నర్మదా శివలింగం బానలింగం మరియు ఇత్తడి పానపట్టం
బాణలింగాలు ఎక్కువుగా నర్మదా నది తిరప్రాంతాలలోనే ఎక్కువుగా లభిస్తాయి.
బాణలింగాన్ని పూజించినంతనే విశేషమైన ఫలితాలు కలుగుతాయి.
బంగారం, వెండి, మట్టి వంటి తదితర శివలింగాలను పూజించడం కలిగే పుణ్యఫలం ఒక్క నర్మదా బాణలింగాన్ని ఆరాధించడం వలన కలుగుతాయి.
ఈ బాణలింగాన్ని పూజించడం వలన సకల శుభాలు చేకూరుతాయి. సుఖసంతోషాలు కలుగుతాయి.
బాణలింగాలకు అభిషేకం చేసిన జలం సేవించిన వారికి కాలసర్ప దోషం ఉండదు.అభిషేక జలం త్రిదోషహరం, ఆరోగ్యకరం.
నర్మదా లింగాన్ని చూసినంతమాత్రాన్నే కాలసర్ప దోషాలు, నాగదోషాలు, సమస్త పాపాలు నశించునని పురాణాలు తెలుపుతున్నాయి.
శ్రీ లక్ష్మీ నారాయణ సాలిగ్రామ మాల సాలిగ్రామాన్ని రోజూ పూజించేవారు. ఆరోగ్యంతో అలాగే సంపదతో తులతూగుతారు. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు ఇందులో కొలువై ఉంటారు.
నేపాల్లోని గండకి నది వద్ద శాలిగ్రామాలు విస్తృతంగా లభిస్తాయి. కొన్ని వేల ఏళ్ళ క్రితంనుంచి ఈ ప్రాంతంలో శ్రీమహావిష్ణువు కొలువై ఉన్నాడని నమ్మకం.
పురాణాలలో శాలిగ్రామ శిల ప్రాముఖ్యత గురించి దానిని పూజించడం వెనుక గల ప్రాధాన్యత గురించి విస్తృతంగా ప్రస్తావించబడింది.ఈ సాలిగ్రామాలు అధిక శక్తివంతమైనవి, అద్భుతమైనవి.
నియమ నిష్ఠలతో ఈ సాలిగ్రామాలను పూజించడం వలన సకల సంపదలు కలిగి ఆ లక్ష్మీ నారాయణుల అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది.
ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు.సాలగ్రామానికి చేసిన అభిషేక తీర్ధం నిత్యం సేవించడం వలన సర్వదేవతానుగ్రహం లభిస్తుంది.
ఆ లక్ష్మీ నారాయణుల పరిపూర్ణ కటాక్షంతో భోగభాగ్యాలు అనుభవించి ముక్తి పొందుతారు.సర్వరోగాల నుండి విముక్తికి సాలగ్రామ మాల.
No comments:
Post a Comment