I am UNIQUE, AMAZING, ORIGINAL, STRONG, KIND & I'm who I am. REAL and SIMPLE. :-) MoSt Of AlL My LiFe Is SiMpLe AnD CoLoRfUl...
Saturday, December 11, 2021
తిరుమల - టీటీడీ పాలకమండలి నిర్ణయాలు
Tuesday, November 30, 2021
సహధర్మచారిణి
సనాతన ధర్మంలో భార్య అన్న పదానికి ఉన్న అనేక పదాలలో 'సహధర్మచారిణి' అన్నది విశిష్ట మైనది.
ధర్మయుతమైన భర్త మార్గాన్ని అన్నివిధాలా తాను అనుసరించి అనుగమించేది అని అర్థంచెప్పుకోవచ్చు. పెళ్లి నాటి ప్రమాణాలు ప్రకారం ధర్మేచ ,అర్థేచ, కామేచ భార్యాభర్తలదిద్దరిదీ ఒకే మార్గం అయితే ఆ దాంపత్యం అన్యోన్య సుఖదాయకంగా ఉంటుంది. ఈ ఆదర్శాన్ని చాటి చెప్పడానికే బ్రహ్మాది దేవతలు తమ సతీమణులకు సగౌరవ స్ధానాలిచ్చి ఆదర్శమూర్తులయ్యారు. తన చతుర్ముఖాలలో సరస్వతిని నిలిపాడు బ్రహ్మ దేవుడు.అంటే విధాత రసనాగ్రసీమను (బ్రహ్మ నాలుకనే వేదికగా చేసుకొని) వాణి వేదవాణిగా లాస్యమాడింది. ఇక విష్ణుమూర్తి తన వక్షస్థలం పై లక్ష్మీ దేవిని నిలుపుకొని ఆమెకు హృదయస్థానాన్ని ఇచ్చాడు. దీనర్థం స్వామిది సంకల్పం అయితే అమ్మ సిద్ధిదాత్రి అన్నమాట. వీరిద్దరినీ మించి తన మేనిలో సగభాగమిచ్చి అర్థనారీశ్వరుడయ్యాడు జగదీశ్వరుడు. అంటే తామిద్దరమూ అభిన్నమని విడదీయరానంతగా కలిసి ఉన్నామని తెలపడమే అర్ధనారీశ్వర తత్త్వ పరమార్ధం.
దీన్నే కాళిదాసు మహాకవి రఘువంశంలో
"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"
'జగత్తుకు తల్లిదండ్రులు ఆదిదంపతులు అయిన పార్వతీ పరమేశ్వరులు వాక్కు అర్థాలలాగా ఎప్పుడూ కలిసే ఉంటారు. వారు ఈ నా కావ్య రచనకు అర్థవంతములైన మంచి వాక్కులను ప్రసాదింతురుగాక!' అని నుతిస్తాడు. మాటను అనుసరించే అర్థం వచ్చినట్లుగా సతిపతులిద్దరూ ఒకరిననుసరించి మరొకరు నడుచుకోవాలి. అప్పుడే సంసారంలో ఆనంద సరాగాలు వెల్లివిరుస్తాయి.
లక్ష్మీ నారాయణులు, వాణీ హిరణ్యగర్భులు, శచీపురంధరులు, అరుంధతీ వసిష్ఠులు, సీతారాములు, రాధాకృష్ణులు అని భార్యలతో కలిపి భర్తల పేర్లు స్మరించడం లోకంలో పరిపాటి. కానీ ఒక్క పరమశివుణ్ణి మాత్రం సాంబశివుడని పిలిస్తే చాలు. స+ అంబ శివుడు అంటే అమ్మతో కూడిన అయ్య . పార్వతీ పరమేశ్వరుల రూపం లాగానే వారి పేర్లు కూడా ఒకటిగా కలిసి పోయాయి. తల్లి జగన్మాత - శివుడు జగదీశ్వరుడు అంటే ఆమె శక్తి - స్వామి శక్తి మంతుడు. దీనికర్థం ఏమిటంటే అమ్మవారి అండ లేనిదే పరమేశ్వరుడు కనీసం కదలను కూడా కదలలేదు. అందుకే సౌందర్య లహరిలో ఆదిశంకరులు అమ్మవారి తత్వాన్ని ఆవిష్కరించి త్రిమూర్తులకు సైతం వారి వారి శక్తి లేకపోతే చలనమే ఉండదు అని చెప్తారు.
సహధర్మచారిణి స్ధానాన్ని మించిన పదవి ధర్మపత్నికి లభించిందన్నమాట. ఇలా ఒక్కోసారి ఇల్లాలివల్లే ఇంటాయన గౌరవం కూడా పెరుగుతుందని ప్రాచీన స్తోత్రవాఙ్మయం నిరూపిస్తుంది.
"చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో
జటాధారీ కంఠేభుజగపతిహారీ పశుపతిః
కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం
భవానీ త్వత్పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదమ్"
"చితిలో బూడిదను భస్మంగా ధరిస్తాడు.విషాన్ని ఆహారంగా స్వీకరిస్తాడు.దిక్కులనే వస్త్రాలుగా ధరించిన దిగంబరుడు, జటలు కట్టిన వెంట్రుకలు గలవాడు, మెడలో విషసర్పాన్నే ఆభరణంగా ధరించినవాడు, కపాలాన్ని చేతదాల్చినవాడు, భూతాధిపతి,పశుపతి అన్నపేరున్నవాడు శివుడు. కానీ ఓ భవానీ! నిన్ను వివాహమాడి నందువల్లనే ఈశుడు జగదీశుడనే గొప్ప పదవిని పొందాడు" అని అంటారు ఆదిశంకర భగవత్పాదులు దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో. యమునితో పోరాడి పతిప్రాణాలను దక్కించుకున్న సతీసావిత్రి, త్రిమూర్తులనే పసిబిడ్డలు గా చేసి లాలించిన సతీ అనసూయ వంటి పతివ్రతా శిరోమణులకు నిలయం మన భారతదేశం.
శ్రీమద్రామాయణంలో అశోకవనంలో శోకిస్తున్న సీతామాతను గురించి చెబుతూ ఆదికవి వాల్మీకి పరమాత్మ కోసం పరితపించే జీవాత్మ లాగా సీతమ్మ ఉంది అంటాడు. జీవాత్మ పరమాత్మ బంధాన్నే దాంపత్య బంధంగా ఆదికావ్యం రామాయణం నిరూపిస్తుంది.
ఇలా భర్తలను ఆరాధించి, అనుసరించి, అనుగమించి జీవితాంతం సాహచర్యం అందించిన భారతీయ మహిళలు సర్వదా సమాదరణీయలు.
దైవం మానుషరూపేణ
తండ్రి ఆశీర్వాదం
Monday, November 29, 2021
త్రిచక్ర యాప్ - 3 Chakra Project
- తిరుపతి నగరంలోని ఆటోలకు ప్రత్యేక గుర్తింపు.
- త్రిచక్ర యాప్ ద్వారా ఆటో యొక్క వివరాలన్నీ నమోదు.
- ఆటో ప్రయాణికులకు ప్రత్యేక రక్షణ.
- తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్.
- నగరంలోని ఆటోలకు త్రిచక్ర యాప్ ద్వారా ప్రత్యేక గుర్తింపు.
