Wednesday, April 21, 2021

శ్రీకాళహస్తి గుడి దర్శనం తర్వాత చాలా మంది ఆ తప్పు చేస్తారంట.! కానీ అది చేయద్దు. ఎందుకో తెలుసా


తిరుమల తిరుపతి దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు శ్రీవారి దర్శనం ముగియగానే చుట్టూ ఉన్నఅన్ని దేవాలయాలను దర్శించుకునేందుకు వెళుతుంటారు. పాపనాశనం.. కాణీపాకం.. చివరగా శ్రీకాళహస్తిని దర్శించుకుంటారు. ఇక చివరగా శ్రీకాళహస్తిని దర్శించుకున్న తరువాత మరే దేవాలయానికి వెళ్లకూడదని చెపుతారు.. 

అలా వెళితే అరిష్టం అనే ఆచారం హిందూ సంప్రదాయంలో కొనసాగుతూ వస్తోంది. అసలు ఎందుకు అలా చేయాలి.. శ్రీకాళహస్తి దేవాలయాన్నే ఎందుకు చివరగా దర్శించుకోవాలి.. శ్రీకాళహస్తి దర్శనం తరువాత మరో గుడికి ఎందుకు వెళ్లకూడదు.. వెళితే ఏమవుతుంది. నేరుగా ఇంటికే ఎందుకే వెళ్లాలి.? తెలుసుకుందాం.

పంచభూతాల నిలయం ఈ విశాల విశ్వం.

గాలి, నింగి, నేల, నీరు, నిప్పు ఇవే పంచభూతాలు. వీటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిసాయి. అందులో ఒకటే చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన వాయులింగం. అయితే ఇక్కడి గాలి స్పరించిన తరువాత ఏ ఇతర దేవాలయాలకు వెళ్లకూడనదే ఆచారం.

అందులో నిజం లేకపోలేదు. సర్పదోషం.....

రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా నయమవుతుంది. శ్రీకాళహస్తిలోని సుబ్రమణ్య స్వామి దర్శనంతో సర్పదోషం తొలుగుతుంది.
ప్రత్యేక పూజలు చేసుకున్న తరువాత నేరుగా ఇంటికే చేరాలని చెపుతారు ఇక్కడి పూజారులు. కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే. తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్లిన దోష నివారణ ఉండదనేది అక్కడి పూజరులు చెపుతున్నారు. గ్రహణాలు..
శని బాధలు.. పరమశివుడుకి ఉండవని. మిగితా అందరి దేవుళ్లకి శని ప్రభావం.. గ్రహణ ప్రభావం ఉంటుందని చెపుతున్నారు.

దీనికి మరోక ఆధారం..

 చంద్రగ్రహణం

ఈ రోజున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా అన్ని దేవాలయాలు మూసివేస్తారు. గ్రహణానంతరం సంప్రోక్షణ జరిపి అప్పుడు పూజలు ప్రారంభిస్తారు.
కానీ గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది. అంతే కాదు రోజంతా ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉంటాయి. 

అందుకే ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక దైవం దర్శనం అవసరం లేదన్నది నీతి.

No comments:

పూజారి -- కానుకలు..

పూజారి -- కానుకలు .. మీరు కానుకలు హుండీలోనే వేయండి . పూజారి ప్లేటులో వేయవద్దు ,హుండీలో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడికి చేరుతుంది...