Sunday, January 23, 2022

వట్టివేరు గణపతి

వట్టివేరు వినాయకుడిని గృహంలో ఉంచడం వలన కార్యసిద్ధి కలుగుతుంది. ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ఎరుపు చందన మాల.

వట్టివేరు గణపతి: వట్టివేరు అనేది గడ్డి జాతికి చెందిన మొక్క. అనేక ఔషధ విలువలు కలిగి ఉన్న ఈ వట్టివేరును ప్రాచీన కాలం నుండి అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు.

వట్టివేరు నుండి వచ్చే సుగంధం వలన ఇది ప్రత్యేకమైనది, సువాసన భరితమైనది. అనేక సౌందర్య సాధనాలలో కూడా ఈ వట్టివేరును ఉపయోగిస్తారు. వట్టివేరును ఆయుర్వేదంలో వైద్యానికి ఉపయోగిస్తారు.

వట్టివేరు గణపతి గృహంలో ఉంచడం వలన చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. వట్టివేరుకు ఉన్న సుగంధం వలన మీ మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది.

వ్యాపార ప్రదేశంలో ఈ వట్టివేరు గణపతిని ఉంచడం వలన అలంకరగానే కాక ఆ గణపతి అనుగ్రహంతో వ్యాపార వృద్ధి జరుగుతుంది. మీ గృహానికి నూతన శోభను తెస్తుంది.

చందన మాల - ఎరుపు - 108పూసలు ఎర్రచందనం మాల ధరించడం వల్ల భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. శరీరానికి చల్లదనాన్ని చేకూరుస్తుంది. 

ఎర్రచందనం మాల వినాయకుడికి అనుకూలం. మరియు ఇది శక్తివంతమైనది సానుకూల శక్తిని ఇస్తుంది. ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ఈ ఎరుపు చందనమాల ఉపయోగపడుతుంది.

ఎర్రచందనం మాల ఒకరిని మానసికంగా దృఢంగా చేస్తుంది. అంతర్గత బలం మరియు సంకల్ప శక్తిని పెంచుతుంది.  ఈ మాలను పూజ మందిరంలో ఉంచవచ్చు. మిలో సానుకూలతను పెంచడంలో ఈ చందన మాల ఎంతగానో సహాయపడుతుంది. మిలో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. సంకల్పశక్తిని పెంచుతుంది. చందన పరిమళం ఇంద్రియాలను మేల్కొల్పుతుంది. 

ఈ మాల ధారణ వలన ఆధ్యాత్మికత పెరుగుతుంది. దైవ అనుగ్రహం కలుగుతుంది. ఈ మాల రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు అజీర్ణం, తక్కువ రోగ నిరోధక శక్తి మరియు జ్వరాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది.

No comments:

పూజారి -- కానుకలు..

పూజారి -- కానుకలు .. మీరు కానుకలు హుండీలోనే వేయండి . పూజారి ప్లేటులో వేయవద్దు ,హుండీలో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడికి చేరుతుంది...