పూర్వీకులు చేసిన పాపముల వల్ల పితృ దోషం ఏర్పడుతుంది. జాతకుని జన్మకుండలిలో ఏ గ్రహం వల్ల అయితే పితృ దోషం ఏర్పడిందో, ఆ గ్రహానికి సంబంధించిన అధి దేవతను ప్రార్థించి వేడుకోవాలి. పూజాది హోమ కార్యక్రమములు జరిపించాలి. ఆ విధంగా జరుపకుండా నిర్లక్ష్యం చేసినట్లైతే, ఈ పితృ దోషం జాతకుని తరువాత వచ్చే తరాల వారి జన్మకుండలిలో కూడా పితృ దోషం కనబడుతూ, ఆ పితృ దోషం యొక్క ప్రభావాన్ని ఎదుర్కొని బాధలు పడాల్సి ఉంటుంది.
జన్మకుండలిలో 9వ భావంలో పైశాచిక గ్రహాలు ఉన్నప్పుడు గాని లేదా నవమాధిపతి శత్రు, నీచ స్థానంలో లేదా వక్ర స్థితిలో ఉన్నప్పుడు గాని జాతకునికి పితృ దోషం ఉన్నట్టు నిర్ధారించాలి. రవి, చంద్ర, గురు, శని, రాహు, కేతు, బుధ గ్రహాలు ప్రత్యేక స్థానాలలో ఉన్నప్పుడు, ఆ గ్రహాల శత్రు గ్రహాలతో కలసి ఉన్నప్పుడు గాని, లేదా వక్ర స్థానంలో ఉన్నప్పుడు గాని పితృ దోషమును జన్మకుండలిలో జ్యోతిష్యులు గుర్తిస్తారు. పితృదోషమును ప్రేరేపించడానికి కొన్ని లగ్నాలకు రవి, కుజ, శని గ్రహాలు యోగ కారకులుగా వ్యవహరిస్తాయి. జన్మకుండలిలో పితృదోషం ఉన్నట్టు ఎప్పుడైతే గుర్తిస్తారో, వెంటనే వామతంత్ర ఆచారంలో పితృదోష నివారణా హోమమును జరిపించుకొని, దోష నివృత్తి చేసుకోవాలి.
*పితృదోషం వల్ల ఎలాంటి సమస్యలు ఏర్పడతాయి?*
పితృదోషం ఉన్న జాతకులకు శరీరకంగా, మానసికంగా అనుకోని చెడు ప్రభావాలు పడతాయి. శారీరకంగా వైకల్యం రావడం లేదా వ్యాధి బారీన పడటం లాంటివి జరుగుతాయి. ఏదైనా వ్యాధి పారంపర్యంగా తరువాతి తరం వారికి రావడం లాంటివి జరుగుతాయి. పితృదోషం ఉన్న జాతకుల కుటుంబములోని వ్యక్తులు పదే పదే చేతబడి ప్రయోగానికి గురి అవుతూ ఉంటారు. కారణంగా ఆరోగ్యం నశిస్తుంది.
*చదువు, వృత్తి, ఉద్యోగం పరంగా ఎదురయ్యే సమస్యలు:*
పితృదోషం ఉన్న జాతకులు ఎలాంటి పరీక్షల్లో అయినా ఫెయిల్ అవటం, పై చదువుల కొరకు ఎలాంటి ప్రోత్సాహం జాతకులకు లభించకపోవడం, చదువు పరంగా, వృత్తి పరంగా నిత్యం అపజయం పాలవటం, ఉద్యోగం స్థిరంగా ఉండకపోవడం, ప్రమోషన్లకు తీవ్రమైన ఆటంకాలు రావడం లాంటివి జరుగుతాయి.
పితృదోషం వల్ల భార్యా భర్తల మధ్య ప్రేమ తగ్గిపోవడం, వివాహం ఆలస్యం కావడం, వైవాహిక జీవితం సాఫీగా లేకపోవడం, శృంగార జీవితంలో ఆనందం లేకపోవడం వల్ల అసంతృప్తి కలగడం, సంతాన సాఫల్యత లేకపోవడం, పదే పదే గర్భస్రావాలు జరగడం, చిన్నతనంలోనే సంతానం మరణించడం, గోత్రం వంశం కొనసాగించేందుకు పుత్ర యోగం లేకపోవటం, దంపతుల మధ్య ప్రేమానుబంధం లేకపోవటం, వివాహేతర సంబంధాలు ఏర్పడటం, విడాకులు జరగడం లాంటి తీవ్రమైన సమస్యలు పితృ దోషం ఉన్న జాతకులకు ఎదురవుతాయి.
*ఆర్థికపరమైన సమస్యలు:*
ఆర్థిక పరమైన అభివృద్ధి లోపించడమే కాక, ఆర్థిక స్థిరత్వం ఉండదు. తీవ్రమైన అప్పులు ఎదురవడం వల్ల పేదరికం అనుభవించాల్సి వస్తుంది. పూర్వీకుల ఆస్తుల విషయాలలో ఎన్నో సమస్యలు వస్తాయి. డబ్బు రూపంలో వచ్చే లాభాలను చేతి దాకా వచ్చినా చేజార్చుకుంటారు.
*ముఖ్య గమనిక:*
జన్మకుండలిలో ఏ గ్రహం వల్ల పితృదోషం ఏర్పడిందో తెలుసుకోవాలి. ఎందుకనగా ఏ గ్రహం వల్ల అయితే పితృదోషం ఏర్పడిందో ఆ గ్రహ దశ, అంతర్దశ, గోచార సమయంలో ఈ దోష ప్రభావం జాతకులపై పడి, సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
*పరిహారం:*
పితృదోషం వల్ల ఇక్కడ వివరించిన సమస్యలు ఎదుర్కొంటున్న జాతకులు వెంటనే వామతంత్ర ఆచారం ప్రకారం పితృదోష నివృత్తి హోమమును ఖచ్చితంగా జరిపించుకోవాలి. ఈ పితృదోష నివృత్తి హోమమును జరిపిస్తే పితృదేవతలు తమ వారసుల పై తమ అనుగ్రహాన్ని కురిపిస్తారు. పితృదేవతలు తమ వారసులు నిర్వహించుకునే పనులలో విజయం సాధించుకునేందుకు పరోక్షంగా సహాయపడి వారికి విజయం చేకూరేలా అనుగ్రహిస్తారు. తత్కారణంగా పనులకు ఉన్న అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోయి విజయం లభిస్తుంది. వామతంత్ర ఆచారం ప్రకారం చేసీ పితృదోష నివృత్తి హోమము ఎంతో శక్తివంతమైనది. ఈ హోమం ఆరోగ్యపరమైన తీవ్ర సమస్యలను సైతం పారద్రోలుతుంది. ధీర్ఘ వ్యాధులు నుండి ఉపశమనం పొందుతారు.వ్యాపారంలో లాభాలు అమితంగా రావాలన్నా పితృదోషం ఉన్న జాతకులు ఈ పితృదోష నివృత్తి హోమమును తప్పక జరిపించాలి.
No comments:
Post a Comment