Wednesday, January 19, 2022

జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు.


Image #TheQuint

చివరి శ్వాసను విడుస్తున్న, జటాయువు నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికివాడు అని అనుకుంటారు. 

రావణుడు జటాయువు రెండు రెక్కలను తెంచినప్పుడు మృత్యువు వచ్చింది. అపుడు జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు. 

"జాగ్రత్త! ఓ మృత్యువా! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరుకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత యొక్క సమాచారం "ప్రభు శ్రీరాముడి" కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు! 

మరణం జటాయువును తాకలేకపోతోంది, అది నిలబడి వణుకుతూనే ఉంది. అప్పటివరకు కదలకుండా నిల్చునే వుంది, తాను కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది.

జటాయువు శ్రీరాముడి ఒడిలో పడుకున్నాడు. ప్రభు "శ్రీరామ్" ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు. 

అదే సమయంలో, జటాయువుకు ప్రభువు "శ్రీరాముడి" ఒడి పాన్పుగా అయింది. 

జటాయువు తన కర్మ బలం ద్వారా ప్రభు "శ్రీరాముడి" యొక్క ఒడిలో ప్రాణ త్యాగం చేసాడు. జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు.

No comments:

సృష్టి రహస్య విశేషాలు. సృష్టి ఎలా ఏర్పడింది.

సృష్టి రహస్య విశేషాలు సృష్టి  ఎలా  ఏర్పడ్డది సృష్టి  కాల చక్రం  ఎలా నడుస్తుంది మనిషిలో  ఎన్ని  తత్వాలున్నాయి ( సృష్ఠి )  ఆవిర్బావము  1  ముంద...