- నగరములోని ఆటోల యజమానులు త్రిచక్ర యాప్ ను ప్లే స్టోర్ నందు డౌన్లోడ్ చేసుకోవాలి.
- ప్రతి ఆటో దారుడు తప్పకుండా పూర్తి వివరాలతో యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
- నకిలీ వాహనాలను సులభంగా గుర్తించే అవకాశం.
- ప్రయాణికులకు పూర్తిస్థాయిలో భద్రత.
- ప్రయాణికులు ఉన్నచోట నుండి యాప్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం.
- ప్రయాణికులు పయనించు మార్గాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
- దీని వల్ల ఆటో యొక్క లొకేషన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.
- ప్రతి ఆటోకు ఒక QR కోడ్ నెంబర్ వస్తుంది. దాని ద్వారా ప్రయాణికులతో నేరుగా సంప్రదించవచ్చు.
- ప్రయాణికులకు, ఆటో డ్రైవర్లకు, పోలీసులకు అనుసందానమై ఉపయోగకరంగా ఉంటుంది.
- ప్రయానికుల భద్రతే ముఖ్యం. దిశా యాప్ వలే పనిచేయడం వలన పూర్తి స్థాయిలో భద్రత.
- ఆపదలో ఉన్నప్పుడు QR కోడ్ ఒక రక్షణ.
Thursday, November 25, 2021
Chanting Vishnu Sahasranama
Vishnu Sahasranama was first composed & recited by Bhishma when he was on his deathbed. Lord Krishna went to see Bhishma because he was breathing his last. When Bhishma had darshan of Lord Krishna, he started reciting Vishnu Sahasranama immediately. Vishnu Sahasranama means, the rosary of thousand names of Lord Vishnu.
He started reciting Vishnu Sahasranama in the order he saw the lord's form continuously and successively.
Vishnu Sahasranama is found in Mahabharata, the great epic of India.
If confers all the mundane transcendental benefits to the person who chants it. There are so many Sahasranamas of Vishnu, but among them, this happens to be the most cardinal and important one because right from Sankaracharyalu there are so many Sages and Saints who have recited and commented in their own way. Even today, it is recited with fervor and gaiety in all the temples of Lord Vishnu.
The Chanting of the following names of Lord Vishnu immensely helps us in overcoming the obstacles in our daily life.
1. "Om Vashatkaaraaya Namaha" : For Success in Business.
2. "Om Aksharaaya Namaha": For Success in Studies.
3. "Om Bhuthabhavanaya Namaha": For Good Health.
4. "Om Paramaathmane Namaha": For Self Confidence.
Wednesday, November 24, 2021
బల్లిశాస్త్రం చెప్పే నిజాలు
బల్లి శరీరంపై పడితే మనలో చాలా మంది ఆందోళన పడుతుంటారు. బల్లిశాస్త్రంపై అవగాహన లేక ఏం చెయ్యాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు. అయితే బల్లి మన శరీరంపై ఎక్కడ పడినప్పటికీ వెంటనే తలస్నానం చేసి, దీపం పెట్టి, నైవేద్యంతో ఇష్ట దైవమును ప్రార్థించాలి. బల్లి లేదా తొండ తల మీద నుంచి కిందకు దిగితే మంచిది కాదు. కింద నుంచి పైకి పాకి వెంటనే దిగితే మంచిది. శరీరంపై కొన్ని ప్రత్యేక స్థానాల్లో బల్లి పడటం వల్ల కొన్ని రకాల ఫలితాలు కలుగుతాయి. అలాగే కొన్ని రకాల నష్టాలు కూడా కలుగుతాయి.
మగవారి తలపై బల్లి పడితే మరణం వెంటాడుతుందని సంకేతం. ముఖంపై పడితే ఆర్థిక సమస్యల నుంచి బయట పడి లాభాల బారిన పడతారు. ఎడమ కన్నుపై పడితే అంతా శుభమే జరుగుతుంది. కుడి కన్నుపై పడితే చేసే పని విజయవంతం కాదు. అపజయం కలుగుతుంది. నుదురుపై పడితే ఇతర సమస్యలు రావడం, విడిపోవడం లాంటివి జరుగుతుంది.
కుడి చెంపపై పడితే బాధలు ఎక్కువవుతాయి. ఎడమ చెవిపై పడితే ఆదాయం బాగా వస్తుంది. పైపెదవి అయితే కలహాలు వెంట పడతాయి. కింది పెదవి ఆదాయంలో లాభం కలుగుతుంది. రెండు పెదవుల మధ్య పడితే మృత్యువు సంభవిస్తుంది. వీపుపై ఎడమ భాగం విజయం కలుగుతుంది. మణికట్టు అలంకార ప్రాప్తి కలుగుతుంది. మోచేయి డబ్బు నష్టం.
వేళ్ళపై పడితే అనుకోకుండా బంధువులు, స్నేహితుల రాక, కుడి భుజంపై పడితే కష్టాలు, సమస్యలు. ఎడమ భుజం పదిమందిలో అవమానం జరుగుతుంది. తొడలపై పడితే దుస్తులు, వస్త్రాలు నాశనమవుతాయి. మీసాలపై పడితే కష్టాలు వెంటాడుతాయి. కాలి వేళ్ళపై అయితే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. పాదములపై అయితే ప్రయాణానికి సిద్ధం అని అర్థం. ఇవన్నీ పురుషులపై బల్లి పడితే కలిగే విషయాలు.
ఇక స్త్రీలపై బల్లి పడితే: తలపై పడితే మరణ భయం, కొప్పుపై రోగాల భయం, పిక్కలపై బంధువుల రాక, ఎడమ కన్ను భర్త వేరొకరి ప్రేమను పొందుతారట, కుడి కన్ను మనోవ్యధ, రొమ్ము (వక్షస్ధలం) మంచి జరుగుతుంది, కుడి చెంప మగ శిశువు జన్మిస్తాడని, కుడి చెవి ధనలాభం.. ఆదాయం, పై పెదవి విరోధములు కలుగుతాయి, కింది పెదవి కొత్త వస్తువులు మీ చెంతకు చేరుతాయి.
స్త్రీలకు రెండు పెదవులపై పడితే కష్టాలు, సమస్యలను ఫేస్ చెయ్యాలి. వీపు పైన పడితే మరణవార్తను వింటారు. గోళ్ళపై పడితే చిన్నచిన్న కలహాలు గొడవలు.స్త్రీల ఎడమ చేయిపైన బల్లి పడితే మెంటల్ స్ట్రెస్, వేళ్ళపై పడితే నగల ప్రాప్తి కలుగుతుంది. కుడిభుజం కామరతి ప్రాప్తి కలుగుతుంది, తొడలు- కామము, మోకాళ్ళు ఆదరణ, అభిమానం, చీలమండలము కష్టాలు, కుడి కాలిపై పడితే గొడవలు, కాలివేళ్ళు పుత్రుడు జన్మిస్తాడు.
ఇక బల్లి ఎవరిపైనా అయినా సరే తలమీద పడితే కలహము, బ్రహ్మరంధ్రం మీద భయం కలుగుతాయి. జుట్టుమీద అయితే కష్టం, వెనుక జుట్టుపైన పడితే మృత్యు భయం, జడమీద మృత్యు భయం వంటివి కలుగుతాయి. అదేవిధంగా ముఖంపైన పడితే బందు దర్శనం, కనుబొమ్మల మీద కలహం, కుడి కన్నుమీద ఓటమి, ఎడమకన్ను మీద అవమానం, కుడిచెవి మీద దుర్వార్త వినటం, ఎడమచెవి మీద వర్తక లాభం, ముక్కుమీద ఆరోగ్య సమస్యలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది.
