Sunday, January 23, 2022

స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం - బంజారాహిల్స్


తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లా, హైదరాబాద్ పట్టణంలోని, రోడ్ నెం. 12లోని బంజారా హిల్స్ లో స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఉన్నది. ఈ ఆలయం హైదరాబాద్ లోని అతి ప్రాచీనమైన క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుచున్నది. 

ఈ ఆలయంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, పాంచ జన్య ఈశ్వరునిగా ప్రసిద్ధిచెందిన శివుని విగ్రహాలు కలవు. ఈ ఆలయంలో స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఇచ్చట నిలబడి భక్తులను ఆశీర్వదించుట ఈ ఆలయంలోని ప్రత్యేకత.

ఇస్కాన్ సంస్థ వారు ఈ దేవాలయాన్ని దత్తత తీసుకొని, ఆలయ పునరుద్దరణను, మరియు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయం సాయంకాల సమయంలో భక్తులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. 

ఇచ్చట నిత్యపూజలతో పాటు, పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ రోజులలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.

No comments:

సృష్టి రహస్య విశేషాలు. సృష్టి ఎలా ఏర్పడింది.

సృష్టి రహస్య విశేషాలు సృష్టి  ఎలా  ఏర్పడ్డది సృష్టి  కాల చక్రం  ఎలా నడుస్తుంది మనిషిలో  ఎన్ని  తత్వాలున్నాయి ( సృష్ఠి )  ఆవిర్బావము  1  ముంద...