I am UNIQUE, AMAZING, ORIGINAL, STRONG, KIND & I'm who I am. REAL and SIMPLE. :-) MoSt Of AlL My LiFe Is SiMpLe AnD CoLoRfUl...
Wednesday, January 26, 2022
కాణిపాకం విశిష్టత, విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు.
Sunday, January 23, 2022
Birth circle of Kumbha Karna, Ravanasura
హనుమాన్ చాలీసా మహత్యం
ఉత్తరభారతదేశంలో క్రీ||శ||16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాసుని సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన ‘రామచరితమానస్’ సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోకతమయేవి.
ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు.
తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొగల్ చక్రవర్తి అక్బర్ బాదుషాకు తరచుగా పిర్యాదులు చేస్తుండేవారు. కానీ, అక్బర్ అంతగా పట్టించుకోలేదు.
ఇది ఇలా వుండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడు అయిన గృహస్టు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా, విధి వక్రించి ఆయువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టు కోలేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యేష్టి జరగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను, బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా, శవయాత్ర సాగిపోతున్నది.
స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకోన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కనులు తెరచి ‘దీర్ఘసుమంగళీభవః’ అని దీవించాడు. దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి, జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ ‘తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు!’ అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు.
ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామభాక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మత పెద్దలంతా ఢిల్లీ కి వెళ్ళి బాదుషాకు స్వయముగా వవరించి తగిన చర్య తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను విచారణకు పిలిపించాడు.
విచారణ ఇలా సాగింది:
పాదుషా: తులసీదాస్ జీ! మీరు రామనామం అన్నింటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట!
తులసీదాస్: అవును ప్రభూ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరము?
పాదుషా: అలాగా! రామానామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు, నిజమేనా?
తులసీదాస్: అవును ప్రభూ! రామనామానికి మించినదేమి లేదు.
పాదుషా: సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము.
తులసీదాస్: క్షమించండి ప్రభూ! ప్రతి జీవి జనన మనరణాలు జగత్ప్రభువు ఇచ్ఛానుసారం జరుతుతాయి. మానవమాత్రులు మార్చలేరు.
పాదుషా: తులసీదాస్ జీ! మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సుభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి!
తులసీదాస్: క్షమించండి! నేను చెప్పేది నిజం!
పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, ‘తులసీ! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా శవాన్ని బ్రతికించు!’ అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్ధించాడు. అది రాజ ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంటే! ఇక్కడి నుంచి వచ్చాయో వేలాదికోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని, వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి. ఈ హాటాత్ సంఘటనతో అదరూ హడలిపోయి, ఎక్కడి వారు అక్కడ స్థాణువులై పోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు.
ఆ స్త్రోతంతో ప్రసన్నుడైన హనుమంతుడు ‘తులసీ! నీ స్త్రోత్రంతో మాకు చాల ఆనందమైంది. ఏమీకావాలో కోరుకో!’ అన్నాడు. అందుకు తులసీదాస్ ‘తండ్రీ! నా కేమి కావాలి! నేను చేసిన నీ స్త్రోత్రం లోక క్షేమం కొఱకు ఉపయోగపడితే చాలు, నా జన్మ చరితార్థమవుతుంది. నా ఈ స్త్రోతంలో నిన్ను ఎవరు వేడుకున్నా, వారికి అభయం ప్రసాదించు తండ్రీ! అని కోరుకున్నాడు.
ఆమాటలతో మరింతప్రీతిచెందిన హనుమంతుడు ‘తులసీ! ఈస్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా, వారి రక్షణ భారం మేం వహిస్తాము’ అని వాగ్దానం చేశారు.
అప్పట్నుండి ఇప్పటివరకు ‘హనుమాన్ చాలీసా’ కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది.
వట్టివేరు గణపతి
Swayambhu Sri Lakshmi Narasimhaswamy
స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం - బంజారాహిల్స్
Saturday, January 22, 2022
మంత్రాలయ రాఘవేంద్రస్వామి విశిష్టత
జై భీమ్ సినిమా తరహాలో చిత్తూరులో ఎస్సీ మహిళపై లాఠీ కాఠిన్యం
Friday, January 21, 2022
దురాశ - భీముడు సంతోషిస్తూ ఆ మణి తీసుకుని ఇంటికి వెళ్ళాడు
శ్రీ చింతపూర్ణి దేవి ఆలయం, ఉనా, హిమాచల్ ప్రదేశ్
నర్మదా లింగాన్ని చూసినంతమాత్రాన్నే కాలసర్ప దోషాలు, నాగదోషాలు, సమస్త పాపాలు నశించును.
Thursday, January 20, 2022
పురుషర్షభ అని శ్రీకృష్ణుడు అర్జునుడిని సంబోధించాడు
Wednesday, January 19, 2022
గుడిలో తలమీద శఠగోపం ఎందుకు పెడతారో తెలుసా?
శ్రీ #మహాభారతం - #శాంతిపర్వం. #శారిక - #బ్రహ్మదత్తుల #సంవాదం
జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు.
పూజారి -- కానుకలు..
పూజారి -- కానుకలు .. మీరు కానుకలు హుండీలోనే వేయండి . పూజారి ప్లేటులో వేయవద్దు ,హుండీలో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడికి చేరుతుంది...
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjNFUZ0LboKxprC4OtkHRRpqtIZ6tCGP20b0uakyQylS3ued_FupoeG8TEMT-drLbYHyam3Q6mNkdyJ2TOsIkYyzOj8fiZJGWRqTIbtuToquh0R1vyn94SGBy_LtqS8oh2bRdZFwRAwKvg/s1600/1678099779495601-0.png)
-
కచ్చబేశ్వరర్ ఆలయము, తిరుకచ్చుర్, తమిళ్నాడు: తిరుకచ్చుర్ మరైమలైనగర్ నుండి 6కి.మీ, సింగపెరుమాళ్ కోయిల్ నుండి 2 కి.మీ దూరములో చెన్నై చెంగల్పట్...
-
The Ekadashi that falls in the month of Magha is called Bhishma Ekadashi. Bhishma Ekadashi is the holiest day on which Bhishma, who was woun...