగంలో ఎన్నిసార్లు దుర్గాసప్తశతిని వల్లెవేస్తూ, అందులోని నామాలతో హోమం చేస్తారో... దానిని బట్టి శత చండీయాగం, సహస్ర చండీయాగం, ఆయుత (పదివేలు) చండీయాగం అని పిలుస్తారు.

విశేష ఫలం:

పూర్వం రాజ్యం సుభిక్షంగా ఉండాలనీ, ప్రజలంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలనీ, ఆపదలు తొలగిపోవాలనీ, శత్రువులపై విజయం సాధించాలనీ.... చండీయాగం చేసేవారు. రాచరికాలు పోయినా, చండీయాగం పట్ల నమ్మకం మాత్రం ఇంకా స్థిరంగానే ఉంది. అందుకే ఇప్పటికీ స్తోమత ఉన్నవారు, రాజకీయ నాయకులు ఈ యాగాన్ని తలపెడుతూ ఉంటారు.

Sloka To avoid Bad Dreams

నిద్రించే సమయంలో దుస్వప్నాలు (చెడుకలలు) రాకుండా ఉండేందుకు

“రామం స్కంధం హనుమంతం
వైనతేయం వృకోదరం
శయనేయః పఠేనిత్యం
దుస్స్వప్నం తస్యనశ్యతి” అనే శ్లోకాన్ని పఠించాలి.

ఆనారోగ్యంవల్ల ఏమైనా మందులు వేసుకునే సమయంలొ ఈ క్రింది శ్లోకాన్ని పఠించాలి.

“ధన్వంత్రిణం గరుత్మంతం – ఫణిరాజంత చ కౌస్తుభం|
ఆచ్యుతం చామృతం చంద్రం – స్మరేత్ ఔషధ కర్మణీ|
శరీరే జర్ఘరీ భూతే – వ్యాధిగ్రస్తే కళేబరే|
ఔషధం జాహ్నవీతోయం -వైద్యోనారాయణోహరిః||

 ప్రతినెలా అమావాస్య తర్వాత వచ్చే క్రొత్తనెలలో చంద్రుదు ఉదయిస్తాడు. ఉదయిస్తున్న చంద్రబింబాన్ని నెలబాలుడు అని పిలుస్తారు. సాధారణంగా నెలబాలుని ఆకాశంలో చూస్తూనే, దేవుడి ఫోటోను గానీ ఇష్టమైనవారి ముఖాన్నిగానీ చూస్తుంటారు. అంతేకాకుండా, నూలు పోగును తీసి చంద్రుని వైపు వేస్తుంటారు.
అలాగే నెలబాలుని దర్శిస్తూనే ఈ క్రింది శ్లోకాన్ని పఠించడం మంచిది.

“క్షీరసాగర సంపన్న లక్ష్మీప్రియ సహోదర
హిరణ్మకుట వాసాయా బాలచంద్ర నమోస్తుతే||”

చీమ - బాతు- హంస - Ramakrishna paramahamsa

చీమ - బాతు- హంస

 రామకృష్ణ పరమహంస అంటారు. ... నేను జీవితంలో కొన్నిటిని చెపుతాను. వాటిని ఆదర్శంగా పెట్టుకో. ఇంతకన్నా ఆదర్శమైనవి నీకు ప్రపంచంలో అక్కర్లేదు. అంటారు. 

అవి ఏమిటి? 

మొదటిది చీమ. చీమను నీవు ఆదర్శంగా తీసుకో. 

కొంచెం పంచదార, కొంత ఇసుక కలిపి అక్కడ పోస్తే చీమ పంచదార రేణువులను మాత్రమే తీసుకువెళుతుంది. ఇసుక రేణువులను వదిలివేస్తుంది. 

ఈ జగత్తులో సారవంతమైన విషయమును గ్రహించి అసారవంతమైన విషయమును విడిచి పెట్టడం నేర్చుకోవాలి. 

సారవంతమైన విషయమును లోపల పదిలపరచుకోవడం నేర్చుకోవాలి.

     రెండు.... బాతులా బ్రతుకు

. బాతు తెల్లగా ఉంటుంది. కానీ బాతు బురదలో ఉంటుంది. ఆ బాతు మీద బురద చుక్క వచ్చి పడుతుంది. అది శరీరమును దులుపుకుం టుంది. వెంటనే బురద చుక్క జారి కింద పడిపోతుంది. 

తెల్లటి మల్లెపువ్వులా ఉండే బాతు ఎప్పుడూ బురదలో ఉంటుంది. కానీ దానికి బురద అంటడం లేదు.

 మనలో చాలామంది ... నేను ఫలానా వాళ్ళతో తిరిగి ఇలా పాడైపోయాను. నేను ఇలా పాడైపోవడానికి కారణం వాళ్ళే. నా సాంగత్యం మంచిది కాదు. నేను అలాంటి వాళ్ళతో ఉన్నాను... అని అంటూ ఉంటారు. 