బల్లి పై పెదవిపైన పడితే వ్యయం, క్రింది పెదవి పైన లాభం, గడ్డము మీద కారాగృహప్రాప్తి, కంఠముపై శతృహాని, మెడపైన భయం, రొమ్ముమీద విజయం, కుడి భుజంపైన ఆరోగ్యం, ఎడమ భుజముపైన పడితే స్త్రీ భోగము కలుగుతాయి.
బల్లి గుండెలపైన పడితే భయం, కడుపుపై పడితే సంతాన లాభం, మోచేతినందు నష్టం, అరచేతినందు ధనలాభం, వెన్నుమీద భయం, పిరుదుల మీద శయ్యాలాభం, తొడ భాగంపైన విషపు జంతువుల వలన ప్రాణ భయం, మోకాలిపైన వాహనలాభం, పాదములమీద ప్రయాణము, వ్రేళ్ళపైన రోగము, అరికాలిపైన బల్లి పడితే ఉన్నత పదవులు కలుగుతాయని జ్యోతిష నిపుణులు మరియు శాస్త్ర వివరణ.
Monday, November 22, 2021
మన పండుగల గొప్పతనం
సంక్రాంతి: మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం, అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.
మహాశివరాత్రి: కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.
హోలీ: వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు, పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.
ఉగాది: కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.
శ్రీరామ నవమి: భార్య - భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.
అక్షయ తృతీయ: విలువైన వాటిని కూడబెట్టుకోమని.
వ్యాస (గురు) పౌర్ణమి : జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.
నాగుల చవితి: ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.
వరలక్ష్మి వ్రతం: నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.
రాఖీ పౌర్ణమి: తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.
వినాయక చవితి ( నవరాత్రులు ): ఊరంతా ఒక్కటిగా కలవడానికి.
పితృ అమావాస్య: చనిపోయిన వారిని ఎప్పటికి మరువకు అని చెపుతూ.
దసరా ( ఆయుధ పూజ): ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.
దీపావళి: పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.
కార్తీక పౌర్ణమి: చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.
గోదాదేవి ఎవరు
గోదాదేవి 1200 ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికులు పన్నిద్దరాళ్వారులలో ఏకైక మహిళ. ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో (4000 పాశురాలు) గోదాదేవి పాడిన 30 పాశురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. గోదాదేవి తనని తాను రేపల్లెలో గొల్లభామగా భావించుకుంది.
తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణస్వామిని పగలంతా చూస్తున్న సంతోషం , రాత్రివేళ చూడలేని తాపం , తెల్లవారే వేళనే కన్నులారా చూసి తరించాలన్న తపన , ఆత్రం కలబోసిన భావరాగానురాగాల పారిజాతాల మాల తిరుప్పావై.
పాశురాల పరమార్ధం: తిరుప్పావైలో ఉన్న మొత్తం పాశురాలు 30. వీటిలో మొదటి అయిదు ఉపోద్ఘాతంగా ఉంటాయి. తిరుప్పావై ప్రాధాన్యతను వివరిస్తాయి. భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదని , చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశురాలు చెబుతాయి. భగవంతుని ఆరాధించటం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని , పంటలు నిండుగా పండుతాయని , దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉంది.
తర్వాతి పది పాశురాల్లో చెలులతో కలిసి శ్రీరంగనాథుని సేవించడానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి. పదిహేను నుంచి ఇరవయ్యో పాశురం వరకు గోదాదేవి చెలులతో కలిసి దేవాలయానికి వెళ్లిన విషయాలు , అక్కడి శిల్పసౌందర్యాల వర్ణనలు , రంగనాథునికి సుప్రభాతం పాడటం మొదలైనవి ఉంటాయి. కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాశురాల్లోనే ఉంటుంది.
చివరి తొమ్మిది పాశురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాశురంలో ఫలశృతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది.
Wednesday, October 20, 2021
Direction priority in Hinduism
Wednesday, May 19, 2021
స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం
Thursday, May 6, 2021
మాతృమూర్తి ఋణ - ఆదిశంకరాచార్యులవారు
సన్యాసాశ్రమం స్వీకరించి తన ఆప్తులందరినీ త్యజించి వేళ్ళే ముందు తల్లి ఆర్యాంబ చాలా బాధ పడింది. "శంకరా, నువ్వు నాకు ఏకైక పుత్రుడువి కదా! నన్ను వదలి వెళ్ళి పోతున్నావు,
ఆఖరి క్షణాల్లో నాకని ఎవరున్నారు?నాకు దిక్కెవరు " అని దీనంగా ప్రశ్నించింది.
"అమ్మా! ఏ సమయమైనా సరే, నీవు తల్చుకుంటే చాలు నీ ముందు వుంటాను." అన్నాడు శంకరుడు.
భగవత్పాదులు శంకరాచార్యులవారి తల్లికి మరణకాలం సమీపించింది. మూసిన కళ్ళు తెరవలేదు.
"నేను తలచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు" అని మనసులోనే తలుచుకుంటూ వున్నది ఆర్యాంబ.
తల్లి తలచుకుంటున్నదన్న విషయం ఆదిశంకరులు గ్రహించారు. వెంటనే శ్రీ కృష్ణుని ధ్యానించారు.
శ్రీ కృష్ణుడు ఏం కావాలని అడిగాడు.
కురు పితామహుడు భీష్మాచార్యునికి మోక్షమిచ్చినట్లుగా నా మాతృమూర్తి కి మోక్షం ప్రసాదించమని వేడుకున్నారు శంకరాచార్యులవారు.
అర్యాంబ , తలుచుకుంటే శంకరుడు వస్తానన్నాడే అని తపిస్తున్నప్పుడు అక్కడికి
ఎవరో వస్తున్న అలికిడయింది.
కళ్ళు కూడా తెరవలేని స్థితిలో వున్న ఆర్యాంబ చటుక్కున లేచి శంకరా! అంటూ , అక్కడికి వచ్చిన ఒక పసిబాలుని,
గట్టిగా హృదయానికి హత్తుకుంది.బాలుని ఒంటి నిండా ఆభరణాలను గమనించిన ఆర్యాంబ,
శంకరుడు సన్యాసి కదా ! యీ ఆభరణాలు ఎలావచ్చాయని అనుకున్నది. బరువెక్కిన కనురెప్పలను మెల్లిగా తెరచి చూసింది
ఆర్యాంబ. అక్కడ తను అను నిత్యం పూజించే గురువాయూరు కృష్ణుడు సాక్షాత్కరించి నిలచివుండడం
గమనించింది.
గురువాయూరప్పన్ ని చూసిన ఆర్యాంబ మహదానందంతో " అప్పా! నోరు తెరిచి,నీ నామజపం చేసేశక్తి కూడా లేని యీ దీనురాలి ఆఖరిక్షణాలలో నను చూసేందుకు
వచ్చావా? కృష్ణా " అని మెల్లిగాగధ్గద కంఠంతో పలికింది.