కానీ అలా అనకూడదు. బురదలో ఉన్న బాతుకి బురద అంటలేదు. మరి నీకెందుకు చెడ్డ గుణములు అంటుకోవాలి? నీవు మనసులో స్వచ్ఛంగా ఉంటే , ఇతరులను మార్చగలవేమో కానీ ఇతరులు నిన్ను మార్చలేరు. నీ దగ్గర ధీశక్తి లేనప్పుడే నీవు ఇతరులు చెప్పిన మాటలకు లొంగిపోతావు. నీది పిరికి మనసు. అటువంటపుడు నీవు తొందరగా దుర్గుణములకు వసుడవు అయిపోతావు. నీ మనసు బలహీనమై నది. దానిని పదిలం చేసుకోవడం మానివేసి, శక్తిమంతము చేసుకోవడం మానివేసి, చీడా పీడా తొలగించడం మానివేసి, నీవు పాడవడాని కి ఇతరుల యందు దోషమును ఆరోపిస్తున్నావు. అది మరొక పెద్ద దోషం. కాబట్టి నీవు బాతులా ఉండడం నేర్చుకో. 

     మూడు.... హంస... నీవు హంసలా ఉండడం నేర్చుకో.

 హంస పాలను, నీటిని కలిపి పెడితే పాలను తీసుకుని నీటిని విడిచిపె డుతుంది. జగత్తునందు బ్రహ్మమును దర్శనం చేసి, జగత్తును విడిచిపెట్టడం అలవాటు చేసుకో. 
ఈ మూడింటిని అలవాటు చేసుకుంటే ఇంతకన్నా గొప్ప విషయం అక్కర్లేదు.

ఆత్మ నిగ్రహం

మనలోని అంతశ్శత్రువులను జయించాలంటే మహత్తరమైన మనోబలం తప్పనిసరి. చిత్తశుద్ధితో మనసును ఒక బిందువు వైపు కేంద్రీకృతం చేస్తేనే ఏకాగ్రత కుదురుతుంది. దీన్నే ప్రస్తుతం యోగా అంటున్నాం. ధ్యానం, తపస్సు అన్నా ఇదే

మనోబలానికి ఆత్మనిగ్రహం ఇంధనం. ఇది సాధించడం అంత సులువేమీ కాదు. భృగు, దూర్వాస, విశ్వామిత్రుల వంటి మహర్షులే కొన్ని సందర్భాల్లో కామ, క్రోధాది రాగద్వేషాలకు లోనయ్యారు. ఆత్మనిగ్రహానికి నిలువెత్తు దర్పణం శ్రీరాముడు. మానవుడు ఈ సమాజంలో ఎలా మసలుకోవాలో ఆచరించి చూపిన దైవస్వరూపుడాయన. లీలా మానుష విగ్రహధారి శ్రీకృష్ణుడు మానవాళి ఏం చేయాలో చెప్పి గీతాచార్యుడయ్యాడు. దృఢసంకల్పంతో ఆత్మనిగ్రహం సాధించినవారు ఈ కాలంలోనూ ఉన్నారు. సత్యమార్గంలో అహింస అనే ఆయుధంతో అతిపెద్ద దేశాన్ని బంధవిముక్తం చేసినవాడు మహాత్మాగాంధీ

ప్రపంచాధిపత్యం కోసం అర్రులు చాచిన అలెగ్జాండర్, హిట్లర్ వంటివారు లోపలి రాగద్వేషాలను జయించలేక పరాజితులయ్యారు. సాధనతో సాధ్యం కానిది లేదు ఎంతటి వారికైనా క్రోధం, స్వార్థం వంటి గుణాలు వెన్నంటే ఉంటాయి. అవి ప్రకోపించినప్పుడే ఆత్మనిగ్రహం అవసరమవుతుంది. వ్యక్తిత్వ వికాస బోధకులు ఈ అంశాన్నే తరచూ ప్రస్తావిస్తుంటారు.

మన దైనందిన జీవితాల్లో ఉద్యోగ, వ్యాపార సంబంధాల కారణంగా అనేకమందితో మాట్లాడవలసి వస్తుంది. వారందరూ మునులు, యోగులు కారు! అది గుర్తెరిగి మనమే ఆత్మనిగ్రహం పాటించాలి ఆవేశం అనర్థదాయకం- సహనం సర్వజనామోదం' అన్న సూక్తి అందరికీ తెలిసిందే. అయినా ఆచరణలో ఇది కనిపించదు. కారణం ఆత్మనిగ్రహ లోపం! ఆవేశం వల్లనే కోపం వస్తుంది. బుద్ధి మసకబారుతుంది. మాటలు పెళుసుబారుతాయి. పర్యవసానంగా అవతలి వ్యక్తుల్లోనూ ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఫలితం అనర్థం! అందుకే మనం శాంత స్వభావులం కావాలంటే మనోబలం పెంచుకోవాలి. ఏకాగ్రతతో ఆత్మనిగ్రహ సంకల్ప సాధనకోసం ఆలస్యం ఎందుకు? ఈ క్షణమే శుభముహూర్తం

The Wisdom of the Turtle: Moving Forward with Patience and Purpose

There is something quietly profound about watching a turtle move. Its steps are slow, steady, and deliberate, yet never meaningless. The wor...