కృష్ణుడు వెంటనే " నీ పుత్రుని ఆదేశం . రాకుండా వుండగలనా ? అమ్మను చూడకుండా వుండగలనా " అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు.
అదే సమయానికి శంకరాచార్యులవారు కూడా అక్కడికి వచ్చారు.
ఉప్పొంగిన ఆనందంతో ఆ మాతృమూర్తి శంకరునితో " నాయనా ! నా భాగ్యమేమని చెప్పను ? నిన్ను పుత్రుని గా పొంది నేను తరించాను. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడినే నా ముందు నిలబెట్టావు కదా, శంకరా!" అని కన్నీళ్ళుకార్చింది .
గోపాలుని నేను నిలబెట్టడమేమిటి?
నేను జన్మించినది మొదలు నీవు నా కోసం పడ్డ శ్రమకు , కష్టాలకు బదులుగా నెనేమీ చేయలేకపోయాను.
సాక్షాత్తు భగవంతుడే మానవరూపంలో పుట్టినా మాతృ ప్రేమకు సాటిగా , ఎంతటి సేవచేసినా కన్నతల్లి ఋణం అణువంతైనా తీరదు. నేనైనా అంతే. నేను చేయగలిగినదంతా నీదివ్య చరణాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రమాణం ఒక్కటే "
అని మాతృదేవత పాదాలముందు మోకరిల్లారు ఆదిశంకరాచార్యులవారు.
మన తల్లి తండ్రులకు మనం చేసే సేవల వల్లనే వారి మనసు సంతృప్తిచెంది వారి దివ్యాశిస్సులు సదా తమ బిడ్డలకు ప్రసాదిస్తారని జగద్గురు ఆది శంకరాచార్యులవారు యీలోకానికి సందేశమిచ్చారు.
బ్రహ్మగారు ఈ భూమి మీద జీవ సృష్టి
బ్రహ్మగారు ఈ భూమి మీద జీవ సృష్టి చేస్తూ మొదటగా
మనిషిని- ఎద్దును- కుక్కను - గుడ్లగూబను పుట్టించి ఒకొక్కరూ నలభై సంవత్సరాలు బతకండి అని ఆదేశించాడు.
సహజంగా మానవుడు ఓన్లీ 40 ఇయర్సేనా సార్ అన్నాడు. అప్పుడు బ్రహ్మ గారు ఒకసారి ఇచ్చిన ఆర్డర్ కు తిరుగుండదోయ్ అన్నాడు.
అక్కడే ఉన్న ఎద్దు నాకు 40 ఏళ్లు ఎందుకుసార్ - ఎప్పుడూ పొలాలు దున్నుతూ, బళ్లను లాగుతూ ముల్లుకర్రతో పొడిపించుకుంటూ - నాకు 20 ఏళ్ళు చాలుసార్ అందోలేదో వెంటనే అక్కడ ఉన్న మానవుడు - ఆ 20 నాకివ్వండి నాకివ్వండి అనగానే - బ్రహ్మ గారు మీలో మీరు అడ్జస్టయితే నాకేమీ అభ్యంతరం లేదు అని అన్నాడు (ఇప్పుడు మానవుడికి 60 ఏళ్ల వయసయింది).
ఆ వెంటనే అక్కడ ఉన్న కుక్క నాకు మాత్రం 40 ఏళ్లు ఎందుకు - ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అందరూ ఛీ ఛీ అనే బతుక్కి 20 ఏళ్లు చాలు అనగానే ... మళ్లీ మానవుడు ఆ 20 నాకే నాకే అనగానే బ్రహ్మ గారు ఓకే ఓకే అనేశారు ( ఇప్పుడు మానవుడికి 80 ఏళ్ల వయసయింది).
చివరలో ఉన్న గుడ్లగూబ కూడా సామీ నన్ను చూస్తేనే అసహ్యంగా అపశకునంలా భావిస్తారు...తల అటూ ఇటూ తిప్పుతూ కూర్చుంటాను..సరిగా కనపడదుకూడా కాబట్టి జంతువులందరిలా నాక్కూడా 20 ఏళ్లు చాలు సామీ అనగానే - అందుకోసం ఎదురుచూస్తూన్న మానవుడు - అదికూడా నాకే నాకే అనుకుంటూ 100 ఏళ్లూ పూర్తయ్యాయని తెగ సంబరపడ్డాడు.
అందుకే:
మానవుడు తన మొదటి 40 ఏళ్లు మానవుడి గా బతుకుతాడు.
ఆ తరువాత 20 ఏళ్లు ఎద్దు నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 40-60 ఏళ్ల మధ్యలో ఒక ఎద్దు లా కష్టపడుతూ పిల్లల్ని చదివించి, పెళ్ళిళ్ళు చేసి, ఇల్లు కట్టుకోవడం చేస్తూంటాడు.
ఇక ఆ తర్వాత 20 ఏళ్లు కుక్క నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 60-80 ఏళ్ల మధ్యలో తన ఇంటికి తనే ఓ కాపలాదారుగా మారిపోయి
వచ్చి వెళ్ళే వాళ్ళ ఆరా తీసుకుంటూ, కోడుకు, కోడలు , మనవలు ఇచ్చే ఆర్డర్లు తీసుకొంటూ కాలక్షేపం చేస్తోంటాడు.
ఇక చివరి 20 ఏళ్లు గుడ్లగూబ నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 80-100 ఏళ్ల మధ్యలో ఎప్పుడు ఈలోకం నుంచి వెళిపోతాడోనని ఇంట్లో వాళ్ళు ఇతగాడికి ప్రొమోషన్ ఇచ్చి ఇతని మకాం వరండాలోకి మార్చిన కారణంగా... పాపం ఆ కుక్కిమంచంలోనే అన్నీ కానిస్తూ, కనపడక పోయినా గుడ్లగూబ లా తల ఇటూ అటూ తిప్పుతూ ఆ దేవుడి పిలపుకై ఎదురు చూస్తూ ఉంటాడు.
"ఇదే మానవుల నూరేళ్ళ చరిత్ర".
మళ్ళీ ఆ మానవుడే అంటాడు : దురాశ దుఃఖానికి చేటని - దేవుడు ఇచ్చిన దానికంటే అతిగా ఆశపడకూడదని.
( ఎక్కడో ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం విన్న కధకు ఈ అక్షర రూపం ఇచ్చే చిన్నప్రయత్నం)
గోదాదేవి అసలు కథ
తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు , మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి , ఆయనకు పెరియాళ్వారు అంటే - పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తూ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు ‘కోదై’ అంటే - పూలమాల అన్నపేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది.
గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూపాడుతూ పెరిగిందే. యుక్తవయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది. కళ్లుమూసినా , తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలనీ , తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు ! తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి , తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి , గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ , ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా , ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు.
ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్లంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికీ , అలంకారానికీ సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు , వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు , తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడింది గోదా. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై !
ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు , ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి , గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మనీ… అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాననీ చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవినీ , విల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి , అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగిరోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి , విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు.
తీర్థయాత్ర - విది విధాన
పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం అనాదిగా ఉన్న ఆచారం. కానీ ఎక్కువమంది దృష్టిలో తీర్థయాత్ర అంటే ప్రయాణం చేసేయడం, అక్కడి దేవుణ్ణి దర్శించుకోవడం, తిరిగిరావడం – ఇంతే ! కానీ తీర్థయాత్ర అంటే కేవలం ఇవే కావు. ఓ పుణ్యక్షేత్రానికి యాత్ర చేసేటప్పుడు పాటించాల్సిన విధినిషేధాలు కొన్నున్నాయి.
1. ఏ దేవుడి క్షేత్రానికి వెళ్తున్నామో ఆ దేవుడి పూజ ముందస్తుగా కొన్నిరోజుల పాటు ఇంట్లో చేయాలి. కనీసం స్తోత్రాలైనా చదవాలి. ఆ దేవుడి గుఱించి ఏదైనా పవిత్ర గ్రంథం ఉంటే దాన్ని కనీసం ఓ సప్తాహం పాటు పారాయణ చేయాలి. ఆ తరువాతే యాత్రకి బయల్దేఱి వెళ్ళాలి. అప్పుడు మన యాత్ర నిరాటంకంగా జఱిగేలా ఆయన ఆశీర్వదిస్తాడు.
2. ఇలా వెళ్ళి, అలా వచ్చేయడం కాకుండా, కనీసం రెండు-మూడ్రోజుల పాటైనా ఆ క్షేత్రంలో గడిపి, తద్ద్వారా ఆ భగవత్సన్నిధాన అనుభూతి విశేషాలతో మన మనస్సులు సంపూర్ణంగా పరిప్లావితం అయ్యేలా యాత్రా ప్రణాళిక వేసుకోవాలి.
౩. మొక్కుబడి తీర్చుకోవడం కోసం వెళుతున్న పక్షంలో అందుకోసం కట్టిన ముడుపును కూడా మర్చిపోకుండా వెంట తీసుకెళ్ళాలి. ఆ దేవుడు మన ఇష్టదైవం గానీ, ఇలవేల్పు గానీ అయిన పక్షంలో ఆయనకి ప్రతిరోజూ పూజ చేసేటప్పుడు సమర్పించిన ధనరూపకమైన దక్షిణల్నీ, ధాన్యాన్నీ కూడా ఆ దేవాలయంలో సమర్పించడం కోసం తీసుకెళ్ళాలి.
4. పుణ్యక్షేత్రాల్లో చేసే పారాయణలు విశేష ఫలితాన్నిస్తాయి. కనుక యాత్రా సమయం లోనూ, పుణ్యక్షేత్రం లోనూ చదువుకోవడం కోసం కొన్ని చిన్నచిన్న పుస్తకాలు కూడా వెంట తీసుకెళ్లాలి. ఉదాహరణకి – విష్ణుసహస్రనామాలు, వివిధ దేవీదేవతల స్తోత్రసంపుటాలు మొ||వి. కార్లో వెళ్ళేవారు దేవుడి దృశ్యక, శ్రవ్యక క్లుప్తికలను (CDs) దగ్గఱ పెట్టుకుని కదలాలి.
5. పిల్లల్ని బడి మానిపించైనా సరే, తీర్థయాత్రకి అవశ్యం తీసుకెళ్ళాలి. ఆ బాల్యదశ లో కాకపోతే వారింక ఎప్పటికీ ఆధ్యాత్మికతకీ, మత సంప్రదాయాలకీ పరిచితం కారు. వారికి సంస్కృతీ, సంప్రదాయమూ అలవడనే అలవడవు. వాటిని బళ్ళల్లో నేర్పరు. తల్లిదండ్రులే వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని నేర్పాలి ...
చిన్నప్పట్నుంచీ హిందూ సంప్రదాయానికి వారిని అలవర్చకపోతే వారి తరంలోనో, వారి వారసుల తరంలోనో మతం మారే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఈ రోజున్నట్లే ఱేపు కూడా ఉంటుందని అనుకోకూడదు. హిందూ తల్లిదండ్రులు తమ నిర్లక్ష్యం ద్వారా తమ పిల్లల జీవితాల్లో సృష్టించిన ఆధ్యాత్మిక శూన్యాన్ని వేఱే ఎవఱో తమ మతంతో భర్తీ చేసేందుకు కాచుక్కూర్చుంటారని మర్చిపోవద్దు.
6. యాత్రని రహస్యంగా ఉంచకూడదు. సాధ్యమైనంత వఱకూ పరిచయస్థులందఱికీ తెలియజేయాలి. వారిలో యాత్రకి రాలేని వారుంటే వారు తమ తరఫున పదో పరకో, లేకపోతే కొన్ని వస్తువులో దేవుడికి సమర్పించమని ఇస్తారు. వాటిని కూడా వెంట తీసుకెళ్ళాలి. భక్తులంటే భగవంతుని స్వరూపాలే. వారికి సేవ చేయడం భగవంతుడికి సేవ చేయడమే.
7. అప్పుచేసి, లేదా ఇతరుల్ని పీడించి సంపాదించిన ద్రవ్యంతో యాత్ర చేయకూడదు.
8. యాత్ర చేస్తూండగా దైవేతర, లౌకిక సంభాషణల్లో సాధ్యమైనంత వఱకూ పాల్గొనకుండా ఉండడానికే ప్రయత్నించాలి. నిరంతరం భగవన్నామాన్ని, స్తోత్రాల్నీ వల్లిస్తూ ముందుకు సాగాలి. భగవత్సంబంధమైన సత్కథల్ని తోటివారితో చెబుతూ ప్రయాణం చేయాలి. ఎవఱితోనూ ఏ విధమైన చర్చలూ, వాదాలూ, తర్కాలూ చేయకూడదు. ఇతరులు ఏదైనా పొఱపాటు మాట్లాడితే దాన్ని సవరించే పని పెట్టుకోకూడదు.
9. కామక్రోధాది అరిషడ్వర్గాల్ని ఉపశమింపజేసుకోవాలి. శత్రువుల్నీ, దురదృష్టాల్నీ జ్ఞాపకం చేసుకోకూడదు. యాత్రలో తారసపడేవారందఱినీ స్నేహభావంతో చూడాలి.
10. దారిలో మనకు కలిగే ఆకలిదప్పుల్నీ, అలసటనీ, అనారోగ్యాల్నీ, అసౌకర్యాల్నీ భగవత్ ప్రసాదంగా భావించి ఆనందంగా భరించాలి. పూర్వజన్మ దుష్కర్మ ఈ యాత్రాక్లేశాల ద్వారా హరించుకు పోతోందనీ, ఆత్మ పరిశుద్ధమవుతోందనీ భావించి సంతోషించాలి. అంతే తప్ప “అది బాలేదు, ఇది బాలేదు” అని మాటిమాటికీ వ్యాఖ్యానించుకొని మనసుని కష్టపెట్టుకోకూడదు. యాత్రకొచ్చింది తినడానికో, తాగడానికో, జీవితాన్ని ఆస్వాదించడానికో, కాలకృత్యాలు తీర్చుకోవడానికో కాదనీ, దైవసన్నిధానాన్ని అనుభూతి చెందడానికేననే విషయాన్ని అనుక్షణం గుర్తుంచుకొని ప్రవర్తించాలి. ఆయా అవసరాలు ఎలా తీఱినా ఫర్వాలేదన్నట్లు మసలుకోవాలి. దైవానుభూతికి మినహా ఇంకా దేనికీ ప్రాధాన్యం ఇవ్వకూడదు.
11. తీర్థగమ్యాన్ని చేఱుకున్నాక ముందు చేయాల్సిన పని స్నానాదులు ముగించి ఎంతో కొంత ఆహారంగా తీసుకోవడం. సుప్రసిద్ధ క్షేత్రాలైతే దైవదర్శనానికి గంటలకొద్దీ సమయం పట్టవచ్చు. తినడం ఆలస్యమయ్యే కొద్దీ, వరుసలో నిలబడ్డా మనసు దేవుడి మీదికి కాక తిండి మీదికే పోతూంటుంది. కనుక ఖాళీకడుపుతో దైవదర్శనం చేయలేం.
12. దైవదర్శనానికి వెళ్ళే దారిలో ఎన్ని ఆకర్షక విషయాలూ, వస్తువులూ ఉన్నా ఆగకుండా, పట్టించుకోకుండా ముందుకు సాగిపోవాలి. భారీ బ్యాగులూ, పెట్టెలూ మొదలైన సరంజామాతో వెళ్ళడం చాలా అసౌకర్యం. అలా తీసుకెళ్తే చిత్తం దేవుడి మీద కాక వాటి మీదే లగ్నమై ఉంటుంది.
13. కొన్ని క్షేత్రాలలో ప్రధాన దైవతం కాక మఱో దేవుడో, దేవతో వేంచేసి ఉంటారు. ముందు వారిని దర్శించుకున్నాకనే ప్రధాన దైవతాన్ని దర్శించాలనే సంప్రదాయం ఉంటుంది. దాన్ని తు.చ. తప్పకుండా పాటించాలి. ఉదాహరణకి – తిరుమలలో శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకున్నాకనే శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వెళ్ళాలి. అలాగే శ్రీస్వామి వారిని దర్శించాక తిరుచానూరులో శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి.
14. “రిక్తహస్తేన నోపేయాద్ రాజానం దైవతమ్ గురుమ్” అన్నారు పెద్దలు. కనుక దైవ దర్శనానికి వట్టి చేతులతో వెళ్ళకూడదు. అందులోనూ సమాజంలో కాస్తో కూస్తో స్థితిమంతులనిపించు కుంటున్నవారు దేవుడి దగ్గఱికి చేతులూపుకుంటూ వెళ్ళనేకూడదు. పూలదండలు, పండ్లు, కొబ్బరికాయ, తాంబూలం, దక్షిణద్రవ్యం, క్రొత్తవస్త్రాలూ, ఏదైనా వెండి/ బంగారు వస్తువూ – వీటిల్లో ఏదో ఒకటి గానీ, కొన్ని గానీ, అన్నీ గానీ సమర్పణగా తీసుకెళ్ళాలి. కొన్ని క్షేత్రాల్లో ప్రధాన దైవతానికి కొన్ని ప్రత్యేక సమర్పణ లంటే ప్రీతి కనుక అవేంటో కనుక్కుని అవి కూడా తీసుకెళ్ళాలి.
15. దేవుడికి సమర్పించిన పూలదండల్నీ, తినుబండారాల్ని, వస్త్రాల్నీ ఆయన ప్రసాదంగా వెనక్కి తీసుకోవచ్చు. కానీ ఆయనకు సమర్పించిన డబ్బునీ, వెండి/ బంగారు ఆభరణాల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోకూడదు.
అలా చేస్తే అమ్మ వార్లు చాలా బాధపడతారు. మనకు జన్మజన్మల దరిద్రం చుట్టుకుంటుంది. ఈ సంగతి తెలీక చాలామంది ఆడవాళ్ళు అమ్మవార్ల దర్శనానికి వెళ్ళినప్పుడు నగలతో వారిని అలంకరింపజేసి ఆ తరువాత మళ్లీ వాటిని వెంట తీసుకెళుతున్నారు. “దేవుడికి ఇంత ఇవ్వాలి” అని మనసులో అనుకుని, లేదా ఆ మాట పైకి అనేసి ఆ తరువాత మనసు మార్చుకోవడం కూడా మహాదోషం.
16. అలాగే దేవుడి కోసం బయటికి తీసిన డబ్బుని యథాతథంగా సమర్పించేయాలే తప్ప, “ఈ నోటు తీసుకుని ఇంత చిల్లఱ నాకు వెనక్కివ్వండి” అని అడక్కూడదు. మనం అక్కడికి వెళ్ళినది దేవుణ్ణి శరణాగతి వేడడానికే తప్ప ఆయనతో బేరసారాలూ, వ్యాపారమూ, నగదుమార్పిడి చేయడానికి వెళ్ళలేదనే విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి.
17. ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడి స్థానిక ఆచార వ్యవహారాలన్నింటినీ వినయ విధేయతలతో పాటించాలే తప్ప “ఇవన్నీ నిజమా ? వీటి వల్ల ఏమైనా ప్రయోజనముందా ? దీనివల్ల గుడి సిబ్బందికేమైనా లబ్ధి చేకూఱుతోందేమో ? మమ్మల్ని ఎందుకింత కష్టపెడుతున్నారు ? ఫలానా గుళ్ళో ఇలా లేదే ? ఇక్కడెందుకు ఇలా ఉంది ?” అని వితండవాదాలూ, విమర్శలూ, తర్కాలూ చేయకూడదు. పుణ్యక్షేత్రాల్లో అశ్లీలాలూ, అవాచ్యాలూ పలకరాదు.
18. పుణ్యక్షేత్రాల్లో రాజకీయాలూ, క్రీడలూ, సినిమాలూ, పెట్టుబడివ్యాపారాలూ, విద్యా-ఉద్యోగావకాశాలూ, లోకాభిరామాయణమూ మాట్లాడరాదు. వారపత్రికలూ, వార్తాపత్రికలూ, కథలూ, నవలలూ చదవరాదు. భార్యతో గానీ, ప్రియురాలితో గానీ సరసాలాడరాదు. భగవంతుడికి తప్ప ఇంకెవఱికీ జై కొట్టరాదు, పొగడరాదు. పరనింద, ఎగతాళి చేయరాదు.
19. ధూమపానం, మద్యపానం, మాంసాహారం పూర్తిగా వివర్జించాలి.
20. కొంతమంది పుణ్యక్షేత్రాల్లో చనిపోతే సద్గతి లభిస్తుందనుకుని అక్కడికెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటారు. అలాంటిచోట్ల కాలిక మరణం, లేదా సాధారణ మరణం పొందితేనే సద్గతి. ఆత్మహత్య చేసుకుంటే మటుకూ దుర్గతే. ఆత్మహత్య చేసుకోవడమంటే భవిష్యత్తు మీదా, తద్ద్వారా భగవంతుడి మీదా నమ్మకం లేదని ఆచరణాత్మకంగా, బహిరంగంగా ప్రదర్శించడమే. అది దైవవిశ్వాసానికి ఎంతమాత్రమూ ప్రతీక కాదు. అలా చనిపోయేవారికి పిశాచ, బ్రహ్మరాక్షస జన్మలే గతి.
21. ఒకానొక పుణ్యక్షేత్రంలో మనుషులూ, స్థలాలూ మనకు నచ్చకపోయినా విమర్శించకూడదు. ఆ విమర్శలు నేరుగా అక్కడి దేవుడికే తగుల్తాయి. పుణ్యక్షేత్రమైనా, కాకపోయినా అందఱిలోనూ భగవంతుడే ఉన్నాడు గనుక ఎక్కడైనా సరే, పరనిందా, భగవన్నిందా రెండూ వేఱు కాదు.
22. కొన్నికొన్ని క్షేత్రాలలో స్థలమహాత్మ్యమూ, భగవద్వరప్రసాదమూ మూలంగా కొన్నికొన్ని రకాల విశేష సాధనలు చేస్తే త్వరగా కోరికలు తీఱతాయి. అవేంటో అక్కడ జనాన్ని అడిగి తెలుసుకుని ఆ ప్రకారంగా అనుష్ఠించాలి.
23. దర్శనం కాగానే “హమ్మయ్య” అనుకుని బయటపడొద్దు. గుళ్ళోనో, గుడి బయట అరుగు మీదనో, చెట్టు కిందనో కూర్చుని భగవంతుడి స్తోత్రాలు చదువుకుని, లేదా జపధ్యానాదుల్లాంటివి చేసుకుని ఆ తరువాతే లేవాలి. ఇలా చేసేటప్పుడు వట్టి నేలమీద కాకుండా ఏదైనా ఓ ఆసనం (చిట్టిచాప, వస్త్రం, తెల్ల కాయితం లాంటివి) వేసుకుని చేయాలి. అలా కాక వట్టి నేలమీద కూర్చుని చేసే ఉపాసనల ఫలం భూదేవికీ, తద్ద్వారా బలి చక్రవర్తికీ చెందుతుంది.
24. అక్కడ ఎవఱైనా చేయి చాపితే మనకు తోచినంత, మనం ఓపినంత దానం చేయాలి. పుణ్యక్షేత్రంలో చేస్తున్న దానం కనుక దానికి విశేష ఫలితం ఉంటుంది. ఒకవేళ ఇష్టం లేకపోతే ఇవ్వనక్కఱలేదు. కానీ యాచకుల్ని విసుక్కోవడం, కసురుకోవడం, దూషించడం, బుద్ధి చెప్పడం లాంటివి మంచివి కావు. ఇష్టం లేకపోతే మౌనంగా అక్కణ్ణుంచి వెళ్ళిపోవాలి.
25. ఈ రోజుల్లో లౌకిక ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలాన పుణ్యక్షేత్రాలున్న ఊళ్లల్లో సినిమా హాళ్ళూ, వ్యభిచార గృహాలూ కూడా చొఱబడ్డాయి. “దర్శనమైపోయింది గదా” అని చెప్పి వాటికేసి దృష్టిసారించరాదు. పెద్దలేమన్నారంటే-
శ్లో|| అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి |
పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రలేపో భవిష్యతి ||
తాత్పర్యం – ఇతర ప్రదేశాల్లో చేసిన పాపం పుణ్యక్షేత్రంలో పోతుంది. కానీ పుణ్యక్షేత్రంలో చేసిన పాపం సిమెంటులా పట్టుకుంటుంది.
26. తీర్థయాత్ర చేసినందుకు గుర్తుగా అక్కడి వస్తువుల్నీ, విగ్రహాల్నీ, స్థలపురాణ గ్రంథాల్నీ తప్పనిసరిగా కొనాలి. వీలైతే కొన్ని ఎక్కువ పుస్తకాలే కొనాలి. ఇంటికి వెళ్ళాక వాటిని ఇతరులకిచ్చి చదివిస్తే వారికీ ఆ తీర్థయాత్ర చేయాలనే కోరిక కలుగుతుంది. పుణ్యక్షేత్రం నుంచి తెచ్చిన ప్రసాదాల్ని కేవలం తామారగించడమే కాకుండా తమ బంధుమిత్రులకీ, ఇఱుగు పొఱుగు వారికీ కూడా పంచాలి.
27. యాత్రలో పొందిన మధురానుభవాల్ని మాత్రమే ఇతరులతో చెప్పాలి. “ఓయమ్మో, అంత కష్టపడ్డాం, ఇంత కష్టపడ్డాం” అని వాపోకూడదు. అది భగవంతుణ్ణి విమర్శించడమే అవుతుంది. అదే విధంగా ఇంటికెళ్ళేటప్పుడు/ వెళ్ళాక “యాత్రకంతా కలిపి మొత్తం ఎంత ఖర్చయింది ?” అని లెక్కలు వేయకూడదు. అలాంటివి యాత్రకి బయల్దేఱక ముందే వేసుకోవాలి.
మొత్తమ్మీద తీర్థయాత్రకి వెళ్ళి సాధ్యమైనంత పుణ్యధనాన్ని మూటగట్టుకు రావాలి, పాపాల్ని కాదు.
చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ
ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది.
దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.
మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!
దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.
మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను
దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి.
మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?
దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి
మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?
దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి
మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!
దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు
మనిషి: నా స్నేహితులున్నారా అందులో?
దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే
మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?
దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు
మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!
దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.
మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?
దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.
మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.
మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.
మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?
దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.
ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.
అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి.
పశ్చాతాపులను క్షమించాలి.
*తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.
సర్వేజనా సుఖినోభవంతు
వేములవాడ ధర్మగుండ మహత్యం తెలుసా
రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి తనకు వచ్చిన కుష్టు వ్యాధి నివారణ కోసం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ చివరకు వేములవాడ ప్రాంతం చేరుకొని ఇప్పుడు నేలకోని ఉన్న దక్షిణామూర్తి ప్రాంతము లో ఒక మహా బోధి వృక్షం ఉండేది. దాని ప్రక్కనే ఒక కోనేరు ఉంది ఇక్కడ బస చేయడానికి అనువైన ప్రాంతము గాఉందని బోధి చెట్టు క్రింద సేద తీర్చుకొన్నాడు ఉధయమునే స్నానమాచ రించుటకు ప్రక్కనే ఉన్న కోనేరు లో దిగగానే ఒక్కసారి గా తన శరీరాన్ని ఏదో బలమైన శక్తి కోనేరు అడుగునకు లాగినది. చక్రవర్తి కోనేరు అడుగు బాగం నుండి కొంత సమయములో సంపూర్ణ ఆరోగ్యం తో తన వ్యాధి నయం అయి బయటకు వచ్చాడు. అంతే ఆ రాజు బోధి వృక్షం క్రింద గల దక్షిణామూర్తి ( శివలింగం ) కు పుజనచారించి నమ్మలేని నిజాన్ని చూసి నివ్వర పోతు ఏమి ఆ కోనేటి మహత్యం అంటూ ఆలోచిస్తూ చెట్టు క్రింద వాలి పోయాడు . కొద్ది సేపటి తరువాత జనం అలజడికి మేల్కొని చూడగా అక్కడ ఒక మహాముని కూర్చుండి. వ్యాధి గ్రస్తులయిన వారికీ కోనేటి నీటితో వైద్యం చేస్తూ కానిపించాడు. ఆ మహాముని కి ప్రణమిల్లి అయ్యా నేను రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి ని నాకు అతిబయంకర కుష్టు వ్యాధి వాచినది ఎన్నో ప్రదేశాలు తిరిగా ఎన్నో పుణ్యనదులలో స్నానమాచ రించ కానీ ఈ కోనేటి లో మునగాగానే నా వ్యాధి దూరమైంది ఎలా? నా సందేహ నివృతి చేయండి స్వామి అంటూ ప్రదేయపడ్డాడు. అప్పుడు ఆ మహాముని ఈ విధముగా చెప్పాడు ఈ కోనేటి అడుగు భాగమున అష్టదిక్కుల కాలబైరవ జ్వలముకి బహుముకి ...... దేవత లు కొలువు తిరి ఉన్నారు అందుకే ఈ కోనేటి కి కలియిగంతం వరకు దాని మహిమ అలానే ఉంటుందని చెప్పాడు. ఓ.కే నా నమ్మలేదు కాదు ఇప్పటి కి గుండం లో నీరు తిసి వేస్తే మనకు ఆ విగ్రహాలు కనిపిస్తాయి మిత్రులారా ..... ఇకనుంచి ఇచరిత్ర నలుగురి తో పంచుకుని ఆధారాలతో కనిపించే పుష్కరణి పవిత్రతను కాపాడుతారని ఆశిస్తూ................వేములవాడ ధర్మగుండ మహత్యం తెలుసా ?
రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి తనకు వచ్చిన కుష్టు వ్యాధి నివారణ కోసం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ చివరకు వేములవాడ ప్రాంతం చేరుకొని ఇప్పుడు నేలకోని ఉన్న దక్షిణామూర్తి ప్రాంతము లో ఒక మహా బోధి వృక్షం ఉండేది. దాని ప్రక్కనే ఒక కోనేరు ఉంది ఇక్కడ బస చేయడానికి అనువైన ప్రాంతము గాఉందని బోధి చెట్టు క్రింద సేద తీర్చుకొన్నాడు ఉధయమునే స్నానమాచ రించుటకు ప్రక్కనే ఉన్న కోనేరు లో దిగగానే ఒక్కసారి గా తన శరీరాన్ని ఏదో బలమైన శక్తి కోనేరు అడుగునకు లాగినది. చక్రవర్తి కోనేరు అడుగు బాగం నుండి కొంత సమయములో సంపూర్ణ ఆరోగ్యం తో తన వ్యాధి నయం అయి బయటకు వచ్చాడు. అంతే ఆ రాజు బోధి వృక్షం క్రింద గల దక్షిణామూర్తి ( శివలింగం ) కు పుజనచారించి నమ్మలేని నిజాన్ని చూసి నివ్వర పోతు ఏమి ఆ కోనేటి మహత్యం అంటూ ఆలోచిస్తూ చెట్టు క్రింద వాలి పోయాడు . కొద్ది సేపటి తరువాత జనం అలజడికి మేల్కొని చూడగా అక్కడ ఒక మహాముని కూర్చుండి. వ్యాధి గ్రస్తులయిన వారికీ కోనేటి నీటితో వైద్యం చేస్తూ కానిపించాడు. ఆ మహాముని కి ప్రణమిల్లి అయ్యా నేను రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి ని నాకు అతిబయంకర కుష్టు వ్యాధి వాచినది ఎన్నో ప్రదేశాలు తిరిగా ఎన్నో పుణ్యనదులలో స్నానమాచ రించ కానీ ఈ కోనేటి లో మునగాగానే నా వ్యాధి దూరమైంది ఎలా? నా సందేహ నివృతి చేయండి స్వామి అంటూ ప్రదేయపడ్డాడు. అప్పుడు ఆ మహాముని ఈ విధముగా చెప్పాడు ఈ కోనేటి అడుగు భాగమున అష్టదిక్కుల కాలబైరవ జ్వాలాముఖి బహుముకి దేవత లు కొలువు తిరి ఉన్నారు అందుకే ఈ కోనేటి కి కలియిగంతం వరకు దాని మహిమ అలానే ఉంటుందని చెప్పాడు.
ఆదిశంకరాచార్యుల జయంతి - 16 మే, 2021
1) కైలాస వాసుని అవతారంగా భావించబడే శంకరుల కృప వలన మనకు ఈ రోజు హిందూ మతములో
2) స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత ఉన్నవని అనుటలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు.
3) ఎందరో మహర్షుల, ఋషుల నోట అంతర్యామి వాక్కులుగా పలుకబడిన శక్తి వేదములుగా ప్రకాశిస్తున్నాయి.
4) ఎవరో రచించి, మరెవరో పరిశీలనము, విమర్శ చేసేందుకు అవి పురాణాలు, నవలలు కావు.
5) విశ్వవ్యాప్తుని మనోకమలము నుండి స్వయంగా మహాపురుషుల నోట వెలువడిన సచ్చిదానందములు వేదములు.
6) అంతటి వేదములకు కూడా వక్ర భాష్యము చెప్పి, భారతీయ సమాజంలో విభజన కలిగించి
7) మూఢ చాందస భావాలను ప్రేరేపించి అన్యమతముల వైపు ప్రజలను మళ్లించిన సమయంలో
8) ఆ పరిస్థితిని చక్క దిద్దటానికి శంకరులు కాలడిలో శివగురు శక్తితో ఆర్యాంబ గర్బములో
9) ఉత్తరాయణ పుణ్య కాలమున వైశాఖ శుద్ధ పంచమి నాడు అవతరించారు.
10) చిన్ముద్రతో, మౌనంతో జ్ఞానాన్ని వ్యాపింప జేసే దక్షిణామూర్తి రూపమైన పరమ శివుడు
11) ఈ దంపతులను ఆశీర్వదించగా శంకరులు ఉదయించారు.
12) పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆయన దైవిక శక్తి, మార్గము కాలడిలో ప్రస్ఫుటించాయి.
సాక్ష్యాత్తు కైలాస శంకరుడు - కాలడి శంకరులుగా ఈ భూమి మీదకు అవతరించారు
హర హర శంకర !! జయ జయ శంకర !!
Saturday, April 24, 2021
Postmortem Findings - Covid 19 Patients in Italian Patients - Telugu
Thursday, April 22, 2021
COVID-19 CRUCIAL INFORMATION
Wednesday, April 21, 2021
శ్రీకాళహస్తి గుడి దర్శనం తర్వాత చాలా మంది ఆ తప్పు చేస్తారంట.! కానీ అది చేయద్దు. ఎందుకో తెలుసా
గోదాదేవి అసలు కథ
కార్తీక పురాణం - 27 వ అధ్యాయము
సృష్టి రహస్య విశేషాలు. సృష్టి ఎలా ఏర్పడింది.
సృష్టి రహస్య విశేషాలు సృష్టి ఎలా ఏర్పడ్డది సృష్టి కాల చక్రం ఎలా నడుస్తుంది మనిషిలో ఎన్ని తత్వాలున్నాయి ( సృష్ఠి ) ఆవిర్బావము 1 ముంద...
-
ప్రముఖ వాగ్గేయ కారులు (అతి సంక్షిప్త పరిచయం) జయదేవుడు (1101-1153) 'గీతగోవిందము' అను సంగీత గ్రంథమును సంస్కృత భాషలో రచిం...
-
కచ్చబేశ్వరర్ ఆలయము, తిరుకచ్చుర్, తమిళ్నాడు: తిరుకచ్చుర్ మరైమలైనగర్ నుండి 6కి.మీ, సింగపెరుమాళ్ కోయిల్ నుండి 2 కి.మీ దూరములో చెన్నై చెంగల్పట్...